పుష్కర ఉవాచః
తిష్టతో గమనే ప్రశ్నే పురుషస్య శుభాశుభమ్ ।
నివేదయంతి శకునా దేశస్య నగరస్యచ.
సర్వః పాపఫలోదీప్తో నిర్దిష్ణో దైవచింత కైః ।
శాంతః శుభ ఫలశ్చైవ దైవజ్ఞ సముదాహృతః.
షట్ప్రకారా వినిర్దిష్ట శకునానాం చదీప్తయః ।
వేలాదిగ్దేశ కరణరుత జాతివిభేదతః.
పూర్వాపూర్వా చ విజ్ఞేయా సాతేషాం బలవత్తరా ।
దివాచరో రాత్రి చర స్తథారాత్రౌ దివాచరః.
క్రూరేమ దీప్తా విజ్ఞేయా హ్యృక్షలగ్న గ్రహాదిషు ।
ధూమితాసాతు విజ్ఞేయాయాంగమిష్యతి భాస్కరః
యస్యాం స్థితః సాజ్వలితా ముక్తా చాంగారిణీమతా।
ఏతా స్తిస్రః స్మృతాదీప్తాః పంచ శాంతా స్తథాపరాః.
దీప్తాయాం దిశి దిగ్దీప్తం శకునం పరికీర్తితమ్ ।
గ్రామేరణ్యావనే గ్రామా స్తథా నిందితపాదపః.
పుష్కరుడు పలికెను : రాజు ఒకచోట నివాసము ఏర్పరచుకొన్న ప్పుడుగాని, వేళ్చునపుడు గాని, ప్రశ్న సమయమునందు గాని కచబడు శకునములు ఆ దేశము నందున, నగరమందును కలుగు శుభాశుభములను సూచించును “దీప్తములు,” “శాంతములు” అని శకునములు రెండు విధములు. అన్ని దీప శకునముల ఫలితములు అశుభములగు ననియు, శాంత శకవచుని ఫలితములు శుభములగుననియు జ్యోతి, శాస్త్రజ్ఞులు చెప్పివారు. దీప్తశకునములు వేలాదీప్త. నిక్షిప్త - దేశ దీప్త - క్రియాశీప - రుతదీప్త జాతికీపములని అరువిధములు. వీటిలో పూర్వపర్వములు ప్రబలతరములు వగలు సంచరించవలసిన ప్రాణలు రాత్రి, రాత్రి సంచరించవలసినవి పగలు సంచరించినచో ఆ “వేలాదీప్తము” నక్షత్ర. లగ్న - గ్రహాదులు క్రూరావస్థను పొందిన సమయము కూడ “వేలాదీప్తము” సూర్యుడు ప్రయాణించు దిక్కు “ధూమిత”, ఉన్న దిక్కు “జ్వలిత” విడవబడినదిక్కు "ఆంగారిణి", ఈ మూడు దిక్కులును దీప్తములు. మిగిలిన ఐదును శాంతములు. దీప్త దిక్కులందు కలుగు శకునములు దిగ్దీప్తములు. గ్రామములో ఆరణ్య జంతువులును, ఆరణ్యములో గ్రామ్య జంతువులను ఉన్నచో ఆపినిందిత దేశము నిందిత ములు వృక్షములున్న దేశము గూడ నింద్యము. ఆశుభము
దేశే చై వాకుబేజ్ఞేయో దేశ దీప్తో ద్విజోత్తమః।
క్రియాదీప్తో వినిర్దిష్టః స్వజాత్యనుచితక్రియః.
రుతదీప్తశ్చకథితో భిన్న భైరవనిః స్వనః ।
జాతిదీ ప్తస్తథాజ్ఞేయః కేవలం మాంసభోజనః.
దీప్తాచ్ఛాన్తో వినిర్దిష్టః నర్వైర్భేదైః ప్రయత్నతః ।
మిశ్రైర్మిశ్రో వినిర్దిష్టస్తన్యవాచ్యం ఫలాఫలమ్.
విప్రవరా! ఆశుభ దేశమునందు కనబడు శకునములు “దేశ దీప్త ములు"; తన వర్ణ ధర్మమునకు విపరీతముగ ప్రవర్తించువాడు "క్రియాదీప్తుడు", భయంకర ధ్వని వినబడు “రుతదీప్తము” మాంసభోజనము మాత్రము చేయు ప్రాణి “జాతిదీప్తము”; దీప్తావస్థకు విపరీతమైన శకునములు శాంతములు; వాటిలో కూడ పైన చెప్పిన భేదములన్నియు గ్రహించవలెను. దీప్త-శాంతములు కలసినచో అవి మిశ్ర శకునములు, ఈ విధముగ పరిశీలించి వాటి ఫలాఫలములను చెప్పవలెను
గోశ్వోష్ట్ర గర్దభ శ్వానః సారికా గృహగోధికా ।
చటకా భాస కూర్మాద్యాః కథితా గ్రామ వాసినః.
ఆజావిశుక నాగేన్ ద్రాః కోలో మహిష వాయసా।
గ్రామ్యారణ్యా వినిర్దిష్టాః సర్వేఽన్యేవనగోవరాః.
మార్జార కుక్కుటౌ గ్రామ్యౌ తౌచైవ వనగోచరౌ ।
తయోర్భవతి విజ్ఞానం నిత్యం వైరూప భేదతః.
గోకర్ణశిబి చక్రాహ్వ ఖర హారీత వాయసాః ।
కులాహ కుక్కుభశ్యే నపేరు అంజన వానరాః.
శతఘ్న చటక శ్యామచాషశ్యేన కపింజలాః ।
తిత్తిరిః శతపత్రశ్చ కపోతశ్చ తథాత్రయః.
ఖంజరీటక దాత్యూహ శుకరాజీవకుక్కుటాః ।
భారద్వాజశ్చ సారఙ్గ ఇతి జ్ఞేయాదివాచరాః.
వాగుర్యులూక శరభ క్రౌంచాః శశకకచ్ఛపాః ।
లోమాసికా! పిఙ్గలికాః కథితా రాత్రి గోచరాః.
హంసాశ్చ మృగమార్జార నకులర్క్ష భుజఙ్గమాః ।
వృకారిసింహ వ్యాఘ్రోష్ట్ర గ్రామసూకరమానుషాః.
శ్వావిద్వృషభగోమాయువృక కోకిల సారసాః ।
తురంగ కౌపీన నరా గోధాహ్యు భయచారిణః.
గోవు, గుఱ్ఱము, గాడిద, కుక్క, సారిక, బల్లి, చటకము, భాసము, తాబేలు - ఇవి గ్రామవాసి ప్రాణులు. మేక , తోడేలు, చిలుక, గజరాజు, సూకరము, గేదె, కాకి . ఇవి గ్రామరణ్య ఉభయ వాసి ప్రాణులు. మిగిలిన ప్రాణులన్నియు ఆటవికములు. పిల్లి, కోడి కూత ఉథయవాసులు, వీటి ఆకారములో భేదముండును గాన వీటిని గుర్తించవచ్చును. గోకర్ణము, నెమలి, చక్రవాక ము, రాసభము, హరీతము. కాకి, కలాపము (ఒక విధముగు గుఱ్ఱము) కుక్కుభము, నక్క, ఖం జరీటము, వానరము, శతఘ్నము, చటక ము, కోకిల, శ్యేనము, కపింజలము, తీతువు, శతపత్రము, పావురము, ఖంజనము దోత్యూహము, శుకము, రాజీవము, కోడి, భరద్వాజము, సారంగము పగలు సంచరించు ప్రాణులు. వాగురి, గుడ్లగూబ, శరభము, శౌచము, చెవులపిల్లి, తాబేలు, లోమాసిక, పింగలిక రాత్రి సంచరించు ప్రాణులు. హంస, లేడి, పిల్లి, ముంగిస, భల్లూకము, సర్పము, వృకారి, సింహము, వ్యామము, ఒంటె, గ్రామసూకర ము, మనుష్యులు, శ్వావిరము, వషధము, నక్క, తోడేలు, కోకిల, సార సము, గుఱ్ఱము, ముంగిస, కౌపీనధారి పురుషులు రాత్రి, పగలు, కూడ సంచరించు ప్రాణులు.
బలప్రస్థానయోః సర్వే పురస్తాత్సంఘ చారిణః ।
జయావహా వినిర్దిష్ణాః పశ్చాన్ని ధనకారిణః.
గృహాద్గమ్య యదా చాషో వ్యాహరేత్పురతః స్థితః।
నృపావమానం వదతి వామః కలహభోజనే.
యానేతద్దర్శనం శస్తం సవ్యమంగస్య వాప్యథ ।
చౌరై ర్మోషమథాఖ్యాతి మయూరో భిన్న నిఃస్వనః.
యుద్దమునందు గాని, యుద్ధమునకై యాత్ర చేయునపుడు గాని ఈ ప్రాణులన్నియు గుంపుగా ఎదుటకు వచ్చినచో విజయప్రదములు, వెనుక నుంచి వచ్చినచో మృత్యు కారకములు. నీలకంఠము తన గూడు నుండి బైటకు వచ్చి ధ్వని చేయుచు ఎదురైనచో అది రాజుకు అవమాన సూచకము. అది వామభాగమునందు వచ్చినచో కలహకారకమ; భోజనమున బాధ కలిగించును. యాత్రా సమయమున దాని దర్శన ము ఉత్త మము. దాని ఎడమభాగము కనబడుట కూడ మంచిది. యాత్రా సమయమున నెమలి ఎక్కువ ధ్వని చేసినచో ఆది దొంగల ద్వారా ధనము కోల్పోవుటను సూచించును.
ప్రయాత న్యాగ్రతో రామ మృగః ప్రాణహరో భవేత్ ।
ఋక్షాఖుజంబుక వ్యాఘ్ర సింహ మార్జార గర్దభాః.
ప్రతిలోమా స్తథా రామ స్వరశ్చ వికృతస్వనః ।
వామః కపిఞ్జలః శ్రేష్ఠస్తథా దక్షిణ సంస్థితః.
వృష్ఠతో నిన్ దిత ఫలస్తిత్తిరిస్తునశస్యతే ।
ఏణా వరాహాః పృషతా వామా భూత్వాతు దక్షిణాః.
భవ న్ త్యర్థకరా నిత్యం విపరీతం విగర్హితాః ।
వృషాశ్వ జంబుక వ్యాఘ్రాః సింహమార్జార గర్దభాః.
వాఛితార్థకరా జ్ఞేయా దక్షిణా ద్వామతోగతాః ।
శివాశ్యామాననాచ్చుచ్ఛూః పింగలా గృహగోధికా.
సూకరీపరపుష్టాచ పున్నా మానశ్చ వామతః ।
స్త్రీ సంజ్ఞా భాసకారూష కపిశ్రీ కర్ణచ్ఛిత్కరాః.
కపిశ్రీకర్ణపిప్పీకారురు శ్యేనాశ్చ దక్షిణాః ।
జాతోక్షా (తికా) హిశశ క్రోడగోధానాం కీర్తనం శుభమ్.
పరశురామా ! ప్రస్థాన సమయముందు లేడి ముందు ముందు నడచినచో అది మృత్యు ప్రదము. భల్లూకము, ఎలుక, నక్క, పులి, సింహము, పెల్లి, గాడిద - ఇవి ప్రతికూలమగు దిక్కున వెళ్ళినను. గాడిద గట్టిగా ఓండ్ర పెట్టినను, కపింజరిపక్షి ఎడమ ప్రక్క గావి, కుడి ప్రక్క గానీ ఉన్నను ఇవన్నియు ఉత్తమ శకునములు. కాని కపింజల పక్షి వెనుక ప్రక్కన ఉన్నచో చెడ్డఫలము నిచ్చును. యాత్రాసమయమున తీతు కనబడ కూడదు. లేడి. సూకరము, చిత్రవర్ణహరిణము, ఎడమ నుండి కుడివైపు వచ్చినచో సర్వదా కార్యసాధకము. కుడినుండి ఎడమ వైపు వెళ్లినచో మంచిది కాదు. ఎద్దు, గుఱ్ఱము, గ్రద్ద, పులి, సింహము, పిల్లి, గాడిద, పిల్లి, గాడిద మొదలైన కుడినుంచి ఎడమకు వెళ్ళినచో మనోవాంఛితసిద్ధి ప్రదములు. శృగాలము, శ్యామముఖము, చుంచు, పింగల, బల్లి, సూకరి, కోకిల, పులింగనామములు గల ప్రాణులు, భాసము, కారుషము, కోతి, శ్రీకర్ణము, ఛత్వరము, కపి, పిప్పీకము, గరువు, శ్యేనము ఇవి కుడి ప్రక్క నున్నను శుభము. యాత్రాకాలమున జాతీకము, సర్పము, చెవులపిల్లి, సూకరము, ఉడుము-- వీటి పేరు చెప్పుట గూడ శుభమని చెప్పబడినది.
తతః సందర్శనం నేష్టం ప్రతీపం వానర ర్క్షయోః।
కార్యకృద్బలీ శకునః ప్రస్థితస్యహి యోఽన్వహమ్.
భవేత్తస్య ఫలం వాచ్యం తదేవ దివసం బుధైః ।
మత్తభక్ష్యార్థినో బాలా వైరసక్తా స్తథైవచ.
సీమా న్త మభ్య న్ తరితా విజ్ఞేయానిష్ఫలాద్విజ ।
ఏకద్విత్రి చతుర్బిస్తు శివాధన్యారుతైర్భవేత్.
పంచభిశ్చతథా షడ్భిరదన్యా పరికీర్తితా ।
సప్తభిక్బతథాధన్యా నిష్ఫలాపరతో భవేత్.
నృణాం రోమాంచ జననీ వాహనానాం భయప్రదా ।
జ్వాలానలా సూర్యముఖీ విజ్ఞేయాభయవర్ధినీ.
ప్రథమం సారఙ్గే ద్గృష్టే శుభే దేశే శుభం భవేత్ ।
సంవత్సరం మనుషస్యహం శుభే చ శుభం తథా.
తథావిధం నరః పశ్యేత్సారఙ్గం ప్రథమేహని ।
ఆత్మనశ్చ తథాత్వేన జ్ఞాతవ్యం వత్సరం ఫలమ్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శకుననిరూపణం నామైక త్రింశదధిక శతతమోఽధ్యాయః॥
భల్లూక - వానరములు విపరీత దిక్కునందు కనబడుట అనిష్ట కారకము. ప్రస్థానము చేసిన తరువాత ఏదినమున బలవత్తరమగు ఏశకునము కనబడునో అది ఆదినము నకు మాత్రమే ఫలమునిచ్చును. పరశురామా ! పిచ్చివాడు, భోజనార్థి, బాలుడు, శత్రువు మొదలగు వారు గ్రామసీమయందు గాని, నగర సీమయందు గాని కనబడినచో దానికి ఫల మేమియు ఉండదని తెలుసుకొనవలెను. ఆడనక్క ఒకసారిగాని, రెండుసార్లు గాని, మూడుసార్లు గాని, నాలుగుసార్లుగానీ కూసినచో శుభము. ఐదు లేదా ఆరుసార్లు కూసినచో అశుభము. ఏడుసార్లు కూసినచో శుభము. అంతకు మించికూసినచో ఫలమేమియు ఉండదు. మార్గ మధ్యమునందు సూర్యుని వైపు పైకి ఎగిసే జ్వాల కనబడి, అది చూడగానే రోమాంచకారి గాను, వాహనములు భయపడునట్లు గాను ఉన్నచో ఆది మహా భయ సూచకము. ముందుగనే ఏదైన ఒక ఉత్తమ ప్రదేశము నందు సారంగము కనబడినచో అది సంవత్సరము వరకును శుభ సూచకము. దానిని చూచుటచే ఆరంభమునందు గూడ శుభ మగును. అందుచే యాతా పారంభ దినమున అట్టి సారంగమును జూచి ఒక సంవత్సరము పాటు శుభ ఫలప్రాప్తి కలుగు నని గ్రహించవలెను.
అగ్ని మహాపురాణమునందు శకున వర్ణనమను రెండు వందల యొకటవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 231 of the Agni Purāṇa is as follows:
Agni presents the inner science of dhyāna as the highest limb of sādhana. The chapter describes the sat-cakra (six lotuses along the suṣumnā nāḍī) and the prāṇāyāma techniques that awaken the sleeping Kuṇḍalinī-śakti. The forms of Brahma, Viṣṇu, Rudra, Īśvara, and Sadāśiva seated in the respective cakras from Mūlādhāra to Ājñā are described. The chapter culminates in the formless meditation on Brahman as pure consciousness, the only reality underlying all appearances.