అగ్ని రువాచః
సూర్యవంశం సోమవంశం రాజ్ఞాంవంశం వదామితే।
హరేర్బ్రహ్మా పద్మగోఽభూన్మరీ చిర్బ్రహ్మణఃసుతః.
మరీ చేః కశ్యపస్తస్మా ద్వివస్వాం స్తస్య పత్న్యపి ।
సంజ్ఞా రాజ్ఞీప్రథాతి స్రో రాజ్ఞీరై వతపుత్రికా.
రేవ న్తం సుషువే పుత్రం ప్రభావం చ ప్రధార వేః ।
త్వాష్ట్రీసంజ్ఞా మను౦పుత్రం యమలౌయమునాం యమమ్.
ఛాయా సంజ్ఞాచసావర్ణిం మనుం వైవస్వతం సుతమ్ ।
శనిం చ తపతీం విష్టింసంజ్ఞాయాం చాశ్వినౌపునః.
మనోర్వైవస్వత స్యాసన్పుత్రావై నవ తత్సమాః ।
ఇవ్వాకు శ్చైవ నాభాగో ధృష్టశిశర్యాతి రేవచ.
నరిష్య న స్తథా ప్రాంతుర్నా భాగాద్యష్ట సత్తమాః ।
కరూషశ్చ పృషధ్రశ్చ అయోధ్యాయాం మహాబలాః.
కన్యేలా చ మనోరాసీద్బుధా త్తస్యాం పురూరవాః ।
పురూరవసముత్పాద్య సేలాసుద్యుమ్న తాంగతా.
సుద్యుమ్నాదుత్కలగయో వితతాశ్వశ్రయానృపాః ।
ఉత్కలస్యోత్కలం రాష్ట్రం వినతాశ్వస్య పశ్చిమా.
దీక్సర్వా రాజవర్యస్య గయస్యతుగయాపురీ ।
వసిష్ఠ వాక్యాత్సుద్యుమ్నః ప్రతిష్టానమవాపహ.
తత్పురూరవసే పాదాత్సుద్యుమ్నో రాజ్య మాప్యతు ।
నరిష్యతశ కాః పుత్రానాభాగస్య చ వైష్ణవః.
అంబరీష ప్రజాపాలో ధార్షకం ధృష్టతఃకులమ్ ।
సుక ల్పానర్తౌ శర్యార్వైరోహ్య నర్తతోనృప.
ఆనర్తవిషయశ్చానీత్పురీ చాసీతుశస్థలీ ।
రేవస్యరై వతః పుత్రః కకుద్మీ నామధార్మికః.
జ్యేష్ఠః పుత్రశతస్యాసీద్రాజ్యం ప్రాప్యకుశ స్థలీమ్ ।
అగ్ని దేవుడు పలికెను. ఇపుడు సూర్యవంశమును ఇతర రాజవంశమును గూర్చి చెప్పెదను. మహావిష్ణువు నాభికమలమునుండి బ్రహ్మ ఆవిర్భవించెను. బ్రహ్మకుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు. ఆతని కుమారుడు వివస్వంతుడు. ఆతనికి సంజ్ఞ, రాజై, ప్రథయను ముగ్గురు భార్యలుండిరి. రాజై రైవతకునిపుత్రి. ఆమె రేవంతుడను కుమారుని కనెను. ప్రభ ప్రభాతుడను పుత్రుని, త్వష్టకుమార్తెయైన సంజ్ఞ మనువుయను పుత్రుని, యమున, యమడుయను కవలలను కనెను, ఛాయయను నామాంతరముగల సంజ్ఞ సావర్ణ్యమనువును, శవిని, తపతి, - విష్టి, యనుక న్యలను కనెను. పిదప సంజ్ఞకు అశ్వినీ కుమారులు జన్మించిరి. వైవస్వత మనువుకి, ఆతనితో సమానులగు - పదిమంది కుమారులుపుట్టిరి. ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు నృగుడు దిష్టుడు కరూశుడు, పృషధ్రుడు ఆను ఈ పదిమంది మహాబలులును అయోధ్యలో నివసించిరి. మనువునకు ఇలయనుకన్య పుట్టెను. ఆమెయందు బుధునకు, పురూరవుడు పుట్టెను. పురూరవుని కనిన పిమ్మట ఆ ఇలశుద్యుమ్నుడిగా మారిపోయెను. సుద్యుమ్నునకు ఉత్కలుడు, గయుడు వినతాశ్వుడు అను రాజులు జన్మించిరి. ఉత్కలునకు ఉత్కలము రాష్ట్రమాయెను. పశ్చిమదేశము వినతాశ్వుల రాజ్యమాయెను. రాజ శ్రేష్టుడైన గయునకు పూర్వదిక్కున అధికారము లభించెను. ఆతని రాజధాని గయాపురి. వశిష్ఠుని వాక్యము ప్రకారము సుద్యుమ్నుడు ప్రతిష్టానపురము చేరెను. అచట రాజ్యమును పొంది దానిని పురూరవసునకు ఇచ్చెను. నరిష్యంతుని పుత్రునకు శకులను పేరు. నాఖాగున విష్ణభక్తుడగు అంబరీషుడు జనించెను. ఆతడు. ప్రజలను బాగుగ పరిపాలించెను. ధృష్టుని నుండి ధాష్ట్రక వంశము విస్తరించెను. శర్యాతికి సుకన్య, ఆనర్తుడు, జనించిరి. ఆనర్తునకు రేవుడు జనించెను ఆతనిదేశము ఆనర్త దేశ ము. కుశస్థలి ఆతనిరాజధాని. రేవునకు రైవతుడు, జనించెను. ధార్మికుడైన ఆతనికి కకుద్మియని కూడ పేరు తన తండ్రి నూర్గురు కుమారులలో ఇతడుజ్యేష్ఠుడగుటనే కుశస్థలిరాజ్యము ఆతనికి లభించెను
సుకన్యాసహితః శ్రుత్వా గాంధర్వం బ్రహ్మణోఽ న్తితికే ।
ముహూర్త భూతందేవన్య మర్త్యేబహు యుగం గతమ్ ।
ఆజగామ జయేనాథస్వాంపురీం యాదవై ర్వృతామ్.
కృతాంద్వారవతీం నామ బహుద్వారాం మనోరమామ్ ।
భోజవృష్యంధ కైరుప్తాం వాసుదేవపురోగమైః.
రేవతీం బలదేవాయ దదౌజ్ఞాత్వాహ్యనిన్దితామ్ ।
తపసుమేరుశిఖరే తప్వావిష్ణ్వాలయంగతః.
నాలాగస్య చ పుత్రాద్వౌవై శ్యా బ్రాహ్మణతాం గతౌ ।
కరూషస్యతు కారూషాః క్షత్రియాయుద్ధదుర్మదాః.
శూద్రత్వంచ పృషధ్రోఽగాద్దింసయిత్వా గురోశ్చగామ్ ।
మనుపుత్రాద ధేశ్వా కోర్వికుడిరేవరాడభూత్.
వికు క్షేస్తు కకుత్స్థోఽభూ త్తస్యపుత్రః సుయోధనః ।
తన్యపుత్రః పృథుర్నామ విశ్వగాశ్వః పృథోసుతః
ఆయు స్తస్య చ పుత్రోఽభూద్యువనాశ్వ స్తథాసుతః ।
యువనాశ్వాచ్చ శ్రావన్తః పూర్వేర్రావంతికాపురీ .
శ్రావన్తాద్బృహదశ్వోఽ భూత్కువతాశ్వ సతోబృపః ।
ధుంధుమారత్వ మగ మద్దుందోర్నామ్నా చవై పురా.
దుందుమారాస్త్రయో భూపాదృఢాశ్వోదండ ఏవచ ।
కపిలో ఽథ దృడా శ్వాత్తుహర్యశ్వశ్చ ప్రమోదకః.
హర్యశ్వాచ్చ నికుంభోఽభూత్సంహతాశ్వో నికుంభతః ।
ఆకృశాశ్వోరణాశ్వశ్చ సంహతాశ్వ సుతావుభౌ.
యువనాశ్వో రణాశ్వస్యమాంధాతా యువనాశ్వతః।
మాంధాతుః పురుకుత్సోఽభూన్ముచుకుందో ద్వితీయకః.
ఒకనాడు అతడు కన్యాసహితుడై బ్రహ్మదగ్గరకువెళ్ళి అచట సంగీతమును వినుచుండెను. అచట బ్రహ్మకు ముహూర్తమొకటి మాత్రమే గడచెను. అంతలో మర్త్యలోక మున అనేక యుగ ములు సమా ప్రమాయెను. అతడు శీఘ్ర మగ యాదవులతో కూడిన తన నగరమునకు వచ్చెను. ఆచట కుశ స్థలిస్థానమున అనేక ద్వారములు కలది, మనోహర మైవదియగు ద్వారవతీపట్టణము నిర్మితమై యుండెను. వాసుదేవుడు నాయకులుగాగల భోజవృష్టి అంధకులు దానిని రక్షించుచుండిరి. రేవతిని బలరామునకు ఇచ్చి సంసార మును అనిత్యవిషయమును తెలుసుకొని సుమేరు పర్వత శిఖరమువ తపస్సు చేసి ఎన్టపడి ముమ చేరెను. నాతాగుని యిద్దరు పుత్రులు వైశ్యులు. వారు బ్రాహ్మణత్వమును పొందిరి. కరూషు నకు యుదోన్మత్తులగు కరూషులను క్షత్రియులు జన్మించిరి. వృషధ్రుడు గురువుయొక్క గోవును హింసించుటచే శూద్రు డాయెను. మనుపుత్రుడైన ఇక్ష్వాకునకు దేవరాజుయైన ఆవిడక్షి" పుట్టెను. వికుడి పుత్రుడు క కుత్సుడు. అతని పుత్రుడు సుయోధనుడు, ఆతని పుత్రుడు పృథువు, అతని పుత్రుడు విశ్వనాశ్వుడు. అతనిపుత్రుడు వాయువు. వాని పుత్రుడు. యవనాశ్వుడు, యువనాశ్వుని కుమారుడైన శ్రావంతుడ: తూర్పు దిక్కున లౌవంతి కాపురమును నెలకొల్పేను. అతని పుత్రుడు బృహదశ్వుడు, వాని కుమారుడు కువలాశ్వుడు. ఇతడు పూర్వము దుంధు అను రాక్షసుని చంపుటచే దుంధుమారుడను పేరుపొందెను. ఆతనికి దృఢాశ్వుడు. దండుడు, కపిలుడు, ఆను ముగ్గురురాజులు జన్మించిరి. దృఢశ్వునకు హర్యశ్వుడు, ప్రమోదకుడుయను పుత్రులు పుట్టిరి హర్యశ్వుని కుమారుడు నికుంభుడు. ఆతనికుమారుడు సంహతాశ్వుడు. సంహతాశ్వునకు ఆకృషాశ్వుడు రణాశ్వుడుయను పుత్రులు పుట్టిరి. రణాశ్వునపుత్రుడు యువనాశ్వుడు. ఆతనిపుత్రుడు మాంధాత. ఆతనికి పురుకుల్త్సుడు ముచికుందుడు, ఆను పుత్రులు పుట్టిరి.
పురుకుత్సాత్త్ర సద్దస్యుః సంభూతో నర్మదాభవః ।
సంభూతస్య సుధన్వాఽభూ త్త్రిధన్వాథసుధన్వనః.
త్రిధన్వనస్తు తరుణ స్తస్యసత్యవ్రతఃసుతః ।
సత్యవ్రతాత్పత్యరథో హరిశ్చంద్రశ్చ తత్సుతః.
హరిశ్చంద్రా ద్రోహితాశ్వో రోహిత్వోద్వృకోఽభవత్ ।
వృకార్బాహుశ్చ బాహోశ్చ సగర స్తస్యచప్రియా.
ప్రభాషష్టి సహస్రాణాం సుతానాం జననీహ్యభూత్ ।
తుష్టాదౌర్వాన్నృపాదేకం భానుమత్యసమంజనమ్.
ఖన న్తః పృథివీం దగ్ధా విష్ణునాబహుసాగరాః ।
అసమంజసోంశుమాంశ్చ దిలీపోంశుమతోఽభవత్.
భగీరథో దిలీపాత్తుయేన గంగావతారితా ।
భగీరథాత్తు నాభాగో నాభాగాదంబరీక్షకః.
సింధుద్వీపోఽ బరీషాత్తుశ్రుతా యు స్తత్సుతఃస్మృతః ।
శ్రుతాయోరృ తపర్ణోఽభూత్త స్యకల్మాష పాదకః.
కల్మాషాం ఘ్రేః సర్వకర్మా హ్యనరణ్య స్తతోఽభవత్ ।
అనరణ్యాత్తుని ఘ్నో థహ్యనమిత స్తతోరఘః.
ర ఘోర భూద్దిలీపస్తు దిలీపాద్ఛాప్యజోనృపః ।
దీర్ఘబాహుర జాత్కాల స్తజపాలన స్త తోఽభవత్.
తథా దశరథో జాత స్తస్య పుత్రచతుష్టయమ్ ।
నారాయణాత్మకాః సర్వేరామ స్తస్యాగ్రజోఽభవత్.
రావణాంతక రోరాజా హ్యయోధ్యాయాం రఘూత్తమః ।
వాల్మీకిర స్యచరితం చ క్రేతన్నారదశ్రవాత్.
రామపుత్రౌ కుశలవౌ సీతాయాంకులవర్ధనౌ ।
అతిథిశ్చకుశాజ్ఞజ్ఞే నిషధ స్తన్య చాత్మజ.
నిషధాత్తు నలో జజ్ఞే నభోఽజాయత వై నలాత్ ।
నభ నః పుండరీకోఽభూత్సు ధన్వాచతతోఽభవత్.
సుధన్వనో దేవానీకోహ్యపీనాక్వశ్చ తత్సుతః ।
అహీనాశ్వాత్సహస్రాశ్వశ్చంద్రాలోక స్తతో ఽభవత్.
చంద్రావలోక తస్తారాపీడోఽస్మాచ్చంద్ర పర్వతః ।
చంద్రగి రేర్భానురథః శ్రుతాయు స్తస్య దాత్మజః.
ఇక్ష్వాకు వంక ప్రభవాః సూర్యవంశధరాః స్మృతాః.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే సూర్యవంశ కీర్తనంనామ త్రిసప్తత్యధిక ద్విశతత మోఽధ్యాయః॥
పురుకుత్స్థునకు నర్మదయందు త్రసద్దస్యుడుయను సంభూతుడను నామాంతరముగల పుత్రుడు పుట్టెన-- సంభూతునికుమారుడు సుధన్వ. ఆతనిపుత్రుడు త్రిధన్వ, ఆతనిపుత్రుడు తరుణుడు. ఆతని పుత్రుడు సత్యవ్రతుడు. ఆతనీపుత్రుడు సత్యరథుడు. ఆతనికి హరిశ్చంద్రుడు, ఆతనికిరోహితాశ్వుడు, ఆతనికి వృకుడు, ఆతనికిఙాహువు ఆతనికి సగరుడు పుట్టెను. సగరుని ప్రియురాలగు ప్రథకు ఔర్వముని ప్రసాదముచే అరువదివేల పుత్రులను నెను. రెండవ భార్యయైన భానుమతికి అసమంజసుడను ఒక కుమారుడు జనించేను. సగరుని ఆరువదివేలమంది కుమారులును . భూమీనీ త్రవ్వుచు కపిలునిచే చేయబడిరి. అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. ఆతని కుమారుడు దిలీపుడు, ఆతనికి గంగను భూలోకమునకు తీసుకునివచ్చిన భగీరథుడ నుకుమారుడు పుట్టెను. అతనికి నాభాగుడు, అతనికి అంబరీషుడు, ఆతనికి సింధుద్వీపుడు వానికి శ్రుతాయువు, వానికి ఋతుపర్ణుడు, వానికి కల్మషపాదుడు, వానికి సర్వకర్మ, వానికి అనరణ్యుడు; వానికి నిఘ్నుడు, దానికి దిలీపుడు, వానికి రఘువు, వానికి ఆజుడు, వానికి దశరథుడు పుట్టెను. దశరథునకు నారాయణ స్వరూపులగు నలుగురు కుమారులు పుట్టిరి. వారిలో జ్యేష్ఠుడు రాముడు. రావణాంతకుడైన ఆ రఘూత్తముడు అయోధ్యకు రాజాయెను. ఆతని చరిత్రమును వారదునినుండి విని వాల్మీకి రామాయణముగ రచించెను. రామునకు సీతయందు, కులవర్గమగు కుశలవులు జన్మించిరి. కడునకు అతిథి ఆతనికి నిషధుడు. ఆతనికి నలుడు, అతనికి నభుడు, ఆతనికి పుండరీకుడు ఆతనికి సుధన్వుడు, అతనికి దేవానీకుడు, ఆతనికి ఆహీనాశ్వుడు, అతనికి సహస్రాశ్వుడు, అతనికి చంద్రాలోకుడు, ఆతనికి తారాపీడుడు, ఆతనికి చంద్ర పర్వతుడు, ఆతనికి భానురథుడు, ఆతనికి శ్రుతాయువు, జన్మించెను. ఇక్ష్వాకు వంశీయులందరును సూర్యవంశ ప్రవర్తకులుగా చెప్పబడుదురు.
ఆగ్ని మహాపురాణమున సూర్యవంశ కీర్తనమను రెండువందల డెబ్బదిమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 273 of the Agni Purāṇa is as follows:
The Solar dynasty is traced from its cosmic origin: Viṣṇu → Brahmā → Marīci → Kaśyapa → Vivasvān (Sūrya). Vivasvān's three wives — Saṃjñā, Rājñī, and Chāyā — give birth to Manu, Yama, Yamunā, Śani, the twin Aśvins, and Revanta. From Vaivasvata Manu descend the ten sons: Ikṣvāku, Nābhāga, Dhṛṣṭa, Śaryāti, and others who found the great Solar kingdoms. The lineage is traced through the Ikṣvāku line, passing through Hariścandra, Sagara, the sixty-thousand sons of Sagara, Bhagīratha (who brought Gaṅgā to earth), and ultimately to Rāma and his descendants Kuśa and Lava, ending at Śrutāyus. Agni narrates this to Vasiṣṭha.