అగ్ని మహా పురాణము

41 - అథ శిలావిన్యాసవిధిః

భగవానువాచః

పాధప్రతిష్ఠాం వక్ష్యామి శిలావిన్యాస లక్షణమ్

ఆగ్రతో మణ్డపః కార్యః కుణ్డానాంతు చతుష్టయమ్.

కుమ్బాన్యాసేష్టకాన్యాసౌ దారః స్తమ్భోచ్ఛ్రయం శుభమ్

పాదోనం పూరయేత్ఖాతం తత్రవాస్తుం యజేత్సమే.

ఇష్టకాశ్చసుపక్వాఃస్యుఃద్వాదశాఙ్గుల సంమితాః

సువిస్తారత్రి భాగేణ వైపుల్యేన సమన్వితాః.

కరప్రమాణాశ్రేష్ఠాస్యాచ్ఛిలాప్యథ శిలామయే

నవకుమ్భాంస్తామ్రమయాన్థ్సాపయేదిష్టగాకాఘటాన్.

అద్భిః పఞ్చకషాయేణ సర్వౌషధిజలేనచ

గన్ధతోయేన చ తథా కుమ్బైఃస్తోయసుపూరితైః.

హిరణ్యప్రిహిసంయుక్తైర్గన్దచన్దనచర్చితైః

ఆపోహిష్ఠేతి తిసృభిః శన్నోదేవేతి చాప్యథ.

తరత్సమన్దీరితి చ పావమానీభిరేవచ

ఉదుత్తమం వరుణమితి కయానశ్చతథైవచ.

వరుణ్డస్యేతి మన్త్రేణ హంసం శుచిషదిత్యపి

శ్రీసూక్తే నాపిచ తథా శిలాం సంస్థాప్య సంయుతాః.

శయ్యాయాం మణ్డపే ప్రాచ్యాం మణలే హరిమర్చయేత్

జుహుయాజ్జనయిత్వాగ్నిం సమిదోద్వాదశీస్తతః.

హయగ్రీవుడు చెప్పెను : శిలాన్యాసరూపమగు పాదప్రతిష్టను గూర్చి చెప్పెదను; వినుము. మొదట మండపము నిర్మించి పిదపదాని పై నాలుగు కుండములు నిర్మింపవలెను. ఆ కుండములు క్రమముగ కుంభన్యాస ఇష్టకాన్యాస ద్వార. స్తంభములకు మంగళకరమైన ఆశ్రయములుగా నుండును. కుండములోని నాలుగువంతులలో మూడువంతుల భాగము కంకర మొదలైనవాటితో నింపి, సమముచేసి, దానిపై వాస్తుదేవతాపూజ చేయవలెను. పునాదిలో వేయు ఇటుకలు బాగుగా కాలినవై యుండవలెను. వాటి పొడవు పండ్రెండు అంగుళములు, దళసరి పొడవులో మూడవవంతు, ఆనగా నాలుగు అంగుళములుండవలెను. డాళ్లతో దేవాలయమును నిర్మింపదలచిన పక్షమున ఇటుకలకు బదులు జళ్లనీ పునాదిలో అవేయవలెను. ఒక్కొక్క జాయి హస్తము పొడవుండవలెను. తొమ్మిది రాగికలశములుగాని, మట్టికలశములుగాని స్థాపింపవలెమ, ఆ కలశములను జలముతోను, సర్వౌషధులతోను, చందనముకలిపిన జలముతోను నింపవలెను. వాటిలో బంగారము, ధాన్యములు మొదంగును కూడవేసి, గంధాదులతో పూజించి, ఆ జఅపూర్ణకలశలతో “ఆపోహిష్టామ” ఇత్యాది ఋక్ త్రయమును, “శంనోదేవీ రభిష్టయ” ఇత్యాదిమంత్రమును, “తరత్సమన్దః” ఇత్యాది మంత్రమును, పాపమానఋక్కులను, ఉదుత్తమం వరుణ”, “కయానః”, “వరుణస్యో తమ్బనమసి” ఇత్యాదిమంత్రములను పఠించుచు, “హంసః శుచిషత్” ఇత్యాదిమంత్రమును, శ్రీ సూక్త మునుకూడ పఠించుచు, ఆధికసంఖ్యాకములగు శిలలను, ఇటుకలను తడుపవలెను. వాటిని పునాదిలో స్థాపించి, మండపములోపల, ఒక శయ్యపై, పూర్వమండలమునందు శ్రీ మహావిష్ణువును పూజింపవలెను. అరణిని మథించి పుట్టించిన అగ్నియందు ద్వాదశాక్షరమంత్రమును పఠించుచు, సమిధలను హోమము చేయవలెను.

ఆఘారావాజ్యభాగౌతు ప్రణవేనైవ కారయేత్

అష్టాహుతీ స్తథాష్టాన్తైరాజ్యం వ్యాహృతిభిః క్రమాత్.

లోకేశానామగ్నయే వై సోమాయావగ్రహేషు చ

పురుషోత్తమాయేతి చ వ్యాహృతీర్జు హుయాత్తతః.

ప్రాయశ్చిత్తం తతః పూర్ణాం మూర్తమాంసఘృతాం స్తిలాన్

వేదాద్యైర్ద్వాదశాన్తేషు కుమ్భేషుచపృథక్ పృథక్.

ప్రాజ్ముఖస్తుగురుః కుర్యాదష్ట దిక్షువిలిప్యచ

మధ్యేచైకాం శీలాం కుమ్భాన్న్యసేదేలాన్ సురాన్ క్రమాత్.

పద్మంచైవ మహాపద్మం మకరం కచ్చపం తథా

కుముదం చ తథా నన్దం పద్మశజ్ఖే చ పద్మినీమ్.

కుమ్భాన్నచాలయే, త్తేషున్యసేదష్టేష్టకాః క్రమాత్

ఈశానాన్తాశ్చ పూర్వాదావిష్టకాః ప్రథమంన్యసేత్.

శక్తయో విమలాద్యాస్తు ఇష్టకానాంతు దేవతాః

న్యసనీయా యథాయోగం మధ్యేన స్యాత్వనుగ్రహా.

అవ్యఙ్గే చాక్షతేపూర్ణ మునీ రఙ్గిరసః సుతే

ఇష్టకే త్వంప్రయచ్ఛేష్టం ప్రతిష్ఠాం కారయామ్యహమ్.

మన్త్రేణానేన విన్యస్య ఇష్టకాదేశికోత్తమః

గర్భాధానం తతఃకుర్యాన్మధ్యస్థానే సమాహితః.

కుమ్భోపరిష్టాద్దేవేశం పద్మినీంన్యస్యదేవతామ్

మృత్తికాశ్చైవపుష్పాణి ధాతవోరత్న మేవచ.

లోహానిదిక్పతేరస్త్రం యజేద్వై గర్భభాజనే

ద్వాదశాఙ్గులివిస్తారే చతురఙ్గులకోచ్ఛ్రయే.

ఆ ఘారము, ఆజ్యభాగము అను ఆహుతులను ప్రణవముతో చేయవలెను. పిమ్మట అష్టాక్షరమంత్రముతో ఎనిమిది ఆహుతులిచ్చి “ఓం భూః స్వాహా” “ఓం భువః స్వాహా” “ఓం సువః స్వాహా” ఆని మూడు వ్యాహృతులతో క్రమముగాలోకేశ్వరుడైన అగ్ని కిని, సోమగ్రహమునకును. శ్రీ మహావిష్ణువునకును ఆహుతులర్పింపవలెను. పిమ్మట ప్రాయశ్చిత్తహోమముచేసి, ప్రణవయుక్తమగు ద్వాదశాక్షర మంత్రముతో మినుములు, ఘృతము, తిలలు కలిపి పూర్ణాహుతి చేయవలెను. పిమ్మట ఆచార్యుడు పూర్వాభిముఖుడై, ఎనిమిది దిక్కులందు స్థాపించిన కలశములపై వేరు వేరుగ పద్మాదిదేవతలను స్థాపించి పూజింపవలెను. మధ్య యందు కూడ భూమి అలికి ఒక శిలను కలశమును స్థాపింపవలెను. ఈ తొమ్మిదికలశములపై ఈ క్రింద జెప్పిన దేవతలను స్థాపింపవలెను. పద్మ-మహాపద్మ-మకర-కచ్చప-కుముద-ఆనంద-పద్మ-శంఖములను ఎనిమిది కలశములపైస్థాపించి, పద్మినిని మధ్యనున్న కలశముపైస్థాపింపవలెను.

ఈ కలశలను కదపగూడదు. వాటి సమీపమున తూర్పునుండి ప్రారంభించి ఈశాన్యదిక్కువరకును ఒక్కొక్క ఇటుక ఉంచవలేను. వాటిపై వాటి దేవతలైన విమలమొదలగు శక్తులను స్థాపింపవలెను. మధ్య అనుగ్రహ అను దేవతను స్థాపింపవలెను. పిమ్మట “ముని శ్రేష్ఠుడైన ఆంగిరసుని పుత్రియైన ఓ ఇష్టకాదేవీ! నీ ఏ ఆవయవము కూడ విరుగలేదు, వికృతము కాలేదు. నీవు నీ సర్వాంగములతో పూర్ణమై యున్నావు. ఇపుడు నిన్ను నేను ప్రతిష్ఠించుచున్నాను అని” ప్రార్థింపవలెను. ఉత్తముడై న ఆచార్యుడు ఈ మంత్రముతో ఇష్టకాస్థాపనముచేసి, ఏకాగ్రచిత్తుడైమధ్యప్రదేశము నందు గర్భాధానము చేయవలెను. దాని విధి - ఒక కలశముపై శ్రీ మహావిష్ణువును, శ్రీ మహాలక్ష్మిని స్థాపించి వారి సమీపమున మట్టి, పుష్పములు, ధాతువులు, రత్నములు ఉంచవలెను. పిమ్మట పండ్రెండు అంగుళముల వైశాల్యము, నాలుగు అంగుళముల ఎత్తుగల, లోహాదినిర్మితమగు గర్భపాత్రలో అగ్రపూజ చేయవలెను. పిమ్మట కమలాకారమగు తామ్రపాత్రలో పృథివిని పూజించి ఈ విధముగ ప్రార్థింపవలెను.

పద్మా కారే తామ్రమయే భాజనే పృథివీంయజేత్

ఏ కాన్తే సర్వభూతేశే పర్వతాసనమణ్డితే.

సముద్రపరివారేత్వం దేవిగర్భం సమాశ్రయ

నన్దే నన్దయ వాసిష్ఠే వసుభిః ప్రజయాసహ.

జయేభార్గవదాయాదే ప్రజానాంవి నయావ హే

పూర్ణేఽఙ్గిరసదాయాదే పూర్ణకామం కురుష్వమామ్.

భద్రేకాశ్యపదాయాదే కురుభద్రాంమతింమమ

సర్వబీజసమాయు క్తే సర్వరత్నౌషధీవృతే.

జయేసురుచిరే నన్దే వాసిష్ఠే రమ్యతామిహ

ప్రజాపతిసుతే దేవి చతుర్రసే మహీయసి.

సుభగే నుప్రభే భద్రే గృహే కాశ్యపి రమ్యతామ్

పూజతే పరమాశ్చర్యేగన్దమాల్యైరలఙ్కృతే.

భవభూతికరీదేవి గృహే భార్గవిరమ్యతామ్

దేశస్వామి పురస్వామి గృహస్వామి పరిగ్రహే.

మనుష్యాదిక తుష్ట్యర్థం పశువృద్దికరాభవ

ఏవముక్త్వా తతః ఖాతం గోమూత్రేణ తుసేచయేత్.

“సకలభూతముల ఆధీశ్వరివైన ఓ భూదేవీ! పర్వతాసనముపై విరాజిల్లుచు, సముద్రములచే చుట్టబడియున్న నీవు ఏకాంతమునందు గర్భధారణము చేయుము. వసిష్ఠకన్యవె న ఓ నందా! వసువులతోడను, ప్రజలతోడను కూడియున్న నీవు నన్ను ఆనందింపచేయుము. భార్గవ పుత్రివైన ఓ జయా! నీవు ప్రజలకు విజయము నిచ్చుదానవు. (నాకు కూడ విజయము నిమ్ము). అంగిరసుని పుత్రివె న ఓ పూర్ణా! నీవు నాకోరికలను తీర్పుము. కశ్యపమహర్షి పుత్రికవైన ఓభద్రా! నీవు నాకు కల్యాణమైన బుద్దినిమ్ము. సకలబీజములతో నిండి, సమస్త రత్నాషధులతో సంపన్న మేన, సుందరియైన ఓ జయాదేవి! వసిష్ట పుత్రికయైన ఓ నందాదేవీ! ఇచట ఆనంద పూర్వకముగ రమింపుము. కశ్యపుని కన్యయైన ఓ భద్రా! నీవు ప్రజాపతికి పుత్రివి. నాలుగు దిక్కులందును వ్యాపించినదానవు. బాలగొప్పదానవు. సుందరివి, మనోహరమైనదానవు. ఈగృహమునందు రమింపుము. ఓ భార్గవీదేవీ! నీవు చాల ఆశ్చర్యమయురాలవు. గంధమాల్యాదులతో పూజింపబడి ప్రకాశించు చున్నావు. జనులకు ఐశ్వర్యమునిచ్చు ఓదేవీ! నీవీ గృహమునందు విహరింపుము. ఈదేశాధిపతికిని, నగరాధిపతికని, గృహాధిపతికిని, దీనియందు నివసించు బాలాదులకును, మనుష్యాది ప్రాణులకును ఆనందము కలిగించుటకై ప్వదులను వృద్ధిపొందింపుము.” ఈ విధముగా ప్రార్థించి వాస్తుకుండమును గోమూత్రముతో తడుపవలెను.

కృత్వా నిధాయేద్గర్భం గర్భాధానం భవేన్నిశి

గోవస్త్రాది ప్రదగ్యాచ్చ గురవేఽన్యేమ భోజనమ్.

గర్బంన్యన్యేష్టకాన్యస్య తతోగర్బం ప్రపూరయేత్

పీఠబన్దమతః కుర్యాన్మిత ప్రాసాదమానతః.

వీఠోత్తమం చోచ్ఛ్రయేణ ప్రాసాదస్యార్ధ విస్తరాత్

పాదహనం మధ్యమం స్యాత్కనిష్ఠం చోత్తమార్ధతః.

పీఠబన్దో పరిష్టాత్తు వాస్తుయాగం పునర్యజేత్

పాదప్రతిష్ఠాకాలేతు నిష్పాపో దివిమోదతే.

ఈ విధి యంతయు పూర్తి చేసి కుండమునందు గర్భమును స్థాపింపవలెను. ఆ సమయమున ఆచార్యునకు గోవస్తాదిదానమును, ఇతరులకు అన్నదానమును చేయవలెను. ఈ విధముగ గర్భపాత్రనుంచి, ఇటుకలను గూడ ఉంచి ఆ కుండమును నింపవలెను. పిమ్మట దేవాలయము ఎత్తు ననుసరించి ప్రధాన దేవతకు పీఠమును నిర్మింపవలెను. ఆలయము వైశాల్యములో సగము ఎంతయో అంత ఎత్తుగల పీఠము ఉత్తమపీఠము. దానికంటె నాల్గవవంతు ఎత్తు తగ్గినది మధ్యమ పీఠము. ఉత్తమ పీఠము ఎత్తులో సగము ఎత్తు ఉన్నది. కనిష్ఠ పీఠము. పీఠ బంధము చేసిన పిమ్మట మరల వాస్తు పూజ చేయవలేను. కేవల పాద ప్రతిష్ఠ చేయువాడు కూడ సకల పాపవిముక్తుడై దేవలోకములో ఆనంద మగుభవించును.

దేవాగారం కరోమీతి మనసా యస్తు చిన్తయేత్

తస్యకాయగతం పాపం తదహ్నా హి ప్రణశ్యతి.

కృతేతు కింపున స్తస్య ప్రాసాదే విధినై వతు

ఆషేష్టక సమాయుక్తం యంకుర్యాద్దేవతాలయమ్.

 నతస్యఫలసంప త్తిర్వక్తుం శ క్యేత కేనచిత్

 అనే నై వాను మేయంహి ఫలంప్రాసాదవి స్తరాత్.

 గ్రామమధ్యేచ పూర్వేచ ప్రత్యగ్వారం ప్రకల్పయేత్

విదిశాసుచసర్వాసు గ్రామేప్రత్యఙ్ము లోభ వేత్.

 దక్షిణే చోత్తరంచైవ పశ్చిమేప్రాజ్ముఖోభవేత్

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శిలావిన్యాస కథనం నామైక చత్వారింశోధ్యాయః.

“నేను దేవాలయ నిర్మాణము చేసెదను” అతని సంకల్పించిన వాని శారీరక పాపము లన్నియు ఆదివసముననే నశించిపోవును. యథాశాస్త్రముగా దేవాలయ నిర్మాణము చేయువాని మాట చెవ్పవలెనా ఎనిమిది ఇటుకలతో దేవాలయము నిర్మించినవానికి కలుగు ఫలము కూడ వర్ణింపశక్యము కానిది. దీనిని పట్టి విశాలమైన దేవాలయమును నిర్మించిన వానికి కలుగు ఫలమును ఊహించుకొన వచ్చును.

            గ్రామ మధ్యము నందుగాని, గ్రామమునకు తూర్పుగా గాని దేవాలయమును నిర్మించినచో దాని ద్వారము పశ్చిమ మున కుండవలెను. విదిక్కులందు నిర్మించినచో దానిద్వారము గ్రామాభిముఖముగ ఉండవలెను. గ్రామమునకు దక్షిణ- ఉత్తర - పశ్చి దిక్కులందు నిర్మించిన దేవాలయము ద్వారము తూర్పు వైపు ఉండవలెను.

అగ్నేయ మహాపురాణమునందు శిలావిన్యాసకథనమను నలుబది యొకటవ అధ్యాయము సమాప్తము.