అగ్ని మహా పురాణము

127 - అథ నానాబలాని.

ఈశ్వర ఉవాచః

విష్కమ్భే ఘటికాస్తిస్రః శూలే పఞ్చ వివర్జయేత్

షట్ షట్ గణ్డేఽతిగణ్డే చ నవ వ్యాఘాతవజ్రయోః.

పరిఘే చ వ్యతీపాతే హ్యుభయోరపి తద్దినమ్

వైధృతౌ తద్దినే చైవ యాత్రా యుద్ధాదికం త్యజేత్.

గ్రహైః శుభాశుభం వక్ష్యే దేవి మేషాదిరాగితః

చన్ద్రశుక్రౌ చ జన్మసౌ వర్ణితౌ శుభదాయకౌ.

ద్వితీయో మఙ్గలోఽథార్కః! సౌరిశ్చైవ తు సైంహికః

ద్రవ్యనాశమలాభం చ హ్యాహవే భఙ్గమాదిశేత్.

సోమో బుధో భృగుర్జీవో ద్వితీయస్థాః శుభావహాః

తృతీయస్థో యదా భానుః శనిర్బౌమో భృగుస్తథా.

బుధశ్చైవేన్దురాహుశ్చ సర్వే తే ఫలడా గ్రహా

బుధశుక్రౌ చతుర్థౌ తు శేషాశ్చైవ భయావహాః.

పఞ్చమస్థో యదా జీవః శుక్రః సౌమ్యశ్చ చన్ద్రమాః

దదేతచేప్పితం లాభం ష్ఠషే స్థానే శులో రవిః.

చన్ద్రః సౌరిర్మఙ్గలశ్చ గ్రహా దేవి స్వరాశితః

బుధశ్చ శుభదః షష్ఠే త్యజేత్షష్ఠే గురుం భృగుమ్.

న స్తమోర్కః శనిర్భౌమో రాహుర్హాన్యై సుఖాయ చ

జీవో భృగుశ్చ సౌమ్యశ్చ జ్ఞశుక్రౌ చాష్టమౌ శుభౌ.

శేషా గ్రహాస్తథా హాన్యై జ్ఞభృగూ నవమౌ శుభౌ

శేషా హాన్యై చ లాభాయ దశమౌ భృగుభాస్కరౌ.

శనిర్భౌమశ్చ రాహుశ్చ చన్ద్రః సౌమ్యః శుభావహః

శుభాశ్చైకాదశే సర్వే వర్జయేద్దేశమే గురుమ్.

బుధశుక్రౌ ద్వాదశస్థౌ శేషాన్ ద్వాదశగాం స్త్యజేత్

అహోరాత్రే ద్వాదశ స్యూరాశయస్తాన్వదామ్యహమ్.

పరమేశ్వరుడు చెప్పెను : విష్కంభయోగమున మూడు ఘడియలు శీలయోగమున ఐదు ఘడియలు గండ-అతిగండ యోగముల ఆరు ఘడియలు, వ్యాఘాత-వజ్రముల తొమ్మిది మడియలు అన్ని కార్యములందును త్యాజ్యములు. పరిమవ్యతీపాత-వైధృత యోగములందు దిన మంతయు త్యాజ్యమే. ఈ యోగ ములందు యాత్రాయుద్ధాదికము చేయరాదు. దేవీ! నే నిపుడు మేషాదీరాశుల ఫలములను, గ్రహముల ద్వారా కలుగు ఫలములను చేప్పెదను. జన్మరాశియందు చంద్రశుక్రులు వర్ణితులే యైనను శుభప్రదులు. జన్మరాశినుండియు, లగ్నమునండియు రెండవ స్థానమున సూర్యుడు గాని, శని గానీ, రాహువు గాని కుజుడు గాని ఉన్నచో ప్రాప్తద్రవ్యము నశించును. ఆప్రాప్తము లభించదు; యుద్ధమున పరాజయము కలుగును. చంద్ర-బుధ గురు శుక్రులు ద్వితీయమందున్న చో శుభప్రదులు. మూడవ ఇంటిలో నున్న రవి.శని-కుజశుక్రబుధ-చంద్ర-రాహువులు శుభ ప్రదులు. నాల్గవ ఇంటిలో బుధ శుక్రులున్నచో శుభులు. ఇతరులు భయప్రదులు. పంచ మమునం దున్న గురు-శుక్ర-బుధ-చంద్రులు ఆభిష్టలాభదాయకులు. దేవీ! తన రాశినుండి ఆరవ భావమున రవి చంద్ర శని కుజు-బుధు లున్న చో శుభవలము నిత్తురు. కాని శుక్రగురులు శుభ ప్రదులు. కారు సప్తమభావమునందు రవి-శుక్ర-శని-కుజ రాహువు లున్న చో హాని కలుగును. బుధ-గురు-శుక్రులున్న చో సుఖము కలుగును; అష్టమమునందలి బుధ-శుక్రులు శుభులు. ఇతరులు హానికరులు. నవమభావమునం దున్న బుధ శుక్రులు శుభులు, ఇతరులు అశుభులు దశమభావము వందలి శుక్ర.సూర్యులు లాభకరులు. శని-కుజ-రాహు-చండ్ర-బుధులు శుభకారకులు. పదకొండవ భావమునం దున్న ఏ గ్రహమైనను శుభము నిచ్చును. దశమ స్థానమునందు బుధ శుక్రులు శుభులు. ఇతర గ్రహములు ఆశుభులు. ఒక దివసమునందు పండ్రెండు రాసులును తిరిగివచ్చును. ఇపుడు వాటి ఫలమును చెప్పెదను

మీనో మేషోఽథ మిథునం చతస్రో నాడయో వృషః

షట్ కర్మసింహకన్యాశ్చ తులా పఞ్చ చ వృశ్చికః.

ధనుర్నక్రో ఘటశ్చైవ సూర్యగోరాశీరాద్యకః

చరస్థిరద్విస్వభావా మేషాద్యాః స్యుర్యథాక్రమమ్.

కులీరో మకరశ్చైవ తులామేషాదయశ్చరాః

చరకార్యం జయం కామమాచరేచ్చ శుభాశుభమ్.

స్థిరో వృషో హరిః కుమ్బో వృశ్చికః స్థిరకార్యకే

శీఘ్రః సమాగమో నాస్తి రోగార్తో నైవముచ్యతే.

మిథునం కన్యకా మీనో ధనుశ్చ ద్విస్వభావకః

ద్విస్వభావా శుభాశ్చైతే సర్వకార్యేషునిత్యశః.

యాత్రాకాణిజ్యసంగ్రామే వివాహే రాజరర్శనే

వృద్ధిం జయం తథా లాభం యుద్దే జయమవాప్నుయాత్.

అశ్వినీ వింశతారాశ్చ తురగస్యాకృతిస్తథా

యద్యత్ర కురుతే వృష్టిమేకరాత్రం ప్రవర్షతి.

యమభే తు యదా వృష్టిః పక్షమేకం తు వర్షతి

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే యుద్ధజయార్ణవే నానాబలనిరూపణం నామ నవ్తవింశత్యధిక శతతమోఽధ్యాయః.

మీన-మేష-మిథునములకు ఒక్కొక్కదానికి భోగ కాలము నాలుగు దండములు. వృషభ-కర్కట-సింహ-కన్యలకు ఆరేసి దండములు, తులావృశ్చికధనుర్మకరకుంభములకు ఐదేసి దండముల కాలము. సూర్యు డున్న రాశీ ఉదయ రాశి, ఆ రాశినుండి ఇతర రాశుల భోగ కాలము ప్రారంభ మగును. మేషాది రాశులకు క్రమముగ చర-స్థిర-ద్విస్వభావము అని పేరు. మేష-కర్కట-తులా-మకరములు చరరాశులు. వీటియందు ఆస్థిరము లైన శుభాశుభకార్యములు చేయవలెను. వృషభ-సింహ-వృశ్చిక-కుంభములు స్థిరరాశులు. వీటిలో స్థిర కార్యములు చేయవ రెను. ఈ లగ్నములలో బైటకు వెళ్ళిన వ్యక్తి తో శీఘ్రసమాగము జరుగదు. రోగి శీఘ్రముగ రోగ విముక్తుడు కాడు. మిథున-కన్యా-ధనుః-మీనము ద్విస్వభావ రాశులు. ఈ రాశులు అన్ని కార్యములందును శుభప్రదములు. వీటియందు యాత్ర, వ్యాపారము, సంగ్రామము, వివాహము, రాజదర్శనము, వృద్ధిక రము, జయలాభకరములు; యుద్ధమునందు విజయప్రదములు, ఆశ్వినీనక్షత్రమునందు ఇరువది తారలు ఉండును. దాని ఆకారము గుర్రము వలె నుండును. ఈ నక్షత్రమునందు వరము ప్రారంభించినచో ఒక రాత్రి వరకు గొప్ప వర్షము కలుగును. భరణీయందు వర్షము ప్రారంభించినచో పదునై దు దినములవరకును ఆవిచ్చిన్నముగా నుండును.

అగ్ని మహాపురాణమునందు నానాబలవర్ణన మను నూట ఇరువదియేడవ అధ్యాయము సమాప్తము.