అగ్ని మహా పురాణము

110 - అథ గజ్గామాహాత్మ్యమ్

 అగ్ని రువాచః-

గజ్గామామాహాత్మ్యమాఖ్యా స్యే సేవ్యా సా భుక్తిముక్తిదా

యేషాం మద్యే యాతి గజ్జి తే దేశాః పావనా పరాః.

గతిర్గజ్గా తు భూతానాం గతిమన్వేషతాం సదా

గజ్జాతారయతే శోభౌ వంశా నిత్యంపా నేవీలా.

చాంద్రయణసహస్రాచ్చ గజ్జామ్భః పానముత్తమమ్

గఙాం మానం తు నం సేవ్య సర్వయజ్ఞఫలం లభేత్

నకలామహరీ దేవి స్వర్గలోకప్రదాయినీ

యావదణ్ణి చ గజ్జాయాం తావత్స్వర్గీ స తిష్ఠతి.

అన్టాదయస్తు లోం సేవ్య దేవై రచ్చ తుల్యతామ్

గఙాతీరసముద్భూతమృధారీ స్కోఫహారవల్.

రీ దర్శనాత్స్పర్శతృవా తథా గణేతి కిర్తనాత్

పునాతి పుణ్యపురుషాణతథ సహస్రశః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే గజ్గామాహాత్మ్యం నామ దశాధిక శతతమోధ్యాయః.

అగ్ని దేవుడు పలికెను : ఇపుడు గంగామాహాత్మ్యమును చెప్పెదను. సర్వదా గంగను సేవించవలెను. గంగ భుక్తిముక్తిప్రదాయిని. ఏ దేశ ములందు గంగ ప్రవహించునో ఆ దేశ ములు పవిత్రములు. ఉత్తమగతిని ఆవ్వేషించువారికి గంగ ఒక్కటియే సర్వోత్తమగతి. గంగను సేవించినచో మాతృపితృవంశములు రెండును ఉద్దరింపబడును. వేయి చాంద్రా యణవ్రతములు చేయుటకంటె గంగాజలపాసవడం ఉత్తమము. ఒక మాసము గంగా సేవ చేసినవాడు సకలయజ్ఞముల కల ములు పొందును. గంగాదేవి సకల పాపములను తొలగించును, స్వర్గము నిచ్చుమ. గంగాజలములో ఎముక పడి యున్నంత కాలము, ఆ జీవుడు స్వర్గములో నివసించును. అంధాదులు గంగా సేవ చేసి దేవలాతుల్యు లగుదురు. గంగాతీర్థమునుండి మట్టి తీపి ధరించువాడు సూర్యుడు వలె సకలపాపములను నశింపచేయును. గంగాదర్శనస్పర్శ.జలపానములు చేయువాడును, గంగావామ సంకీర్తన చేయువాడును తన వంశము నందలి ఎన్నో వేల తరముల వారిని పవిత్రము చేయును,

అగ్ని మహాపురాణమునందు గంగామహిమవర్ణవ మను నూటపదవ అధ్యాయo సమాప్తము.