నారద ఉవాచః-
వక్ష్యే పూజావిధిం విప్రా యం కృత్వా సర్వమాప్నుయాత్ ।
ప్రక్షాలితాంఘిరాచమ్య వాగతః కృత రక్షణ.
ప్రాజ్ముఖః స్వస్తి కం బద్ధ్వా వద్మాద్యపర మేవ వా ।
యం బీజం నాభిమధ్యస్థం ధూమం చణ్డానిలాత్మకమ్.
విశోషయేద శేషం తు ధ్యాయన్కాయత్తు కల్మషమ్।
నారదుడు పలికెను.
విప్రులారా! ఏ పూజావిధిచే సర్వకార్య కామములును లభించునో దానిని చేప్పెదను. పాదప్రక్షాళనము చేసికొని, ఆచమనము చేసి, మౌన మవలంబించి, రక్ష చేసికొని, తూర్పుగా తిరిగి, స్వ సికాసనమునందు కాని, పద్మాసనము నందు గాని, మరొక అననమునందు కాని కూర్చుండి, నాభి మధ్యలో నున్న దియు, ధూమ్రవర్ణము కలదియు, తీవ్ర వాయురూప మైనదియు ఆగు “యం” బీజమును ధ్యానించుచు శరీరమునుండి సకలకల్మషములను శోషింపచేయవలేను.
క్షౌం హృత్సంజ జమధ్యస్థం బీజం తేజోనిధిం స్మరన్
అథోర్ద్వతిరగ్గాభీస్తు జ్వాలాభిః కల్మషం ద హేత్ ।
హృదయపద్మ మధ్యమునం దున్న తేజోనిధి యగు “క్షౌం” అను బీజమును స్మరించుచు, క్రిందికిని, పైకిని, అడ్డముగను ప్రసరించే జ్వాలలచే కల్మషమును దహించవలెను.
శశజ్కాకృతివద్ద్యాయేదమ్బరస్థం సుధాముభిః.
హృత్పద్మవ్యాపిభిర్దేహం స్వకమాప్లావయేత్సుధీ।
సుషుమ్నా యోనిమార్గేణ సర్వనాడీవిసర్పిభి.
ఆకాశమునందు చంద్రుని ఆకారము వంటి ఆకారమును ధ్యానము చేయవలెను. దాని నుండి స్రవించుచున్న దియు, సుషుమ్నా నాడిద్వాగా నమ స్ర నాడులందును వ్యాపించుచున్న దియు, హృదయ పద్మమును వ్యాపించుచున్న వియు ఆగు అమృతధారల చేత తన దేహమును ని పవలేను.
శోధయిత్వా న్య సేత్తత్వం కర శుద్ధిర థాస్త్రకమ్।
వ్యాపకం హస్తయోరాదో దక్షిణాజుష్టతోఒజ్గకమ్.
మూలం దేహే ద్వాదశాబ్దం న్య సేన్మనైఠ్విషట్కకైః ।
హృదయం చ శిర శ్చైవ శిఖావర్మాస్త్రలోచనే.
ఉదరం చ తథా పృష్టం బాహూరూ జానుపాదకమ్ ।
ముద్రాం దత్త్వా స్మర్వేద్విష్ణుం జప్త్వాష్టశతమర్చయేత్.
శోధనము చేసి తత్వనానము చేయవలెను. పిమ్మట కర శుద్ధి కొరకు ఆత్రవ్యాపళముద్రలను, చేయవలెను. కుడి చేతి అంగుష్ఠమునుండి కరతలము వరకి న్యానము చేయవలెను. దేహమునందు పన్నెండు ఆక్షరముల మూల మంత్ర ముతో హృదయము, శిరస్సు, శిఖ, వర్మ, అస్త్రము, నేత్రములు, ఉదరము, శరీరము వెనుక భాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్లు, పాదములు అను ద్వాదశాంగముల పై న్యాసము చేయవలెను ముద్రనిచ్చి విష్ణువును స్మరించి, ఆప్టోత్తరశత జపము చేసి పూజింపవలేను.
వా మేతు వర్థనీం న్యస్య పూజాద్రవ్యం తు దక్షిణే ।
ప్రగ్యా ణ చారే ఒథ గన్దపుష్పాన్వితే న్య సేత్.
చైతన్యం సర్వగం జ్యోతిరస్త్రజ ఫేన వారిణా!
షడనే న తు సంసిచ్య హస్తే ధ్యాత్వా హరిం వరే.
ధర్మం జ్ఞానం చ వైరాగ్యమైశ్వర్యం వహ్ని గిజ్ముఖాన్।
ఆధర్మాదిని గాత్రాణి పూర్వాదౌ యోగపీఠ కే
కూర్మం పీలే హ్యననం చ యమం స్యూర్యాదిమజ్ఞలమ్ ।
విమలాద్యాః కేసరస్థానగ్రహాః కర్ణికాస్థితాః.
పూర్వం స్వహృదయే ధ్యాత్వా ఆవాహ్యారేచ్చ మణ్డలే ।
అర్ఘ్యం పాద్యం తథానామం మధుపర్కం పునశ్చ తత్.
స్నానం వస్తోవవీతం చ భూషణం గన్ధపుష్పకమ్।
ధూపదీపనైవేద్యాని పుట్టిరీకాక్ష విద్యయా.
యజేదజ్జాని పూర్వాదౌ ద్వారి పూర్వే వరేణ్డజమ్ ।
దక్షే చక్రం గదాం సౌమ్యకోణే శజం ధనుర్వ్య సేత్.
దేవస్య వామతో దక్షే చేషధీ ఖడమేవ చ।
వామే చర్మ శ్రియం దāపుష్టిం వామేగ్రతో న్య సేత్.
జలకుంభమును ఎడమ వైపునను, పూజాద్రవ్యములను కుడి వైపునను ఉంచవలెను. అస్త్రముచే ప్రక్షాళన చేసి గంధపుష్పాన్వితము నైన ఆర్యములను ఉంచవలెను. సర్వవ్యాప్తము, జ్యోతిస్వరూపము అయిన చైతన్యములను “ అయఫట్” అని అభిమంత్రించిన, ఉదరముచే యోగ బీజము నడిపి, హరిని ధ్యానించి, పూర్వాదియోగ పీఠము నందు ధర్మమును, వే రాగ్యమును. ఐశ్వర్యమును, ఆగ్నేయదిక్కు మొదలైన వాటిని, అధర్మము మొదలగు అంగము లకు, పీఠమునందు కూర్మమును, అనంతుని, యముని, సూర్యాదుల మండలములను, విమల మొదలగు కేసరస్థానము నందున్న గ్రహణములను, కర్ణిక (ఈ పద్మము మధ్యనున్న దుద్దు యందున్న గ్రహణములనుముందు తన హృదయము నందు ధ్యానము చేసి పిమ్మట మండలము పై ఆవాహనము చేసి అర్చించవలెను. వైష్ణవ విద్యానుసారముగా ఆర్య-పాద్య. ఆచమన - మధుపర్క - స్నాన, వస్త్ర - యజ్ఞోపవీత - అలంకార - గంధ - పుష్ప - ధూప - దీప - నైవేద్యములను, నమర్పింపవలెను. పూర్వాది దిక్కులందు అంగదేవతలను పూజించవలెను. తూర్పు-పడమర దిక్కులందు గరుత్మ తుని, కుడివైపున చక్రమును, గదను, ఎడమవైవన శంఖమును, ధనస్సును ఉంచవలేను. దేవుని ఎడమవైపున అంబుల పొదులను, కుదివైపున ఖడ్గమును, ఎడమవైపున డాలును ఊంచవలెను. కుడివైపున అగ్రభాగమున పుష్టిని ఉంచవలెను.
వనమాలాం చ శ్రీవత్సకౌస్తుభౌ దికృతీన్ బహిః । స్వమనైరర్చయేంత్సర్వాన్విష్ణోరర్భావసాగతః.
వ్యక్తేన చ సమ స్తేన అజ్గైర్బీజేన వై యజేత్।
జప్త్వా ప్రదక్షిణీకృత్య స్తుత్వార్ఘ్య చ సమర్ప్య చ
హృధయే విన్య సేద్ద్యాత్వా అహం బ్రహ్మహరిస్తితి ।
వనమాలను, శ్రీ వత్సమును, కౌస్తుభమును కూడ ఉంచవలెను. దిక్పాలకులను వెలుపల ఉంచవలెను. ఈ అంగదేవతల నందరిని వారి వారి మంత్రములచే పూజించవలెను. విష్ణుపూజ పూర్తి యేన పిమ్మట ఆంగదేవతలను వ్య స్త రూపమునను, నమ స్తరూపమునను బీజాక్షరయు క మంత్రములతో పూజించవలెను. జపించి, ప్రదక్షిణము చేసి, స్తుతించి, అర్ఘ్యమును సమర్పించి “నేనే బ్రహ్మను, నేనే హరిని” అని ధ్యానము చేసి హృదయమునందు ఉంచుకొనవలెను.
ఆగచ్ఛావాహనే యోజ్యం క్షమ స్వేతి విసర్జనే.
ఏవమష్టాక్షరాద్వైశ్చ పూజాం కృత్వా విముక్తి భాన్ ।
ఆవాహనము చేయు నపుడు 'అగచ్చ' ఆనియు. ఉద్వాననము చేప్పునపుడు 'క్షమస్వ' అనియు అనవలెను. ఈ విధముగా అష్టాక్షరాదులచే పూజ చేసి ముక్తిని పొందును.
ఏక మూర్యర్చనం ప్రోక్తం నవవ్యూహార్చనం శృణు.
అజ్గుష్ఠద్వయ కే న్యస్య వాసుదేవం బలాతన్।
తర్జన్యాదౌ శరీ రేఒథ శిరోలలాటవక్త్ర కే.
హృన్నా భిగుహ్యజాన్వజ్ఘ్రౌ మధ్యే వూర్వాధికం యజేత్ ।
ఏకపీలే నవవ్యూహం నవపీఠం చ పూర్వవత్.
నవాబ్జే నవమూర్త్యా చ నవవ్యూహం చ పూర్వవత్।
పద్మమధ్యే చ తత్స్థాని వాసుదేవం చ పూజయేత్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ఆదిమూర్త్యాదిపూజావిధిర్నామ త్రయోవింశోధ్యాయః.
ఇంతవరకును ఏకమార్త్యర్చనము చెప్పబడినది. ఇపుడు నవ వ్యూహార్చనమును వినుము. ఆంగుష్ఠద్వయము సందును తర్జన్యాదులందును వాసుదేవుని, బలాదులను న్యానము చేయవలెను. పిమ్మట శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాలు, పాదము వీటియందు న్యాసము చేసి మద్యయందు పూర్వాదిక్ పూజ చేయ వలెను, ఏక పీఠము పై, క్రమముగ, నవ వ్యూహములను, నవ పీఠములను స్థాపించి వెనుక టివలెనే పూజించవలెను. నవాబ్జములందు నవమూర్తుల నావాహనము చేసి నవవ్యూహపూజ వెనుక టివలెనే చేయవలెను. పద్మ మధ్యమునందు వాటి యందున్న దేవతలను, వాసుదేవుని పూజించవలెను.
అగ్ని మహాపురాణమున ఆదిమూర్త్యాది పూజావిధి యను ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 23 of the Agni Purāṇa is as follows:
The twenty-third chapter presents a sacred list of 108 names of Bhagavān Viṣṇu, each name encoding a theological attribute, a cosmic function, or a narrative epithet drawn from the Purāṇic tradition. Names such as Viṣṇu (all-pervading), Madhusūdana (slayer of Madhu), Trivikrama (three-strides), Vāmana, Śrīdhara (bearer of Śrī), Hṛṣīkeśa (lord of the senses), and Padmanābha (lotus-naveled) are included. Each name is accompanied by a brief indication of its meaning and the benefit of its recitation. The chapter prescribes the ritual context for reciting these names — at the conclusion of the pūjā — and affirms that the recitation of even a single name of Bhagavān destroys the accumulated sins of many births and grants liberation.