పుష్కర ఉవాచః
యజుర్విధానం వక్ష్యామి భుక్షి ముక్షిపదం శృణు ।
ఓంకార పూర్వికారామ మహావ్యాహృతమో మతాః.
సర్వకలుషనాశినుః సర్వకామప్రదా స్తథా ।
ఆజ్ఞ్యాహుతి సహస్రేణ దేవానారాధయేద్బుధః.
మనసః కాంక్షితం రామ మనసేప్సిత కామదమ్ ।
శాంతికామో యవైః కుర్యాత్తి లైః పాపావనుత్తయే.
దానైః సీద్దార్థకైశ్పైవ సర్వకామకరైస్తథా ।
ఔదుంబరీభిరిధ్యాభిః పశుకామస్య శస్యతే.
దధ్నా చైవాన్న కామస్య పయసా శాన్తిమిచ్ఛతః ।
అపామార్గ నమిద్భిస్తు కామయన్కనకం బహు.
కన్యాకామో మృతాక్తాని యుగ్మశోగ్రథితానితు ।
జాతీ పుష్పాణి జుహుయాద్గ్రామార్థీతిలతండులామ్.
వశ్వకర్మణి శాఖోట వాసోపా మార్గమేవచ ।
విషాసృజ విశ్ర సమిదో వ్యాధిఘాతస్య భార్గవ.
కద్ధస్తు జుహుయాత్సమ్యక్ఛత్రూణాం వరకామ్యయా ।
నర్మవ్రీహిమయీం కృత్వా రాజ్ఞః ప్రతిక్నతింట్విజః.
సహస్రశస్తు జుహుయాద్రాజావశగతో భవేత్ ।
వస్త్రకామస్య పుష్పాణి దూర్వావ్యాధివినాశినీ.
బ్రహ్మవర్చస కామస్య వాసోగ్రంచ విధీయతే ।
ప్రత్యంగి రేషు జుహుయాత్తుష కంటక భస్మభిః.
విద్వేషణే చ పక్ష్మాణి కాక కౌశికయోస్తథా ।
కాపిలంచ ఘృతం హుత్వా తథా చంద్రగ్రహేద్విజః.
వచాచూర్ణేన సంపాతాత్స మానీయచతాం వచమ్ ।
సహస్రమంత్రితాం భుక్త్వా మేధావీ జాయతేనరః.
ఏకాదశాంగులం శంకుం లౌహం ఖాదిరమేవచ ।
ద్వీషతోవధోఽసీతి జపన్నిఖనేద్రి పువేశ్మని.
ఉచ్చాటన మిదం కర్మ శత్రూణాం కథితం తవ ।
చక్షుష్యా ఇతి జప్త్వాచ వినష్టం చక్షురాప్నుయాత్.
ఉపయుంజత ఇత్యేతదనువాకం తథాన్నదమ్ ।
తనూనపాగ్నే సదితి దూర్వాహుత్వార్తివర్జితః.
భేషజమసీతి దధ్యాజ్యైర్హోమః పశూపసర్గనుత్ ।
త్రియంబకం యజామహే హోమః సౌభాగ్యవర్గనః.
కన్యానామ గృహీత్వాతు కన్యాలాభకరః పరః ।
భయేషుతు జపన్నిత్యం భయేభ్యో విప్రముచ్యతే.
దుస్తూ (త్తూ) ర పుష్పం సఘృతం హుత్వా స్యాత్సర్వ కామభాక్ ।
హుత్వాతు గుగ్గులం రామ స్వప్నే పశ్యతి శంకరమ్.
యుంజతే మనోఽనువాకం జప్త్వా దీర్ఘాయురాప్నుయాత్ ।
విష్ణోరరాట మిత్యేతత్సర్వ బాధావినాశనమ్.
రక్షోఘ్నం చ యశస్యం చ తథైవ విజయప్రదమ్ ।
ఆయంనో ఆగ్నిరిత్యేతత్సంగ్రామే విజయప్రదమ్.
ఇదమాపః ప్రవహత స్నానే పాపాపనోదనమ్ ।
విశ్వకర్మన్ను హవిషా సూచీం లౌహీం దశాం గులామ్.
కన్యాయా నిఖనే ద్ద్వారి సాఽప్యస్మై నప్రదీయతే ।
దేవ సవితరేతేన హుతేనైతేన చాన్నవాన్.
పుష్కరుడు పలికెను. పరశురామ ! ఇపుడు భుక్తిముక్తి ప్రదమగు యజుర్విధానమును చెప్పెదను వినుము. ఓంకార యుక్తములగు మహావ్యాహృతులు సకల పాపనాశ కములు, సర్వకామప్రదములు. బుద్ధిమంతుడు వీటితో నూరు హోమములు చేసి దేవతలను ఆరాధించవలెను. దీని వలన మనోవాంఛితములగు కోరికలు తీరును శాంతికాముడు యవలతోను పాపవినాశనమును కోరువాడు తిలలతోను, హోమము చేయవలెను. ధాన్యములతోను తెల్లఆవాలతోను హోమము చేసినచో సర్వకామములు సిద్ధించును. పశుకాముడు ఉదుంబరమిధలతో హోమము చేయవలెను. అన్న కాముకు పెరుగుతోను శాంతి కాముడు పాలతోను, అధికసువర్ణకాముడు ఆపామార్గసమిధలతోను హోమము చేయవలేను కన్యకను కోరు వాడు రెండేసి చొప్పున కట్టిన, నేతితో తడిపిన జాతిపుష్పములను హోమము చేయవలెను. కామము కోరువాడు తిలలను తండులములను హోమము చేయవలెను. వశీకరణ కర్మయందు శాకోట - వస - అపామార్గ - సమిధలను హోమము చేయవలెను. ఓ భార్గవా! రోగనాశనిమిత్తము విషర క్షములతో తడిపిన సమిధలు హోమము చేయవలెను. శత్రువధ కోరువాడు క్రోధపూర్వక మగ పైసమిధలను హోమము చేయవలెను. ద్విజుడు అన్ని ధాన్యములతో ఒక రాజప్రతిమను నిర్మించి దానిని వేయిసార్లు హోమము చేసినచో రాజు వశమగును. వస్త్రకాముడు పుష్పములను హోముమచేయలేను. “దూర్వా” హోమము వ్యాధి వినాశకము. బ్రహ్మతేజము కోరువాడు ఉత్తమ వస్త్రమును ఆర్పించవలెను. విద్వేషణకర్మయందు ప్రగ్యంగిరోక్త విధానానుసారముగ స్థాపించిన, ఆగ్నియదు పొల్లుముల్లు, భస్మము, కాకి ఈకలు, గుడ్లగూబ ఈకలు హోమము చేయవలెను. చంద్రగ్రహణసమయమున కపిలధేను ఘృతమును, హోమముచేసి ఆఘృతమునందు వూనా చూర్ణమును కంపి “సుపాతము” అనే ఆహుతినిచ్చి, మిగిలిన వసను తీసుకొని వెయ్యిసార్లు గాయత్రిచే ఆభిమంత్రించి, ఆవసను తిన్నచో వేధావియగును. పదకొండు అంగుళముల లోహశంకువుకాని ఖదిర వృక్షపు శంకువు కాని “ద్విషతోవధోఽసి” (1.25 , అను మంత్రమును జపించుచు శత్రువు ఇంటిలో పాతవలేను. ఈ విధముగా శత్రువినాశక మగు కర్మను నీకు చెప్పితిని. “చక్షుష్యా” (2.16) ఇత్యాది ముత్రమును జపించుటచే పోయిన చూపువచ్చును. “ఉపయుంజతే” ఇత్యాది అనువాకము అన్న మునుఇచ్చును. “తనూనపాగ్నేఽసి” (3-17) ఇత్యాదిమంత్రముతో దూర్వాహోమము చేసినచో సంక ఎములు దూరమగును. “భేషజమసి” (3-59) ఇత్యాది మంత్రముతో పెరుగు, నెయ్యి హోమము చేసినచో పశువునకు వచ్చు మహామారి రోగములు తొలగిపోవును. “తియంబకం యజామహే” (3-60) అను మంత్రము చేత చేసినహోమము సౌభాగ్యవృద్దీకరము కన్య యొక్క పేరు చెప్పికాని కన్యనుద్దేశించిగాని ఈ మంత్రముతో జపహోమములు చేసినచో ఇది కన్యాలాభమనకు ఉత్తమ సాధనము. భయములు వచ్చినపుడు నిత్యము ఈ మంత్రమును జపిచువాడు భయవిముక్తుడగును, ఈ మంత్రముతో మృతమిశ్ర తత్తూర పుష్పములను హోమము చేసినవాడు సర్వకామములను పొందును. ఈ మంత్రమతో “గుగ్గులు” హోమము చేసిన వాడు స్వప్నమునందు శంకరుని చూచును. “యుంజలేమనః” (5-14) అను అనువాకమును జపించినవాడు దీర్ఘాయుర్దాయమును పొందును. “విష్ణోరరాటమసి” అను మంత్రము సకల బాధలను నివారించును. రాక్షసులను నశింపచేయును. ఇది కీర్తి వర్ధకమ విజయప్రదము. “ఆయంనోఅగ్నిః” (5-37) ఇత్యాది మంత్రము యుద్ధమునందు జయప్రదను. “ఇదమాపః ప్రవహత” (6-17) ఆను మంత్రము జపించుచు స్నానము చేసినచో పాపనాశ కము. పది అంగుళముల పొడవైన ఇనుప ఊచను “విశ్వకర్మన్ హవిషా” (17-22) అను మంత్రముచే అభిమంత్రించి యేకన్యకయొక్క ద్వారమువద్దః పాతేదరో ఆ కన్యను మరెవరికీ ఇవ్వజాలరు. “దేవసవితః” (11–7) అనువంత్రముతో హోమము చేసినవాడు అన్నవంతుడగును.
అగ్నౌ స్వాహేతి జుహుయాద్బల కామో ద్విజోత్తమః ।
తిలైర్య వైశ్చ ధర్మజ్ఞ తథాపామార్గతండులైః.
సహస్రమంత్రితాం కృత్వా తథా గోరోచనాం ద్విజ ।
తిలకంచ తథాకృత్వా జనస్య ప్రియతామియాత్.
రుద్రాణాం చ తథా జప్యం సర్వాఘ వినిషూదనమ్ ।
సర్వకర్మకరో హోమస్తథా సర్వత శాంతిదః.
అజావికానామశ్వానాం కుంజరాణాం తథాగవాయ్ ।
మనుష్యాణాం నరేంద్రాణాం బాలానాం యోషితామహి.
గ్రామాణాం నగరాణాంచ దేశానామపి భార్గవ ।
ఉపద్రుతానాం ధర్మజ్ఞ వ్యాధితానాం తథైవచ.
మరకేసమను ప్రాప్తే రిపుజే చ తథాభయే ।
రుద్రహోమః పరాశాంతిః పాయసేన మృతేనచ.
కూష్మాండ ఘృత హోమేన సర్వాన్పాపాన్వ్యపోహతి ।
నక్తుయావక భైక్షాశీ నక్తం మనుజసత్తమ.
బహిః స్నానరతో మాసాన్ముచ్యతే బ్రహ్మహత్యయా ।
మధువాతేతి మంత్రేణ హోమాదితోఽఖిలంలభేత్.
దధిక్రావ్ణేతి హుత్వాతు పుత్రాన్ప్రాప్నోత్య సంశయమ్ ।
తథాఘృతవతీత్యేతదాయుష్యం స్యాద్ఘృతేన తు.
స్వస్తిన ఇంద్ర ఇత్యేతత్పర్వ బాధావినాశనమ్ ।
ఇహగావః ప్రజాయధ్వమితిపుష్టివీవర్ధనమ్.
ఘృతాహుతి సహస్రేణ తథాఽలక్ష్మీ వినాశనమ్ ।
స్రుషేణ దేవస్య త్వేతి హుత్వాపామార్గతండులమ్.
ముచ్యతే వికృతాచ్చీఘ్ర మభీచారాన్న సంశయః ।
రుద్రపాతు (ద్రంయత్తే) పలాశస్య సమిద్భిః కనకం లభేత్.
శవో భవేత్యగ్న్యుత్పాతే ప్రీహిభిర్జుహుయాన్నరః ।
యాః సేనా ఇతి చైతచ్చ తన్కారేభ్యో భయాపహమ్ .
యో ఆస్మభ్య మవాతీయాద్దుత్వా కృష్ణతిలాన్నరః ।
నహస్రశోఽభిచారాచ్చ ముచ్యతే వికృతాద్ద్విజ.
అన్నేనాన్నపతే త్యేషం హుత్వా చాన్న మవాప్నుయాత్ ।
హంస! శుచిషదిత్యేతజ్ఞప్తం తోయేఽఘ నాశనమ్.
చత్వారి శృంగే త్యేతత్తు సర్వపాపహరం జలే ।
దేవాయజ్ఞేతి జప్త్వాతు బ్రహ్మలోకే మహీయతే.
వసంతేతిచ హుత్వాజ్యమాదిత్యాద్వ రమాప్నుయాత్ ।
సుపర్ణో సీతి చేత్యస్య కర్మవ్యాహృతి వద్భవేత్.
నమః స్వాహేతి త్రిర్జప్త్వా బంధనాన్మోక్ష మాప్నుయాత్ ।
అంతర్జలే త్రిరావర్త్య ద్రుపదాసర్వ పాపముక్.
బల కామడగు ద్విజుడు “అగ్నౌ స్వాహా” ఆనుమంత్రముతో తింలు యవలు, ఆపామార్గ సమిధలు తండులములు హోమము చేయవలెను. ఈ మంత్రమతో వెయ్యిపర్యాయములు అభిమంత్రించిన గోరోచనమును తిలకనగా ధరించినచో లోకప్రియుడగును. రుద్రమంత్రముల జపము సర్వపాప వినాశకము. వానితో చేసిన హోమము సర్వకర్మ సాధకము. అంతటన శాంతిప్రదాయకము. మేకలు, గొఱ్ఱెలు, ఈర్రములు, ఏనుగులు, గోవులు, ఇష్యులు, రాజులు, బాలురు, స్త్రీలు, గ్రామములు, నగరసలు, దేశము, వివిధోపద్రవ పీడితులై రోగగ్రస్తులై నను మహామారీ భయము కాని శత్రుభయము కాని వచ్చివన మృతదితమగు పాయసముతో రుద్రదేవతనుద్దేశించి హోమము చేసినచో గొప్పశాంతి లభించును. ఓ నరశ్రేష్ఠా! రాత్రియంద మాత్రమే సక్తువులు యవల గంజి భిన్నము భుజించుచు ఒక మాసమపాటు బయటమో నమ చేయావాడు బ్రహ్మహత్యా పాపవిముక్తుడగును. “మధువాతా” (13-17) ఇత్యాది మంత్రమతో హోమాదులు చేసిన సర్వపు లభించును. “దధిక్రాప్ణో” (23-32) అను మంత్రముచే హోమముచేయు గృహస్థుడు నిస్సంశయమగా పుత్రులను పొందును. “మృతవతీ భవనానామభి” (34-45) అను మంత్రముతో మృతహోమతి చేసినచో ఆయుర్వృద్ధి కలుగును. “స్వస్తినః ఇంద్రః” (25-19) అను మంత్రపు సమస్త భాధలను నశింపచేయును. “ఇవగావః ప్రజాయద్వం” అను పుష్టి వర్ధక మాత్రలో వెయ్యి మృతిహోమములు చేసినచో దారిద్ర్యము నశింతన. “దేవస్యత్వా” అను మంత్రముతో సృవపతో అపామార్గ సమిధలను, తండులవలన హోమము చేసినవాడు శీఘ్రమగా అభిచారవిషక్తుడగును. సంశయము లేదు “రుద్రయత్తే” (10-20) అను మంత్రమతో పలాశ సమిధలను హోమము చేసినచో సువర్గము లభించును. ఆగి ప్రమారస కల్గినపుడు “శివోభవ” (11-45) అమమంత్రముతో ప్రీహి హోమము చేయవలయును. “యా సేనా!' అని పుత్రస చోరథయము తొలగించును. “యో ఆస్మభ్యమరాతీయాత్” (11-80) అను మంత్రముతో వెయ్యి తిల హోమములు చేయువాడు భయంకరమగు అలిచారము నుండి విముక్తుడగున “అన్నపతే” (11-83) అను మంత్రముతో అన్నహోమమున చేసినవారికి అన్నము లభించును. నీటిలో నిలచి “హంసః శచిషత్” (11-24) అను మంత్రమును జపించి నచో శర్వపాపములు నశించును. నీటిలో నిలచీ “చత్వారికృంగా” (17-91) అను మంత్రమును జపించినచో సర్వపాపము నశించును. “దేవాయజ్ఞ మతవ్వత” (19-12) అను మంత్రమును జపించువాడ బ్రహ్మలోకమును పూజితుడగును. “వసంతోఽస్యాసీత్” (31-14) అనుమంత్రముతో ఆజ్యహోమము చేయువానికి సూర్యడు వరముల నిచ్చను. “సువర్ణోఽసీ (17-22) అనుమంత్రమతో వ్యాహృతి మంత్రమంలో చేసినట్లే కర్మ చేయవలెను. “నమస్వాహా” ఇత్యాది మంత్రమును మూడు పర్యాయములు జపించినవాడు బంధవిముక్తుడగును. నీటిలో నిలచి “దృపదాదివ” (20-20) అనుమంత్రమును మూడు పర్యాయములు చెప్పువాడ సర్వపాపవిముక్తుడగును.
ఇహగావః ప్రజాయద్వం మంత్రోయం బుద్దివర్ధనః ।
హుతంతు సర్పిషాదద్నా పయసా పాయసేనవా.
శతం య ఇతి చైతేన హుత్వా పూర్ణఫలానిచ ।
ఆరోగ్యం శ్రియమాప్నోతి జీవితం చచిరు తథా.
ఓషధీః ప్రతిమోదర్వం వషనే లవనేఽర్ధకృత్ ।
అశ్వావతి పాయసేన హోమాచ్ఛాన్తి మవాప్నుయాత్.
తస్మాఇతి చ మంత్రేణ బంధనస్థో విముచ్యతే ।
యువా సువాసా ఇత్యేవ వాసాంస్యాప్నోతి చోత్తమమ్.
ముంచంతు మాశపఖ్యాని (ది) సర్వాన్తక వినాశనమ్ ।
మామాహింసీస్తిరాజ్యేన హుతం రిపు వినాశనమ్.
నమోజ్స్తు నర్వసర్పేభ్యో ఘృతేన పాయ సేనతు ।
కృణుర్వం రాజ ఇత్యేతదభిచార వినాశనమ్.
దూర్వాకాండాయుతం హుత్యా కాండాత్కాండేతి మానవః ।
గ్రామే జనపడే వాపీ మరకం తు శమం నయేత్.
రోగార్తో ముచ్యతే రోగాత్తథా దుఃఖాత్తు దుఃఖితః ।
ఔదుంబరీశ్చ సమిధో మధుమాన్నో వనస్పతిః.
హుత్వా సహన్రశో రామ ధనమాప్నోతి మానవః ।
సౌభాగ్యం మహదాప్నోతి వ్యవహారే తథాజయమ్.
ఆపాం గర్భమితి హుత్వాదేవం వర్షపయేద్ధృవమ్ ।
ఆవః పిబేతి చ తథా హుత్వా దధిమృతం మధు.
ప్రవర్తయతి దర్మజ్ఞ మహావృష్టి మనన్తరమ్ ।
నమస్తే రుద్ర ఇత్యేతత్పర్వోపద్రవ నాశనమ్.
నర్వశాంతికరం ప్రోక్తం మహాపాతక నాశనమ్ ।
ఆధ్యవోచ దిత్యనేన రక్షణం వ్యాదితన్యతు.
రక్షఘ్నంచ యశస్యంచ చిరాయుః పుష్టివర్ధనమ్ ।
సిద్ధార్ధకానాం క్షేపేణ పథి చైతజ్ఞపన్పుఖీ.
అసౌ యస్తామ్ర ఇత్యేతత్పతన్నిత్యం దివాకరమ్ ।
ఉపతిష్ఠేత ధర్మజ్ఞ సాయంప్రాతర తంద్రితః.
అన్నమక్షయమాప్నోతి దీర్ఘమాయుశ్చ విన్దతి ।
ప్రముంచ ధన్వన్నిత్యేతత్షడ్బిరాయుడ మంత్రణమ్.
రిపూణాం భయదం యుద్దే నాత్రకార్యావిచారణా ।
మానో మహాన్త ఇత్యేవం బాలానాం శాంతికారకమ్.
నమో హిరణ్యబాహవే ఇత్యనువాక సప్తకమ్ ।
రాజికాం కటుతై లాక్తాం జుహుయాచ్ఛత్రునాశినీమ్.
నమోవః కిరికేభ్యశ్చ పద్మలక్షైర్హుతైర్నరః ।
రాజలక్ష్మీమవాప్నోతి తథా బిల్వైః సువర్ణకమ్.
ఇమారుద్రాయేతి తిలైర్హోమాచ్చ రనమాప్యతే ।
దూర్వాహోమేన చాన్యేన సర్వవ్యాధి వివర్జితః.
ఆశుః శిశాన ఇత్యేతదాయుధానాం చరక్షణే ।
సంగ్రామే కథితం రామ సర్వశత్రునిబర్హణమ్.
రాజసామేతి జుహుయాత్పహస్రం పంచభిర్ద్విజ ।
ఆజ్యాహుతీనాం ధర్మజ్ఞ చక్షూరోగాద్విముచ్వతే.
“ఇహగావః ప్రజాయధ్వం” అను మంత్రమతో నెయ్యి, పెరుగు, పాలు లేదా పాయసము హోమము చేసినచో బుద్ధి వృద్ధి చెందును. “శంన్నో దేవీ!” అను మంత్రముతో పలాశఫలములను హోమము చేసినవానికి ఆరోగ్యమ, లక్మి చిరజీవనము లభించును. “ఓషధీఃప్రమోదధ్వం” (12-17) అను మంత్రముతో విత్తనములు చల్లునపుడు, పంటకోయు వపుడు హోమము చేసినచో ఆర్గప్రాప్తి కలుగును. “అశ్వావతీః” (34-40) అను మంత్రముతో పాయస హోమము చేసిన శాంతి లభించును. “తస్మాఅరం” (36-16) ఇత్యాది మంత్రముతో హోమము చేసినచో బందియైన వాడు విడువ బడును. “యువాసువాసా” (తై!! దా!! 3-6-18) అను మంత్రముతో హోమము చేసిన వస్త్రము లభించుడి. “ముంచన్తు మాశపథ్యాత్” (12-90) ఇత్యాది మంత్రముతో హోమము చేసినచో శాపాదులు నశించును. “మామాపాలసీవితాః” (12-102) అను క్షంత్రముతో మృతమిశ్రతిలలు హోమముచేయగ శత్రువులు నశింతురు. “నమోఽస్తు సర్వేభ్యః” (13-6) అనుమంత్రవ్వలో మృత హోమము “కృణుర్వంరాజ” అను మంత్రముతో పాయసమున హోమము చేసినచో ఆభిచారము, నశించును. “కాఁడాత్కాండాత్” (13-20) అను మంత్రముతో దూర్వా కాండమలను వెత్యూయములు హోమము చేసినచో గ్రామములో గాని జనపదములోగాని వ్యాపించిన మహామారి శాంతించును. రోగపిడితుడు. రోగవిముక్తుడగును, దుఃఖితుడు దుఃఖవిముక్తుడగును. “మధుమాన్నొవనస్పతిః” (13-29) అను మంత్రముతో వెయ్యి ఉదుంబర సమిధలు హోమము చేయుటచే ధనము గొప్ప సౌభాగ్యము, వ్యవహారములో విజయము లభించును. “ఆపాంగర్బంసీద” (వా!! 13-30) అనుమంత్రముతో హోమముచేయువాడు తప్పక పర్ధన్య దేవునిచే వర్షము కుర్పింప చేయును “ఆపపిబన్” (14-8) ఇత్యాది మంత్రముతో దధిఘృత మధువులను హోమము చేసినచో వెంటనే గొప్పవర్షము కురియును “నమస్తేరుద్ర (16-1) అను మంత్రము సర్వోపద్రవవాశకము, సర్వశంతికరము, మహాపాతకములను నశింపచేయును. “అధ్యవోచ దధివక్త” (16-5) అను మంత్రముతో హోమముచేసినచో వ్యాధిగ్రస్తుడు రక్షింపబడును రాక్షసులు నశింతురు, యశస్సులు లభించును. చిరాయువు సష్టివృద్ధికలుగును. ఈమంత్రము చదువుతూ మార్గమునందు తెల్లఆవాలను చల్లు బాటసారి సుఖ వంతుడగును, “అసౌయప్తామ్రః” (16-6) అనుమంత్రమును చదువుచూ, నిత్యము సాయం ప్రాతఃకాలములందు. ఆలస్య రహితుడు సూర్యోపస్థానము చేయుడు అక్షయమైన అన్నమును, దీర్ఘాయువును పొందును “ప్రముంచరస్వది” (16-9-14) ఇత్యాదిమంత్ర షట్కముతో ఆయుధములను అభిమంత్రించినచో యుద్ధమునందు శత్రువులకు భయము కలుగును. ఈ విషయ మున మరియొక విధముగా అలోచింప పనిలేదు. “మానోమహాపాతం” (16-15) అను మంత్రము బాలలకు శాంతికారకము. “నమోహిరణ్యవాహవే” అను ఏడు అనువాకములతో తైలము కలిపిన రాజికలను హోమము చేసినచో శత్రువులు నశింతురు. “నమోవకిరికేభ్యః” (16-46) అను మంత్రముతో ఒక లక్ష కమలములను హోమము చేసినవాడు రాజ్యలక్ష్మిని, ఒక బిల్వ ఫలముల హోమము చేసినవాడు, సువర్ణ రాశిని పొందును. “మారుద్రాయ” (16-48) ఆనుమంత్రముతో తిలహోమము చేసినచో ధనములభించును. ఈ మంత్రముతోనే దూర్వాహోమము చేసినచో సర్వవ్యాధులు నశించును. “అశుఃశిశానః” (17-33) అను మంత్రముతో ఆయుధములకు రక్ష, యుద్ధములందు సర్వ శత్రువినాశము కలుగును. “వాజశ్చమే” (18-15-19) ఇత్యాది మంత్రపంచకమతో ఆజ్యాహుతులు వెయ్యి చేసినచో నేత్రరోగములనుండి విముక్తుడగును.
శన్నోవనస్పతేగేహే హోమః స్యాదాస్తు దోషనుత్ ।
అగ్న ఆయూంషి హుత్వాజ్యం ద్వేషం నాప్నోతి కేనచిత్.
ఆపాంఫేనేతి లాజాభిర్హుత్వా జయమవాప్నుయాత్ ।
భద్రా ఇతీంద్రయైర్హీనో జవన్స్యాత్సకలేంద్రియః.
ఆగ్నిశ్చపృథివీ చేతి వశీకరణ ముత్తమమ్ ।
ఆధ్వనేతి జపన్మంత్రం వ్యవహారే జయీభవేత్.
బ్రహ్మరాజన్యమితిచ కర్మారంభేతు సిద్దికృత్ ।
సంవత్సరోఽసీతి మృతైర్లక్షహోమాదరోగవాన్.
కేతుం కృణ్వన్నిత్యే తత్సంగ్రామే జయవర్ధనమ్ ।
ఇంద్రాగ్నిర్దర్మ ఇత్యేతద్రణే ధర్మనిబంధనమ్.
ధన్వా నాగేతి మంత్రశ్చ ధనుర్గ్రాహణికః పరః ।
యుంజీతేతి తథామంత్రో విజ్ఞేయోహ్యభిమంత్రణే.
మంత్రశ్చాహి రథేత్యేతచ్ఛరాణాం మంత్రణే భవేత్ ।
వహ్నినాం పితరిత్యేతత్తూణమంత్రః ప్రకీర్తితః.
యుంజన్తీతి తథాశ్వానాం యోజనేమంత్ర ఉచ్యతే ।
ఆశుః శిశాన ఇత్యేతద్యాత్రారంభణ ముచ్యతే.
విష్ణోః కర్మేతి మంత్రశ్చ రథారోహణికః పరః ।
ఆజంఘేతీతి చాశ్వానాం తాడనీయ ముదాహృతమ్.
యాః సేనా అభిత్వరీతి పరసైన్య ముఖేజపేత్ ।
దుందుభ్య ఇతి చాహ్యేతద్దుందుభితాడనం భవేత్.
ఏతైః పూర్వహితైర్మంత్త్రెః కృత్వైవం విజయీభవేత్ ।
యమేన దత్తమిత్యస్య కోటి హోమాద్విచక్షణః.
రథముత్పాదయేచ్చీఘ్రం సంగ్రామే విజయప్రదమ్ ।
ఆకృష్ణేతి తథైతస్య కర్మవ్యాహృతివద్భవేత్.
శివసంకల్ప జాపేన సమాధిం మనసో లభేత్ ।
పంచనద్యః పంచలక్షం హుత్వాలక్ష్మీమవాప్నుయాత్.
యదా వధూ దాక్షాయణం మంత్రేణానేన మంత్రితమ్ ।
సహస్రకృత్వః కనకం ధారయేద్రిపువారణమ్.
ఇమం జీవేభ్య ఇతిచ శిలాం లోష్టం చతుర్థిశమ్ ।
క్షి పేద్గృహే తదా తస్యన స్యాచ్చోర భయంనిశి.
పరిమే గామనేనేతి వశీకరణ ముత్తమమ్ ।
హన్తుమభ్యాగతస్తత వశీభవతి మానవః.
భక్ష్యతాంబూల పుష్పాద్యం మంత్రితం తుప్రయచ్ఛతి ।
యస్యధర్మజ్ఞ వశగః సోఽస్య శీఘ్రం భవిష్యతి.
శన్నోమిత్ర ఇతిత్యేతత్సదా సర్వత్ర శాంతిదమ్ ।
గణానాంత్వా గణపతిం కృత్వా హోమం చతుష్పథే.
వశీకుర్యాజ్జగత్సర్వం నర్వదాన్యైర సంశయమ్ ।
హిరణ్యవర్ణా! శుచయో మంత్రోఽయ మభిషేచనే.
శన్నోదేవీర భీష్టయే తథా శాంతికరః పరః ।
ఏక చక్రేతి మంత్రేణ హుతేనాజ్యేన భాగశః.
గృహేభ్యః శాంతి మాప్నోతి ప్రసాదం చన సంశయః ।
గావోభగ ఇతి ద్వాభ్యాం హుత్వాజ్యంగా అవాప్నుయాత్.
ప్రహదాంషః సోపదితి గ్రహయజ్ఞే విధీయతే ।
దేవేభ్యో వనస్పత ఇతి ద్రుమయజ్ఞే విధీయతే.
గాయత్రీ వైష్ణవీ జ్ఞేయా తద్విష్ణోః పరమం పదమ్ ।
సర్వపాపప్రశమనం సర్వకామకరం తథా.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే యజుర్విధానం నామ షష్ట్యధిక ద్విశతతమోఽద్యాయః.
“శంనో వనస్పతే” (19-38) అనుమంత్రముతో గృహమునందు హోమము చేసినచో వాస్తుదోషములు నశిచును. “అగ్న ఆయానాం” (19-38) అనుమత్రముతో ఆజృహోమము చేయువానికి ఎవ్వరితోను వైరముండదు. “ఆంపాంఫేనేన” (19-71) అను మంత్రముతో లాజహోమము చేసినవాడు విజయము పొందును. “భద్రాహుత” (14-39) అను మంత్రమును జపించిన ఇంద్రియహీనుడు, లేనా దుర్బలేంద్రియుడు ఇంద్రియశక్తి సంపన్నుడగును. “ఆశ్చిపృథివీచ” (26-1) అను మంత్రము గోప్ప వశీకరణ మంత్రము. “ఆధ్వనా” (5-33) ఆనుమంత్రమును జపించువాడు వ్యవహారమున జయమును పొందును. కార్యప్రారంభమున “బ్రహ్మక్షత్రంపవతే” (19-5) అనుమత్రముమ జపించినచో కార్యసిద్ధి కలుగును. “సంవత్సర్మోసి” అను మంత్రముతో లక్ష ఆజ్యహోమములు చేసిన వాడు రోగ విముక్తుడగును. “కేతుంకృణ్వన్” (29-37) అను మంత్రము యుద్ధమునందు జయవర్ధకమ. “ఇంద్రోఽగ్నిధర్మః” అనుమంత్రము యుద్ధమునందు ధర్మ సమ్మతమైన విజయము నిచ్చును. ధనుస్సును ధరించువును “ధవ్వనాగా” (29-39) అను మంత్రమును జపించుట ఉత్తమము. “యజీత అను మంత్రముచే ధనుస్సునభిమంత్రించవలెను. “ఆహిరివ” (29-51) అను మంత్రముచే బాణములను ఆభిమంత్రించ వలెను. “వహ్నినాంపితః (29-42) అను మంత్రముతో తూణీరమును అభిమంత్రించవలెను. “యుంజన్త్యస్యా” (23-61) అను మంత్రమును చదువుచు గుర్రములను రథములకు కట్టవలెను. యాప్రారంభ సమయమున “ఆశువుగిశానః” (17-35) అను మంత్రమును చదువవలెను. రథారోహణసమయమున “విష్ణోఃక్రమోసి” (12-5) అను మంత్రమును గుర్రములను తొలిసారిగా తోయినపుడు “ఆజంఘన్తి” (29-50) అను మంత్రమును, శత్రుసేనఎదుట “యాస్సే వాఅభిత్వరీః” (11-77) అను మంత్రమును, దుందుభివాయించునవుడు “దుందుభ్యః” అను మంత్రమును పఠించవలెను. ముందుగా ఈమంత్రములతో హోమముచేసి, తరువాత ఈ విధముగ చేసినచో విజయము లభించును. “యమేనదత్తమ్” (29-13) ఆను మంత్రముతో కోటిహోమములు చేసినచో యుద్ధమునందు వెంటనే విజయమునిచ్చు రథము ఆవిర్భవించును, “ఆకృష్ణన” అను మంత్రముతో వ్యాహృతులతో చేసిన కర్మల వంటికర్మలను చేయవలయును. “యజ్ఞాగత్రః” (34-1) ఇత్యాది శివసంకల్ప మంత్రములను జపించుటచే మనస్సుకు ఏకాగ్రత లభించును. “పంచనద్యః” (34-11) అను మంత్రముతో ఐదులక్షల హోమము చేసినవాడు లక్ష్మీని పొందును. “యదాబధ్నన్ దాక్షాయణాః” (34-52) అను మంత్రముతో వెయ్యి పర్యాయములు అభిమంత్రించిన సువర్ణమును ధరించినచో ఆది శత్రునివారణము. “ఇమంజీవేభ్యః” (35-15) అనుమంత్రమును చదువుచు. రాళ్లుగాని, మట్టిపెడ్డలు గాని అభిమంత్రించి ఇంటినలు వైపుల విసిరినచో రాత్రిచోర భయము వుండదు. “షరిమేగామనేషత్” (35-18) ఉత్తమమైన. వశీకరణ మంత్రము చంపుటకు వచ్చినవాడు.. కూడ లొంగిపోవును ఓడర్మజుడా! ఈ మంత్రముతో అభిమంత్రించిన భక్ష్యములు తాంబూలములు పుష్పములు, మొదలగు నవి ఎవనికై న ఇచ్చినచో వాడు శీఘ్రముగా వశమై పోవును “శంనోమిత్రః” (36-9) అను మంత్రము అంతటను ఎల్ల వేశలను శాంతిప్రదము “గణానాంత్వాగణపతిం” (23-19) ఆను మంత్రముతో చతుష్పదమునందు సర్వధాన్యములను హోమము చేసినవాడు జగత్తునంతను వశము చేసుకొనును. సందేహము లేదు. అభిషేక సమయమున “హిరణ్య వర్ణాః శుచయే” అను మంత్రమును పఠించవలెను. “శంనోదేవీరభీష్టయే” అను మంత్రము పరమ శాంతికారకము. ఏకచక్ర ఇత్యాడిమంత్రముతో ఆజ్యభాగపూర్వకముగ గృహమునకు ఆజ్యహోమము చేసినచో గ్రహముల అనుగ్రహము శాంతి లభించును. సందేహములేదు. “గావపావతావం” (33-29) “భగ పణేతః” (34-36-37) అనుమంత్రత్రయముచే ఆజ్యహోమము చేసినవానికి గోవులు లభించును. “ప్రవాదాంశఃసోవత్” అను మంత్రమును గృహయజ్ఞమున ఉపయో గించవలేను “దేవేభ్యోవనస్పతే” ఇత్యాదిమంత్రములను వృక్షయజ్ఞములందు వినియోగించవలెను. గాయత్రి విష్ణురూప మెనదని తెలుసుకొనవలెను సమస్తపాపములను శమింపచేయునది, సమస్తకామములను తీర్చునదియగు విష్ణపరమపదము కూడ గాయత్రియే.
ఆగ్ని మహాపురాణమునందు యజుర్విధానమను రెండువందల అరువదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 260 of the Agni Purāṇa is as follows:
An expanded treatment of Śrāddha rites is presented, covering the sixteen types of Śrāddha including the Mahālaya Śrāddha performed during the entire Pitṛ-pakṣa. Agni enumerates the food items most dear to the pitṛs — sesame, barley, kuśa grass, and the flesh of specific animals — and the items that should never be offered. The chapter discusses who is qualified to receive a Śrāddha invitation (the pātra brāhmaṇa) and the effect of an unqualified person's participation, which is said to cancel the benefit of the entire rite.