అగ్ని మహా పురాణము

268 - అథ నీరాజనవిధిః

పుష్కర ఉవాచః

కర్మసాంవత్సరం రాజ్ఞాం జన్మర్క్షే పూజయేచ్చతమ్

మానియాసి చ సంక్రాన్తౌ సూర్యసోమాది దేవతాః.

  ఆగస్త్య స్యోదయేఽగస్త్యం చాతుర్మాస్యంహరింయజేత్

శయనోత్థాపనే పంచ దినం కుర్యాత్సముత్సవమ్.

 ప్రోష్ఠపాదేసితే పక్షే త్రతిపత్ప్రభృతిక్రమాత్

శిబిరాత్పూర్వ దిగ్భాగే శుక్రార్ధం భవనం చరేత్.

తత్ర కధ్వజంస్థాప్య శచీం శక్రం చ పూజయేత్ 

అష్టమ్యాం వాద్య మో షేణ తాంతుయష్టిం ప్రవేశ యేత్.

 ఏకాదశ్యాం సోపవాసో ద్వాదశ్యాం కేతుముత్తితమ్

యజేద్వస్త్రాది సంవీతం ఘటస్థం సురపంశ చీమ్.

 వర్గ స్వేంద్ర జితామిత్ర వృత్రహన్సాక శాసన

 దేవదేవమహాభాగ త్వం భూమిష్టంగతః.

త్వంప్రభుః శాశ్వత్చవ సర్వభూత హితేరతః

అనంత తేజా వైరాజో యశో జయవివర్దనః.

తేజస్తే వర్గయంత్వేతే దేవాః క్రః సువృష్టి కృత్

 బ్రహ్మవిష్ణుమ హేళ్చా కార్తికేయోవినాయకః.

ఆదిత్యా వసవోరుద్రః సాధ్యాక్చఠృగవోదిశః

మరుద్గణాలోకపాలా గ్రహా యణాది నిమ్న గా.

 సముద్రాః శ్రీరహీగౌరీ చండికాచ నరస్వతీ

 ప్రవ ర్తయంతు తేతేజో జయశక్ర శచీపతే.

 తవచాపి జయన్ని త్యం మమసంపద్యతాం శుభం

 ప్రసీదరాజ్ఞాం విప్రాణాం ప్రజానామపి సర్వశః.

భవత్రసాదాత్పృథివీ నిత్యం నస్యవతీ భవేత్

శివం భవతి నిర్విఘ్నం శామ్యన్ తా మీతయోభృశమ్.

 మంత్రేణేంద్రం సమభ్యర్చ్య జీతభూఃస్వర్గ మాప్నుయాత్

పుష్కరుడు చెప్పెను. రాజుకు చేయదగిన సాంవత్సర కర్మచెప్పెదను. రాజుజన్మ నక్షత్రమున ఆనక్షత్ర మును పూజించవలెను. ప్రతిమాసమునందును, సంక్రాంతి యందు సూర్య హోమాది దేవతలను ఆగస్త్యోదయ సమయ మున అగస్త్యుని, చాతుర్మాస్యము నందు హరిని పూజించవలెను. శయన ఉత్థాన ఏకాదశులందు ఐదుదినములు ఉత్స వము చేయవలెను. భాద్రపద శుక్ల ప్రతిపత్తున శిబిరమునకు తూర్పున ఇంద్రపూజ కె భవనము నిర్మించవలెను. ఆచట శక్రధ్వజము స్థాపించి శచీదేవుని ఇంద్రుని ప్రతిపత్తు మొదలు అష్టమి వరకు పూజించవలెను. అష్టమినాడు వాద్య ఘోషము లతో ఆ ఇంద్రధ్వజమనకు దండము తొడుగవలెను. ఏకాదశినాడు ఉపవాసముండి ద్వాదశినాడు ఆధ్వజము ఎత్త వలెను. ఒక కలశ ముపై వస్త్రాదులచే చుట్టబడిన ఇంద్రుని శచీదేవిని స్థాపించి “శత్రువులను జయించు వృత్రనాశ కుడవగు ఓ పాక శాసనా ! ఓ మహాభాగా ఓదేవ దేవా ! నీకు అభ్యుదయమగు గాక. నీవు ఈ భూమి పైకి వచ్చితివి. నీవు శాశ్వతుడ పైన ప్రభువు. సర్వభూతముల హితమునందు ఆసక్తుడవు. అనంతతేజముకలవాడవు. విరాట్ పురుషుడవు. యశోజయములను వృద్ధి చేయువాడవు. నీవు ఉత్తమ వర్షమును కల్గించు ఇంద్రుడవు. సమస్త దేవతలు, నీతేజస్సును వృద్ధి పొందించెదరు గాక. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కార్తికేయుడు వినాయకుడు ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, సాధ్యులు, భృగువులు, దిక్కులు, మరుద్గణములు, లోకపాలకులు, గ్రహములు, యక్షులు, పర్వతములు, నదులు, సముద్రములు, లక్ష్మి, భూమి, గౌరి, చండికా, సరస్వతీ, వీరందరును నీతేజస్సును వృద్ధి పొందించేదరు గాక! శచీపతి వైన ఓయిం ద్రా! నీవు జయించెదవుగాక ! నీ విజయముచే నాకు కూడ సర్వదా శుభము కలుగుగాక ! రోజులు బ్రాహ్మణులు, ప్రజలు, వీరందరిని అనుగ్రహించుము. నీయనుగ్రహమంచే భూమి నిత్యము సస్యసంపన్న అగుగాక : అందరికి విఘ్న విహీన మగు కల్యాణమగు గాక ! ఈతిబాధలు పూర్తి గ నశించుగాక!"యని ప్రార్థించుచు పూజించవలెను. ఈమంత్రముతో యింద్రుని పూజించిన వాడు భూమిని జయించి స్వర్గ మును పొందును.

భద్రకాళీం పటేలిఖ్యపూజయే దాశ్వినేజయే.

 శుక్లపక్షే తథాష్టమ్యా మాయుధం కార్ముకం ధ్వజమ్

ఛత్రం చ రాజలింగాని శస్త్రాద్యం కుసుమాదిభిః. 

జాగ్రన్ని శిబలిం దద్యాద్ద్వితీయేఽహ్ని పునర్యజేత్

భద్రకాళి మహాకాళి దుర్గే దుర్గార్తి హారిణి.

త్రైలోక్య విజయ్ చండిమమశాంతౌ జయేభవ

నీరాజనావిధిం వచ్యే హ్యైశాన్యాం మందిరంచరేల్.

 తోరణత్రితయం తత్రగృహే దేవాన్యజేత్సదా

చిత్రాం త్యక్త్వాయదా స్వాతిసవితా ప్రతిపద్యతే.

 తతఃప్రభృతి కర్తవ్యం యావల్స్వాతౌరవిః స్థితః

 బ్రహ్మావిష్ణుశ్చ శంభుశ్చ శక్ర శ్చైవానలానిలౌ.

 వినాయకః కుమారశ్చవరుణ్ ధనదోయమః

 విశ్వేదేవా వైశ్రవసో గజాశ్చాష్టాచలాన్య జేత్. 

కుముద్ర రావభౌపద్మః పుష్పదంతశ్చవామనః

సుప్రతీకోంజనోనీలకి పూజాకార్యాగృహాది కే. 

 పురోధా జుహుయా దాజ్యం సమిత్సిద్ధార్థకం తిలాః

కుంతా ఆష్టా పూజితాశ్చతైః స్నాప్యాక్చగజోత్తమాః.

అశ్వాన్ని ప్యా దదేత్పిండాం సతో పా ప్రథమం గజాన్

 నిట్రామయేత్తోరడైస్తు గోపురాది నలంఘయేత్ .

విక్ర మేయు స్తతః సర్వే రాజలింగం గృ హేయజేత్

వారుణోవరుణం ప్రార్చ్య రాత్రే భూతబలిందదేత్. 

విశాఖాయంగతే సూర్యే ఆశ్రమే నివసే న్నపః

ఆలంకుర్యాద్ధినే తస్మిన్వాహనం తు విశేషతః.

 పూజితా రాజ లింగాశ్చ కర్తవ్యా నరహ స్తగాః

హ క్రితం తురగం ఛత్రం ఖడ్గం చాపంచ దుందుభిమ్.

ధ్వజం పతాకాం ధర్మజ్ఞ కాలజ్ఞ స్వభి మంత్రయేత్

ఆభిమంత్య్ర తతః సర్వాన్ కుర్యాత్కుంజర ధూర్గరాన్.

 కుంజరోపరిగె స్యాతాం సాంవత్సర పురోహితౌ

మంత్రితాంశ్చ సమారుహ్య తోరణేన వినిర్గ మేత్.

 నిష్ర్కమ్య నాగమారుహ్య తోరణీనాథ నిర్గ మేత్

బలిం విభజ్యవిధివద్రాజా కుంజర ధూర్గతః.

 ఉల్ము కానాంతు నిచయమాదీపిత దిగ న్ తరమ్

 రాజాప్రదక్షిణం కుర్యా త్త్రీన్వారాన్సుసమాహితః.

 చతురంగబలో పేతః సర్వ సైన్యేన నాదయన్

ఏవం కృత్వాగృహం గచ్ఛే ద్విసర్జిత జలాంజలిః.

 శాంతినీరాజనాఖ్యేయం వృద్ధయేరిపుమర్దినీ.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నీరాజనావిధిర్మామాష్ట షష్ట్యధిక ద్విశతత మోఽధ్యాయః.

ఆశ్వీయుజ శుక్ల అష్టమినాడు వస్త్రము పై భద్రకాళిని చిత్రించి, విజయము కోరువాడు ఆదేవతను పూజించ వలేను. ఆయుధమాలు, ధనస్సు, ధ్వజము, ఛత్రము, రాతి చిహ్నములు శస్త్రాదులు వీటిని కూడ పుష్పాదులతో పూజింపవలెను. రాత్రి జాగరణ చేసి బలియిచ్చి, మరునాడు మరల పూజించవలెను. "భద్రకాళి, మహాకాళి, దుర్గా, దుర్గ బాధనుహరించుదానా, త్రైలోక్య విజయా, చండీ నాకు శాంతివిజయమును ఇమ్ము" ఇపుడు నీరాజనావిధిని చేప్పె దను. ఈశాన్యమున దేవతామందిరము నిర్మించి మూడు ద్వారములు ఏర్పరచి యచట సర్వదా దేవతా పూజ చేయ వలయును. సూర్యుడు చిత్తానక్షత్రమును విడిచి స్వాతిలో ప్రవేశించునపుడు ప్రారంభించి, ఆ నక్షత్రములో ఉండు వరకును దేవతా పూజ చేయవలయును. బృహ . విష్ణువు - శంభు - శక్ర - అగ్ని - వాయు . వినాయక . కుమార - వరుణ - కుబేర విశ్వేదేవ - వైశ్రవసులను కుముద, ఐరావణ, పద్మ, పుష్పదంత వానున, సుప్రతీక - ఆంజననీలు లను దిగ్గ జములను గృహాదులందు పూజించవలెను. పిదప పురోహితుడు ఆజ్య, సమిత్, సిద్దార తిలలతో హోమము చేయవలయును. ఎనిమిది కలశములు పూజించి వాటితో ఉత్తమమైన ఆశ్వములను గజములను స్నానము చేయించి ముందు గజములకు గ్రాసము ఇవ్వవలెను. తోరణ ద్వారమునుండి బయటకు తీసుకుని రావలేను. గోపురాదులను దాట కూడదు. పిదప ఆందరును బయటకు వచ్చిన పిమ్మట ఇంటియందే రాజ చిహ్నములను పూజించవలెను. శతభిషా నక్షత్ర మున వరుణిని పూజించి భూతములకు బలేయివ్వవలెను. సూర్యుడు విశాఖలో ప్రవేశించిన పిమ్మట రాజ ఆశ్రమములో నివసించవలేను. ఆ దీవమున వాహనములను అధికముగ అంక రించవలెను. రాజ చిహ్నములను పూజించి వాటి వాటి రక్షకుల చేతికి ఇవ్వవలెను కాలజ్ఞుడగు జ్యోతిషుడు గజములు అశ్వములు, ఛత్రము, ఖడ్గము. ధనస్సు, దుందుభి.. ధ్వజము, పతాక, వీటిని అభిమంత్రించవలెను. వాటిని, ఏనుగుల పైకి ఎక్కించవలెను. జ్యోతిష్కుడు పురోహితుడు. కూడ ఏనుగును ఎక్కవలెను ఆభిమంత్రితములగు వాటిని ఎక్కి ద్వార మునుంచి, నిష్క్రమింప చేయవలయును. ఈ విధ ముగ నిష్క్రమించి ఏనుగును ఎక్కిరాజు రాజ ద్వారమునుండి బయటకు శచ్చి విధి పూర్వకముగ బలి ఇవ్వవలేను. పిదప అతడు, సుస్థిర చిత్తుడై చతురంగ సైన్యములతో కూడి వారి అందరి చేత జయ ఘోషములు పలికించుచు, దిగంతములను ప్రకాశింపచేయుచున్న కాగడాల సముదాయములకు మూడు పర్యాయములు ప్రదక్షిణములు చేసి, జలాంజలి యిచ్చి ఇంటికి మరలి రావలయును. నీరాజనమను ఈ పేరుగల శాంతి వృద్ధి నిచ్చును. శత్రువులను నశింపచేయును.

అగ్ని మహాపురాణమున నీరాజనా విధియను రెండువందల ఆరువది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.