అగ్ని రువాచః-
తిథివారర్ణ దివసమాసర్వఙార్కసంక్రమే ।
సృస్త్రీవ్రతాది వక్ష్యామి వసిష్ఠ శృణు తత్ర్కమాత్.
శాస్తో దితో హి నియమో వ్రతం తచ్చ తపో మతమ్ ।
నియమాస్తు వి శేషాస్తు వ్రత స్యైవ దమాదయః.
వ్రతం హి కర్తృ సన్హాపాత్రప ఇత్యభిధీయతే ।
ఇన్దియ గ్రామనియమో నియమళ్చాభిధీయతే.
అనగ్నయస్తు యే విప్రాస్తేషాం శ్రేయోభిధీయతే ।
వ్రతాపవాసనియమైర్నా నాదా నై స్తథా ద్విజ.
తే స్యుద్దేవాద దుః ప్రీతా భుక్తిముక్తిప్రదాయకాః ।
ఉపావృత్తస్య పా పేభ్యో యస్తు వాసోగుడైః సహ.
ఉపవాస స విజేయః సర్వభోగవివర్జితః ।
కాంస్యం మాంసం మసూరం చ చణకం కోరదూషకమ్.
శాకం మధు పరాన్నం చ త్యజేదుపవసన్ శ్రియమ్ ।
పుష్పాలజారవస్త్రాణి ధూపగన్గానులేపనమ్.
ఉపవానే న శస్య ని ద స్తధావనమజ్జనమ్ ।
ద నకాష్ఠం పఇ్చగవ్యం కృత్వా ప్రాతర్వతం చరేత్.
అసకృజ్జలపానాచ్చ తామ్బూలస్య చ భక్షణాత్ ।
ఉపవాసః ప్రదు ష్యేత దివాస్వప్నా చ్చ మైథనాత్.
క్షమా సత్యం దయాదానం శౌచమిస్ట్రియనిగ్రహః ।
దేవపూజాగ్ని హరణం సన్తోషో స్త్యమేవ చ.
సర్వవతేష్వయం ధర్మః సామాన్యో దశ ధా స్మృతః ।
పవిత్రాణి జ పేచైవ జుహుయాచ్చైవ శ క్రిత.
నిత్యస్నాయీ మితాహారీ గురుదేవద్విజార్చకః ।
ఔరం ఔద్రం చ లవణం మధు మాంసాని వర్జయేత్.
తిలముద్గాదృతే సశ్యస స్యే గోధూమకోద్రనౌ ।
చీనకం దేవధాన్యం చ శమీధాన్యం తథై క్షవమ్.
శిత ధాన్యం తథా పణ్యం మూలం క్షారగణః స్మృతః ।
ద్రోహిషష్టికముద్దాశ్చ కలాయాః సతిలా యవాః.
శ్యామాకా శ్చైవ నీవారా గోధూమాద్యా వ్రతే హితాః ।
కూష్మాణాలాబు వార్తా కాన్సాలజ్కీం పూతికాంత్యజేత్.।
చరుభక్ష్యం సర్దుకణాః శాకం దధి ఘృతం పయః ।
శ్యామాక శాలినీవారా యవకం మూలతణులమ్.
హవిష్యం వ్రతనక్తా దావగ్ని కార్యాది కే హితమ్ ।
మధు మాంసం విహాయాన్య ద్ర్వతే హ హితమీరితమ్.
అగ్ని దేవుడు పలికెను : వసిష్ఠా! తిథి, వారము, నక్షత్రము, దివసము, మాసము, ఋతుపు, సంవత్సరము సూర్యసంక్రమణము– వీటియందు పురుషులు స్త్రీలు ఆచరించదగిన వ్రతములను క్రమముగా చెప్పెదను; వినుము. శాస్త్రములలో చెప్పిన నియమమే 'వ్రతము'. అదియే తపస్సు. దమము మొదలగునవి వ్రతమున కే విశిష్టమైన నియమములు. కర్తను తపింపచేయుట చే వ్రతమే 'తపస్సు' అని చెప్పబడును. ఇంద్రియసముదాయమును వశములో నుంచుకొనుట నియమము. అగ్నిరహితు లగు విప్రులకు ఇది శ్రేయస్కరమని చెప్పబడినది, వ్రతోపవాసనియమము లచేతను, నానావిధము లగు దానము చేతను దేవాదులు సంతసించినవారై భుక్తి ముక్తులను ప్రసాదింతురు. పాపములనుండి మరలినవాడై గుణములతో నివసించుటయే సకలభోగములు విడనాడిన ఉపవాసము. ఉపవాసము చేయువాడు కంచుపాత్రలు, మాంసము, మసూరము, శనగ, కొజ్జలు, శాకము, మధువు, పరాన్నము, శ్రీ వీటిని విడువవలెను. ఉపవాస సమయమున పుష్పాలంకారవస్త్రములు, ధూపగంధాను లేపనములు, దంతకాష్ఠముతో దంతధావనము, అంజనము. ఇవి విషిద్ధములు. ప్రాతఃకాలమునందే పుచగవ్యము చేసి వ్రతము ప్రారంభింపవలేను. మాటిమాటికి నీరు త్రాగినను, తాంబూలము భక్షించినను, పగలు నిద్రించినను మైథునము చేసినను ఉపవాసము చెడిపోవును. ఓర్పు, సత్యము, దయ, దానము, శౌచము, ఇంద్రియనిగ్రహము, దేవపూజ, అగ్నిహరణము, సంతోషము, అస్తేయము ఈ పదియు సర్వవ్రతము లందును అనుసరించవలసిన సామాన్యధర్మములు. పవిత్ర మంత్రములను జపించవలెను. యథాశక్తిగా హోమము చేయ వలెను. నిత్యస్నానము చేయుచు, మితముగా భుజించుచు, గురు - దేవ - బ్రాహ్మణులను పూజించుచు, క్షారము, తేనె, లవణము మధువు, మాంసము విడువవలెను. తిలలు పెసలు తప్ప మిగిలిన పప్పుదినుసులు, సస్యములతో గోధుమలు కొఱ్ఱలు, చీనకము, దేవధాన్యము, శమీధాన్యము, చెరకు నుండి తయారై నవి, శీతధాన్యము, పణ్యము, మూలము ఇవి ఔరగణమునకు చెందినవి గాన త్యాజ్యములు. షష్టిక ప్రిహి, పెసలు, కలాయములు, తిలలు, యవలు, శ్యామాకములు, గోధూమాదులు, శ్యామాకములు వ్రతమునందు హిత మైనవి. గుమ్మడి. ఆనపకాయ, వంకాయ, పాలంకీ, పూతిక పరిత్య జించవలెను. వ్రతమునందును, నక్తాదులందును, ఆగ్ని కార్యములందును, భిక్షాలబ్ధ మగు చరువు, సత్తుకణములు, శాకము పెరుగు, నెయ్యి, పాలు, శ్యామాక - శాలి - నీ వారములు, యవలు, మూలతండులములు, హవిష్యములు, హితములు లేదా వ్రతమునందు మధుమాంసములు తప్ప మిగిలిన వన్నియు హితములే.
త్ర్యహం ప్రాతస్ర్యహం సాయం త్ర్యహమద్యాదయాచితమ్ ।
త్ర్యహం పరం చ నాశ్నీ యాత్రాజాపత్యం చరన్ ద్విజః.
ఏకైకం గ్రాసమళ్నీ యాత్యహాణి త్రీణి పూర్వవత్ ।
త్ర్యహం చోపవ సేద న్యమతికృచ్ఛం చరన్ద్విజః.
గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పికి కుశోదకమ్ ।
ఏకరాత్రోపవాసశ్చ కృచ్ఛం సానపనం స్మృతమ్.
పృథకా స్తపన దవ్యైః షడహః సోపవాసకః ।
సప్తాహీసన్లు కృచ్చోయం మహాసా స్తపనోఘహా..
ద్వాదశాహోవా సేన పరాకః సర్వపాపహా ।
మహాపరాక శ్రిగుణ స్వయమేవ ప్రకీర్తితః.
పౌర్ణమాస్యాం పజ్ఞ్చదశ గ్రాస్యమావాస్యభోజనః ।
ఏకాపాయే తేతు వృద్దె చాన్టాయణమతోఒన్యధా.
కపిలాగోః పలం మూత్రమరొజుష్టం చ గోమయమ్ ।
క్షీరం సప్తపలం దద్యాద్దద్న శ్చైవ పలద్వయమ్.
మృతమేకపలం దద్యాత్పలమేకం కుశోదకమ్ ।
గాయత్ర్యా గృహ్య గోమూత్రం గన్జద్వా రేతి గోమయమ్.
ఆప్యాయ స్వేతి చ క్షీరం దధిక్రాప్టేతి వై దధి ।
తేజో నీతి తథాచాజ్యం దేవ స్యేతి కుశోదకమ్.
బ్రహ్మ కూర్చో భవత్యేవ మాపోహిషీత్కృతం జపేత్ ।
అఘమర్షణసూ కేన సంయోజ్య ప్రణవేన వా.
పీత్వా సర్వాభనిర్ముక్తో విష్ణలో కే హ్యుపోషితః ।
ఉపవాసే సాయంభోజీ యతి షష్టాత్మకొలవాన్.
మాంసవర్జీ చాశ్వమేధీ సత్య వాదీ దివం వ్రజేత్ ।
అగ్న్యాధేయం ప్రతిష్ఠా చ యజ్ఞదానవ్రతాని చ.
దేవవ్రతవృషోత్సర్గ చూడాకరణ మేఖలాః ।
మాజ్గల్యమభి షేకం చ మలమాసే వివర్జయేత్.
ప్రాజాపత్యము నాచరించు ద్విజుడు మూడు దినములు ప్రాతఃకాలము, మూడు దినము సాయంకాలము. ఆయా చితాహారము భుజించవలెను. పిదప మూడు దినములు ఏమియు తినగూడదు. అతికృచ్చము చేయు ద్విజుడు వెనుక చెప్పినట్లుగనే మూడు దివసములు ఒక్కొక్క గ్రాసమును తినవలెను. చివర మూడు దివసములు ఉపవాసము చేయవలెను. గోమూత్రము, గోమయము, క్షీరము, పెరుగు, నెయ్యి, కుశోదకము భుజించుట ఒకరాత్రి ఉపవాసము- ఇది కృచ్చ సాంతపనము. సాంతపనమునకు చెప్పిన ద్రవ్యములు వేరు వేరుగా ఒక్కొక్క రోజుచొప్పున ఆరు రోజులు భుజించి ఏడవ రోజున ఉపవాసము చేసినచో ఇది పాపములను నశింపచేయు మహాసాంతపనము. పండ్రెండు రోజులు ఉపవాసము చేసినచో ఆది సర్వపాపములను తొలగించు పరాకము. ఇదే మూడు రెట్లుచేసినచో “మహాపరాకము”. పూర్ణిమ నాడు పదునై దు గ్రాసములు భుజించి పిదప ప్రతిదినము ఒక్కొక్క గ్రాసము తగ్గించుచు అమావాస్యనాడు ఉపవాసము చేయవలెను. పిదప ప్రతిపత్తున ఒక గ్రాసము తినుటతో ప్రారంభించి ప్రతి దినము ఒక్కొక్క గ్రాసమును పెంచుతూ తినవలెను ఇది చాంద్రా యణము. ఈ వ్రతము పైన చెప్పిన క్రమమునకు విపరీతముగా కూడ చేయవచ్చును, ఒక పలము కపి గోమూత్రము,అర్ధాం గుడ్డ ప్రమాణ మగు గోమయము, ఏడు పలముల క్షీరము, రెండు పలముల పెరుగు, ఒక పలము మృతము, కుశోదకము ఒక పలము. వీటిలో గోమూత్రమును గాయత్రీమంత్రము చేతను, గోమయమును “గంధధ్వారా” ఇత్యాదిమంత్రముచేతను, క్షీరమును “ఆప్యాయస్వ” ఇత్యాదిమంత్రముచేతను, పెరుగును. “దధిక్రామ్ణం” అను మంత్రముచేతను. ఆజ్యమును “తేజోసి” ఇత్యాదిమంత్రముచేతను, కుశోదకమును “దేవస్య” ఇత్యాదిమంత్రము చేతను, ఈ విధముగ గ్రహించినచో అది “బ్రహ్మకూర్చము” అఘమర్షణసూక్త ముతో గాని, ప్రణవముతో గాని చేర్చి “ఆపో హి షామ” ఇత్యాదిమంత్రమును జపించవలెను. ఈ విధముగా త్రాగి పిదప ఉపవాసమున్న వాడు సర్వపాపవిముక్తుడై విష్ణులోకము చేరగల్గును. పగలు ఉపవాస ముండి సాయంకాలము భుజించువాడును, దివసము ఎనిమిది భాగములలో కేవలము ఆరవ భాగమునందు మాత్రము భుజించు సంన్యాసియు, ఆశ్వమేధయాతియు, సత్యము పలుకువాడును స్వర్గమునకు వెళ్లును. అగ్న్యాధానము, ప్రతిష్ట యజ్ఞము, దానము, వ్రతము, దేవవ్రతము, వృషోత్సర్గము, చూడాకరణము, మేఖలాబంధము, వివాహము, మొదలగు మంగళకార్యములును, ఆభి షేకము మలమాసములో చేయగూడదు.
దర్శాద్దర్శస్తు చాంద్రః స్యా త్రింశాహశ్చైవ సావనః ।
మాసః సౌరస్తు సంక్రా నేర్నా క్షతో భవివర్తనాత్.
సౌరో మాసో వివాహాదౌ యజ్ఞాదౌ సావనః స్మృతః ।
ఆబ్ది కే పితృకార్యే చాంద్రో మాసః ప్రశస్యతే.
ఆషాఢమవధిం కృత్వా యః స్యాత్పక్షస్తు పళ్చామః ।
కుర్యాద్రాద్ధం తత్ర రవిః కన్యాం గచ్చతు వా న వా.
మాసి సంవత్సరే చైవ తిథిద్వైధం యదా భవేత్।
తత్రో తో త్తమా జేయ పూర్వా తు స్యాత్మలిమ్లు చా.
ఉపోషితవ్యం నక్షత్రం యేనా స్తం యాతి భాస్కరః ।
దివా పుణ్యాస్తు తిథయో రాత్రా నక్తవతే శుభాః.
యుగ్మాగ్ని యుగభూతాని షణ్ము నోర్వసురన్తయోః ।
రుద్రేణ ద్వాదశీయుక్తా చతుర్ధశ్యా తు పూర్ణిమా.
ప్రతిపద్యప్యమావాస్యా తిథ్యోర్యుగ్మం మహాఫలమ్।
ఏతద్వ్యస్తం మహా ఘోరం హ ని పుణ్యం పురాకృతమ్.
నరేనమని ప్రతినాం వివాహోపద్రవాదిషు ।
సద్యః శౌచం సమాఖ్వాతం కాస్తారాపది సంసది.
ఆర బదీర్ఘతపసాం న రాజా ప్రతహా శ్రియాః ।
గర్భిణీ సూతికా నక్తం కుమారీ చ రజస్వలా.
యదా శుద్ధ తదాన్యేన కారయేత క్రియాః సదా ।
క్రోధాత్ర్పమాదాల్లో భార్వా వ్రతభణో భవేద్యది.
దినత్రయం న భుజ్జిత ముజ్ఞనం శిర సోథ వా ।
అసామర్థ్య వ్రతకృతా పత్నీం వా కారయేత్సుతమ్.
సూత కే మృత కే కార్యం ప్రారబ్ధం పూజనో జై తమ్ ।
వతస్థం మూర్ఛితం దుగ్గపానాద్యైరుద్ధ ద్గురుః.
ఆష్టా తాన్యవ్రతఘ్న ని ఆపో మూలం ఫలం పయః ।
హరిర్ర్బహ్మణకామ్యా చ గురోర్వచనమౌషధమ్.
కీర్తిసన్తనవిద్యాది సౌభాగ్యారోగ్యవృద్ధయే ।
నైర్మల్యభు క్రిము క్త్యర్థం కుర్వే వ్రతపతే వ్రతమ్.
ఇదం వ్రతం మయా శ్రేష్ఠం గృహీతం పురత స్తవ ।
నిర్విఘ్నం సిద్ధిమాయాతు త్వత్రసాదాజ్ఞగత్పతే.
గృహీతే స్మిన్వతవరే యద్యపూర్ణే మ్రియే హ్యహమ్ ।
తత్సర్వం పూర్ణమేవాస్తు ప్రసన్నే త్వయి సత్పతౌ.
అమావాస్యనుండి అమావాస్యకు “చాంద్రమాసము.” ముప్పది దినములు “సావనమాసము”. సంక్రాంతినుండి సంక్రాంతికి “సౌరమాసము”. అన్ని నక్షత్రములును ఒక పర్యాయము తిరిగి వచ్చినచో నక్షత్రమాసము. వివాహాదులకు సౌరమాసము, యజ్ఞాదులకు సావనమాసము, శ్రాద్ధాది పితృకార్యములకు చాంద్రమాసము ఉత్తమ మైనవి. ఆషాఢపూర్ణిమ తరువాత వచ్చు ఐదవ పక్షమునందు పితరులకు తప్పక శ్రాద్ధము చేయవలెను. అప్పటికి సూర్యుడు కన్యారాశి చేరినాడా లేదా అను విచారము. అనావశ్యకము. మాసిక-వార్షిక వ్రతములకు ఏదైన ఒక తిథి దినద్వయవ్యాప్త మైనచో రెండవ దినమునందలి తిథి ఉత్తమ మైనది. మొదటిది మలినము. నక్షత్రవ్రతమునందు, సూర్యుడు ఏ నక్షత్రమునందు అస్తమించునో ఆ నక్షత్రమునందే ఉపవాసము చేయవలెను. దివసవ్రతములకు దినవ్యాపితిథులును, నక్తవతములకు రాత్రివ్యాపితిథులును పుణ్యప్రదములు, శుభకరములు. ద్వితీయ, తృతీయ, చతుర్దశితో పూర్ణిమ, అమావాస్యతో ప్రతిపత్తు కలియుట మంచిది. ఇది గొప్పఫలము నిచ్చును. ఇందుకు , వీపరీత మగు కలయిక ప్రతిపత్తుతో ద్వితీయ ఇత్యాదేవిధమున భయానకము. పూర్వము చేసిన పుణ్యములను గూడ వశింపజేయును. రాజు, మంత్రి, వ్రతమధ్యమునం దున్న వాడు...వీరికి వివాహము, ఉపద్రవాదులు, దుర్గమస్థానము, సంకటసమయము యుద్ధము. వీటియందు తత్కాలశుద్ధి చెప్పబడినది. దీర్ఘకాలిక వ్రతము నారంభించిన శ్రీ మధ్యలో రజస్వల యైనను వ్రతభంగము కాదు. గర్భవతి, ప్రసవగృహమునం దున్న స్త్రీ, రజస్వల యగు కన్య శుద్దలే వ్రతము చేయుటకు అయోగ్యులుగా నున్న పుడు ఆ శుభకార్యమును. ఇతరులచే చేయించవలెను. క్రోధము చేత గాని, పొరబాటుచేత గాని, లోభముచేత గాని వ్రతభంగ మైనచో మూడు డినములు ఉపవాసముండవలెను. లేదా శిరోవ్రతపరిభాషాః ముండనము చేయించుకొన వలెను. స్వయముగా వ్రతము నాచరించుటకు సామర్థ్యము లేనిచో భార్యచేత గాని, పుత్రుని చేత గాని చేయించవలెను. ప్రారంభించిన వ్రతమును జననాశాచ-మరణాశౌచములందు కూడ నడిపింపవలెను; పూజాకార్యము మాత్రము చేయగూడదు. వ్రతము నవలంబించిన వాడు ఉపవాసము చేయుటచే మూర్ఛితుడైనచో గురువు ఆతనిని పాలు త్రాగించి గాని, మరి యేదైన ఉపాయము చేత గాని ఎరల స్పృహలోనికి వచ్చునట్లు చేయవలెను. జలము, ఫలము, మూలము, పాలు, హవిష్యము (నెయ్యి) బ్రాహ్మణోచ్ఛాపూర్తి, గురువచనము, ఔషధము_ఇవి వ్రతథంగకరములు కావు. (వ్రతము చేయువాడు ఆ దేవతను ఈ విధముగా ప్రార్థించవలెను. “వ్రతపతే! కీర్తి-సంతాన-విద్యాదులకొరకును, సౌభాగ్య-ఆరోగ్య-ఆభివృద్ధి-నిర్మలతా భోగ మోక్షము కొరకును నేను ఈ వ్రతము నాచరించుచున్నాను. ఈ ష్టవ్రత మును నీ ఎదుటినే గ్రహించినాను. జగత్పతీ! నీ అనుగ్రహముచే ఇది నిర్విఘ్నముగ కొనసాగుగాక. ఓ వ్రతపాలకా! ఈ వ్రతమును గ్రహించిన తరువాత ఇది పూర్తి కాకుండగనే నేను మరణించినచో, నీ అనుగ్రహముచే ఇది పూర్ణ మగుగాక.
వ్రతమూర్తిం జగద్బూతిం మణలే సర్వసిద్ధ మే ।
ఆవాహయేన్నమస్తుభ్యం సన్నిధౌ భవ కేశవ.
మనసా కల్పి తైర్భక్త్యా పథ్బాగవ్యైర్జలైః శుభై
పక్చామృతైః స్నాపయామి త్వం మే చ భవ పాపహా.
గన్దపుష్పోదకైర్యు కమర్ష్యమర్ష పతే శుభమ్ ।
గృహాణ పాద్యమాచామమర్యార్షం కురు మాం సదా.
వస్త్రం వస్త్రపతే పుణ్యం గృహాణ కురు మాం సదా ।
భూషణా ద్యైః సువస్త్రాద్యైశ్ఛాదితం వ్రతసత్పతే.
సుగన్దిగన్దం విమలం గన్దమూ ర్తె గృహాణ వై ।
పాపగన్దవిహీనం మాం కురు త్వం హి సుగన్దినమ్.
పుష్పం గృహాణ పుష్పాదిపూర్ణం మాం కురు సర్వదా ।
పుష్పగడ్గం సువిమలం ఆయురారోగ్యవృద్దయే.
దశాబ్దం గుగ్గులు మృతయు క్తం ధూపం గృహాణ వై ।
సరూపధూపితం మాం త్వం కురు ధూపితసత్పతే.
దీపమూర్వశిఖం దీప్తం గృహాణాఖిలభాసకమ్ ।
దీపమూ ర్తీ ప్రకాశాఢ్యం సర్వదోర్ధ్వగతిం కురు.
అన్నా దికం చ నైవేద్యం గృహాణాన్నా దిసత్పతే ।
అన్నా దిపూర్ణం కురు మామన్నదం సర్వదాయకమ్.
మ స్త్రహీనం క్రియాహీనం భ క్తిహీనం మయా ప్రభో ।
యత్పూజితం వ్రతపతే పరిపూర్ణం తదస్తు మే.
ధర్మం దేహి ధనం దేహి సౌభాగ్యం గుణస తిమ్ ।
కీర్తిం విద్యాం దేహి చాయుః స్వర్గం మోక్షం చ దేహి మే.
ఇమాం పూజాం వ్రతపతే గృహీత్వా ప్రజ సాంప్రతమ్ ।
పునరాగమనాయైవ వరదానాయ వై ప్రభో.
స్నాత్వా వ్రతవతా సర్వప్రతేషు వ్రతమూర్తయః ।
పూజ్యాః సువర్ణ జాస్తా వై శక్త్యా వై భూమిశాయినా.
జపో హోమశ్చ సామాన్యం వ్రతా నే దానమేవ చ ।
చతుర్వింశతిర్గ్వాదశ వా పజ్చ పా త్రయ ఏకకః.
విప్రాః ప్రపూజ్యా గురవో భోజ్యాః శక్త్యా తు దక్షిణా ।
దేయా గావః సువర్ణాద్యాః పాదుకోపానహ పృథక్.
జలపాతం చాన్న పాత్రమృత్తికాచ్ఛత్రమాసనమ్ ।
శయ్యా వస్త్రయుగం కుమ్భాః పరిభా షేయమీరితా.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నే యే వ్రతపరిభాషా నామ పఞ్చసప్తత్యధిక శతతమోధ్యాయః.
కేశవా! వ్రతస్వరూపుడవును, జగత్కారణధూతుడవును అగు నిన్ను సర్వసిద్ది నిమిత్తమై మండలముల పై ఆవాహ నము చేయుచున్నాను. నీకు నమస్కారము. సన్నిహితుడవై ఉండుము. మనస్సుచే కల్పితములగు పంచగవ్యముల తోను, శుభములైన జలములతోడను, పంచామృతములతోడను భక్తి పూర్వకముగ అభి షేకము చేయుచున్నాను. నీవు నా పాపములను తొలగించుము. ఓ! ఆర్ఘ్యపతీ! గంధపుష్ప - ఉదక యుక్త మగు శుభమైన అర్ఘ్యమును స్వీకరించి నన్ను సర్వదా అర్ఘ్యయోగ్యునిగా చేయుము. ఓ! వస్త్రపతీ! పుణ్యమైన వస్త్రములను గ్రహింపుము. ఓ వత సత్పతీ! నన్ను భూషణ. సువసాదుల చే ఆచ్ఛాదింపబడిన పొనినిగా చేయుము. ఓ గంధమూర్తీ! వినుర మైన సుగంధియగు గంధమును స్వీకరిం పుము. నన్ను పాప గంధ విహీనునిగాను, మంచి గంధ ము కలవానిని గాను చేయుము. పుష్పమును గ్రహింపుము. నన్ను పుష్పపూర్ణునిగాను, పుష్పగంధము గలవానినిగాను, ఆయురారోగ్యవృద్ధి కొరకై చాల విమలునిగాను చేయుము. దశాంగములు గలదియు గుగ్గులు ఘృతయుక్తమును అగు ధూపమును గ్రహింపుము. ధూపితుడవై ఓ సత్పతీ! నన్ను ధూపధూపితునిగా చేయుము. ఊర్ద్వశిఖగలది యు సర్వమును ప్రకాశింపచేయునదియు అగు దీపించుచున్న దీపమును గ్రహిం పుము – ఓ! దీపమూర్తీ! నన్ను సర్వదా ప్రకాశముతో నిండిన వానినిగాను, ఊర్ధ్వగమనము కలవానినిగాను చేయుము. అన్నాదు లకు ప్రభువైనవాడా! అన్నాదిక మగు నైవేద్యమును స్వీకరింపుము. నన్ను అన్నాదులతో పూర్ణునిగాను ఆన్న దానము చేయువానినిగాను, సర్వదాతగాను చేయుము. ఓ! ప్రభూ! వ్రతపతీ! మంత్రహీనముగా గాని, క్రియాహీనముగాగాని, భక్తిహీనముగా గాని నేను చేసిన పూజ పరిపూర్ణ మగు గాక. నాకు ధర్మమును ఇమ్ము, ధనమును సౌభాగ్యమును, గుణసముదాయమును, కీర్తి ని, విద్యను ఆయుర్దాయమును, స్వర్గమును, మోక్షమును ఇమ్ము, ఓ! వ్రతపతీ! ఈ పూజను స్వీకరించి పునరాగమనార్థమును వరముల నిచ్చుటకును ఇపుడు వేళ్ళుము. అన్ని వతములందును వతధారి యగువాడు భూమి పై శయనించుచు సువర్ణమయములగు ఆ వతమూర్తులను యథాశక్తి గా పూజించవలెను. తాంతమునందు జపము హోమము దానము ఇవి సామాన్యక ర్తవ్యములు. పూజ్యులగు విపులకు ఇరువదినలుగురికి గాని, పండ్రెండుగురికి గాని ఐదు గురికి గాని, ఒకరికి గాని భోజనము పెట్టవలెను. శ క్త్యనుసారము దక్షిణలుగా వారికి వేరువేరుగా గోవులను, సువర్ణాదు లను, జలపాత్రమును, అన్నపాతమును, మృత్తికను, ఛతమును, ఆసనమును, శయ్యను. వస్త్రయుగమును, కుంభము లను ఇవ్వవలెను. ఇట్లు వ్రతపరిభాష చెప్పబడినది.
అగ్ని మహాపురాణమునందు వ్రతపరిభాషయను నూటడెబ్బదిఐదవ ఆధ్యాయము సమాప్తము.
Summary of chapter 175 of the Agni Purāṇa is as follows:
The foundational definitions and general rules governing all vratas are established. Agni defines vrata as a śāstrokta-niyama (injunction prescribed by scripture), distinguishes it from tapas (bodily austerity) and niyama (habitual observance), and states that upavāsa means complete abstention from all bhoga including tāmbūla, daytime sleep, and marital intimacy. Ten sāmānya-dharmas applicable to all vrata-observances regardless of the specific vrata are enumerated: kṣamā, satya, dayā, dāna, śauca, indriya-nigraha, deva-pūjā, agni-haraṇa, saṃtoṣa, and asteya. The chapter also catalogues permitted and prohibited foods during vratas, describes the three calendar systems (cāndra, sāvana, saura) with their respective ritual applications, and provides the format of the vrata-pūjā including the concluding prārthanā mantra addressed to the vrata-pati deity.