పుష్కర ఉవాచః-
మనుర్విష్ణరాజ్ఞవల్క్య హారీతోఒత్రిర్యమోఒ జ్గిరాః ।
వసిష్ఠదక్షసంవర్ణణాతాతపపరాశరాః.
ఆవ స్తమోశ నోవ్యాసాః కాత్యాయనబృహస్పతి।
గోతమః శజలిఖితా ధర్మ మేతే యథాబ్రువన్.
తథా వచ్వే సమా సేన భుక్తిముక్తి ప్రడం శృణు ।
ప్రవృత్తం చ నివృత్తం చ ద్వివిధం కర్మ వైదికమ్.
కామ్యం కర్మ ప్రవృత్తం స్యాన్ని వృత్తం జ్ఞానపూర్వకమ్ ।
వేదాభ్యాస స్తపో జ్ఞానమిస్ట్రియాణాం చ సంయమః.
అహింసా గురు సేవా చ నికి శ్రేయసకరం పరమ్ ।
సర్వేషామపి చై తేషామాత్మజ్ఞానం పరం స్మృతమ్.
తచ్చాగ్ర్యం సర్వవిద్యానాం ప్రాప్యతే హ్యమృతం తతః ।
సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని.
సమం పశ్యన్నాత్మయాజీ స్వారాజ్యమధిగచ్ఛతి ।
ఆత్మజ్ఞానే సమే చ స్యాద్వేదాభ్యాసే చ యత్న వాన్.
ఏతద్ద్విజన్మ సామర్థ్యం బ్రాహ్మణస్య విశేషతః ।
వేదశాస్త్రార్థతత్త్వష్ణో యత్ర తత్రాశ్రమే వసన్.
ఇ హైవ లో కే తిష్టని బ్రహ్మభూయాయ కల్పతే ।
స్వాధ్యాయానాముపాకర్మ శ్రావణ్యాం శ్రవణేన తు.
హస్తే చౌషధినారే చ పశ్చిమ్యాం శ్రవణస్య వా ।
పౌషమాసస్య రోహిణ్యామష్టకాయామథాపి వా.
జలాంతే విధివతుర్యాదుత్సర్గం విధివద్బహి.
పుష్కరుడు చెప్పెను; మనువు, విష్ణువు, యాజ్ఞవల్క్యుడు, హారీతుడు, ఆత్రి, యముడు, ఆంగిరసుడు, వసిష్ఠుడు, దక్షుడు, సంవర్తుడు, శాతాతపుడు, పరాశరుడు, ఆప స్తంబుడు, ఉశనస్సు, వ్యాసుడు, కాత్యాయనుడు, బృహస్పతి, గోత ముడు, శంఖలిఖితులు, వీరు చెప్పిన విధముగ భుక్తిముక్తిప్రద మగు ధర్మమును సంక్షిప్తముగా చెప్పెదను వినుము. వై ఏకకర్మ ‘ప్రవృత్తము' 'నివృత్తము' అని రెండు విధములు. కామ్యకర్మ ప్రవృత్తము. జ్ఞానపూర్వక మగు కర్మ నివృత్తము. వేదాభ్యాసము, తపస్సు, జ్ఞానము, ఇంద్రియసంయమము, అహింస, పూజ్యుల సేవ ఇవి నిశ్శేయసకరములు. వీటి అన్నింటికంటెను ఆత్మజ్ఞానము శ్రేష్టము. అది అన్ని విద్యలలో ఉత్తమము. దానివలన మోక్షము లభించును. తనను సర్వభూతములందును, సర్వభూతములను తనయందును చూచు, ఆత్మజ్ఞానము కలవాడు స్వారాజ్యమును పొందును ఆత్మజ్ఞానము సమముగ నుండునట్లు చేసికొని, వేదాభ్యా సమునందు ప్రయత్నము కలవాడు కావలెను. ఇది ద్విజు లందరికిని సామర్థ్యమును పెంపొందించునది. బ్రాహ్మణులకు విశేషముగ సామర్థ్యవర్ధకము. వేదశాస్త్రార్థతత్త్వము తెలిసినవాడు ఏ ఆశ్రమమునం దున్నను, ఈ లోకమునందే బ్రహ్మత్వమును పొంద సమర్థు డగును. శ్రావణపూర్ణిమనాడు గాని, శ్రవణ నక్షత్రయుక్త దినమున గాని, హస్తనక్షత్రయుక్త శ్రావణశుక్ల పంచమినాడు గాని, తమ శాఖకు సంబంధించిన గృహ్య సూత్రము ప్రకారము నియమపూర్వకముగా వేదాధ్యయన ప్రారంభము చేయవలెను. పౌషమాసమున రోహిణీనక్షత్రమునందు గానీ, అష్టకతిథియందు గాని నగరము లేదా గ్రామము వెలుపల జలసమీపమున వేదాధ్యయనోత్సర్గము చేయవలెను.
త్ర్యహం పేజేష్వనధ్యాయః శిష్య్వి గ్గురుబగ్గుషు.
ఉపాకర్మణి చోత్సర్గో స్వశాఖా శ్రోత్రియా తథా ।
సర్థ్యాగర్జితనిర్వాతే భూక మోల్కానిపాతనే.
సమాప్య వేదం హ్యనిశమారణ్యక మధీత్య చ ।
పఇ్చదశ్యాం చతుర్ధ శ్యామష్టమ్యాం రాహుసూత కే.
ఋతుసశ్లీషు భుక్త్వా పా శ్రాద్ధకం ప్రతిగృహ్య చ ।
శశమళ్లాక నకుల్వహిమార్జార సూక రైః.
కృతేన్తరే త్వహోరాత్రం శక్రపాతే తథేచ్ఛయే ।
శ్వక్రోష్టుగర్దభోలూకసామ బాణా ర్తనిస్వనే.
ఆమేధ్యకవశూదా న్యశ్మశానపతిశాస్త్రి కే ।
అశుభాసు చ తారాసు విద్యుత్సవిత సంప్లవే.
భుక్తార్ద్రపాణిర మోఒ నరర్ధరాత్రేతమారుతే ।
పాంసువరే దిశాం దా హే సర్ధ్యానీహారభీతిషు.
ధావతః ప్రాణిబాధే చ శిష్ట చ గృహమాగతే ।
ఖరోష్ట్రయానహ స్యశ్వనౌకావృక్షాధిరోహణే.
సప్తవింశత్యనధ్యాయా నేతాంస్తాత్కాలికాన్విదుః.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ధర్మశాస్త్రనిరూపణం నామ ద్విషష్ట్యధిక శతతమోధ్యాయః.
శిష్యుడు, ఋత్విక్కు గురువులు, బంధువులు మరణించినపుడు మూడు దినములు ఆధ్యయనము మానివేయవలెను. ఉపాకర్మ-ఉత్సర్జన దినములు మొదలు మూడు దినములు అధ్యయనము చేయరాదు. తన వేదశాఖకు చెందిన వేదాధ్యత మరణించినపుడు కూడ అట్లే. సంధ్యాకాలమునందు, ఉరుముచున్నపుడు, ఉత్పాతసూచకము లగు ధ్వనులు వినబడినప్పుడు, భూకంపమునందు, ఉల్కా. నిపాతకమునందు, వేదాధ్యయనసమాప్తి చేసిన పిమ్మటను, ఆరణ్యకమును చదివిన పిమ్మ టను ఒక రాత్రి ఆనధ్యయనము. పూర్ణిమ, చతుర్దశి, అష్టమి, రాహుగ్రహణము, ఋతుసంధులు, శ్రాద్దాన్న భోజనము చేసినపుడు శ్రాళ్లదానము పట్టినపుడును ఒక దినము అనధ్యాయము. స్వాధ్యాయము చేయువారి మధ్యనుండి చెవులపిల్లి, కప్ప, ముంగిస, కుక్క, సర్పము, పిల్లి, పంది వెళ్ళినచో ఒక దినము అనధ్యయనము. ఇంద్రధ్వజమును దింపిన దినమునను, ఎత్తిన దినము మందును, అనధ్యయనము. కుక్క, నక్క, గాడిద, గుడ్లగూబ వీటి అరుపులు వినబడినపుడు, సామగానము వినబడినప్పు డును, బాణధ్వని. ఆర్తధ్వని వినబడినపుడును, అపవితవస్తువు, శవము, శూద్రుడు, అంత్యజుడు, శ్మశానము, పతితుడు మొదలగు వారి సాన్నిధ్యమునందును, అశుభతారలందును, మాటిమాటికి మెరపులు మెరయు చున్నప్పుడును, తాత్కాలిక అనధ్యాయము. భోజనానంతరము తడి చేతులతో అధ్యయనము చేయకూడదు. జలములోపల, అర్థరాత్రమునందును, దుమ్ము పడుచున్నవుడును, పెను గాలులు వీచుచున్నపుడును, ఓర్ణాహసమయమునందును, సంధ్యలందును, మంచు వర్షించుచున్న పుడును, భయసమయములందును అధ్యయనము చేయరాదు. పరుగెత్తుచు అధ్యయనము చేయరాదు. ఏదైన ప్రాణి బాధ పడుచున్నపుడును, శిష్యులు ఇంటికి వచ్చి నపుడును ఆధ్యయనము చేయరాదు. గాడిద, ఒంటె, రథము మొదలగు వాహన మలు ఎక్కినపుడును, ఏనుగ, గుఱ్ఱము, నావ, వృక్షము మొదలైన వాటిని ఎక్కినపుడు, మరుభూమియందును, ఆధ్యయ నముచేయరాదు. ఈ ముప్పదియైదును తాత్కాలికానధ్యయన కాలములు.
అగ్ని మహాపురాణమునందు ధర్మశాస్త్రవర్ణన మను నూటఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 162 of the Agni Purāṇa is as follows:
The broad scope of dharmaśāstra as a human-regulating science rooted in the Vedas is surveyed. Agni situates the Smṛtis of Manu, Yājñavalkya, Parāśara, and others as Veda-derived and therefore authoritative, while acknowledging that their specific injunctions may vary by yuga and region. The chapter summarizes key areas of dharmaśāstra: vyavahāra (litigation and civil law), rājanīti (royal governance), and the resolution of contradictions between different smṛtis by the principle that the more restrictive rule prevails. Dharmaśāstra is declared to be the śāstra most beneficial to human society because it governs collective life in accordance with the divine order.