అగ్ని మహా పురాణము

131 - అథ ఘాతచక్రాదివర్ణనమ్.

ఈశ్వర ఉవాచః

ప్రదక్షిణమకారాదీన్స్వరాన్వూర్వాదితో లిఖేత్

చైత్రాద్యం భ్రమణాచ్చక్రం ప్రతిపత్పూర్ణిమాతిధిః.

త్రయోదశి చతుర్దశే హ్యాష్టమ్యేకా చ సప్తమీ

ప్రతిపత్రయోదశ్యన్తాస్తిథయో ద్వాదశ స్మృతాః.

చైత్రచక్రే తు సంస్పర్శాజ్జయలాబాధికం విదుః

విషమే తు శుభం జ్ఞేయం సమే దాశుభమీడితమ్.

యుద్ధకాలే నముత్పన్నే యన్య శామ హ్యుదాహృతమ్

మాత్రారూఢం తు తన్నామ హ్యాడితో గురురేవ చ.

జయస్తస్య సదా కాల సంగ్రామే చైవ భీషణే

హ్రస్వనామ యదా యోధో ప్రియతే హ్యవివారితః.

ప్రథమో దీర్ఘ ఆదిస్థో ద్వితీయే మధ్యే హ్యన్తకః

ద్వౌ మధ్యన ప్రథమాన్తౌ జాయేతే నాత్ర సంశయః.

పునశ్చాన్తే యదా చాదౌ స్వరారూఢం తు దృశ్యతే

హ్రస్వస్య మరణం విద్యాద్దీర్ఘస్యైవ జయో భవేత్.

నరచక్రం ప్రవక్ష్యామి హ్యృక్షపిణ్డాత్మకం యథా

ప్రతిమామాలిఖేత్పూర్వం పశ్చాదృక్షాణి విన్యసేత్.

శీర్ష త్రీణి ముఖే చైకం ద్వే ఋక్షే నేత్రయాత్న్య సేత్

వేదసంఖ్యాని హస్తాభ్యాం కర్ణే హృక్షద్వయం పునః.

హృదయే భూతసంఖ్యాని షడృక్షాని తు పాదయోః

నామ హ్యృక్షం స్ఫుటం కృత్వా చక్రమధ్యేతు విన్యపేత

నేత్ర శిరోదక్షకర్ణే యామ్యహస్తే చ పాదయోః

హృద్గ్రీవావామహస్తే తు పునర్గుహ్యే తు పాదయోః.

యస్మిన్ ఋక్షే స్థితః సూర్యః సౌరిర్భౌమస్తు సైంహికః

తస్మిన్ స్థానే స్థితే విద్యాద్ఘాతమేవ న సంశయః.

పరమేశ్వడు చెప్పెను :- పూర్వాడిదిక్కులందు ప్రదక్షిణక్రమమున అకారాది స్వరములు వ్రాయవలెను. దాని యందు శుక్ల పక్ష ప్రతిపత్తు పూర్ణిమ, త్రయోదశి, చతుర్దశి, శుక్ల పక్షాష్టమి మాత్రము, సప్తమి, కృష్ణపక్షపతిపత్తు మొదల తయోడశి వరకు (అష్టమి విడచి) పండ్రెండు తిథుల న్యాసము చేయవలెను. ఈ చైత్రచక్రమునందు పూర్వాదిదిశ లో స్పర్శ వర్ణములను వ్రాయుటచే జయపరాజయములను గూర్చియు లాభమును గూర్చియు నిర్ణయించవచ్చును, విషమదిక్కు, విషమస్వరము, విషమ వర్ణము ఆయిసచో కథ మగును. ఆది సమము లైనచో ఆశుభ మగును. యుద్ధరంథసమయమునందు సేనాపతి మొదట ఎవరి పేరు పెట్టి పిలుచునో అతని పేరు దీర్ఘాక్షరమతో ప్రారంభ మైనచో ఘోరసంగ్రామమునందు గూడ వానికి (సేనాపతికి) విజయము కలుగును. పేరు ప్రస్వాక్షరముతో పారంభ మైనచో తప్పక మృత్యువు కలుగును. ఉదాహరణమునకు ఒకని పేరు ఆదిత్యుడు మరి యొకని పేరు గురుడు. వీటిలో మొదటి పేరు మొదటి అక్షరము ‘ఆ’ దీర్ఘము రెండవ పేరు మొదటి అక్షరము హ్రస్వము. ఆందుచేత అద్యక్షరము దీరాక్షరముగా గల పేరు గలవానిని పిలచినచో మృత్యువు కలుగును. నక్షత్రపిండమునుబట్టి పరచక్రమును గూర్చి చెప్పెదను. మొదలు ఒక మనుష్యుని ఆకారము తయారు చేయవలెను. దానిపై నక్షత్రముల న్యాసము చేయవలెను సూర్యనక్షత్రము మొదలుగా నామనక్షత్రము వరకు లెక్కపెట్టవలెను. మొదటి మూడింటిని శిరస్సు పైనను, ఒకటి ముఖము పైనను, రెండు నేత్రములందును, సాలుగు చేతుల పైనను, రెండు చెవుల పైనను, ఐదు హృదయముపైననూ, ఆరు పాదముల పైనమ, వ్రాయవలెను. నామనక్షత్రమును స్పష్టముగ చక్రమధ్యమున వ్రాయవలెను. ఇట్లు వ్రాసిన పిమ్మట నేత్ర-శిరో-దక్షిణహస్త-ఫౌడ-హృదయ-కంఠ వామహస్త గుహ్యాంగములందు ఎచట శని-కుజ-రవి- రాహు నక్షత్రము లుండునో ఆ అవయమాలపై యుద్ధమునందు దెబ్బ తగులును.

జయచక్రం ప్రవక్ష్యామి ఆదిహాన్తాంశ్చ వై లిఖేత్

రేఖాస్త్రయోదశాలిఖ్య షడ్రఖాస్తిర్యగాలిఖేత్.

దిగ్గ్రహా మునయః సూర్యా ఋత్విగుద్రస్థితిః క్రమాత్

మూర్ఛనాస్మృతివేదర్క్షజినా అకడమా హ్యధః.

ఆదిత్యాద్యాః సప్త హృతే నామాన్తా బలినో గ్రహాః

ఆదిత్యసౌరిభౌమాఖ్యా జయే సౌమ్యాశ్చ సవ్దయే.

రేఖా ద్వాదశ చోద్ద్రత్య షట్చ యామ్యా స్తథో తరాః

మనుశ్చైవ తు ఋక్షాణి నేత్రే చ రవిమణ్డలమ్.

 తిథయశ్చ రసా వేదా ఆగ్నిః సప్త దశాథ వా

వసురన్దాః సమాఖ్యాతా ఆకటపాసధో న్య సేత్.

ఏకైకమక్షరం న్యస్య శేషాణ్యేవం క్రమాన్న్య సేత్

నామాక్షరకృతం పిణ్డం వసుభిర్బాజయే త్తతః. 

వాయసాన్మణ్డలౌత్యుగ్రో మణ్డలాద్రాసఖో వరః

రాసభాద్వృషభః శ్రేష్టో వృషభాత్కుఞ్జరో వరః.

  కుఞ్జరాచ్చ పునః సింహః సింహాచ్చైవ ఖరుర్వరః

ఖరోశ్చైవ బలీ ధూమ్ర ఏవమాది బలాబలమ్.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే ఘాతచక్రాదికం నామైకత్రింశదధిక శతతమోధ్యాయః

తూర్పునుండి పశ్చిమమునకు పదమూడు రేఖలు గీసి ఉత్తరమునుండి దక్షిణమునకు ఆరు అడ్డగీతలు గీయవలెను దానిపై అ నుండి ‘హ’ వరకు అక్షరములు వ్రాసి, 10, 9, 7, 12, 4, 11, 15, 24, 18, 4, 27, 24 అంకెలను కూడ వేయవలెను. అంకెలు ఆకారాద్యక్షముల పైన ఉండునట్లు వ్రాయవలెను. శత్రునామము నందలి స్వర వ్యంజనములకు ఎదురుగా అంకెలు కూడి పిండము (మొత్తము) చేయవలెను. దానిని ఏడుచే భాగించగా మిగిలిన ఒకటి మొదలగు దానిని పట్టి సూర్యాదిగ్రహముల భాగలను తెలిసికొనవలెను. శేషము 1 సూర్యుడు; 2 చంద్రుడు; 3 కుజుడు; 5 గురుడు; 6 శుక్రుడు; 7 శని వీరి భాగము లగును రవి-శని-కుజ భాగలు వచ్చినచో జయము కలుగును. శుభగ్రహభాగ మైనచో సంధి కుదురును. తూర్పునుండి పశ్చిమమువరకు పండ్రెండు రేఖలు గీయవలెను. ఆరు లేఖలు ఉత్తరదక్షిణముగ వ్రాయవలెను. దీని పై కోష్ఠమున 14, 27, 12, 15, 6, 4, 3, 17, 8, 8 అంకెలు వ్రాసి కోష్ఠములందు అకారాదిస్వరములు మొదలు హవరకు నుండు అక్షరములు వ్రాయవలెను. పిదప పేరు లోని అక్షరముల ద్వారా ఏర్పడిన మొత్తమును ఎనిమిదిచే భాగించి, ఏకాదిశేషమును బట్టి వాయస –మండల - రాసభ – వృషభ - కుంజర - సింహ - బర - ధూమ్రము లను భాగనామములు అగును. వీటిలోవాయసముకంటె మండలము, దానికంటె రాసభము ఈవిధముగ పూర్వముకంటె ఉత్తరోత్తరము బలీయము.

ఆగ్ని మహాపురాణమునందు ఘాతచక్రాది వర్ణన మను నూటముప్పదియొకటవ అధ్యాయము సమాప్తము.