అగ్ని మహా పురాణము

187 - అథ ఏకాదశీవ్రతాని

అగ్నిగువాచః-

ఏకాదశి వ్రతం వక్ష్యే భుక్తిముక్తిప్రదాయకమ్

దశమ్యాం నియతాహారో మాంసమైథునవర్జితః.

 ఏకాదళ్యాం న భుజ్ఞత పక్షయోరుభయోరపి

ద్వాదశ్యేకాదశీ యత్ర తత్ర సన్నిహితో హరికి.

 తత్రక్రతు తం పుణ్యం త్రయోదశ్యాం తు పొరణే

ఏకాదశ్యాం కలా యత్ర పరతో ద్వాదశీ గతా.

 తత్ర క్రతుశ తం పుణ్యం త్రయోద్యం తు ఫారడే

దశ మ్యేకాదశీ మి నోపోష్యా నరకప్రదా.

 ఏకాదశ్యాం నిరాహారో భుక్త్వా చై వాపరేహన్ని

భోజ్యేహం పుణరీకాక శరణం మే భనాచ్యుత.

ఏకాదశ్యాం సితే పడే పుష్యర్హం తు యదా భవేత్

 సోపోష్యాక్షయ్యఫలదా ప్రోక్తా సా పాపనాశినీ.

 ఏకాదశీ ద్వాదశీయా శ్రవణేన చ సంయులా

విజయా సా తిథిః ప్రోక్తా భక్తానాం విజయప్రదా.

ఏ డైవ ఫాల్గునే మాసి పుష్యరేణ చ సంయుతా

విజయాప్రోచ్యతే సద్బి కోటికోటిగుణోత్తరా.

 ఏకాదశ్యాం విష్ణుపూజా కార్యా సర్వోపకారిణి

ధనవాన్పుత్రవాన్ లోకే విష్ణులో కే మహీయతే.

 ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే ఏకాదశీవ్రతనిరూపణం నామ సప్తాశీత్యధిక శతతమోధ్యాయః.

అగ్ని పలికెను. ఇపుడు భుక్తి ముక్తి ప్రదాయక మగు ఏకాదశీవ్రతమును గూర్చి చెప్పెదను. దశమియందు నియతాహారవంతుడై మాంసమైథునములను వర్ణించవలెను. రెండు పక్షములందును ఏకాదశులందు భోజనము చేయగూడదు. ఏకాదశి ద్వాదశలు కలిసిన దినమున శ్రీహరి సన్నిహితుడై యుండును. ఆ రోజున ఉపవాసము చేసి త్రయోదశినాడు పారణము చేసినచో నూరు యజ్ఞములు చేసిన ఫలము లభించును. ఏకాదశినాడు కొంచెము  ఏకాదశి ఉండి పిదప ద్వాదశి వచ్చినచో, అపుడు ఉపవాసము చేసి త్రయోదశినాడు పారణము  చేసినవానికి నూరు యజ్ఞముల ఫలము లభించును. ఏకాదశినాడు దశమి కలసివచో ఉపవాస ముండరాదు. నరకము వచ్చును. ఏకాదశినాడు ఉపవాస ముండి  మరుచటి రోజున “పుండరీకాక్షా! నేనీ రోజున భుజింతును; నాకు రక్షకుడవు అగుము” అని ప్రార్థించి భోజనము చేయవలెను. శకైకాదశి యందు పుష్యమీ నక్షత్రము ఉన్నపుడు ఉపవాస మున్నచో అదీ అధికఫల ప్రదము. పాపవినాశకము.  ఏకాదశీర్వాదశీతిథులు శ్రవణ నక్షత్రయుక్తము లైనచో అది విజయతిథ. భక్తులకు జయప్రదము. ఫాల్గుణమాసమున పుష్యమీనక్షత్రయుక్త మగ ఏకాదశికూడ విజయాతిథి. అది అనేక కోట్ల రెట్టింపు ఫలము నిచ్చునది. ఏకాదశినాడు విష్ణుపూజ చేయవలెను. ఆదీ అందరికిని ఉపకారకము అట్లు చేసినవాడు ధనపుత్రాదిమంతుడై విష్ణులోకమునందు పూజింపబడును.

            ఆగ్ని మహాపురాణమునందు ఏకాదశీవ్రతనిరూపణ మను నూట ఎనుబదియేడవ అధ్యాయము సమాప్తము.