అగ్ని మహా పురాణము

214 - అథ మంత్ర మాహాత్మ్య కథనమ్

అగ్ని రువాచః-

నాడీచక్రం ప్రవక్ష్యామి యజ్జ్ఞానాజ్జ్ఞాయతే హరిః

నాభేర దస్తాద్యత్కన్దమంకురా స్తత్ర నిర్గతాః.

ద్వా సప్తతి సహస్రాణి నాభిమధ్యే వ్యవస్థితాః

తిర్యగూర్ధ్వ మధ శ్చైవ వ్యాప్తంతాభిః సమ న్తతః.

చక్రవత్సంస్థితా హ్యేతాః ప్రధానా దశ నాడయః

ఇడా చ పిఙ్గలాచైవ సుషుమ్ణా చ తథై వచ.

గాంధారీ హస్తిజిహ్వాచ పృథాచైవ యశాతథా

అలముషా కుహూ శ్చైవ శంఖినీ దశమీ స్మృతా.

దశ ప్రాణహరా హ్యేతా నాడయః పరికీర్తితాః

ప్రాణోఽపానః సమానశ్చోదాన వ్యానౌ చ వాయవః.

నాగః కూర్మోఽథ కృకరో దేవదత్తో ధనంజయః

ప్రాణస్తు ప్రథమో వాయుః దశానామపి సప్రభుః.

ప్రాణః ప్రాణయతే ప్రాణం విసర్గాత్పూరణం ప్రతి

నిత్యమాపూరయత్యేష ప్రాణినామురసి స్థితః.

నిఃశ్వాసోచ్చ్వాసకా సైస్తు ప్రాణో జీవసమాశ్రితః

ప్రయాణం కురుతే యస్మాత్తస్మాత్ప్రాణః ప్రకీర్తితః.

అధో నయత్యపాన ఆహారంచ నృణామధః

మూత్ర శుక్రవహో వాయురపాన స్తేన కీర్తితః.

పీతం భక్షితమాఘ్రాతం రక్తపిత్త కఫానిలమ్

సమం నయతిరాత్రేషు సమానో నామమారుతః.

స్పందయత్యధరం వక్త్రం నేత్రరాగ ప్రకోపనమ్

ఉద్వేజయతి మర్మాణి ఉదావో నామ మారుతః.

వ్యానో వినామయత్యఙ్గం వ్యానోవ్యాధి ప్రకోపనః

ప్రతిదినం తథా కంఠాద్వ్యాపనాద్వ్యాన ఉచ్యతే.

ఉద్గారే నాగ ఇత్యుక్తః కూర్మశ్చోన్మీలనే స్థితః

కృకరో భక్షణే చైవ దేవదత్తో విజృమ్బితే.

ధనంజయః స్థితో ఘోషే మృతస్యాపి న ముఞ్చతి

జీవః ప్రయాతి దశధా నాడీచక్రం హి తేన తత్.

ఆగ్నిదేపుడు చెప్పెను : ఇపుడు నాడీచక్రమును గూర్చి చెప్పెదను దీనిని తెలుసుకొనుటచే శ్రీమహావిష్ణు జ్ఞానము కలుగును. నాభి క్రింద మూలాధారచక్రముండును. దానినుంచి అంకురమువలె నాగులు బయల్వెడలును. నాభిమధ్య యందు డెబ్బది రెండువేల నాడులున్నవి. చక్రాకారముననున్న ఈనాడులు శరీరమునకు క్రింద, పైన, ప్రక్కల అంతటను వ్యాపించి యున్నవి. వీటిలో -ఇడా, పింగళ, సుషుమ్నా, గాంధారీ, హస్తిజిహ్వా, పృథా, యశా, ఆలంబుషా, కుహూ, శంఖినీ ఆను వదినాడులు ప్రధానమైనవి. ఇవి ప్రాణవాయు ప్రసార ముచేయు పది ప్రధాననాడులు. ప్రాణ-ఆపాన-వ్యాన-ఉదాన- సమాన నాగ - కూర్మ - కృకర - దేవదత్త - ధనంజయములనునవి పది ప్రాణవాయువులు. వీటిలో ప్రాణవాయువు అన్నింటికి ఆధిపతి. రిక్త (శూన్య) త్వమును పూర్తిచేయుటకై ఈ ప్రాణము ఇతర ప్రాణవాయువులను ప్రేరేపించును; సకలప్రాణుల హృదయవేళ మునందుండి అపాన వాయువుద్వారాజరుగు మలమూత్ర త్యాగముచే ఏర్పడు రిక్తత్వమును నిత్యము పూడ్చును. జీవుని ఆశ్రయించి యున్న ఈ ప్రాణము శ్వాస - ఉచ్ఛ్వాస - కాసాదుల ద్వారా ప్రయాణము (గమనాగ మనములు) చేయునుగాన ‘ప్రాణ’ మని చెప్పబడుచున్నది. అపానవాయువు ఆహార మును, మూత్ర - శుక్లాదులను క్రిందికి తీసికొనిపోవును. ఇట్లు అపానయనము (తొలగించుట) చేయుటచే ‘ఆపాన’ మైనది. తిన్న ఆహారమును, త్రాగిన జలాదులను, వాసనచూసిన పదార్థములను రక్త - పిత్త - కఫ వాతములను సమావరూపమున సర్వాంగ ములందు ప్రసరింపచేయువది ‘సమానము’. ఉదానము ముఖమును, ఆధర ములను స్పందింపజేయును, నేత్రముల ఎరుపును అధికము చేయును; మర్మ స్థానములను ఉద్విగ్నము చేయును; అందుచే దీనికి ‘ఉదానము’ అని పేరు. వ్యానము ఆంగములను పీడించును. వ్యాధి ప్రకోపము కలిగించుమ. కంఠమును అవరుద్ధము చేయును. వ్యాపన శీలమగుటచే ఇది “వ్యానము”. నాగవాయువు త్రేణుపు, వాంతిమొదలగునవి చేయును. కూర్మవాయువుకంటి రెప్పల మూయుట తెరచుట చేయును. కృకరము భక్షణ మునందును, దేవదత్తము ఆవులింతలందును ఉండును. ధనంజయమునకు స్థానము ఘోషము. ఇది మృతశరీరమును కూడ విడువదు. ఈ పదింటితో జీవుడు ప్రయాణము చేయును. ఆందుచే దశ ప్రాణభేదముచే నాడిచక్రమునకు గూడ పది భేదములేర్పడు చున్నవి.

సంక్రాన్తిర్విషువం చైవ హ్యహోరాత్రాయనాని చ

ఆదిమాస ఋణం చైవ హ్యూనరాత్రం ధనం తథా.

ఊనరాత్రం భవేద్దిక్కా హ్యధిమాసో విజృంభికా

ఋణం చాత్ర భవేత్కాసో విశ్వాసో దనముచ్యతే.

ఉత్తరం దక్షిణం జ్ఞేయం వామం దక్షిణ సంజ్ఞితమ్

మధ్యేతు విషువం ప్రోక్తం పుటద్వయ వినిఃసృతమ్.

సంక్రాన్తిః పునర స్యైవ స్వస్థానాత్స్థాన యోగతః

సుషుమ్ణా మద్యమే హ్యఙ్గే ఇడా వామే ప్రతిష్ఠితా.

షింగలా దక్షిణే విప్ర ఊర్ధ్వం ప్రాణాహ్యహః స్మృతమ్

ఆపానో రాత్రి రేవం స్యాదేకే వాయుర్దశాత్మకః

ఆయామో దేహ మధ్యస్థః సోమ గ్రహణ మిష్యతే

దేహాతి తత్త్వమాయామమాదిత్య గ్రహణం విదుః.

సూర్యగతిచే ఏర్పడు సంక్రాంతి - విషువ - దిన - రాత్రి ఆయన - ఆదిమాస - ఋణ - ఊనరాత్ర - ధనములను పదిదశలు శరీరములో కూడ ఏర్పడును. ఈ శరీరమునందు ఎక్కిళ్లు ఊనరాత్రము. ఆవులింత ఆధిమాసము. దగ్గు ఋణము; నిశ్వాసము ధనము. శరీరములో నున్న వామనాడి ఉత్తరాయణము. దక్షిణనాడి దక్షిణాయనము. ఆ రెండింటి మధ్య నాసికారంధ్రద్వయము నుండి బయల్వెడలు శ్వాసవాయువు విషువము. ఈ విషువవాయువు తన స్థానమునుండి చరించి రెండవస్థానమునకు పోవుట సంక్రాంతి. ద్విజశ్రేష్ఠా! శరీర మధ్యభాగమునందు సుషుమ్న, వామభాగమున ఇడ, దక్షిణ భాగమునపింగళ ఉన్నవి. ఊర్ధ్వగతిగల ప్రాణముదినము; ఆధోగతిగలది రాత్రి, ఒక్క ప్రాణవాయువే దశ వాయు రూపమున విభక్తమైనది. దేహములోపల ప్రాణవాయువు ఆయామము చెందుట “చంద్రగ్రహణము” ఆది దేహము పైభాగము వరకు వ్యాపించినచో సూర్యగ్రహణము.

ఉదరం పూరయేత్తావ ద్వాయునా యావదీప్సితమ్

ప్రాణాయామో భవేదేష పూర కోదేహపూరకః.

పిదాయ సర్వద్వారాణి నిశ్వాసోచ్ఛ్వాస వర్జితః

సంపూర్ణ కుంభవత్తి ష్ఠేత్ప్రాణాయామః స కుంభకః.

ముఞ్చేద్వాయుం తతస్తూర్ధ్వం శ్వాసేనై కేన మంత్రవిత్

ఉచ్ఛ్వాస యోగయుక్తశ్చ వాయుమూర్ధ్వం విరేచయేత్.

ఉచ్చరతి స్వయం యస్మాత్స్వదేహావస్థితః శివః

తస్మాత్తత్త్వవిదాం చైవ సఏవ జపఉచ్యతే.

అయుతే ద్వే సహస్రైకం షట్ శతాని తథైవచ

ఆహోరాత్రేణ యోగీన్ద్రో జపసంఖ్యాం కరోతిసః.

అజపా నామ గాయత్రీ బ్రహ్మవిష్ణుమహేశ్వరీ

ఆజపాం జపతేయస్తాం పునర్జన్మ న విద్యతే.

చంద్రాగ్నిరవి సంయుక్తా ఆద్యాకుండలినీమతా

హృత్ప్రదేశే తు సాజ్ఞేయా అంకురాకార సంస్థితా.

సృష్టిన్యాసో భవేత్తత్ర సవై సర్గావలంబనాత్

స్రవన్తం చింతయేత్తస్మిన్న మృతం సాత్త్వికోత్తమః.

దేహస్థః సకలోజ్ఞేయో నిష్కలోదేహవర్జితః

హంస హంసేతియో బ్రూయాద్దంసోదేవః సదాశివః.

తిలేషు చ యథాతైలం పుష్పేగంధః సమాశ్రితః

పురుషస్య తథాదేహే స బాహ్యాభ్య న్తరంస్థితః.

బ్రహ్మణో హృదయే స్థానం కంఠే విష్ణుః సమాశ్రితః

తాలుమధ్యేస్థితోరుద్రోలలాటేతు మహేశ్వరః.

ప్రాణాగ్రంతు శివం విద్యత్తస్యా న్తేతు పరాపరమ్

పంచధా సకలః ప్రోక్తో విపరీతస్తు నిష్కలః.

సాధకుడు ఎంత శక్యమగునో ఆంతవాయువు లోనికి తీసికొనవలెను. ఇది దేహమును నింపు ‘పూరక’ ప్రాణాయామము. శ్వాస బైటికి పోకుండునట్లు శ్వాసనిశ్వాసలు ఆపివేసి పూర్ణ కుంభము వలెన్నుచో అది ‘కుంభక’ ప్రాణాయామము. పిదప మంత్రవేత్త పైకి ఒకే నాసారంధ్రముచే వాయువును విడచినచో ఆది  ‘రేచక’ ప్రాణాయామము. శ్వాసోచ్ఛ్వాస క్రియనే శరీరములో నున్న శివరూపబ్రహ్మ యొక్క ఉచ్చారణము (సోహంహంస అనువిధమున) జరుగును. గాన తత్వవేత్తలు దీనిని జపమందురు. ఈ విధముగ తత్త్వవేత్త ఒకదినమునందు శ్వాసప్రశ్వాసల ద్వారా 21600 పర్యాయములు మాత్రజపము చేయును. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సంబంధించిన ‘అజపాగాయత్రి’. ఈ ఆజపాజపము చేయువానికి పునర్జన్మ లేదు. చంద్రాగ్ని సూర్యయుక్త మూలాధార స్థిత యగు కుండలినీ శక్తి హృదయ ప్రదేశమునందు అంకురా కారమున నుండును. సాత్విక పురుష శ్రేష్టుడగు యోగి సృష్టిక్రమను నవలంబించి, సృష్టి న్యాసము చేసి, బ్రహ్మరంధ్రము నందున్న శివునినుండి కుండలినీ ముఖమునందు అమృతము ప్రవహించునట్లు భావన చేయవలెను. శివునకు సకలము నిష్కలము అని రెండు రూపములున్నవి. సాకారుడగు శిపుడు సకలుడు, నిరాకారుడు నిష్కలుడు. వారు ‘హంసహంస’ అని జపము చేయుదురు. హంస అనగా సదాశివుడు, తిలలలోతైలము, పుష్పముల లో సుగంధము ఉన్న విధముగ జీవాత్మకు లోపలను వెలుపలను సదాశివుడు నివసించును. బ్రహ్మ హృదయమునందును, విష్ణువు కంఠమునందును, తొలమధ్యభాగమున రుద్రుడు, లలాటముక మహేశ్వరుడు, ప్రాణాగ్రము నందు సదాశివుడును ఉందురు. వీటి అన్నింటికి అంతమునందు పరాత్పర బ్రహ్మ ఉండును. సకల పరమాత్మ బ్రహ్మ - విష్ణు - రుద్ర మహేశ్వర - సదాశివరూపముననుండును. నిర్గుణుడు, నిష్కలుడు అగు పరమాత్మ ‘నిష్కలుడు’.

ప్రాసాదం నాదముత్ధాప్య సతతంతు జపేద్యది

షణ్మాసైః సిద్దిమాప్నోతి యోగయుక్తో నసంశయః.

 గమాగమస్య జ్ఞానేన సర్వపాపక్షయోభవేత్

అణిమాది గుణైశ్వర్యం షడ్భిర్మా సైరవాప్నుయాత్.

 స్థూలః సూక్ష్మః పరశ్చేతి ప్రాసాదః కథితో మయా

హ్రస్వోదీర్ఘః ప్లుతశ్చేతి ప్రాసాదం లక్షయే త్త్రిదా.

 హ్రస్వో దహతి పాపాని దీర్ఘో మోక్షప్రదో భవేత్

 ఆప్యాయనే ప్లుత శ్చేతి మూర్ద్ని బిందు విభూషితః.

 ఆదావ న్తేచ ప్రశ్వస్య ఫట్కారో మారణే హితః

ఆవ న్తేచ హృదయమాకృష్టౌ సంప్రకీర్తితమ్.

 దేవస్య దక్షిణాం మూర్తిం పంచలక్షంస్థితో జపేత్

జపాన్తే ఘృతహోమస్తు దశ సాహస్రికో భవేత్.

 ఏవ మాప్యాయితో మన్త్రో వశ్యోచ్చాటాదికారయేత్

 ఊర్థ్వేశూన్యమధఃశూన్యం మధ్యే శూన్యం నిరామయమ్.

త్రిశూన్యంయో విజానాతి ముచ్యతేఽసౌధ్రువంద్విజః

 ప్రాసాదం యోనజానాతి పంచమంత్ర మహాతనుమ్.

అష్టత్రింశత్కలాయుక్తం న స ఆచార్య ఉచ్యతే

 తథోఙ్కారంచ గాయత్రీం రుద్రాదీన్వే త్త్య సౌ గురుః.

ఆవాహతనాదమును ప్రాసాదమువరకు లేవదీసి నిరంతర జపముచేయు యోగి ఆరు మాసములలోనే సిద్ధినిపొందును; సంశయము లేదు. గమనాగమన జ్ఞానముచే సమస్త పాపములును నశించి అణిమాదిసిద్దులు, గుణములు, ఐశ్వర్యము ఆరు మాసములలో లభించును. స్థూల, సూక్ష్మము పరము అను మూడు విధములగు ప్రాసాదమును వర్ణించితిని. ప్రాసాదమును హ్రస్వము, దీర్ఘము, ప్లుతమ అను మూడురూపమాలలో గుర్తించవలెను. హ్రస్వము పాపములమ దహించివేయును, దీర్ఘము మోక్షప్రదము. ప్లుతము తృప్తిప్రదము. దీని శిరస్సు పై బిందువు (అనుస్వారము) ఉండును. మారణకర్మల యందు హ్రస్వప్రాసాద మంత్రమునకు ఆద్యంతములందు ‘ఫట్’ చేర్చి జపము చేసిన మంచిది. ఆద్యంతములందు ‘నమః’ చేర్చి జపము చేసినచో అది ఆకర్షణధకము, మహాదేవుని దక్షిణామూర్తి సంబంధి మంత్రమును నిలబడి నాలుగులక్షలు జపించి, జపాంతమున పదివేల ఆజ్యహోమములు చేసినచో మంత్రసిద్ది కలుగును. పిదప దానితో వశీకరణోచ్చాటనాదులు చేయవచ్చును. పైనను, క్రిందను, మధ్యయందును శూన్యమేన త్రిశూన్య నిరామయమంత్రము తెలిసికొనిన ద్విజుడు తప్పక ముక్తిపొందును. ఐదు మంత్రముల కలయిక చే చాల పెద్దది, ముప్పదియేడు కలలతో కూడినది అయిన ప్రాసాదమంత్రము నేరుగ నివాడు ఆచార్యుడు కాజాలడు. ఓం కారము, గాయత్రి, రుద్రాది మంత్రములు తెలిసినవాడే గురువు.

అగ్ని మహాపురాణమునందు నాడీచక్ర కథనమను రెండువందల పదునాల్గవ అధ్యాయము సమాప్తము.