అగ్ని మహా పురాణము

47 - అథ శాలగ్రామాఽఽది పూజాకథనమ్

శ్రీ భగవానువాచః-

 శాలగ్రామాది చక్రాజపూజా సిద్ద్యే వదామితే

త్రివిధః స్యాద్దరేఃపూజా కామ్యాకామ్యో భయాత్మికా.

మీనాదీనాంతుపవ్చొనాం కామ్యార్థావోభయాత్మికా

వరాహస్య నృసింహస్య మనస్య చ ముక్తకమ్.

చక్రాదీనాం త్రయానాంతు శాలగ్రామార్చనం శృణు

ఉత్తమా నిష్పలా పూజా కనిష్ఠ సఫలార్చనా.

మధ్యమామూర్తిపూజాస్యాచ్చక్రాట్లే చతుర సకే

ప్రణవం హృది విన్యస్య షడజం కరదేహయోః.

కృతముద్రాత్రయశ్చక్రాద్బహిః పూర్వేగురుం యజేత్

ఆ ప్యేగణం వాయవ్యే ధాతారం నై రృతే యజేత్ .

విధాతారం చకర్తారం హర్తారం దక్ష సౌమ్యః

విష్వక్సేనం యజేదీశ ఆగ్నేయే క్షేత్రపాలకమ్.

ఋగాదివేదాన్ ప్రాసాదావాధారాన న్తకం భువమ్

పీఠం పద్మం చార్కచన్దవహ్యాఖ్యం మట్టిలత్రయమ్.

ఆసనంద్వాదశ ర్ణేన తత్రస్థాప్య శిలాం యజేత్

వ్య క్షేన చ సమ స్తేన స్వబీజేన యజేత్కమాత్.

పూర్వాదావథ వేదాద్యైర్గాయత్రీభ్యాం జితాదినా

ప్రణవేనార్చ యేత్ప్చ న్ముద్రాస్తిస్రః ప్రదర్శయేత్.

విష్వక్సేనస్య చక్రస్య క్షేత్రపాలస్య దర్శయేత్

            హయగ్రీవుడు చెప్పెను : ఇపుడు చక్రాంకిత కాలగ్రామముల పూజావిధానమును చెప్పుచున్నాను. ఇది సిద్దిప్రద మైనది. శ్రీహరి పూజ కామ్య, అకామ్య, కామ్యాకామ్య అని మూడు విధములు. మత్స్యాది పంచ విగ్రహముల పూజ కామ్యముగాని, ఉథయాత్మికగాని కావచ్చును, వెనుక చెప్పిన చక్రములతో ప్రకాశించు వారాహ వామన - నృసింహుల హజను ముక్తి కొరకు చేయవలెను, ఇపుడు మూడు విధములైన శాలగ్రామ పూజను గూర్చి వినుము. వీటిలో నిష్ఫల పూజ ఉత్తమము: సవలపూజ కనిష్ఠము; మూర్తిపూజ మధ్యమము, చతురస్ర మండపము పైనున్న కమలమునందు పూజా విధి ఈ విధముగ ఉండును– హృదయమునందు ప్రణవన్యాసము చేయుచు షడంగన్యాసము చేయవలెను. పిమ్మట కరన్యాసము, వ్యాపకన్యాసము చేసి మూడు ముద్రలను చూపవలెను. పిమ్మట చక్రమునకు. బేట, తూర్పున గురువును పూజించవలేమ. పశ్చిమమున గణమును,  వాయవ్యమున ధాతను, నైరృతి యందు - విధాతను పూజింపవలెను. దక్షిణోత్తరములయందు వరుసగా కర్తను, హర్తను పూజింపవలెను. ఈశాన్యమున విష్వక్సేనుని, ఆగ్నేయమున క్షేత్రపాలుని పూజింపవలెను. పిమ్మట, పూర్వాది దిక్కులందు ఋగ్వేదాది - వేదచతుష్టయమును పూజించి, ఆధారశక్తిని, అనంతున్ని, పృథివిని, యోగపీఠమును, పద్మమును, సూర్యమండలమును, చంద్రమండలమును, బ్రహ్మాత్మక వహ్ని మండలమును పూజించి, ద్వాదశాక్షరిచే ఆసనముపై శిలాస్తాపనముచేసి పూజింపవలెను. పిదప - మూల మంత్రమును, విభజించియు, సంపూర్ణ మంత్రముచేతను క్రమపూర్వకముగా పూజింపవలెను. పిదప- ప్రణవముచే పూజించి మూడు - ముద్రలు చూపవలెను:- కష్వక్సేన - చక్ర - క్షేత్రపాలుల ముద్రలు చూపవలెను.

శాలగ్రామస్య ప్రథమాపూజాథో నిష్ఫలోచ్యతే.

పూర్వవత్తోడశాం చ సపద్మం మణ్డలం లిఖేత్

శజ్ఖచక్ర గదాఖడ్గైర్గుర్వాద్యం పూర్వవద్వజీత్.

పూర్వే సౌమ్యేధనుర్బాణాన్ వేదాద్యైరాసనంద దేత్

శిలాం న్య సేద్ద్వాదశ రై సృతీయం పూజనం శృణు.

అపార మజ్జం విలిజేద్దుర్వాద్యం పూర్వవద్యజేత్

అష్టార్ణేనాసనం దత్వా తేనై వచ శిలాం న్య సేత్.

పూజయేద్దశదా తేన గాయత్రీభ్యాం జీతం తథా

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శాలగ్రామపూజాకథనం నామసప్తచతారింశోధ్యాయః.

ఇంతవరకును చెప్పినది శాలగ్రామ మధ్యమ పూజ. ఇపుడు నిష్ఫలపూజ చెప్పబడుచున్నది. వెనకటి వలెనే షోడశదలకమలముతో కూడిన మండలము చేయవలెను. దాని పై శంఖ - చక్ర - గదా - ఖడ్గములను, గురువు మొదలగువారిని వెనుక చెప్పినట్లుగనే పూజింపవలెను. పూర్వోత్తర దిశలయందు. వరుసగా ధనుర్బాణములను పూజింపవలెను. ప్రణవముచే ఆసనము సమర్పించి, ద్వాదశాక్షరిచే శిలాన్యాసము చేయవలెను. ఇపుడు మూడవదైన కనిష్ఠ పూజను (సఫల పూజను) చెప్పుచున్నాను, వినుము. అష్టదల కమలముపై వెనుక టివలే గుర్వాదిపూజ చేయవలెను - పిదప అష్టాక్షర మంత్రముచే ఆసనము సమర్పించి, ఆ మంత్రముచేతను, శిలను స్థాపించవలెను.

ఆగ్ని మహాపురాణమునందు శాలగ్రామ పూజాకథనమను నలుబది ఏడవ అధ్యాయము సమాప్తము.