అగ్ని రువాచః
అలంకృతమపి ప్రీత్వైన కావ్యం నిర్గుణం భవేత్ ।
వపుష్యలలితే స్త్రీణాం హారో భారాయతేపరమ్.
నచ వాచ్యం గుణో దోషోభావవవ భవిష్యతి ।
గుణాః శ్లేషాదయోదోషా గూడార్థాద్యాః పృథక్ కృతాః .
యః కావ్యమహతీం ఛాయామను గృహ్ణాత్యసౌ గుణః ।
సంభవత్యేష సామాన్యో వైశేషిక ఇతిద్విధా.
సర్వసాధారణీ భూతః సామాన్య ఇతిమన్యతే ।
శబ్దమర్థముభౌ ప్రాప్తః సామాన్యో భవతిత్రిధా.
శబ్దమాశ్రయతే కావ్యం శరీరం యః సతద్గుణః ।
శైషోలాలిత్య గాంభీర్య సౌకుమార్య ముదారతా.
సత్యేవ యౌగికీ చేతి గుణాః శబ్దస్య సప్తధా ।
సు శ్లిష్ట సన్ని వేశ త్వం శబ్దానాం శ్లేష ఉచ్యతే.
గుణాదేశాదినా పూర్వం పదసంబద్ధ మక్షరమ్ ।
యత్రసంధీయతేనైవ తల్లాలిత్య ముదాహృతమ్.
విశిష్ట లక్షణోల్లేఖలేఖ్య ముత్తాన శబ్దకమ్ ।
గాంభీర్యం కథయన్త్యార్యా స్తదేవాన్యేషు శబ్దతామ్.
ఆనిష్ఠురాక్షర ప్రాయశబ్దతా సుకుమారతా ।
ఉత్తాన పదతౌ దార్యయుతశ్లాఘైర్వి శేషణైః.
ఓజః సమాస భూయస్త్వ మేతత్పద్యాది జీవితమ్ ।
ఆ బ్రహ్మా స్తంబ పర్యన్తామోజనై కేన పౌరుషమ్.
ఉచ్యమానస్య శబ్ధేన యేన కేనాపి వస్తునః ।
ఉత్కర్ష మావహన్నర్థోగుణ ఇత్యభి ధీయతే.
మాధుర్యం సంవిధానంచ కోమలత్వ ముదారతా।
(పౌడి: సామయికత్వంచ తద్భేదాః షట్ చకాసతి.
కోదేర్ష్యకార గాంభీర్యాన్మాదుర్య ధైర్యగాహితా ।
సంవిధానం పరికరః స్యాద పేక్షతా సిద్ధయే.
యత్కాఠిన్యాది నిర్ముక్త సన్ని వేశ విశిష్టతా ।
తిరస్కృత్యైవ మృదుతాభాతి కోమలతతిసా.
లక్ష్యతేస్థూల లక్షత్వ ప్రవృత్తేర్యత్ర లక్షణమ్।
గుణస్యత దుదారత్వ మాశ యస్యాతి సౌష్ఠవమ్.
అభిప్రేతం ప్రతియతో నిర్వాహస్యోప పాదికాః।
యుక్తయో హేతు గర్భిణ్యః ప్రౌడా పౌఢిరుదాహృతి.
స్వతంతస్యాస్య తంత్రస్య బాహ్యాన్తః సమయోగతః ।
తత్రవ్యుత్పత్తి రర్థస్యయా సామయిక తేతిసా.
అగ్ని దేవుడు పలికెను. గుణరహితమగు కావ్యము ఆలంకార సహితమైనను ప్రీతి జనకము కాదు. లలితము కాని స్త్రీ శరీరముపై హారము బరువుకు చేటు. దోషాభావమే గుణము కదా ! గుణములను ఇక చెప్పుట ఎందుకు యని అవ కూడదు. ఏలనన ! శ్లేషాది గుణములు, గూడార్థత్వాది దోషములు వేర్వేరుగా చెప్పబడినవి. కావ్యమునందు శోభాతిశయ మును కల్గించునవి గుణములు. సామాన్యములు వై శేషికములు అని ఇవి రెండు విధములు. సర్వ సాధారణమాలు సామాన్యములు. ఇవి శబ్ద - అర్ధ - శబ్దార్ధ ములతో సంబంధించి మూడు విధములగును. కావ్య శరీరమగు శబ్దమును ఆశ్రయించినది శబ్దగుణము. శ్లేష లాలిత్యము, గాంభీర్యము, సౌకుమార్యము. ఉదారగా ఓజస్సు, యౌగికీ యని శబ్ద గుణములు ఏడు విధములు. శబ్దముల చిక్కదనము శ్లేష. గుణ వృద్ధ్యాదుల ద్వార అక్షరమాలకు సంధిలేనిచో అది లాలిత్య గుణము. ఉత్తమ భావవ్యంజకములగు శబ్ద సమూహము విశిష్ట లక్షణ యుక్తమైనచో ఆది గాంభీర్యము. దానికే శబ్దత అని పేరు. నిష్ఠు రాక్షరములు లేని శబ్దములు అధిక ముగనున్న చో అది సౌకుమార్యము. శ్లాఘ్య విశేషణములతో కూడిన ఉత్కృష్టవదముల ప్రయోగము ఔదార్యము. దీనికే ఉత్తాన పడతాయని పేరు. సమాస బాహుల్యము ఓజస్సు; ఇది పద్యాదులకు జీవితము. బ్రహ్మ మొదలు స్తంభము వరకు వున్న జీవుల పౌరుషమున ఓజోగుణ విశిష్ట శబ్దములతోడనే వర్ణింప వీలగును. ఏశబ్దము లై నను ప్రయోగించి వర్ణింపబడు వస్తువుల ఉత్కర్షను సూచించునది ఆర్ద గుణము. మాధుర్యము సంవిధానమ, కోమలత్వము. ఉదారత, ప్రౌఢి, సామైక తా, అని ఆర్డ గుణములు ఆరు. క్రోధ ఈర్ష్యాదులందు కూడ ఆకార గాంభీర్యము ధైర్యము ఉండుట మాధుర్యము. కార్యసిద్ధికై ప్రయత్నము సంవిధానము. కాఠివ్యాది దోషవర్ణిత మగు మృదు సన్నివేశము కోమలత. ఔదార్యమును సూచించుచు ఆశయమును అతి సుందరముగ ప్రకటించినచో ఆది ఉదార లో. అభీష్టమగు విషయ మును గూర్చి తన్నిర్వాహమును సమర్థించు హేతుగర్భ యుక్తులకు ప్రౌఢ యని పేరు. స్వతంత్రము గానీ పరతంత్రము గాని యగు కార్యము యొక్క బాహాంతర సంయోగముచే కలుగు ఆర్థవ్యుత్పత్తి కి సామెకతయని పేరు.
శబ్దార్థ వుపకుర్వాణో నామ్నోభయగుణః స్మృతః ।
తస్యప్రసాదః సౌభాగ్యం యథాసంఖ్య ప్రశ స్తతా.
పాకోరాగ ఇతిపాజ్ఞైః షట్ ప్రపంచ విపంచితాః ।
సుప్రసిద్దార్థ పదతా ప్రసాద ఇతిగీయతే.
ఉత్కర్షవాన్గుణః కశ్చిద్యసిన్ను క్తే ప్రతీయతే ।
తత్సౌభాగ్య ముదారత్వం ప్రవదంతి మనీషణః.
యథానంఖ్య మనూద్దేశః సామాన్య మతిదిశ్యతే ।
సమయే వర్ణనీయస్య దారుణస్యాపి వస్తునః.
ఆదారుణేన శబ్దేన ప్రాశస్త్య ముపవర్ణనమ్ ।
ఉచ్చై పరిణతిః కాపిపాక ఇత్యభిధీయతే.
మృద్వీకానారి కేలామ్బుపాక భేదా చ్చతుర్విధః ।
ఆదావ న్తేచసౌ (సా) రస్యం మృద్వీకా పాక ఏవసః.
కావ్యేచ్ఛయా విశేషోయః సరాగ ఇతిగీయతే ।
అభ్యాసోపహితః కాంతిం సహజామపి వర్తతే.
హారిద్రశ్చైవ కౌసుభో నీలిరాగశ్చ సత్రిధా ।
వై శేషిక పరిజ్ఞేయోయః స్వలక్షణ గోచరః.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే కావ్యగుణ వివేకవర్ణనంనామ షట్ చత్వారింశదధిక త్రిశతతమోఽధ్యాయ:.
శబ్దార్థములు రెండింటికీని ఉపకారక ముగా మండునది ఉభయ గుణము. ప్రసాదము సౌభాగ్యము యథాసలఖము ప్రశ స్తత పాకము రాగము అని ఆరువిధములు. ప్రసిద్ధార్థములగు పదముల ప్రయోగము ప్రసాదము; దేనిని వర్ణించగ ఉత్కర్ష సూచితమగునో అట్టి వర్ణనము సౌభాగ్యము; దీనికే ఉదారత్వమని పేరు. తుల్యవస్తువులను క్రమముగ చెప్పుట యథాసంఖ్యము; వర్ణనీయమగు దారుణ వస్తువును సమయాను సారముగ అదారణ శబ్దములచే వర్ణించుట ప్రాశస్త్యము. పదార్థము యొక్క ఉన్నత పరిణితి పాకము; మృద్వికాపాకము నారికేళాంబు పాకమని ఆవిరెండు విధములు. ఆదినుండి అంతమువరకుర సభరిత మేనది మృద్వికాపాకము; కావ్యము నందలి ఛాయ విశేషమునకు రాగమని పేరు. అభ్యాసవశముచే ఇవి సహజ కాంతిని కూడ అతిశయించి పుండును. ఒకానొక విశేష లక్షణముచే అనుభవమానకు వచ్చుదానిని వైశేషిక గుణమందురు. హరిద్రారాగము కౌసుంబరాగము నీలిరాగము అని రాగము మూడు విధములు. స్వలక్షణగోచరమైనది అనగా ఆవస్య సాధారణమైన ధర్మము వైశేషికము.
అగ్ని మహాపురాణమున కావ్య గుణ వివేక కథనమను మూడు వందల నలుబది ఆరవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 347 of the Agni Purāṇa is as follows:
The defects (doṣas) of kāvya are analyzed in nine categories arising from flaws in the speaker (vaktṛ), the word (vācaka), and the meaning (vācya). Specific defects include: asādhu (ungrammatical or non-standard usage), aprayukta (never-occurring in good usage), chāndasa (Vedic forms used in secular kāvya), aviṣpaṣṭa (ambiguity arising not from beauty but from carelessness), and gūḍhārtha (obscure meaning due to incompetence rather than intentional depth). The chapter transitions into a philosophical digression affirming that only Brahman is paramārtha-sat (ultimately real) and that the entire universe of language, poetry, and forms is Brahman's self-expression, grounding the aesthetics section in Vedāntic metaphysics before concluding.