అగ్ని మహా పురాణము

94 - అథ శిలాన్యాస విధానమ్.

ఈశాదిషు చరకాద్యాః పూర్వవత్పూజయేద్బహిః

ఆహుతి త్రితయం దద్యాత్ప్రతిదేవమనుక్రమాత్.

దత్త్వా భూతబలిం లగ్నే శిలాన్యాసమనుక్రమాత్

మధ్యసూత్రే న్య సేచ్ఛ కి కుమ్భం జాన్వన్తముత్తమమ్.

నకారరూఢమూలేన కుమ్భేజస్మిన్ దారయేచ్ఛిలామ్

కుమ్భానష్టా సుభద్రాదీన్ దిషు పూర్వాదిషు క్రమాత్.

లోకపాలాణుభిర్న్యస్య శ్వబ్రేష న్యస్త క్లిషు

శిలా స్తేష్వథ నన్గాద్యాః క్రమేణ వినివేశయేల్.

శమృతైర్మూర్తినాథానాం యథాస్యు రిత్తిమధ్యతః

తాసు ధర్మాదికొనష్టా కోణాల్కోణ విఖాగశః.

సుభద్రాదీషు నన్గాద్యాశ్చతస్కోగ్న్యాది కోణగాః

అజిలాద్యాశ్చ పర్వాదిజయాదీష్వథ విన్య సేత్.

బ్రాహ్మణం చోపరి న్యస్య వ్యాపకం చ మ హేశ్వరమ్

చిన్తయేదేషు దధానం వ్యోమప్రాసాదమధ్యగమ్.

బలిం దత్త్వా జ పేదస్త్రం విఘ్న దోషనివారణమ్

శిలాపళ్చాకపజేపి మనాగుద్దిశ్యతే యథా.

మధ్యే పూర్ణశిలాన్యాసః సుభద్రకల ఒర్ధతః

పద్మా దిషు చ నందద్యాః కోణేష్వగ్న్యాదిషు క్రమాత్.

మధ్యభావే చత సోఽపి మాతృవద్భావసంమతాః

పరమేశ్వరుడు చెప్పెను-స్కందా! వాస్తుమండలమునకు బైట. ఈశాన్యదిక్కులందు వెనుకటి వలె చరకి మొద లగు దేవతలను పూజించవలెను. ఒక్కోక్క దేవతకుమ మూడేసి హోమములు చేయవలెను. భూతబలి ఇచ్చి, నిశ్చిత మగు లగ్నమునందు శిలాన్యాసోపక్రమము చేయవలెను. ఖాతమధ్యభాగమున ఆధారళ క్తివ్యాసము చేయవలెను. అచట అనంతుని మంత్రముచే అభిమంత్రించిన ఉత్తమకలశము స్థాపింపవలెను. “లం పృథివ్యై నమః” అను మంత్రముతో ఆ కలశముపై పృథివీస్వరూప మగు శిలను ఉంచవలెను. దానికి పూర్వాదిదిక్కులందు క్రమముగ సుభద్రము మొదలగు ఎనిమిది కలశ లను స్థాపించవలేము. మొదటి వాటికొరకై గోతులు త్రవ్వి, వాటిలో ఆధారశక్తి న్యాసము చేసిన పిమ్మట ఆ కలశలను ఇంద్రాదిలోకపాలుల మంత్రములతో స్థాపించవలెను. పిదప ఆ కలశలపై నందాది శిలలను ఉంచవలెను. ఆ శిలలు తత్త్వ మూర్త్యధి దేవతావస్త్రములతో కూడి యుండవలెను. గోడలపై మూర్తులను, అస్త్రాదుల చిహ్న ములుంచినట్లు ఆ శిలలపై దిగ్విదిక్కులను చక్కగా విభజించి ధర్మాదిదేవతాష్టకమును స్థాపించవలెను. సుభద్ర మొదలగు నాలుగు కలశములపై వందాది శిలాచతుష్టయమును, నాలుగు కోణములందును స్థాపించవలెను. పిదప జయాది కలశచతుష్టయముపై అజితాది శిలా చతుష్టయమును, పూర్వాదిదిక్చతుష్టయమున స్థాపింపవలెను. వాటి అన్నింటి పైనను, బ్రహ్మను, న్యాపకు డగు మహేశ్వ రుని స్థాపించి మందిరమధ్యమునం దున్న ఆకాశ మను పేరు గల ఆధ్వను చింతించవలెను. ఈ అన్నింటికిని బలి సమ ర్పించి విఘ్న దోష నివారణార్థమై అస్త్రమంత్రమును జపించవలెను. పంచశిలాపక్షమున ఈ విధముగ చేయవలెను. మధ్య భాగమున సుభద్ర కలశముపై పూర్ణయను శిలను స్థాపించవలెను. ఆగ్నేయాది దిక్కులందు క్రమముగా, పద్మాది కలశము లపై, నందాది శిలలను స్థాపించవలెను. మధ్య శిల లేని పక్షమున నాలుగు శిలలనే మాతృభావముతో పూజించి స్థాపించి వలెను. ఆ శిలల వైదింటిని ఈ విధముగ ప్రార్థించవలెను.

ఓం పూర్ణే త్వం మహావిద్యే సర్వసందోహలక్షణే

సర్వం సంపూర్ణ మేపాత్ర కురష్వాజ్గిరసః సుతే

ఓం నన్డే త్వం నర్గినీ పంపాల త్వామత స్థాపయామ్యహమ్.

ప్రాసాదే తిష్ఠ సంతృప్తి యావచ్చన్గారతారకమ్

ఆయుః కామం క్రియం నన్డే దేహి వాసిష్ఠి దేహినామ్.

అస్మిన్ రక్షా సదా కార్యా ప్రాసాదే యత్నరస్త్వయా

ఓం భద్రే త్వం సర్వదా భద్రం లోకానాం కురు కాశ్యపి.

ఆయుర్దా కామదా దేవి శ్రీ ప్రదో చ సదా భవ

ఓం జయేత్ర సర్వదా దేవి శ్రీడాయుర్దా సదా భవ,

ఓం జయేత్ర సర్వదా దేవి తిష్ట త్వం స్థాపితా మయా

నిత్యం జయాయ భూత్యై చ స్వామిని తవ భార్గవి

ఓం రిక్రేతిరిక్తదోష ఘ్న సిద్దిము క్తిప్రదే శుభే

సర్వదా సర్వదేశ సే తిష్టాస్మిన్ విశ్వరూపిణి.

గగనాయతనం ధ్యాత్వా తత్ర తత్త్వత్రయం న్య సేత్

ప్రాయశ్చిత్తం తతో హత్వా విధినా విసృజేన్మ ఖమ్.

 ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శిలాన్యాసధానం నామ చతుర్నవతితమోధ్యాయః.

సర్వసందోహస్వరూపిణివి, మహా విద్యను ఆయిన ఓ పూర్ణా నీవు అంగిరోఋషి పుత్రికవు. ఈ ప్రతిష్టాకర్మ యందు అంతయు చక్కగ పూర్ణ మగు నట్లు చేయుము. నందా! నీవు సమస్త పురుషులను ఆనందింపచేయుదానవు. నిన్ను ఇచట స్థాపించున్నాను. ఆగమునందు సూర్యచంద్ర నక్షత్రాదులు, ప్రకాశించుచున్నంత వరకును నీవు పూర్తి గా తృప్తరా లపై ఈ ప్రాసాడవన స్థిరముగా నుండుము, వసిష్ఠనందిని యైన ఓసందా! నీవు ప్రాణులకు ఆయువును, సంపూర్ణమనో, రథములను లక్ష్మిని ఇమ్మ. నీ వీ ప్రాసాదమునందు స్థిరముగా నుండి దీనిని యత్నముతో రక్షింపుము. కశ్యపనందిని యైన భద్రా నీవు సమ స్తలోకములకును సర్వదా కల్యాణము చేయుము. దేవీ! నీవు సర్వదా మాకు ఆయుర్మనోరథలము లను ఇచ్చుచుండుము. ఓ దేవీ! జయా నీవు సర్వదా మాకు లక్ష్మిని, ఆయువును ఇచ్చుచుండుము. భృగు, పుత్రియైన జయా! నీవు ఇచట స్థాపితురాలవై ఇచటనే ఉండి ఈ గృహస్వామినైన వారు నిత్యము విజయైశ్వర్యాదలు నిమ్ము. ఓ రిక్తా! నీవు అతిరిక్త దోషములను నశింపచేయుదానవు. . సిద్ధిమోక్షదాయినివి ఆగుము. ఓ శుభా సంపూర్ణదేశ కాలములందు నీ నివాసము. ఈశరూపిణీ నీవు సర్వదా ఈ ప్రాసాదమున. ఉండుము. ఈ విధముగ ప్రార్థించి ఆకాశరూపమగు గృహ మును ధ్యానించి, దాని యందు మూడు తత్త్వముల వ్యాసము చేయవలెను.యథా విధిగ ప్రాయశ్చిత్త హోమములు చేసి యజ్ఞ సమాప్తి చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు శిలాన్యాస విధివర్జన మను తొంబది నాల్గవ అధ్యాయము సమాప్తము.