పుష్కర ఉవాచః-
ప్రేతశుద్ధిం ప్రవక్ష్యామి సూతికాశుద్ది మేవ చ ।
దశాహం కావమాశౌచం సపిణేషు విధీయతే.
జననే చ తథా శుద్దిరాహ్మణానాం భృగూ త్తమ ।
ద్వాదశా హేన రాజన్యః పక్షాద్వ్యై థ మాసతః .
ఈద్రోనులోమతో దానే స్వామితుల్యం త్వశాచకమ్।
షడ్భిభిరథై కేన క్షత్రవిట్మూద్రయోనిష.
బ్రాహ్మణః దిమాప్నోతి క్షత్రియస్తు తథైవ చ ।
విట్మూద్రయోనేః శుద్ధిః స్యాత్కమాత్పరశురామక.
షడ్రాత్రేణ త్రిరాత్రేణ షడ్భిః శూటే తథా విశః ।
ఆద నజననాత్సద్య ఆచూడాన్నై శికీ శ్రుతి.
త్రిరాత్రూవ్రలాదేశాద్దశరాత్రమతః పరమ్ ।
ఊనతైవార్షి కే శూద్రః పశ్చాహాచ్ఛుద్దిరిష్యతే.
ద్వాదశా హేన శుద్ధిః స్యాదతీతే వత్సరత్రయే ।
గతైః సంవత్సరైః షడ్భిః శుద్ధిర్మా నేన కీర్తితా.
శ్రీడామకృతచూడానాం విశుద్దిరె శికీ స్మృతా ।
తథా చ కృతచూడానాం త్ర్యహాచ్భుద్ధ్యక్తి బానవాః.
వివాహితాసు నాశౌచం పితృపడే విధీయతే ।
పితుర్గృహే ప్రసూతానాం విశుద్ధిర్నై శికీ స్మతా.
సూతికాదళ రాత్రేణ శుద్ధిమాప్నోతి నాన్యథా ।
వివాహితాహి చేతన్యా ప్రియతే పితృవేశ్మని.
తస్యాస్త్రిరాత్రాచ్చుధ్యని బాన్లవా నాత్రసంశయః ।
సమానం లఘ్వశాచం తు ప్రథమేన సమాపయేత్.
అసమానం ద్వితీయేన ధర్మరాజవచో యథా ।
పుష్కరుడు చెప్పెను : ఇపుడు ప్రేతశుద్ధి-సూతికాశుద్ధులను గూర్చి చెప్పెదను. సపిండులలో (మూలపురు ముడు మొదలు ఏడవ తరమువరకు ఉన్న వారిలో) మరణాశౌచము పది దినములు. జననాశౌచము కూడ అంతే. పరశు రామా! ఇది గ్రాహ్మణుల విషయమున చెప్పిన ఆశాచము. క్షత్రియులకు 11 రోజులు, వైశ్యులకు 15 రోజులు, శూద్రులకు ఒక మాసము అశౌచము. శూద్రులకు చెప్పినఈ అశౌచము అనులోమజునకు స్వామి ఎన్ని దినముల ఆశౌచము పాటించునో సేవకులకు గూడ అన్ని దినములే. జననాశౌచము క్షత్రియ-వైశ్య-శూద్రులకు గూడ పది దినములే. పరశురామా! బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులకు ఈ విధముగ నే శుద్ధి యగును. కొందరి మతమున వైశ్య-శూద్రులకు జననాశౌచము పదునై దు దినములు. బాలకుడు దంతోత్పత్తికి పూర్వమే మరణించినచో జననాశాచమునకు సద్యః శుద్ది కలుగును. దంత ములు వచ్చిన తరువాత చూడాకరణమునకు పూర్వము మరణించినచో ఏకరాత్రాశౌచము; యజ్ఞోపవీతధారణమునకు పూర్వమైనచో త్రిరాత్రాశౌచము; అనంతరము దశరాత్రైశాచము. మూడు సంవత్సరముల లోపు బాలుడుమరణించినచో శూద్రు నకు ఐదు దినముల తరువాత ఆశౌచనివృత్తి. మూడు సంవత్సరముల పిమ్మట నైనచో పదునొక దినముల తరువాతను, ఆరు వర్షములు దాటిన తరువాత నైనచో ఒక మాసము తరువాతను నివృత్త మగును. చూడాకర్మ జరుగ ని కన్య మరణించి నపుడు ఒక రాత్రి మరణాశౌచ మగును. చూడాకర్మ జరిగిన పిమ్మట నైనచో బంధువులకు మూడు దినముల పిమ్మట శుద్ధి యగును. వివాహిత స్త్రీల మరణాశౌచము పితృకులమువారికి ఉండదు. తండ్రి యింటిలో పుత్రిక బిడ్డను కన్నచో ఆ జాతాశౌచము ఒక్క రాత్రిమాత్రమే ఉండును. ఆ శ్రీ మాత్రము పది రోజుల తరువాత శుద్ధురాలగును. వివాహితకన్య పితృగృహమున మరణించినచో పితృకులమువారికి అశౌచము మూడు రాత్రు లుండును. సమానఅశౌచమునకు ముందు శుద్ధి చేసికొనవలెను, అసమానాశాచమునకు అనంతరము చేసికొనవలెను, అని ధర్మరాజు చెప్పెను.
దేశాంతరసః కృత్వా తు కుల్యానాం మరణోద్భవౌ.
యచ్ఛేషం దశరాత్రస్య తావదేవశుచిర్భవేత్ ।
అతీతే దశరాత్రే తు త్రిరాత్రమశుచిర్భవేత్.
తథా సంవత్సరేలితే స్నాత ఏవ విశుద్యతి ।
మాతామహే తథాతీతే హ్యాచార్యే చ తథా మృతే.
రాత్రిభిర్మా సతుల్యాభిర్గర్భస్రావే విధనమ్ ।
సపిణే బ్రాహ్మణే వర్షాః సర్వ ఏవావి శేషతః.
దశరాత్రేణ ధ్యక్తి ద్యాద హేన భూమిపః ।
వైశ్యా వద న రూద్రా మాసేన భార్గవ.
ఉచ్ఛిష్టసన్నిధాపకం తథా పిఱ్ఱం నివేడయేల్ ।
కీర్తయేచ్చ తథా తగ్య నామ గోత్ర సమాహితః.
భుక్త వత్సా ద్విజేష పూజితేమ ధనేన చ ।
విసృష్టాక్షతతో యేము గోత్రనామానుకి గ్రనే.
చతుర జ్ఞుల విస్తారం తప్టాతం తావదన రమ్ ।
వితస్తి దీర్ఘం కర్తవ్యం వికరూణాం తథాత్రయమ్.
వీకరూణాం సమీ పే చ జ్వాలయేజ్జ్వలనత్రయమ్।
సోమాయ వహ్నయే రామ యమాయ చ సమాసతః.
దేశాంతరములో నున్న వాడు జాతమరణాశౌచములను విన్న చో పది రోజులలో మిగిలిన రోజులకు మాత్రమే ఆశౌచము పట్టవలెను. పది రోజుల తరవాత విన్న చో మూడు రోజులు పట్టవలెను. సంవత్సరము దాటిన తరువాత విన్న చో స్నానమాత్రముచే శుద్దుడగును. మాతామహుడు గాని, ఆచార్యుడు గాని మరణించినచో మూడు రాత్రులు ఆశా చము పరశురామా! గర్భస్రావము ఎన్నవ మాసమున జరిగినదో అన్ని రాత్రులు గడచిన పిమ్మట స్త్రీకి శుద్ధి యగును. సపిండ బ్రాహ్మణకులమునందు మరణాశౌచము వచ్చినచో అందరికిని పది రోజులలో శద్ధి, క్షత్రియులకు పదునొకండు రోజులలోను, వైశ్యునకు పదునైదు రోజులలోను, శూద్రునకు ఒక మాసమునకును శుద్ధి (శ్రాద్దమునందు) ఉచ్చిష్ట సమీపమున వేదిని ఏర్పరచి, దాని సంస్కారము చేసి, దాని పై కుశ లు పరచి, కుశముల పైననే పిండప్రదానము చేయవలెను. ఆ సమ యమున ఏకాగ్రచిత్తు డై పితరుల నామగోత్రములు చేప్పుడు పిండప్రదానము చేయవలెను. బ్రాహ్మణులు భుజించిన తర వాత వారికి ధన మిచ్చి సత్కరించి, పూజించి, నామగోత్రోచ్చారణపూర్వకముగ అక్షతసహితజలము విడువవలెను. నాలుగు అంగుళముల వెడల్పు, ఆంతే లోతు, గల జానెడు గొయ్యి తవ్వి అచట మూడు వికరువులు తయారు చేసి, వాటి దగ్గర మూడు అగ్ను లను ప్రజ్వలింపచేయవలెను.
జుహుయాదాహుతీ సమ్యక్సర్వత్రైవ చతుస్రయః।
పిణ్డనిర్వాపణం కుర్యా తాగ్వదేవ పృథక్ పృథక్.
అన్నేన దధ్నా మధునా తథా మాం సేన పూరయేత్ ।
మధ్యే చేద ధీమాసః స్యాతుర్యాదభ్యధికం తు తత్.
అథవా ద్వాదశా హేన సర్వ మేతత్సమాపయేల్ ।
సంవత్సరస్య మధ్యే చ యది స్యాదధి మాసకః.
తదా ద్వాదశ కే శ్రాద్దే కార్యం తదధికం భవేత్ ।
సంవత్సరే సమాప్తీ తు శ్రాద్ధం శ్రాద్ధవదాచరేత్.
ప్రేతాయ తత ఊర్ధ్వం చ తస్యైవ పురుషత్రయే ।
పిజ్జాన్వినిర్వ పేత్తద్వచ్చతురస్తు సమాహితః.
సంపూజ్య దత్త్వా పృథివీ సమానా ఇతి చాప్యథ ।
యోజయేతేత పిఱ్ఱం తు పిణేష్వన్యేషు భార్గవ ।
ప్రేతపాతం చ పాతేషు తథైవ వినియోజయేత్ ।
పృథక్ పృథక్ ప్రకర్త వ్యం కర్మైతత్కర్మపాత్ర కే.
మగ్ర వర్ణమిదం కర్మ శూద్రస్య తు విధీయతే ।
సపిండీకరణం స్త్రీణాం కార్యమేవ తదా భవేత్.
శ్రాద్ధం కుర్యాచ్చ ప్రత్యబ్దం ప్రేతే కుమ్బాన్న మబ్దకమ్ ।
గజ్గాయాః సికతాధారా యథా వర్షతి వాసవే.
శక్యా గణయితుం లో కే న త్వతీతాః పితామహా ।
కాలే సతతగే గైర్యం నాస్తి తస్మాత్రియాం చరేత్.
వాటి అన్నింటియందును మూడేసి, లేదా నాలుగేసి హోమములు చేయవలెను. పిదప అచట వెనుకవలెనే వేరు వేరుగా పిండముల నీయవలెను. పిండములను అన్న ము, పెరుగు, తేనె, మినుగులు వీటితో చేయవలెను. సంవత్సరము మధ్య అధిక మాసము వచ్చినచో దాని కొక పిండము అధికముగా చేయవలెను. లేదా పండ్రెండు మాసముల మాసిక శ్రాద్దము లన్నియు పండ్రెండవ రోజుననే పూర్తి చేయవలెను. ఆ సంవత్సరమునందు అధిక మాసము రానున్నచో ద్వాదహశ్రాద్ధదినమునందే ఆమాసముకొరకై ఒక పిండము అధికముగా ఇవ్వవలెను. సంవత్సరము పూర్తి యైన పిమ్మట శ్రాద్ధమును సామాన్య శ్రాద్ధము వలెనే చేయవలెను. సపిండికరణ శ్రాద్ధమునందు ప్రేతకు పిండము వేరుగా నిచ్చి, పిదప మూడు తరముల పితరులకుశ్రీమదగ్ని మహాపురాణము మూడు పిండములు వేరువేరుగా ఇవ్వవలెను. ఈ విధముగా నాలుగు పిండములను ఏకాగ్రతతో ఇవ్వవలెను. పరశురామా! పిండముల పూజ చేసి, దానము చేసి, “పృథివీతే పాత్రమ్” “యే సమానాః” ఇత్యాదిమంత్రమును పఠించుచు యథోచితకర్మ చేసి, ప్రేతపిండమును మూడు భాగములు చేసి, వాటిని వరుసగా పితృ - పితామహ - ప్రపితామహాపిండములందు కలప వలేను. అంతకు ముందు ప్రేతార్ఘ్య పాత్రలను పిత్రాద్యర్ఘ్య పాత్రలతో కలిపివేయవలెను. ఈ రెండు పనులు వేరు వేరుగ చేయుట మంచిది. శూద్రునకు ఈ శ్రాద్ధకర్మ మంత్రరహితముగ చేయవలెను. స్త్రీల సపిండీకరణమును ఆ సమయమునందు ఈ విధముగనే చేయవలెను. పితృదేవతలకు ప్రతి సంవత్సరము శ్రాద్దము చేయవలెను. ప్రేమకు మాత్రము సాన్నోదకకుంభ దానము ఒక సంవత్సరము పాటు చేయవలెను. వర్షాకాలమునందు గంగానదిలోని ఇసుక లెక్క పెట్టవచ్చునేమో కాని అతీతులగు పితరులను లెక్క పెట్ట శక్యము కాదు. కాలము నిరంతరగమన శీలము. స్థిరత్వ మనునది కాలమునం దేన్నడును ఉండదు. అందుచే కర్మలను తప్పక చేయవలెను.
దేవత్వే యాతనాస్థానే ప్రేతః శ్రాద్ధం కృతం లభేత్ ।
నోపకుర్యాన్నరః శోచన్ పేతస్యాత్మన ఏవవా.
భృగ్వగ్నిపాళ కామోభిర్మృతానామాత్మఘాతినామ్ ।
పతితానాం చ నోశాచం విద్యుచ్ఛక్తహతాశ్చ యే.
యతివ్రతి బ్రహ్మ చారిసృపకారుక దీక్షితాః ।
రాజాజ్ఞాకారిణో యే చ స్నా యాద్వై పేతగామ్యపి.
శితి మైథునే కటధూమే చ సద్యః స్నానం విధీయతే ।
ద్విజేననిర్ఘ రేత్ర్పేతం శూద్రేణ తు కథడ్చాన.
న చ శూద్రం ద్విజేనాపి తయోర్దోషో హి జాయతే ।
అనాథవిప్ర పేతస్య వహన్త్స్వ ర్గలోక భాక్.
సంగ్రామే జయమాప్నోతి పేతేనాధే చ కాష్టదః ।
సంకల్ప్య బాన్లవం పేతమపసవ్యేన లాం చితిమ్.
పరిక్రమ్య తతః స్నానం కుర్యుః సర్వే సవాససః ।
ప్రేతాయ చ తథా దద్యుశ్రీం శ్రీం శ్చైవోద కాంజలీన్.
ద్వార్యశ్మని పదం దత్త్వా ప్రవి శేయున గృహమ్,
ఆక్షతాన్ని ఓ పేద్వహ్నౌ నింబపత్రం విదశ్య చ.
పృథక్ శయీరన్ భూమౌ చ క్రీడలఘ్వాతనో భవేత్।
ఏకః పిజ్జా దశా హే తు శ్మశ్రుకర్మకరః శుచిః .
సిద్దార్దకై స్త్రీ లైర్విద్వాన్మజ్జీద్వా సోమ్బరం దధత్ ।
అజాతదనే తనయే శిశా గర్బమృతే తథా.
కార్యె నై వాగ్ని సంస్కారౌ నైవ దాస్యోదక క్రియా ।
చతుర్రే చ దినేకార్యస్తథాస్థాం చైవ సంచయః.
అస్థిస ఞ్చయనాదూర్ధ్వమంగస్పరో విధీయతే.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శావా శౌచాదికం నామ సప్తపఞ్చాశదుత్తరశతతమోఽధ్యాయః.
మరణించిన వాడు దేవత్వమును పొంది యున్నను, నరకములో శ్రాద్ధమును ఆచటనే తప్పక పొందును. మరణించిన వానిని గూర్చి ఏడ్చువాడు తనకు కాని, మరణించిన వానికిగాని ఉపకారము చేసినవాడు కాజాలడు. పర్వతము నుండి దుమికి, ఆగ్నిలోపడి, ఉరి వేసికొని, నీటిలో పడి, ఆత్మహత్యచేసికొన్న వారి మరణాశౌచము బంధువులకు తగలదు. పిడుగుపడి గాని, యుద్ధములో శస్త్రఘాతమువలన గాని మరణించినవారి వలన గూడ మరణా శాచము ఉండదు. యతులకును, యజ్ఞదీక్షితులకును, రాజాజ్ఞాపాలకులకును ఆశాచ ముండదు. వీరు శవయాత్రలో వెళ్ళినచో స్నానముచే గుద్దు లగుదురు. మైథునము తరవాతను జ్వలించుచున్న శవముయొక్క ధూమము తగిలినను వెంటనే స్నానము చేయవలెను. మరణించిన బ్రాహ్మణుని ఈడుని చేత మోయించగూడదు. అట్లే శూద్రుని బ్రాహ్మణుని చేత మోయించగూడదు. అట్లు చేయుటచే - ఇద్దరికిని దోషము. అశబ్రాహ్మణశ వమును మోసి అంత్యేష్టికి తీసికొని వెళ్ళినవాడు స్వర్గమము పొందును. అనాథ ప్రేత శంస్కారార్థమై కాస్ట్ మిచ్చువాడు యుద్ధమునందు విజయము పొందును. శవమును చితిపై ఉంచి, దహించి, బంధువులు చితికి అపసవ్యంగా పరిక్రమణము చేసి, సచేలస్నానము చేసి, ప్రేతనిమిత్తము మూడేసి పర్యాయములు ఇలాంజలి ఇవ్వ వలెను. గృహద్వారమునందు మొదట తాతిపై పాదములుంచి ఆగ్ని లో ఆక్షతలు వేసి, వేపాకులు నమలి, ఇంటిలో ప్రవేశించవలెను. అందరికి దూరముగా చాప వేసికొని నిద్రించవలెను. ఆ కుటుంబములోని వారు ఆ రోజున కొన్న ఆహారమును స్వల్పముగా భుజించవలెను. పది రోజులవరకును రోజుకు ఒక్కొక్కటి చొప్పున పిండము నీయవలెను. పడవ రోజున ఒక పిండము నిచ్చిన తరువాత క్షారము చేయించుకొనుటచే పరిశుద్దుడగును. పదవ రోజున ఆవాలను, తిలలను శరీర మునకు పూసుకొని, నీటిలో మునిగి స్నానము చేసి నూతన వస్త్రములు ధరించవలెను. దంతోత్పత్తి కి పూర్వమే మరణించిన బాలునకును, గర్భస్రావముచే పోయిన శిశువునకును దాహసంస్కార జలాంజలులు ఉండవు. శవదాహానంతరము నాల్గవ రోజున ఆస్థిసంచయము చేయవలెను. ఆస్థి సంచయము తరువాత అంగ స్పర్శ విహితము.
అగ్ని మహాపురాణమునందు శాతాశౌచాదిక మను నూటఏబదిఏడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 157 of the Agni Purāṇa is as follows:
Ritual impurity specifically arising from contact with or proximity to a corpse (śava) is systematically described. Agni differentiates between āśauca arising from the death of sapiṇḍas in one's own home, death at a distance reported by messenger, and accidental contact with a stranger's corpse. The purification procedures range from a bath with one's clothes on for minimal contact through the full ten-day āśauca for close kin. The chapter specifies which ritual acts—pūjā, homa, tarpana, and vedic recitation—may not be performed during the āśauca period and the manner of recommencing after śuddhi.