ఆగ్ని రువాచః-
తృతీయావ్రతాన్యాఖ్యాస్యే భుక్తిముక్తి ప్రదాని తే ।
లలితాయాం తృతీయాయాం మూలగౌరీ వ్రతం శృణు.
తృతీయాయాం చైత్రశు క్లీ హ్యూడా గౌరీ హరేణ హి ।
తిలైః స్నాత్కోర్చయేచ్ఛమ్భుం గౌర్యా హేమఫలాదిభిః.
నమోస్తు పాటలాయైవ పాదౌ దేవ్యాః శివస్యచ ।
శివాయేతి చ సంకీర్త్య జయాయై గుల్ఫయోర్యజేత్.
త్రిపురఘ్నాయ రుద్రాయ భవాన్యై జయోర్ద్వయోః।
శివం రుద్రాయేశ్వరాయ విజయాయై చ జానునీ .
ఈశాయేతి కటిం దేవ్యాః శంకరాయేతి శంకరమ్ ।
కుక్షద్వయం చ కోటవ్యై శూలినం శూలపాణయే.
మజలాయై నమస్తుభ్యముదరే చాభిపూజయేత్ ।
సర్వాత్మనే నమో రుద్రమైన్యై చ కుచద్వయమ్.
శివం దేవాత్మనే తద్వద్దాయిన్యై కణమర్చయేత్ ।
మహాదేవాయ శివమనన్తాయై కరద్వయమ్.
త్రిలోచనాయేతి హరం బాహుం కొలానలప్రియే ।
సౌభాగ్యాయే మ హేళాయ భూషణాని ప్రపూజయేత్.
అశోకమధువాసిన్యై చేశ్వరాయేతి చోష్టకౌ ।
చతుర్ముఖప్రియా చాన్యం హరాయ స్థాణవే నమః.
నమోర్ధ నారీశహరమమితాజ్గ్చైచ నాసికామ్ ।
నమ ఉగ్రాయ లో కేశం లలితేతి పునర్బ్రువౌ.
అగ్ని దేవుడు చెప్పెను. ఇపుడు భుక్తి ముక్తి ప్రడము లగు తృతీయా వ్రతములను చెప్పెదను. లలితాతృతీయ నాడు చేయు మూల గౌరీ వ్రతమును వినుము. పరమేశ్వరుడు చైత్ర శుక్ల తృతీయ దివసమున పార్వతిని వివాహ మాడెమ. అందుచే ఆ దివసమున తిలమిశ్ర జలముతో స్నానమాచరించి. పార్వతీసమేతుడగు పరమేశ్వరుని బంగారము, ఫలములు మొదలగు వాటితో పూజించవలేను. నమోస్తు పాటలాయే అని చెప్పి పార్వతి పాదములను, శంకరుని పాదములను వూజించవలేను. శివాయ నమః అని శివుని, జయాయై నమః అని పార్వతిని అర్చించవలెను. త్రిపురఘ్నాయ నమః “భవాన్యై నమః” అని చెప్పుచు క్రమముగా శివపార్వతుల జమలను పూజించవలెను. “రుద్రేశ్వరాయ నమః “విజయాయై నమః” అని చెప్పుచు శివపార్వతుల మోకాళ్ళు పూజించవలెను. “ఈశాయై నమః” “శంకరాయ నమః” ఆని చెప్పుచు వరుసగా పార్వతీ శివుల కటి భాగమును, “కో రవ్యై నమః “ “శూలపాణయే నమః” అని చెప్పుచు కుక్షి ప్రదేశములను, “మజ్గలాయై నమః” “తుభ్యం నమః” అని చెప్పుచు వారి ఉదరమును పూజించవలెను. “సర్వాత్మనే నమః” “ఈశాన్యై నమః” అని చెప్పుచు వరుసగా శివపార్వతుల స్తములను, దేవాత్మనే నమః” “ప్రోదిన్యై నమః” అని చెప్పుచు కంఠప్రదేశ మును, “మహాదేవాయ నమః” అనన్తాయై నమః” అని హస్తములను, “త్రిలోచనాయ నమః” “కాలానల ప్రియాయై నమః” అని భుజములను, “మహేశాయ నమః”, “సౌభాగ్యాయై నమః” అని వారి ఆలంకారము లను పూజించవలెను. పిదప “అశోక మధువాసిన్యై నమః” “ఈశ్వరాయ నమః” అని చెప్పుచు వరుసగా పార్వతీ పరమేశ్వరుల ఓష్ఠములను, “చతుర్ముఖ ప్రియాయై నమః” “హరాయ స్థాణవే నమః” అని ముఖములను పూజించవలేను. “అర్ధనారీశాయ నమః” “అమితాజ్ఞాయై నమః” అని వరుసగ శివపార్వతుల నాసికలను, “ఉగ్రాయ నమః” “లలితాయై నమః” అని కనుబొమ్మలను పూజించవలెను.
శర్వాయ పురహర్తారం వాసన్యై చైవ తాలుకమ్ ।
నమః శ్రీకణ్ఠనాథాయై శితికజ్జాయ కేశకమ్.
భీమోగ్రాయ సురూపియ్యై శిరః సర్వాత్మనే నమః ।
మల్లికాశోక కమలకున్దం తగరమాలతీ.
కదమ్బకరవీరం చ బాణమష్ణనకుజ్కుమమ్ ।
సిన్హువారం చ మా సేషు సర్వేము క్రమశః స్మృతమ్.
ఉమామహేశ్వరౌ పూజ్య సౌభాగ్యాష్టకమగ్రతః ।
స్థాపయేదతనిష్పావకుసుమ్భక్షీర జీవకమ్.
తరురా జేములవణం కుస్తుమ్చురుమథాష్టమమ్ ।
చైత్రే శృణోదకం ప్రాళ్య దేవదేవ్యగ్రతః స్వ పేత్.
ప్రాతః స్నాత్వా సమభ్యర్చ్య విప్రదామ్పత్యమర్చయేత్ ।
తదష్టకం ద్విజే దద్యాల్లలితా ప్రీయతాం మమ.
శృణోదకం గోమయం చ మన్గారం బిల్వపత్రకమ్ ।
కుశోదకం దధి క్షీరం కార్తికే పృషదాజ్యకమ్.
గోమూత్రాజ్యం కృష్ణతిలం పజ్చగవ్యం క్రమాశనమ్ ।
లలితా విజయా భద్రా భవానీ కుముదా శివా.
వాసుదేవీ తథా గౌరీ మజలా కమలా సతీ ।
చైత్రాదౌ దానకాలే చ ట్రయతామితి చారయేత్.
సల మేకం వరిత్యాజ్యం వ్రతానే శయనం దదేత్ ।
ఉమామహేశ్వరం ప్రేమం వృషభం చ గవా సహ.
గురుం చ మిథునానకార్చ్య వస్రాద్యైర్భు క్తిముక్తిభాక్ ।
సౌభాగ్యారోగ్యరూపాయుః సౌభాగ్యశ యనవ్రతాత్.
“శిర్వాయ నమః” “వాసన్యై నమః” అని చెప్పుచు వరుసగ శివపార్వతుల తాలుప్రదేశమును పూజించవలెను. “శ్రీకణనాధాయై నమః” “శితిక జ్ఞాయ నమః” అని చెప్పుచు వరుసగా పార్వతీ పరమేశ్వరుల కేశపాశములను పూజించవలెను. “భీమోగ్రాయ నమః” “సురూపియ్యై నమః” అని చెప్పుచు శివపార్వతుల శిరస్సులను పూజించవలెను. “సర్వాత్మనే నమః” అని చెప్పి పూజను ఉపసంహరించవలెను. చైత్రము మొదలు పండ్రెండు మాసములందు వరుసగా మల్లిక, అశోకము, కమలము, కుందము, తగరము, మాలతి, కదంబము, కరవీరము, బాణము, ఆమ్లానము, కుంకు మము, సిందువారము - ఈ పుష్పములతో శివపూజ చేయవలెను. ఉమామహేశ్వర పూజానంతరము వారి ఎదుట - మృతమిశ్ర నిష్పావము, కుసుంభము దుగ్దము, జీవకము, దూర్వలు, చెరకు కర్ర, ఉప్పు, కొత్తిమిరి అను ఎని మిది సౌభాగ్యద్రవ్యములను ఉంచవలెను. చైత్రమాసమున పర్వత శిఖరాగ్ర జలము త్రాగి పార్వతీ పరమేశ్వరుల సం ముఖమున శయనించవలెను. ప్రాతః స్నానముచేసి, పార్వతీపరమేశ్వరుల పూజ చేసి, బ్రాహ్మణ దంపతులను అర్చించి “లలితా ప్రియతాం మమ” అని చెప్పుచు ఆ అష్ట సౌభాగ్యద్రవ్యములను దానము చేయవలెను, వ్రతమాచరించువాడు, చైత్రాగిమాసములందు వరుసగా వ్రతదినములలో, పర్వత శిఖర జలమును, గోమయమును, మందారమును, బిల్వపత్రము లను, ఘృతమిశ్రమగు పెరుగును, గోమూత్రమును, మృతమును. నల్లని తిలలను, పంచగవ్యములను భుజించవలెను. సౌభాగ్యాష్టకము దానము చేయు సమయమున, చైత్రాదివసములందు, వరుసగా “ప్రీయతాం మమ” అనుదానికి “లలితా, విజయా, భద్రా, భవానీ, కుముదా, శివా, వాసుదేవీ, గౌరీ, మంగళా, కమలా, సతీ” అనునవి చేర్చవలెను. వ్రతము ముగిసిన తరువాత ఏదైన ఒక ఫలమును పరిత్యజించవలెను. గురువునకు తలగడలతో గూడిన శయ్యను, స్వర్ణ నిర్మిత మగు ఉమామహేశ్వరమూర్తి ని, గోసహిత వృషభమును దానము చేయవలెను. గురువునకును, బ్రాహ్మ ణదండ తులకును వస్తాదులతో సత్కారము చేసిన వాడు భుక్తిముక్తులను పొందును. “సౌభాగ్యశయనము” అను ఈ వ్రతమును ఆచరించుటచే మనుష్యుడు సౌభాగ్య - ఆరోగ్య - రూప - దీర్ఘాయువులను పొందును.
నభ స్యే వాథ వైశాఖే కుర్యాన్మార్గశిరస్యథ ।
శుక్లపక్షే తృతీయాయాం లలితాయై నమో యజేత్.
ప్రతిపక్షం తతః ప్రార్చవతా నే మిథునాని చ ।
చతుర్వింశతిమభ్యర్చ్య వస్త్రాద్యైర్భుక్తి ముక్తిభాక్.
ఉక్రో మారో ద్వితీయోయం సౌభాగ్యవ్రతమావదే ।
ఫాల్గునాదితృతీయాయాం లవణం యస్తు వర్జయేత్ .
సమాప్తే శయనం దద్యాద్ధృహం చోపస్కరాన్వితమ్ ।
సంపూజ్య విప్రమిథునం భవానీ ప్రీయతామితి.
సౌభాగ్యం తృతీయోక్తా గౌరీలోకాదిదాయినీ ।
మా ఘే భాద్రే చ వైశాఖేతృతీయా వ్రతకృత్తథా.
దమనక తృతీయాకృతైతే దేవీం దమన కైర్యజేత్ ।
ఆత్మతృతీయా మార్గస్య ప్రార్చ్యేచ్చాభోజనాదినా.
గౌరీ కాలీ హ్యుమా భద్రా దుర్గా కా నిః సరస్వతీ ।
వైష్ణవీ లక్ష్మికి ప్రకృతిః శివా నారాయణి క్రమాత్.
మార్గతృతీయామారభ్య సౌభాగ్యం స్వర్గమాప్నుయాత్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే తృతీయావ్రతాని నామాష్టసప్తత్యధిక శతతమోధ్యాయః.
భాద్రపద - వైశాఖ - మార్గశీర్ష శుక్ల తృతీయలందు గూడ ఈ వ్రతము చేయవచ్చును. “లలితాయై నమః” అని చెప్పుచు పార్వతీపూజ చేయవలెను. ప్రతి పక్షమునందును ఈవిడముగా పూజించి వతాంతమునందు ఇరువది నలుగురు దంపతులకు వస్త్రదానము చేయువాడు భుక్తి ముక్తులను పొందును. ఇది సౌభాగ్యశయన వ్రతము రెండవవిధి. ఇపుడు సౌభాగ్యవ్రతమును గూర్చి చెప్పెదను. ఫాల్గుణాది మాసముల శుక్ల పక్ష తృతీయలయందు వ్రతము చేయువాడు ఉప్పు పరిత్య జించవలెను. వ్రతము సమాప్తమైన పిమ్మట బ్రాహ్మణదంపతి పూజ చేసి, “భవానీ ప్రియతామ్” అని చెప్పి శయ్య, సంపూర్ణ సామగ్రి చేర్చి గృహము దానము చేయవలెను. ఇది సౌభాగ్య తృతీయా వ్రతము, ఇది పార్వత్యాదిలోక ముల నిచ్చును. మాఘ - భాద్రపద - వైశాఖ తృతీయలందు గూడ ఈ విధముగనే చేయవలెను. చైత్రమునందు దమనక తృతీయావ్రతమాచరించి దమనక పుష్పముతో పార్వతిని పూజించవలెను. మార్గశీర్షమున ఆత్మ తృతీయావ్రత మాచరించ వలెను. దానియందు పార్వతీ పూజ చేసి బ్రాహ్మణులకు యథేచ్చగా భోజనము పెట్టవలేను మార్గశీర్ష తృతీయతో ప్రారంభించి, క్రమముగా పౌషాదిమాసములందుపై వ్రతమును ఆచరించి “గౌరీ, కాలీ, ఉమా, భద్రా, దుర్గా, కాంతి, సరస్వతీ వైష్ణవీ, లక్ష్మీ, ప్రకృతి, శివా, నారాయణీ” అను నామములకు ప్రీయతామ్ ఆని చేర్చి చెప్పవలెను. ఈ విధముగా వ్రతము చేయువాడు సౌభాగ్యమును స్వర్గమును పొందును.
అగ్ని మహాపురాణమునందు తృతీయా వ్రతవర్ణనమను నూటడెబ్బది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 178 of the Agni Mahā Purana is as follows:
Vratas on the third tithi, primarily associated with Gaurī and Śiva's union, are described. The Mūla-Gaurī vrata performed on Caitra-śukla-tṛtīyā commemorates Śiva and Pārvatī's wedding day; it involves a tila-mixed bath, and the aṅga-pūjā of the divine couple maps specific mantras to each body part from pāda to śiras. Twelve monthly flowers from mallika to sindhuvāra form the seasonal offering cycle, and the Saubhāgya-aṣṭaka (eight auspicious items) is presented to Pārvatī. The Saubhāgya-śayana-vrata requires sleeping before Pārvatī's image and then worshipping a brāhmaṇa couple as Śiva-Pārvatī. Additional tṛtīyā forms—Damana-tṛtīyā, Ātma-tṛtīyā—are described, each with a different presiding form of Gaurī in the twelve-month cycle.