ఈశ్వర ఉవాచః-
శ్రీమతీం కుజ్జికాం వక్ష్యే ధర్మార్థాదిజయప్రదామ్ ।
పూజయేన్మూలమ శ్రేణ పరివారయుతేన వా.
ఓం ఐం హౌం శ్రీం ఖైం హేం హ స క్ష మ ల వ ర య ఊం భగవతి అమ్బి కీ హ్రీం హ్రీం క్షాం క్షాం మం క్రీం కుట్టి కే హీం ఓం జ ణ న మే ఆ మోరముఖి వాం ఛాం శ్రీం కిలికిలి క్రైం విచ్చే ఫ్యౌం ఓం క్రోం ఓం హ్రాం ఐం వజకుఱ్ఱని శ్రీం త్రైలోక్యాక రిణి హీం కామాణ ద్రావిణి హీం శ్రీం మహాకోక కారిణి ఐం హ్రీం క్రైం ఐం హ్రీం శ్రీం హ్రీం క్రైం నమో భగవతి క్రైం కుట్టి కే హీ హ్రీం క్రైం జ ణ మే అఘోరముఖి ఫ్రం భీం విచ్చే ఓం కిలి కిలి.
కృత్వా కరాళిన్యాసం చ సస్థావననమాచరేత్ ।
హమా జ్యోష్ణా తథా రౌడీ నన్దాత్రయమనుక్రమాత్.
కులవాగీశివిద్మహే మహాకాలితి ధీమహి ।
తన్న కౌలీ ప్రచోదయాత్.
మన్రాః పళ్చి ప్రణవాద్యా పాదుకాం పూజయామి చ ।
మధ్యేనామ చతుర్థ్యనం ద్వినవాత్మక బీజకాః.
నమోస్తావాథ షష్ట్యా తు సర్వే జేయా వదామి తాన్ ।
కౌలీశనాధో ముకులా జన్మతం కుబ్జకా తతః.
శ్రీకణ్ణనాథః కౌలేశో గగనానన్దనాథకః ।
చటులా దేవీ మైత్రేశీ కరాలీ తూర్ల నాధకః.
అతలదేవీ శ్రీ చన్హదేవీ త్యన్తో స్తత స్విమే ।
భగాత్మపుఙణదేవ మోహనీ పాదుకాం యజేత్ .
అతీతభువనానన్దరత్నా డ్యాం పాదుకాం యజేత్ ।
బ్రహ్మజ్ఞానాథ కమలా పకమా విద్యయా సహ.
విద్యాదేవీ గురు శుద్ది స్త్రీ శుద్ధిం ప్రవదామి తే ।
గగన్పటులి చాత్మా పద్మానన్లో మణిః కలా.
కమలో మాణిక్యకణో గగనః కుముద స్తథా ।
శ్రీపద్మో భైరవానన్లో దేవః కమలఇత్యత.
శివో భవోథ కృష్ణశ్చ నవ సిద్దాశ్చ షోడశ ।
తనపూరోధ గుల్మశ్చ శుభః కామోతిముక్తకః.
గజ్జో వీరః ప్రయోగోథ కుశలో దేవభోగకః ।
విశ్వదేవః ఖడ్గదేవో రుద్రో ధాతాసిరేవ చ.
ముద్రాస్ఫోటో వంకపూరో భోజః షోడశ సిద్దకాః ।
సమయాన్యస్తు దేహస్తు షోడా న్యా సేన య స్త్రీతః.
పరమేశ్వరుడు చెప్పేను : ఇపుడ, ధర్మార్థకామవిజయాదులను ప్రసాదించు కుల్దీకాదేవీ మంత్రము చెప్పెదము. మూలమంత్రముతో వరిజరసహితురా లగు ఈ దేవి పూజ చేయవలెను. “ఓం ఐం హ్రీం శ్రీం...... కిలికిలి” అనునది (మూలోకము) కుల్దీకామంత్రము - ఆంగన్యాసకరన్యాసములు చేసి సంధ్యావందనము చేయవలెను. వామా - జ్యేషా రౌద్రులు ముగ్గురు సంధ్యలు. “కాలవాగీశీ విద్మహే మహాకాలీతి ధీమహి తన్న కౌలీ ప్రచోదయాత్ అనునది కౌలీగాయత్రి. దీనిలో ఐదు మంత్రము లున్నవి. ప్రారంభమున ప్రణవము అంతమున నమః ప్రయోగించవలేను. మధ్య ఐదుగురు నాథుల పేర్లు, అంతమున “శ్రీ పాదుకాం పూజయామి” అని చేర్చవలేను. మధ్యయందు చతుర్థ్యంత మగు దేవతానామము చేర్చవలేను. ఈ విధముగ ఐదు మంత్రములలో ఒక్కొక్కటి దాదాపు పదునెనిమిది అక్షరములు కలిగి ఉండును. ఈ పేరు లన్నింటిని షష్ఠీ విభక్తిలో ప్రయోగించవలెను. ఈ విధముగ వాక్యయోజన చేసి ఈ మంత్రముల స్వరూపమును - తెలిసికొనవలెను. కౌలీశనాథ - శ్రీకంఠనాధ - కౌలనాథ - గగనానందనాథ - తూర్ణ నాధు లనువారు పంచనాధులు. వీరి పూజా మంత్ర వాక్యములు “ఓం కౌలీశనాధాయ నమస్తస్మై పాదుకాంపూజయామి” ఇత్యాది విధమున నుండవలెను. వీరితో పాటు, పుట్టుక నుండియు గూను ఉండుటచే కుట్టికా అను పేరు గల సుక లాదేవి, చటులాదేవి, వికరాలరూపము గల మైత్రశీదేవి అతలదేవి, శ్రీ చంద్రాదేవి అను ఐదుగురు దేవులను పూజించవలెను. వీరి పేర్లకు చివర దేవీ అని ఉండును. పూజామంత్రవాక్యములు”సుకలాదేవ్యై నమస్తస్యై భగాత్మ పుంగణ దేవమోహినీం పాదుకాం పూజయామి” ఇత్యాది విధమున ఉండును. చటులాదేవి పాదుకకు “ఆతీత భువనానన్దరత్నాథ్యాం” అను విశేషణము, మూడవ దేవిపాదుకకు “బ్రహ్మజ్ఞానాడ్యామ్” అను విశ్లేషణ మును, నాల్గవ దేవి పాదుకకు “కమలాడ్యామ్” అను విశేషణమును ఐదవ పాదుకకు “పరమ విద్యా డ్యామ్” అను విశేషణమును చేర్చవలేను. ఈ విధముగ విద్యా - దేవీ - గురువుల శుద్దికి త్రిశుద్ది” అని పేరు. గగనానంద - చటులి - ఆత్మానంద - పద్మానంద - మణి - కలా - కమల - మాణిక్యకంఠ - గగన - కుముద - శ్రీ పద్మభైరవానంద - కమలదేవ - శివ - భవకృష్ణులు అను పదునారుగురు నూతనసిద్ధులు, చండ్రపూర - గుల్మ - శుథకామ - అతిము క్షక వీరకంఠ - కుశల - దేవగక - విశ్వదేవ - ఇఢదేవ-రుద్ర-ధాతృ - ఆసి ముద్రిస్ఫోట - వంశపూర - భోజు లను పదునారుగురు సిద్దులు.
ప్రక్షిప్య మళ్లలే పుష్పం మధ్ధలాన్యథ పూజయేత్ ।
ఆనన్తం చ మహానాం చ సర్వదా శివపాదుకామ్.
మహావ్యాప్తిం చ శూన్యం చ పణతత్త్వాత్మమడ్డలమ్ ।
శ్రీకణ్ణనాథపాడుతాం శ జురానవకౌ యజేత్ .
కజ్జికాపూజా సదాశివః పిజలశ్చ భృగ్వానన్దశ్చ నాథకః ।
లాఙూలానన్దసంవర్తో మడ్డలస్థాన కే యజేత్.
శీ నైరృత్యే శ్రీమహాకాలః పినా కే చ మ హేస్ట్రోకః ।
ఖడ్గా భుజళో బాణశ్చ ఆసిః శబ్దకో వళః.
ఆజ్ఞరూపో నన్దరూపో బలిం దత్త్వా క్రమం యజేత్.
హీం ఖం ఖం హ్రూం బటు కాయ అరు అరు అర్షం పుష్పం ధూపం దీపం గన్ధం బలిం పూజాం గృష్ణ నమస్తుభ్యమ్. ఓం హ్రాం హ్రీం హ్రూం మేం క్షేత్రపాలాయ ఆవతర ఆవతర మహాకపిల జటాభార భాస్వర త్రినేత్ర జ్వాలాముఖ ఏ హ్యేపి గన్దం పుష్పం బలిపూజాం గృష్ణ గృష్ణ ఖః ఖః ఓం కః ఓం లః
ఓం మహాడామరాధిపతయే స్వాహా.
బలి ఒథ యజేత్ హీం హ్రూం హ్రాం శ్రీం వై త్రికూటకమ్.
వామే దక్షిణేహ్యగ్రీ యా మ్యే నిశానాథపాదుకాః ।
దకే తమోరినాథస్య హ్యగ్రీ కాలానలస్య చ.
ఉడ్డియాణం జాలన్దరం పూర్ణం వై కామరూపకమ్ ।
గగనానన్దదేవం చ స్వర్గానన్దసవర్గకమ్.
పరమానన్దదేవం చ సత్యానన్దస్వపాదుకామ్ ।
నాగానన్దం చవర్గాఖ్యము క్తం తే రత్నపళ్చాకమ్.
సౌమ్యే శివే యజేతట్కం సుర నాథస్య పాదుకామ్ 1
శ్రీమత్సమయకోటీశం విద్యాకోటీశ్వరం యజేత్.
కోటీశం బిన్దుకోటీశం సిద్దకోటీశ్వరం తథా ।
సిద్దచతుషమాగ్నేయ్యామనరీ శేశ్వరం యజేత్.
చక్రీశ నాథం కుర జేశం వృత్రేశం చన్దనాథకమ్ । యజేద్దస్థాదిభికైతాన్యామ్యేవిమలపజ్చకమ్.
యజేదనాదివిమలం సర్వజ్ఞవిమలం తతః ।
యజేద్యోగేశ విమలం సిద్ధాఖ్యం సమయాఖ్యకమ్.
వీరి దేహము కూడ షడ్విధన్యా సనియంత్రితమై ఆత్మతో సమానమగును. మండలము పై పుష్పములు చల్లి మండలపూజ చేయవలెను. అనంత - మహత్ - శివపాదూ . శూన్య - పంచతత్త్వాత్మకమండల - శ్రీకంఠనాథపాదుకా. శంకర - అనంతుల పూజ చేయవలెను. సదాశివ - పింగల - భృగ్వానంద.నాథసముదాయ - లాంగూలానంద - సంవ ర్తులను మండలస్థానమున పూజించవలేను. నైరృతియందు శ్రీమహాకాల - పినాకి - మహేన్ద - బడ్డ - నాగ - బాణ - అఘాసి - శబ్ద - వశ - ఆజ్ఞారూప - నందరూపములకు బలి ఇచ్చి క్రమముగా వాటిని పూజించవలెను. వటుకునకు ఆర్ఘ్య పుష్ప - ధూప - దీప - గంధ - బలులను క్షేత్రపాలునకు పుష్ప-బల్లులను సమర్పించవలేను. అపుడు “హీం ఖం ఖం... నమస్తుభ్యమ్” “ఓం హ్రాం హ్రీం ...... స్వాహా” అను (మూలోక్తము లగు) మంత్రములను వినియోగించవలెను. బలి చివర కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన, ఎదుట త్రికూటమును పూజించవలెను. ఇందుకు మంత్రము “హీం హ్రూం హోం శ్రీం త్రికూటాయ నమః” పిదప ఎడమ ప్రక్కన నిశానాథుని, కుడి ప్రక్కన తమోరినాథుని (సూర్యనాథుని), ఎడుట కాలానలుని పాదుకలను పూజించవలెను. పిదప ఉడ్డియాన - జాలంధర - పూర్ణగిరీ - కామరూపులను, గగనానంద దేవ వర్గసహితస్వర్గానదదేవ - పరమానందదేవ - సత్యానందదేవపాదుకా - నాగానందటేపును పూజించవలెను. ఈ విధముగ ‘వర్గము' అను పేరు గల పంచరత్నములను గూర్చి చెప్పబడినది. ఉత్తర ఈశాన్యములందు సుర నాధపాదుకను, సమయ కోటిశ్వరుని, విద్యాకోటీశ్వరుని, కోటీశ్వరుని, బిందు కోటీశ్వరుని, సిద్ధకోటీశ్వరుని పూజించవలేను. అగ్నేయమున నలుగురు సిద్ధులను, అమరీ శేశ్వర - చక్రీ శేశ్వర - కురంగేశ్వర - వృత్రీశ్వర - చంద్రనాథులను గంధాదిపంచోపచార ముతో పూజించవలెను. దక్షిణమున ఆది విమల - సర్వజ్ఞవిను - యోగ విమల - సిద్ధవిమల - సమయఎమలులను పూజించవలేను.
నైరృత్యే చతురో వేదాన్ యజేత్కన్దర్పనాథకమ్ ।
పూర్వాః శక్తీశ్చ సర్వాశ్చ కుబ్జకాపాదుకాం యజేత్.
నవాత్మ కేన మ శ్రేణ పజ్చప్రణవ కేన వా ।
సహస్రాక్షమనవగ్యం విష్ణుం శివం సదా యజేత్.
పూర్వాచ్చివాన్తం బ్రహ్మాదిం బ్రహ్మాజీ చ మ హేశ్వరీ ।
కౌమారీ వైష్ణవీ చైవ వారాహి శక్రక క్రికా.
చాముణా చ మహాలక్ష్మీః పూర్వాదీశా నమర్చయేత్ ।
డాకినీ రాకిణీ పూజ్యా లాకినీ డాకినీ తథా.
శాకినీ యాకినీ పూజ్యా వాయవ్యాదుగ్రషట్సు చ ।
యజేద్ధ్యాత్వా తతో దేవీం ద్వాత్రింశ ద్వర్ణకాత్మికామ్.
పణప్రణవ కేనాపి హీంకారేణాథవా యజేత్ ।
నీలోత్పలదలశ్యామా షడ్వక్రా షటకారికా.
చిచ్చ క్తిరష్టాదళాఖ్యా బాహుద్వాదశసంయుతా ।
సింహాసనసుఖాసీనా పేతపద్మోపరి స్థితా.
కులకోటిసహస్రాడ్యా కర్కోటో మేఖలాస్థితః ।
తక్షణోపరిష్టాచ్చ గలే హారశ్చ వాసుకికి.
కాలికః కర్ణయోర్వస్యాః కూర్మః కుళ్లలమఱ్ఱలః ।
భ్రువోః పద్మో మహాపద్మో వామే నాగః కపాలకః
ఆక్షసూత్రం చ ఖట్వాజం జం పు స్తం చ దక్షిణే ।
త్రిశూలం దర్పణం ఖడం రత్న మాలాంకుశం ధనుః.
శ్వేతమూర్ధ్వముఖం దేవ్యాహ్యూర్థం శ్వేతం తథాపరమ్ ।
పూర్వాస్యం పాడ్గురం క్రోధి దక్షిణం కృష్ణవర్ణకమ్.
హిమకున్హేన్దుభం సౌమ్యం బ్రహ్మా పాదస్థలే స్థితః ।
విష్ణుస్తు జఘనే రుద్రో హృది కణే తథేశ్వరః.
సదాశివో లలాటే స్యాచ్ఛివ స్తస్యోర్ధ్వతః స్థితః ।
ఆఘూర్జితా కుబ్జ కైవం ధ్యేయా పూజాదిక ర్మసు.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నే యే యుద్ధ జయార్ణవే కుబ్జికాపూజా సామ చతుశ్చత్వారింశదధికశతత మోఽధ్యాయః.
నైరృతియందు నాలుగు వేదమును, కందర్పనాథుని, వెనుక చెప్పిన అందరు శక్తులను, కుట్టిక శ్రీపాదుక ను పూజించవలెను. కుబ్జకాపూజ “ఓం హ్రాం హ్రీం కుట్టికాయై నమః” అను నవాక్షర మంత్రముతో గాని, లేదా కేవలము పంచప్రణవరూప మగు మంత్రముతో గాని చేయవలెను. తూర్పు మొదలు ఈశాన్యమువరకు బ్రహ్మ-ఇంద్ర-అగ్నియమనిరృతి-ఆనంతవరుణ-వాయు కుబేర ఈశాను లను దశ దిక్పాలకులను పూజించవలెను. సహస్రనేత్రు డగు ఇద్రుని, అనవద్యు డగు విష్ణువును, శివుని సదా పూజించవలెను. తూర్పు మొదలు ఈశాన్యము వరకును ఎనిమిది దిక్కులలో క్రమముగా బ్రహ్మాజీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహీ, ఐంద్రీ, చాముండా, మహాలక్ష్ములను పూజించవలెను. వాయవ్యము మొదలు ఆరు ఉగ్ర దిక్కులందు వరుసగ డాకినీ–రాకిణీలాకిసీకాకినీ-శాకినీ–యాకినులను పూజించవలెను. పిదప ధ్యానపూర్వకముగ కుట్టికాదేవిని పూజించవలెను. ముప్పది రెండు వ్యంజనాక్షరములు ఆమె శరీరము. ఆమెను పూజించునపుడు ఐదు ప్రణవములను గాని, 'ప్రీం' గాని, బీజరూపమున ఉచ్చరించవలెను. ఆమె దేహచ్చాయ నీలక మలదలశ్యామము. ఆరు ముఖము లుండును. వాటి కాంతి గూడ ఆరు విధముల నుండును. ఆమె చైతన్య శ క్తిస్వరూపురాలు. అష్టాదశాక్షర మంత్రముచే ప్రతిపాదింపబడునది. పండ్రెండు భుజము లుండును. సుఖముగా పింహాసనముపై కూర్చుండును. కర్కోటకుడు ఆమెకు మేఖల. తక్షకుడు శిరస్సుపై నుండును. వాసుకి కంఠహారము. ఆమె రెండు చేవులకును, కులికుడు, కూర్ముడు అనునాగములు కుండలముగా నున్నవి. రెండు కనుబొమ్మలపై పద్మమహాపద్మము లను నాగము లున్నవి. వామహస్తములందు నాగ –కపాల-అక్షసూత్రఖట్వాంగ, శంఖపుస్తకములు, దక్షిణ హస్తములందు త్రిశూలదర్పణఖడ్గ-రత్నమాలా ఆంకుశ ధనుస్పులు ఉండును. ఆ దేవి ముఖములు రెండు పై వైపునకు ఉండును. వాటిలో ఒకటి పూర్తిగా తెల్లగాను, రెండవది సగము తెల్లగాను ఉండును. తూర్పు వైప ముఖము పాండువర్ణము గలది. దక్షిణము వైపు ముఖము కోపముతో నున్నట్లు కనబడును. పశ్చిమ ముఖము నల్లగాను, ఉత్తరముఖము హిమ-కుంద చంద్రుల వలె తెల్లగాను ఉండును. ఆమే చరణతలమున బ్రహ్మయు, జఘనమున విష్ణువు, హృదయమున రుద్రుడు, కంఠమునందు ఈశ్వరుడు, లలాటమునందు సదాశివుడు ఆమె పై భాగమునందు శివుడును ఉందురు. కుట్టికాదేవి ఊగు తున్నట్లు ఉండును. పూజాదిసమయములందు కుబ్లికను ఈ విధముగ ధ్యానించవలెను
అగ్ని మహాపురాణమునందు యుద్ధజయార్ణవమున కుబ్జికాపూజావర్ణన మను నూట నలుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 144 of the Agni Mahā Purana is as follows:
The second chapter continues and completes the Kubjikā-pūjā sequence with the outer āvaraṇa worship and the concluding rites. Agni describes the outer ring of directional deities, the bali-offerings specific to Kubjikā's retinue, and the fire rite (kubjikā-homa) using red-oleander and guggulu. The fire oblations with the Kubjikā-mūla-mantra are counted at 1,008 to complete the puraścaraṇa. The chapter concludes with a meditation on Kubjikā as the supreme Kuṇḍalinī-śakti ascending through the ṣaṭ-cakras to unite with Śiva at the sahasrāra.