అగ్ని మహా పురాణము

205 - అథ భీష్మపఞ్చకవ్రతమ్

అగ్ని రువాచః-

భీష్మపఞ్చకమాఖ్యా స్యే వ్రతరాజం తు సర్వదమ్

కార్తిక స్యామలే పక్షే హ్యేకాదశ్యాం సమాచరేత్.

దినాని పణ్చ త్రి స్నాత్వా పళ్చి ప్రిహితిలై స్తథా

తర్పయేద్దేవపిత్రాదీన్మౌనీ సంపూజయద్దరిమ్.

ప్చగవ్యన సం స్నాప్య దేవం ప్చమృతేన చ

చన్దనాద్యైః సమాలిప్య గుగ్గులుం సమృతం ద హేత్.

దీపం దద్యాద్దీజా రాత్రే నైవేద్యం పరమాన్నకమ్

ఓం నమో వాసుదేవాయ జ పేదప్టోత్తరం శతమ్.

జుహుయాచ్చ తిలాభక్తాం స్త్రీల వీహీ స్తతో ప్రతీ

షడక్ష రేణ మన్రోణ స్వాహాకారాన్వితేన చ.

కమలైః పూజయేత్పాదౌ ద్వితీయే బిల్వపత్రకైః

జానునః తృతీయేథ నాభిం భృజర జేన తు.

బాణబిల్వజపాభిస్తు చతుర్థ పశ్చిమేహని

మాలయా భూమిళాయీ స్యాదేకాదళ్యాం తు గోమయమ్.

గోమూత్రం దధి దుగ్ధం చ పశ్చిమే ప్చగవ్యకమ్

పౌర్ణమాస్యాం చరేన్న కం టు క్తిం ముక్తిం లభేద్ర్వతి.

భీష్మః కృత్వా హరిం ప్రాప్తనేనై తద్భీష్మపఇకమ్

బ్రహ్మణః పూజనాద్యైశ్చ హ్యుపవాసాదికం వ్రతమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే భీష్మపఞ్చక వ్రతం నామ పఞ్చాధిక ద్విశతతమోధ్యాయః.

అగ్ని దేవుడు చెప్పెను : ఇపుడు సకలమనోరథములను తీర్చు వ్రతరాజ మైన భీష్మపంచక వ్రతమును గూర్చి చెప్పెదను. కార్తిక శుక్లైకాదశినాడు ఈ వ్రతమును ప్రారంభించి, ఐదు దినములపాటు మూడు వేళల స్నానము చేయుచు తిలలతోను, యవలతోను దేవతలకును. పితరులకును ఐదు తర్పణము లీయవలెను మౌనముతో శ్రీమహావిష్ణువును పూజించ వలెను. పంచామృత - పంచగవ్యములతో స్నానము చేయించి, చందనాది సుగంధద్రవ్యములు అలది, ఘృతయుక్తమగు గుగ్గులు వెలిగించవలెను. ప్రాతఃకాలమునందును, రాత్రియందును శ్రీమహావిష్ణువునకు దీపము చూపి, భోజ్యపదార్థములు నివేదనము చేయవలెను. “ఓం నమో భగవతే వాసుదేవాయ”అను ద్వాదశాక్షరీమంత్రమును నూట ఎనిమిది పర్యాయములు జపించవలెను. ద్వాదశాక్షర మంత్రమునకు చివర ‘స్వాహా’ చేర్చి మృతసిక్తము లగు తిలలను, యవలను హోమము చేయవలెను. మొదటి దినమున భగవంతుని పాదములను కమలములతోను, రెండవ దినమున మోకాళ్లను, తొడలను బిల్వపత్రములతోను, మూడవ దినమున నాభిని భృంగరాజముతోను, నాల్గవ దివసమున దాణపుష్ప-బిల్వపత్ర-జపాపుష్ప ములతోను, ఐదవ దివసమున మాలతీపుష్పములతోను సర్వాంగములను పూజించవలెను. వ్రతము నాచరించువాడు భూమిపై శయనించవలెను. ఏ కాదశినాడు గోమయమును, ద్వాదశియందు గోమూత్రమును, త్రయోదశియందు పెరుగును. చతుర్దశి యందు క్షీరమును, చివరి దినమునందు పంచగవ్యములను ఆహారముగ గ్రహించవలెను. పౌర్ణమాసియందు నక్త వ్రతము చేయవలెను. ఈ విధముగ వ్రతము చేసినవాడు భుక్తిముక్తులను పొందును. భీష్ముడు ఈ వ్రతము నాచరించుటచే శ్రీహరిని చేరెను. కావుననే దీనికి ‘భీష్మపంచకము’ అను పేరు వచ్చినది. బ్రహ్మ కూడ ఈ వ్రతమాచరించి శ్రీహరిని పూజించేను. అందుచే ఈ వ్రతము పంచోపవాసాదులతో కూడియున్నది.

అగ్ని మహాపురాణమునందు భీష్మపంచకవ్రతకథన మను రెండువందలఐదవ అధ్యాయము సమాప్తము.