ఈశ్వర ఉవాచః-
అథైక తాత్వికీ దీక్షా లముత్వాదుపదిశ్యతే ।
సూత్రబందాది కుర్వీత యథాయోగం నిజాత్మనా.
కాలాగ్న్యాధి శివాంతాని తత్త్వాని పరిభావయేత్ ।
నమత త్వే సమగ్రాణి సూత్రే మణిగణానివ.
ఆవాహ్య శిష్య తత్త్వాది గర్భాదానాది పూర్వవల్ ।
మూలేన కిను కుర్వీత సర్వశుల్కసమర్పణమ్.
ప్రదదిత తతః పూర్ణాం త త వాతోవగర్భితామ్ ।
ఏక యైవ మయా శిష్యో నిర్యాణమధిగచ్ఛతి.
యోజనాయై శివేచాన్యాం స్థిరత్వాదనాయ చ ।
దత్వా పూర్ణాం ప్రకుర్వీత శివకుంభాభి షేచనమ్.
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ఏకతత్త్వదీక్షావిధిర్నా మైకోన నవతితమోధ్యాయః.
పరమేశ్వరుడు చెప్పెను. ఇపుడు చిన్న దగుటచే ఏకతాత్త్విక దీక్షను గూర్చి చెప్పుచున్నాను. సమయామగుణ మగా, యథోచితడితిని స్వీయమంత్ర సూత్రంధరాదికన చేయవలెను, ఫివుట బము అగ్ని మొదలు శివపర్యంతమైన సమస్తతత్త్వముల చింతనము చేయవలెను. సూత్రములో మణులు గ్రుచ్చబడి యున్నట్లు అన్ని తత్వములును శివ తత్త్వములో గ్రుచ్చబడి యున్నవి. శివతత్త్వాద్యావాహనము చేసి, వెనుకటివలే గర్భాధానాది సంస్కారములు చేయవలెను. కాని సర్వశుల్క సమర్పణమును మాత్రము మూలమంత్రముతో చేయవలెను. పిమ్మట తత్త్వసమూహగర్భిత మైన పూర్ణా హుతి ఈయవలెను, ఆ ఒక్క ఆహుతి చేతనే శిష్యుడు నిర్వాణము పొందగలుగును. శివునియందు నియోజనము, స్థిరత్వా పాదనము చేయుటకును రెండవ పూర్ణాహుతి కూడ చేయవలెను. పిమ్మట శివకలశజలముతో శిష్యునకు స్నానము చేయించ వలెను.
అగ్ని మహాపురాణమునందు ఏకతత్వదీక్షావిధివర్ణన మను ఎనుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 89 of the Agni Purāṇa is as follows:
The eighty-ninth chapter describes an abbreviated form of dīkṣā — the ekatattva-dīkṣā — in which all the tattva-s are not purified individually but are gathered together and strung like beads on the single thread of Śiva-tattva. The theological insight underlying this method is that since all tattva-s are ultimately expressions of the one Śiva-tattva, a single act of recognition of their unity in Śiva is sufficient to accomplish what the extended kalā-śodhana procedure accomplishes sequentially. A single pūrṇāhuti (full oblation) into the consecrated fire suffices in place of the 108-oblation sequences for each kalā. The śivakalaśa-snāna concludes the rite in the same manner as the full nirvāṇa-dīkṣā. The chapter affirms that this abbreviated form is appropriate for advanced śiṣya-s whose accumulated impurities are minimal, or when time constraints require a shorter ceremony.