అగ్ని మహా పురాణము

266 - అథ వినాయక స్నానమ్

పుష్కర ఉవాచః

వినాయకోపనృష్ణానాం స్నానం సర్వకరం వదే

వినాయకః కర్మవిఘ్న సిధ్యర్థం వినియోజితః.

 గజానా మాధిపత్యేచ కేక వేళ పితామ హైః

 స్వప్నే అవగాహఒత్యర్థ జలం ముండాంశ్చ పశ్యతి.

 వినాయకోపసృష్టిస్తు క్రవాదానధిరోహతి

 వజమాన స్తథాత్మానం మన్యత్నేనుగతం పరై .

విమనావిఫలారంభ సంసీదత్య నిమి త్తతః

కన్యా వరం న చాప్నోతి నదిపత్యం వరాంగనా.

ఆచార్యత్వం శ్రోత్రియశ్చ న శిష్యోఒద్యయనం లభేత్

 ధనీ న లాభ మాప్నోతి నకృషించ కృషీవల. 

రాజా రాజ్యం నచాప్నోతి స్నానం తస్య కారయేత్

హ స్తపుష్యాశ్వయుకౌమ్యే విష్ణవే భద్రపీఠ కే.

గౌర సరప కల్కేన సాజ్యేనోత్సాది తస్యచ

సర్వౌషదే ! సర్వగంధైః ప్రలిప్త శిరస స్తథా. 

చతుర్భిః కల శై ఓ స్నానం తేషు సర్వౌషధీః క్షిపేత్

ఆశ్వస్థానాద్దజస్థానాద్వల్మీ కాత్సంగమార్దదాత్.

 మృత్తికాం రోచనాం గంధం గుగ్గులుం తేషునిక్ష పేత్

 సహస్రాక్షం శతధారమృషిభిః పావనం కృతమ్.

 తేనత్వామభిషించామి పామాన్యః పునంతుతే

భగంతే వరుణ్ రాజా భగం సూర్వో బృహస్పతిః. 

భగ మిన్దశ్చ వాయుశ్చ భగంస పర్షయో దదుః

య త్తే కే శేషు దౌర్బాగ్యం సీమంతే యచ్చమూర్ధని.

 లలాటే కర్ణయోరణోరాప స్తద్ ఘ్నంతుసర్వదా

 దర్భపింజలి మాదాయ వామహస్తే తతోగురుః. 

స్నాతస్య సర్షపం తైలం సు వేణోదుంబ రేణచ

జుహుయాస్మూర్దని కుళాన వ్యేన పరిగృహ్మచ. 

మితశ్చ సమ్మితశ్చైవ తథా శాలక కంటకౌ

కూష్మాండే రాజపుత్రశ్చ ఏతై స్వాహా సమన్వితే .

 నామభిర్బలి మంత్రైశ్చ నమస్కార సమన్వితైః

 దద్యాచ్చతుష్పథే శూర్పే కుళానా సీర్య సర్వతః.

  కృతాకృతాం స్తండులాంశ్చ పలలెదన మేవచ

మత్యాన్నంకాంన్ త థై వా మానుష్పం చిత్రం సురాంతథా.

 మూలకం పూరికాం పూపాం స్తథైవై అడవికాస్రజః

 దధ్యాన్నం పాయసం పిష్టం మోదకం గుడమర్పయేత్.

 వినాయకస్య జననీ ముపాతిషే త్తతో౦బికామ్

 దూర్వాసరప పుష్పాసాం దత్త్వారం పూర్ణమంజలిమ్

 రూపం దేహి యశో దేహి సౌభాగ్యం సుభగే మమ

పుత్రం దేహి ధనం దేహి సర్వాన్కామాంశ్చదేహిమే.

 భోజయేద్బ్రాహ్మణాన్ దద్యాద్వస్త్రయుగ్మం గురోరపి

వినాయకం గ్రహాన్ప్రార్బ్యశ్రియం కర్మఫలంలభేత్ .

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే వినాయక స్నానం నామషట్ షష్ట్యధిక ద్విశతతమోధ్యాయః.

పుష్కరుడు పలికెను. వినాయకులచే పీడితులకు సర్వమనోరథములు ఇచ్చుస్నానమును చేప్పెదను, కర్మ లకు విన్న ముకళించుటకు బ్రహ్మ విష్ణు, మహేశ్వరులు వినాయకుని నిర్మించి ఆతనికి గణాధి పత్యమును కూడ ఇచ్చిరి వినాయక పీడితుడు స్వప్నములో లోతైన నీటిలో మునిగిపోవును. ముండిత శిరస్కు: ను చూచును. మాంస మాను తీను మృగములను ఎక్కును ఎచట కేని నడచివెళ్లినపుడు తనవేనుక ఎవరోవచ్చుచున్నట్లు అనుకొనును. కారణము లేకుండగనే మనస్సు డి వ్యర్థ ప్రయత్నములు కలవాడగును. కన్యకు వరుడు లభించడు, శ్రీక సంతానము లభించదు. శ్రోత్రి యునకు ఆచార్యత్వము శిష్యునకు ఆధ్యయనము, ధనికునకు లాభము, కృషి వలునకు కృషి, రాజు నకు రాజ్యము లభింపవు. అట్టి వారికి స్నానము చేయించవలేను. హస్త , పుష్యమి, అశ్విని, మృగశిర శ్రవణనక్షత్రము లందు కదపీఠముపై కూర్చుండబెట్టి పచ్చటి ఆవాలు నూరి నేతితో తడపి వాని శరీరమునందంతటను నలిచి, వాని శిరస్సుపై సర్వౌషద సహితములగు, అన్ని విధముల సుగంధ ద్రవ్యములను లేపనమునుచేసి సర్వౌషధులు వుంచిన నాలుగు కలశ లజముతో ఆతనికి స్నానము చేయించవలెను. అశ్వశాల, గజశాల, పుట్ట, నదీసంగమము, జలా శయము, వీటినుండి తీసుకొనివచ్చిన ఐదు విధములగు నట్టియు, గోరోచనము, గంధము, గుగ్గులు, ఆ కలశ జలము «ందు ఉంచవలెను. ఆచార్యుడు తూర్పుననున్న కలశ తీసుకోని సహస్రనేత్రములు కలదియు, మహర్షులచే పవిత్రీ కృతమును, ఆగుజలముతో నీకు స్నా నముచేయించుచున్నాను. ఈ పవిత్రజలము నిన్ను పవిత్రుని చేయుగాక అని చెప్పుచు స్నానము చేయించవలయును. రాజీవ వర్ణుడు సూర్యుడు, బృహస్పతి, ఇంద్రుడు, వాయువు, సప్త రులు , నీకు కల్యాణమును చేసిరి. అనియు, “నీ కేశములందును, సీమంతమునందును, శిరస్సుయందును, లలాట, కర్ల, నేత్రములందున్న దౌర్భాగ్యమును ఈజలము పూర్తిగా తొలగించుగాక." యనియు చెప్పుచు స్నానముచేయించవలెను. గురువు తవఎడమచేతిలో గ్రహించిన కుశలను ఆస్నానము చేసినవాని శిరస్సుపై ఉంచి, ఉడుంబస్రువతో ఆవ నూనెను హోమము చేయవలెను. ఆసమయమున చివర స్వాహాయను పదము చేర్చిన చతుర్థ్యంతములగా వితసమ్మిత. శాలకకంటక-కూష్మాండ .రాజపుత్ర.ఆనుపదములను చెప్పవలెను. హోమము చేయగా మిగిలిన చరువుతోనమః ఆమ పదము చేరిన జలమంత్రములను ఉచ్చరించుచు వారికి బలిఇవ్వవలెను. పిమ్మట చేటలో అంతట కుశములు పరచి తడిపొడిగా వున్న బియ్యము నూరిన తిలలంక లిపిన ఆన్న ము, వివిధసుష్పములు మాంసాన్నము, మత్స్యములు, త్రివిధసుర, మూలి, పూరి, అపూపములు ఏండవిక మాలలు, దధ్యన్నము, పాయసము, పిష్టము, లడ్డులు, బెల్లము వీటిని ఒక చోట చతుష్పథమునందు చేర్చి వాటిని దేవతా సువర్ణ-సర్ప- గృహ- అసుర యాతుధాన-పిశాచ-నాగ మాతృ-శాకినీ-యక్ష-వేతాళ యోగినీ-పతనాదులకు ఆర్పించవలేను. పిదప వినాయకుని తల్లియైన ఆంబికకు దూర్వాదళ ములు తెల్ల ఆవాలు, పుష్పములు, వీటితో నిండిన అంజలినిసమర్పించి, సౌభాగ్యవతియైన ఓ దేవి! నాకురూపమును, యశస్సును, సౌభాగ్యమును, పుత్రుని, ధనమును, సర్వకామములను ఇమ్ము అని ప్రార్థించవలెను. బ్రాహ్మణులకు భోజనము పెట్టి ఆచార్యునకు రెండు వస్త్రములు ఇవ్వవలెను. ఈ విధముగ వినాయకుని గ్రహములను పూజించుటచే ఐశ్వర్యమును, కర్మఫలమును పొందును.

అగ్ని మహాపురాణమున వినాయక స్నాతమను రెండువందల ఆరువదియారవ అధ్యాయము సమాప్తము.