అగ్నిరువాచః-
అవతారం వరాహస్య వక్ష్యేహం పాపనాశనమ్ ।
హిరణ్యాక్షోసురేశోభూద్దేవాఞ్జిత్వా దివి స్థితః.
అగ్నిదేవుడు పలికెను : పాపములను నశింపచేయు వరాహావతారమును గూర్చి చెప్పెదను. హిరణ్యాతుడనెడు రాక్షసరాజు ఉండెను. అతడు దేవతలను జయించి స్వర్గలోక ములో నివసించేను.
దేవైర్గత్వా స్తుతో విష్ణుర్యజ్ఞరూపో వరాహకః ।
అద్బుతం దానవం హల్వా దైత్యైః సాకం చ కణ్టకమ్.
ధర్మదేవాది దశాకృత్తతః సో నర్దరే హరేః।
యజ్ఞస్వరూపు డిగు విష్ణువును దేవత లందరును వచ్చి తింపగా ఆహరీ వరాహరూపము ధరించి, లోకకంటకు డైన ఆ దానవుని దైత్యులతోకూడ ఆశ్చర్యకర మగువిధమున సంహరించి, ధర్మమును దేవతలు మొదలగువారిని రక్షించి అంతర్ధానము చెందెను.
హిరణ్యాక్షస్య వై బ్రాతా హిరణ్యకశిపు స్తథా.
జిత దేవయజ్ఞ భాగః సర్వదేవాధికారకృత్।
హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు దేవతల యజ్ఞభాగములను అపహరించి దేవతలందరి పైనను అధికార మును జరిపెను.
నారసిమ్హం వపు కృత్వా తం జఘాన సురైః సహ.
స్వపదస్థాన్ సురాంశ్చకే సౌర సింహః సురైః స్తుతః ।
విష్ణువు దేవతానమేతుడై (వెళ్లి) నరసింహరూపము దాల్చి ఆ హిరణ్యకశిపుని సంహరించెను. దేవతలచే స్తుతింప బడిన ఆ నర సింహుడు దేవతలను తమతమ స్థానములలో నిలిపెను.
దేవాసురే పురా యుద్దే బలి ప్రభృతిభిః సురాః,
జితాః స్వర్గాత్పరిభ్రష్టా హరిం వై శరణం గతాః।
పూర్వము దేవాసుర యుద్ధమునందు బలి మొదలగువారీచే సురులు పరాజితులై, స్వర్గమును కోల్పోయిరి. వారు అపుడు హరిని శరణు జొచ్చిరి.
సురాణామభయం దత్త్వా అదిత్యా కశ్య పేన చ
శ్రుతో సౌ పామనో భూత్వా హ్యదిత్యాం సకతుం యయౌ।
బలేః శ్రీయజమానస్య రాజద్వారేఒగృణాచ్ఛ్రుతిమ్.
విష్ణువు దేవతలకు అభయ మిచ్చి, అదితికశ్యపులు తనను స్తుతింపగా అదితియందు వామనుడుగ జన్మించెను. ఆ వామనుడు శోభాయు కముగ యజ్ఞము చేయుచున్న బలిచక్రవర్తి యజ్ఞమునకు వెళ్లి అచట రాజద్వారమునందు వేడమును వఠించెను.
వేదాన్నత స్తం తం దృష్ట్వా వామనం వరదోబ్రవీత్।
నివారితోపి కు కేణ బలిరూహి యదిచ్ఛసి.
త త్తేహం సంప్రదాస్యామి వామనో బలిమబ్రవీత్ ।
వదత్రయం హి గుర్వర్థం దేహి దా న్యే తమబ్రవీత్.
బలి వేదములను పఠించుచున్న ఆ వామనుని చూచి, అతడు కోరు వరముల నీయవలే నని నిశ్చయించుకొని, శుక్రాచార్యుడు నివారించుచున్నను, ఆతనితో- “నీ కేమి కావలెనో కోరుకొనుము; ఇచ్చెదను” అని పలికెను. వామనుడు బలితో ఇట్లనెను : “మూడు అడుగుల నిమ్ము; నా గురువునకు కావలెను”; బలి “అట్లే ఇచ్చెదను” అని పలికెను.
తోయే తు పతితే హస్తే వామనోభూదవామనః ।
భూర్లోకం స భువర్లోకం స్వర్లోకం చ పద తయమ్.
చకే బలిం చ సుతలే తచ్ఛత్రాయ దదౌ హరిః ।
శక్రో దేవైర్హరిం స్తుత్వా భువనేశ సుఖీ త్వభూత్.
దానజలము చేతిలో పడగానే వామనుడు అవామనుడు (పెద్ద శరీరము కలవాడు). ఆయెను భూలోక భువర్లోక. స్వర్లోకములను మూడడుగులుగా గ్రహించి బలిని సుతలమునకు తొక్కివేసెను. వామనరూపుడైన హరి ఆ లోకత్రయ మును దేవేంద్రున కిచ్చెను. దేవతాసహితుడగు ఇంద్రుడు హరిని స్తుతించి, త్రిభువనాధీశుడై సుఖముగా నుండెను.
వక్ష్యే వరశురామన్య చావతారం శృణు ద్విజ ।
ఉద్ధతాన్ క్షత్రియాన్ మత్వా భూభారహరణాయ సః
ఆవతీర్ణో హరిః శాన్యై దేవవిప్రాదిపాలకః ।
జమదగ్నే రేణుకాయాం భార్గవః శస్త్రపారగః.
ఓ బ్రాహ్మణా ! వడకరాముని అవతారమును గూర్చి చెప్పెదను వినుము. ఆ శ్రీమహావిష్ణువు, శత్రియులు ఉద్దతులుగా ఉన్నా రని తలచి, భూభారమును హరించుటకై, దేవతలను, విప్రాదులను పాలించనున్న వాడై, శాంతిని నెల కొల్పుటకై , జమదగ్ని నుండి రేణుకయందు సర్వశాస్త్ర విద్యాపారంగతుడైన భార్గవుడుగా (పరశురాముడుగా) అవతరించి నాడు.
దత్తాత్రేయ ప్రసాదేన కార్తవీర్యో నృవ స్వభూత్ ।
సహస్రబాహుః సర్వోద్వీపతిః స మృగయాం గతః.
కార్తవీర్యుడను రాజు దత్తాత్రేయుని అనుగ్రహముచే వేయిబాహువులు కలవాడుగను, సకల భూమండలమున కును రాజుగను ఆయెను. అతడు వేటకు వెళ్లెను.
శ్రాన్తో నిమ శ్రాతోరణ్యే మునినా జమదగ్నినా ।
కామదేనుప్రభా వేణ భో జితః సబలో నృప.
ఆరణ్యములో అలసిన, సేనానమేతుడైన ఆ రాజును జమదగ్ని మహర్షి విమంత్రించి కామధేనువు ప్రభావము చేత భోజనము పెట్టను భోజనము పెట్టెను.
ఆప్రార్థయతామధేనుం యదా స న దదౌ తదా।
హృతవానథ రామేణ శీరశ్చిత్వా నిపాతితః.
యుద్దే వరకునా రాజా సధేను స్వాశ్రమం యయౌ ।
కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును తన కిమ్మని కోరెను. జమదగ్ని ఈయ నిరాకరించెను. అపుడాతడు దానీని అపహరించేను. పిదవ పరశురాముడు యుద్ధములో పరశువుచే ఆతని శిరస్పు చేదించి సంహరించి దేనువుతో ఆశ్ర మమునకు తిరిగి వెళ్లేను.
కార్త వీర్యస్య పుత్రైస్తు జమదగ్నిర్నిపాతితః.
రామే వనం గతే వైరాదథ రామః సమాగతః।
పితరం నిహతం దృష్ట్వా పీతృనాళాభిమతీతః.
త్రిస వకృత్వః వృథివీం నిఃక్షత్రామక రోద్విభుః ।
కురుక్షేత్రే పణ్చకుణ్డాన్ కృత్వా సన్తర్ప్య వై పితృన్.
కశ్యపాయ మహీం దత్వా మహేంద్రే వర్వతే స్థితః।
పరశురాముడు వనమునకు వెళ్ళి యుండగా కార్తవీర్యుని పుత్రులు పూర్వవై రమువలన జమదగ్ని ని చంపిరి. అంత తిరిగి వచ్చిన ప్రభావశాలి యగు పరశురాముడు చంపబడిన తండ్రిని చూచి, తండ్రిని ఆ విధముగ చంపుటచే కోపించి, ఇరువదియొక్క పర్యాయములు పృథీవీని క్షత్రియులు లేనిదానినిగా చేసి, కురుక్షేత్రమునందు ఐదు కుండములను చేసి, వాటితో పితృదేవతలను తృప్తిపరచి, భూమి నంతను కశ్యపునకు దానము చేసి, మహేంద్రపర్వతము పై నివసించెను.
కూర్మస్య చ వరాహస్య నృసింహస్య చ వామనమ్।
అవతారం చ రామస్య శ్రుత్వా యాతి దివం నరః.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే వరాహనృసింహాద్యవతారో నామ చతుర్థోధ్యాయః.
కూర్మ, వరాహ, నరసింహ, వరశురామావతార గాథలు విన్న మానవుడు స్వర్గమునకు వెళ్ళును.
అగ్ని మహా పురాణములో వరాహనృసింహాద్యవతార మనేడు చతుర్థాధ్యాయము సమాప్తము.
Summary of chapter 4 of the Agni Purāṇa is as follows:
The fourth chapter presents the magnificent narrative of Bhagavān's Varāha avatāra, in which he lifted the earth-goddess Bhūdevī from the depths of the primordial ocean after the demon Hiraṇyākṣa had dragged her to the cosmic depths. Bhagavān emerged from Brahmā's nostril as a tiny boar, then grew to immeasurable size, his body identified with the Veda-s, the sacrificial implements, and the four Āśrama-s. He dove into the cosmic ocean, slew Hiraṇyākṣa in a great battle, and bore Bhūdevī aloft on his tusks, restoring her to her proper place. The earth's gratitude and her praise of Bhagavān are recorded. The chapter also describes the re-creation of the world following this rescue.