అగ్ని మహా పురాణము

136 - అథ నక్షత్రచక్రమ్

ఈశ్వర ఉవాచః-

అథ చక్రం ప్రవక్ష్యామి యా త్రాదౌ చ ఫలప్రదమ్

అశ్విన్యాదౌ లిఖేచ్చక్రం త్రినాడిపరిభూషితమ్.

ఆశ్విన్యాదిభిః పూర్వా తతశోత్తరఫల్గునీ

హస్తో జ్యేష్ఠా తథా మూలం వారుణం చాప్యజై కపాత్.

నాడీయం ప్రథమాచాన్యా యామ్యం మృగశిర స్తథా

పుష్యం భాగ్యం తథా చిత్రా మైత్రం చాప్యం చో వాసవమ్.

అహిర్బుధ్న్యం తృతీయాథ కృత్తికా రోహిణీ హ్యహిః

చిత్రా స్వాతీ విశాఖా చ శ్రవణా రేవతీ చ భమ్.

నాడీ త్రితయసజ్ఞుష్టగ్రహాద్ జ్ఞేయం శుభాశుభమ్

చక్రం ఫణీశ్వరం తత్తు త్రినాడిపరిభూషితమ్.

తవిభౌమారరాహుసమశుభం స్యాచ్ఛుభం పదమ్

దేశ గ్రామయుతా భర్తృభార్వాద్యా ఏకశః శుభాః,

అ, భ, కృ, రో, మృ, ఆ, పు, పు, ఆ, మ, పూ, ఉ, హ, చి, స్వా, వి, ఆ, జ్యే, మూ, పూ, ఉ, , ధ, , ప, ఉ, రే, అత్ర సప్తవింశతి నక్షత్రాణి జ్ఞేయాని,

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే యుద్ధ జయార్ణవే నక్షత్రచక్రం నామ షట్త్రింశదధిక శతతమోధ్యాయః.

పరమేశ్వరుడు పలికేను : దేవీ ! ఇపుడు నక్షత్రముల త్రినాడీచక్రమును గూర్చి చెప్పెదను. ఇది యాత్రాదులలో ఫలదాయకము. అశ్విన్యాది నక్షత్రములలో మూడు నాడులచే భూషిత మగు చక్రమును గీయవలెను. మొదట అశ్వినీఆర్ధా-పునర్వసువులను, పిదప ఉత్తరఫల్గునీహస్త-జ్యేష్ఠా మూల-శతభిషక్-పూర్వాభాద్రలను వ్రాయవలెను. ఇది ప్రథమనాడి, రెండవ నాడియందు భరణీ-మృగశీర్ష-పుష్య-పూర్వఫల్గునీ, చిత్రా, అనూరాధా-పూర్వాషాఢా-ధనిష్ట ఉత్తరాభాద్రలును, మూడవ నాడియందు కృత్తికారోహిణీ – ఆశ్లేషామమా-స్వాతీ-విశాఖాఉత్తరాషాఢా-శ్రవణరేవతులును ఉండును. ఈ మూడు నాడులం దున్న నక్షత్రములతో సంబంధించిన గ్రహముల ద్వారా శుభాశుభఫలములు తెలిసికొనవలెను. ఈ త్రినాడీచక్రమునకు ఫణీశ్వరచక్ర మని పేరు. ఈ చక్రమునందలి నక్షత్రములందు సూర్యకుజ-శనిరాహువు లున్న చో అది అశుభము. ఇతర గ్రహము లున్న చో ఆ నక్షత్రము శుభప్రదము. దేశ –గ్రామ భ్రాతృ -భార్యాదులు తమ తమ నామముల ఆద్యక్షరముల ననుసరించి ఒకే నాడీచ క్రమునం దున్నచో అది శుభకరము. ఇచట నక్షత్రము లవగా ఆశ్విని మొదలు రేవతి వరకును ఉన్న ఇరువది ఏడు నక్షత్రము లని గ్రహించవలెను.         

అగ్ని మహాపురాణమునందు నక్షత్రచక్రవర్ణన మను నూటముప్పదియారవ అధ్యాయము సమాప్తము.