అగ్ని మహా పురాణము

190 - అథ అఖణ్డద్వాదశీవ్రతమ్

ఆగ్ని రువాచః-

అఖణ్డద్వాదశీం వక్ష్యే వ్రతసంపూర్ణతాకృతమ్

మార్గశీరే సితే విష్ణుం ద్వాదశ్యాం సముపోషితః.

పఞ్చగవ్యజలే స్నాతో యజేత్పశనో ప్రతీ

యవద్రోహియుతం పాత్రం ద్వాదశ్యాం హి ద్విజేర్పియేత్.

 సప్తజన్మని యత్కిజ్చోన్మయా ఖణం వ్రతం కృతమ్

భగవం స్వతసావేన తదఖడ్గమిహాస్తు మే.

ఆ యథా ఖడ్గాం జగత్సర్వం త్వమేవ పురుషోత్తమ

తథాభిలాన్యఖడ్గాని వ్రతాని మమ సస్తు వై.

ఏవమేవానుమాసం చ చాతుర్మాస్యో విధిః స్మృతః

 అన్యచ్చేత్రాధిమా సేపు సక్తుపాత్రాణీ చార్పయేత్.

గ్రావణాదిషు చారథ్యకార్తికా శ్రేష పారణమ్

సప్తజన్మసు వైకల్యం వ్రతానాం సఫలం కృతే.

ఆయురారోగ్యసౌభాగ్య రాజ్యభోగాది మాప్నుయాత్

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ఆఖణ్డ ద్వాదశి వ్రతం నామ నవత్యధిక శతతమోధ్యాయః.

ఆగ్ని పలికెను: ఇపుడు సమస్త వ్రతములకు సంపూర్ణత్వమును సంపాదించు అఖండద్వాదశీ వ్రతమును గూర్చి చేప్పెదను. మార్గశిర శుక్ల ద్వాదశినాడు ఉపవాసము చేసి శ్రీమహావిష్ణువును పూజించవలెను. పంచగవ్యమిత్ర జలముతో స్నానము చేసి దానితోనే పారణము చేయవలెను. శ్రీమహావిష్ణవు ఎదుట ఈ విధముగా ప్రార్థన చేయవలెను. “భగవంతుడా! ఏడు జన్మలనుండి నేను చేసిన వ్రతాలలో ఏదైన ఖండ మైనచో అది ఆఖండ వలదాయక మగు నట్లు అను గ్రహించుము. పురుషోత్తమా! నీవు ఈ అఖండ చరాచర విశ్వరూపమున ఉన్నట్లు నా వ్రతము కూడ అఖండ మగుగాక” ఈ విధముగ నాలుగు మాసములు ఈ వ్రతము చేయవలెను. చైత్రమునుండి ఆషాఢము వరకును చేసిన పక్షమున పేలాల పిండి నింపిన పాత్రము దానము చేయవలెను. రావణమునందు ప్రారంభించి కార్తికమునందు కూడ సమాప్తము చేయవచ్చును. ఈ విధముగా అఖండ ద్వాదశీవ్రతము చేయుటచే ఏడుజన్మలలో ఖండితము లై పోయిన (అసంపూర్ణములైన) వ్రతములు సంపూర్ణవలప్రదము లగును. దీనిని చేసినవానికి దీర్ఘాయురారోగ్య - సౌభాగ్య - రాజ్యాది వివిధభోగములు లభించును.

అగ్ని మహాపురాణమునందు ఆఖండద్వాదశీవ్రతవర్ణవ మను నూటతొంబదవ అధ్యాయము నమాప్తము.