అగ్ని మహా పురాణము

27 - అథ దీక్షా విధిః

నారద ఉవాచః-

వక్ష్యే దీక్షాం సర్వదాం చ మణ్డలేబబ్జే హరిం యజేత్

దశమ్యాముపసంహృత్య యాగద్రవ్యం సమ స్తకమ్.

 విన్యస్యనారసిం హేన సంమంత్య్ర శతవారకమ్

సర్షసాంస్తు ఫడ నేన రక్షోఘ్నాన్ సర్వతః క్షిపేత్. 

నారదుడు పలి కెను : -

అన్ని ఫలములను ఇచ్చు దీక్షను చెప్పెదను. మండలమునందలి పద్మమునందు హరిని పూజించవలెను. దశమి యందు సమస్త మైన యాగ ద్రవ్యములను సమకూర్చుకొని, ఆచట ఉంచి, 'ఫట్' అనునది అంతముందు గల నారసింహ మంత్రముచేత ఆవాసాను నూరు పర్యాయములు అభినంత్రించి, వాటిని నలుమూలల చల్లవలెను.

 శ క్తిం సర్వాత్మికాం తత్ర న్య సేత్రాసాదరూపిణీమ్

 సర్వౌషధీః సమాహృత్య వికిరానభిమ స్త్రీయేత్  

 శతవారం శుభే పాత్రే వాసుదేవేన సాధకః

సంసాధ్య పడ్చాగవ్యం తు పఞ్చ భిర్మూలమూర్తి భిః.

 నారాయణానైః సంప్రోక్ష్య కుశాగ్రైస్తేన తాం భువమ్

వికిరన్వాసుదేవేన క్షిపేదుత్తానపాణినా.

త్రిధా పూర్వముఖస్తిష్ణన్ ధ్యాయేద్విష్ణుం తథా హృది

వర్ధన్యా సహితే కుమ్ఛే సాజ్గం విష్ణుం ప్రపూజయేత్.

అచట స్వత్మికయు, ప్రాసాదరూపిణియు అగు శక్తిని నిలుపవలేను. సాధకుడు శుభ మైన పాత్రయందు సమసౌషధు. ను ఉంచి నూరు పర్యాయములు వాసు దేవమం తముచే వికిరములను అభిమంత్రించ వలెను. పంచగవ్యమును నారా యణాన్తము లైన ఐదు మూలమూర్తులచే సంపాదించుకొని, దానిచే ఆ భూమిని కుశాగ్రములతో సంప్రోక్షించి, వాసుదేవ మంత్రముచే చిమ్ముచు, వెల్లిగితల ఉంచబడిన హస్తముతో మూడు ప్యూయములు విసిరివేయవలెను. తూర్పుగా తిరిగి విష్ణువును మనస్సులో ధ్యానించవలెను. వర్ధనితో కూడిన కుంభమునందు ఆంగసహితు డగు విష్ణువును పూజింపవలెను.

 శతవారం మంత్రయిత్వా త్వస్త్రేణైవ చ వర్ధనీమ్

అచ్ఛిన్న ధారయా సిఞ్చన్నీ శానాన్తం నయేచ్చ తామ్.

వర్ధనిని అస్త్రముచేతనే నూరు పర్యాయములు ఆభిపుంత్రించి, భిన్నము కాని ధారతో తడుపుచు ఈశాన్య దిక్కు వరకును తీసికొని వెళ్ళవలెను.

 కలశం పృష్ఠతో నీత్వా స్థాపయేద్వికిరోపరి

సంహృత్య వికిరాన్దర్బైః కుమ్భేశం కర్కరీం యజేత్.

కలశమును వెనుకనుంచి తీసికొని వెళ్ళి వికిర ములపై స్థాపించవలెను. వికరములను దర్భలచేత పోగుచేసి కుంభేశుని కర్కరిని పూజించపలెను.

సవస్త్రం పఞ్చరత్నాడ్యం స్థణ్డిలే పూజయేద్దరిమ్

అగ్నా వపి సమభ్యర్చ్వ మంత్రాన్ సంజప్య పూర్వవత్.

  ప్రక్షాళ్య పుణరీ కేణ విలిప్యానః సుగన్దినా

 ఊఖామాజ్యేన సంపూర్య గోక్షి రేణ తు సాధకః.

ఆలోక్య వాసుదేవేన తతః సఙ్కర్షణేన చ

తణ్డులానాజ్యసంసృష్టాన్ క్షిపేత్ క్షిరే సుసంస్కృతే.

వస్త్రముతోడను పంచరత్నములతోడను కూడిన విష్ణువును స్థండిలము పై పూజించవలెను. అగ్నియందు కూడ పూజించి, పూర్వమునందు వలె మంత్రమును జపించి, పాత్రను కడిగి, మంచి సువాసన గల పద్మముచే లోపల తుడిచి, నేతితోను, గోక్షీరముతోను నింపి, వాసుదేవమంత్రముతో దానివై పు చూచి, పిచ్ముట సంకర్షణమంత్రముతో, సంస్కృతమైన క్షీరములో నెయ్యి పూసిన తండులములను పోయవలెను.

ప్రద్యుమ్నేన సమాలోడ్య దర్వ్యా సంఘట్టయేచ్ఛనైః

పక్వముత్తారయేతృశ్చాదనిరుద్దేన దేశిక .

  ప్రశాల్యాలిప్య తత్కుర్యాదూర్ధ్వపుణ్డ్రం తు భస్మనా

 నారాయణేన పార్శ్వేపు చరుమేవం సుసంస్కృతమ్.

ప్రద్యుమ్న మంత్రముతో కలిపి గరిటిచేత మెల్లగా ఎనపవలేను. ఉడికిన తరువాత, గురువు అనిరుద్ధమంత్రముతో దింపవలెను. ఆ పాత్రను కడిగి, నారాయణమంత్రముతో, భస్మ చేత పాత్రకు ఊర్ధ్వపుండ్రము లుంచవలెను. ఈ విధముగ ఆ చరువును చక్కగా సంస్కరించవలెను.

భాగమేకం తు దేవాయ కలశాయ ద్వితీయకమ్

తృతీయేన తు భాగేన ప్రదద్యాదాహుతిత్రయమ్. 

శి ష్యైః సహ చతుర్థం తు గురురద్యా ద్విశుద్ధయే

నారాయణేన సంమన్త్య సప్త ధా క్షీరవృక్షజమ్.

 దన కాష్ఠం భక్షయిత్వా త్యక్త్వా జ్ఞాత్వా స్వపాతకమ్

 ఐంద్రాగ్న్యుత్తర కేళినీముఖం పతితముత్తమమ్. 

శుభం సింహశతం హుత్వా ఆచమ్యాథ ప్రవిశ్వచ

 పూజాగారం న్య సే న్మంత్రీ ప్రాచ్యాం విష్ణుం ప్రదక్షిణమ్.

ఒక భాగము దేవునకు, రెండవ భాగము కలశకు సమర్పించి, మూడవ భాగముచే మూడు ఆహుతులు చేయవలెను. నాల్గవ భాగమును గురువు శిష్యులతోకూడ భుజించవలెను. క్షీరవృక్షమునుండి దంత కాష్ఠమును గ్రహించి, దానిని నారాయణ మంత్రముచే ఏడు సార్లు అభిమంత్రించి పవిత్రము చేసి, దానిని నమలి విడువవలెను. తన పాప మంతయు ఈశాన్యదిగభి ముఖముగా పడిపోయినట్లు భావన చేయవలెను. శుభమైన నరసింహమంత్రముతో నూరు సార్లు హోమము చేసి, ఆచమనము చేసి, పూజా గృహము ప్రవేశించి, తూర్పున విష్ణువును స్థాపించి ప్రదక్షిణము చేయవలెను.

సంసారార్ణవమగ్నానాం పశూనాం పాపముక్త యే

 త్వమేవ శరణం దేవ సదా త్వం భక్త వత్సల.

 దేవదేవానుజానీహి ప్రాకృతైః పాశ బన్దనై 

పాశితాన్మోచయిష్యామి త్వత్రసాదాత్పశూనిమాన్.

“భక్త వత్సలుడి వైన ఓదేవా! సంసార సముద్రమునందు మునిగి యున్న పశువుల పాపములను తొలగించుటకు నీ వొక్కడవే శరణము. ఓ! దేవదేవా! ప్రాకృతములై న పాశ బంధనముచే బద్దులైన ఈ పశువులను, నీ అనుగ్రహము వలన విముక్తులను చేసెను. ఆనుజ్ఞఇమ్ము.” అని విష్ణువును ప్రార్థించవలెను.

ఇతి విజ్ఞాప్య దేవేశం సంప్రవిశ్య పశూంస్త తః

 ధారణాభిస్తు సంశోధ్య పూర్వవజ్జ్వలనాదినా.

 సంస్కృత్య మూర్త్యా సంయోజ్య నేత్రే బద్ధ్వా ప్రదర్శయేత్

పుష్పపూర్ణాలింస్తత్ర క్షిపేత్త న్నామ యోజయేత్.

 అమంత్రమర్చనం తత్ర పూర్వవతారయేత్కమాత్

యస్యాం మూర్తౌ పతేతుష్పం తస్య తన్నామ నిర్ధి శత్.

విష్ణువునకు ఈ విధముగా విజ్ఞాపన చేసి, పిమ్మట పశువులను ప్రవేశించి, పూర్వము చెప్పినట్లు ధారణలచేతను, జ్వలనాదికముచేతను సంశోధనముచేసి, సంస్కరించి, మూర్తి తో కలిపి, నేత్రములను బంధించి చూపవలేను. ఆచట పుష్పములతో నిండిన దోసిళ్ళను విసిరి, ఆ పేర్లను చేర్చవలెను. అచట వెనుక టివలే క్రమముగా మంత్రరహితముగా అర్చన చేయవలెను. పుష్పము ఏ మూర్తి పై పడునో ఆ మూర్తి యొక్క పేరు ఆతనికి పెట్టవలెను.

 శిఖాంతా సంమితం సూత్రం పాదాజుష్టాది షడ్గుణమ్

కన్యయా కర్తి తం రక్తం పునస్తత్రిగుణీకృతమ్. 

యస్యాం సంలీయతే విశ్వం యయా విశ్వం ప్రసూయతే

 ప్రకృతిం ప్రక్రియాభేదై సంస్థితాం తత్ర చిన్తయేత్ .

పాదాంగుష్టము మొదలు శిఖ వరకు పొడవు గల ఆరు పేట్ల ఎఱ్ఱటి దారమును, కన్యచేత - భేదింపచేసి, మరల దానిని మూడు పేటలు చేసి, దానిపై, ఏ, ప్రకృతిలో విశ్వము లీనమగునో, దేనినుండి జనించునో అట్టి ప్రకృతిని వివిధ ప్రక్రియలతో భావన చేయవలెను.

తేన ప్రాకృతికాన్ పాశాన్ గ్రథిత్వా తత్త్వసంఖ్యయా

కృత్వా శరావే తత్సూత్రం కుణ్డపార్శ్వే నిధాయ తు.

 తతస్తత్వాని సర్వాణి ధ్యాత్వా శిష్యతనౌ న్య సేత్

 సృష్టి క్రమాత్ర కృత్యాది పృథివ్యస్తాని దేశిక .

ఆ సూత్రముతో, ఎన్ని తత్వము లున్నవో అన్ని ప్రాకృతిక పాశములను ముడివేసి, దానిని మూకుడులో అగ్ని కుండపార్శ్వమునందుంచి, గురువు. ప్రకృతి మొదలు పృథివి వర కును ఉన్న ఆ తత్త్వములను సృష్టి క్రమానుసారము ధ్యానించుచు శిష్యుని శరీరముపై న్యాసము చేయవలెను.

తత్రైకధా పఞ్చధా స్యాద్దశ ద్వాదశ ధాపి వ

దాతవ్యః సర్వభేదేన గ్రథితస్తత్వచిన కైః. 

అజ్గైః పఞ్చభరధ్వానం నిఖిలం వికృతిక్రమాత్

తన్మాత్రాత్మని సంహృత్య మాయాసూత్రే పశోస్త నౌ.

వికృతుల క్రమము ప్రకారము నిఖిలమార్గమును పంచాంగములతో, తన్మాత్రాత్మకమగు మాయాసూత్రమైన పశువు శరీరమునందు ఉపసంహరించి, తత్త్వచింతకులు ఆచట ఐదు, పది, లేదా పండ్రెండు విధములచే ఆ గ్రథితమైన సూత్రమును పర్వ భేదముచే ఇవ్వవలెను.

ప్రకృతిర్లిజ్గశక్తి శ్చ కర్తా బుద్ధి స్తథామనః

పఞ్చ తన్మాత్రబుద్ధ్యాఖ్యం కర్మా ఖ్యం భూతపశ్చకమ్.

  ధ్యాయేచ్చ ద్వాదశాత్మానం సూత్రే దేహే తథేచ్ఛయా

హుత్వా సంపాతవిధినా సృ ష్టిః సృష్టి క్రమేణ తు.

 ఏకైకశతహోమేన దత్వా పూర్ణాహుతిం తతః

 శరావే సంపుటీకృత్య కుంభేశాయ నివేదయేత్ .

తన ఇచ్ఛననుసరించి, సూత్రమునందును, దేహమునందును - ప్రకృతి, లింగశక్తి కర్త, బుద్ధి, మనస్సు, తన్మాత్రలు, జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములు, పంచభూతములు.వీటినన్నింటిని, ద్వాదశాత్మను ధ్యానించవలెను. సృష్ట్య నులోమవిలోమక్రమములచే ఒక్కొక్క శతము హోమములు చేసి, పిమ్మట పూర్ణాహుతి. ఇచ్చి, మూకుడులో” సంపుటముగా చేసి, కుంభీశునకు నివేదనము చేయవలెను.

 అధివాస్య యథాన్యాయం భక్తం శిష్యం తు దీక్షయేత్

 కరణీం కర్తరీం వాపి రజాంసి ఖటికామపి.

  అన్యదప్యుపయోగి స్యాత్సర్వం తద్వామగోచరే

సంస్థాప్య మూలమంత్రేణ పరామృశ్యాధివాసయేత్.

ఈ విధముగ, శాస్త్రానుసారముగా ఆధివాసితము చేసి; భక్తుడైన శిష్యునికి దీక్ష ఇవ్వవలెను. కరణి, కర్తరి, రజస్సులు. ఖటిక, ఇంకను ఉపయుక్తములైన వస్తువులు, వీటి నన్నింటిని ఆతని ఎడమ ప్రక్క దగ్గరగా ఉంచి, “మూల మంత్రముచే స్పృశించి, అధివాసితములు చేయవలెను.

 నమో భూతేభ్యశ్చ బలిః కు శే దేయః స్మరన్ హరిమ్

 మణపం భూషయిత్వాథ వితానఘటిలడ్డుకైః.

మణ్డలేథ యజేద్విష్ణుం తతః సన్తర్ప్య పావకమ్

ఆహూయ దీక్షయేచ్ఛిష్యాన్ బద్ధ పద్మాసనస్థితాన్.

హరిని స్మరించుచు “నమో భూతేభ్యః” అని భూతబలిని కుళముల పై ఇవ్వవలెను. పిదప వితానము (చందన) చేత, ఘటముచేత, లడ్డుల చేత మండలమును అలంకరించి, మండలముపై విష్ణువును . పూజింపవలెను. పిమ్మట ఆగ్నిని పూజించి పద్మాసనము కట్టి కూర్చున్న శిష్యులను పిలచి వారికి దీక్ష ఇవ్వవలెను.

సంప్రోక్ష్య విష్ణుం హస్తేన మూర్ధానం స్పృశ్య వై క్రమాత్

ప్రకృత్యా దివికృత్యనాం సాధిభూతాధిదైవతామ్

సృష్టి మాధ్యాత్మికీం కృత్వాహృది తాం సంహరేత్ర్కమాత్

 తన్మాత్రభూతాం సకలాం జీవేన సమతాం గతామ్.

విష్ణువును హస్తముచే ప్రోక్షించి, శిరస్సును స్పృశించి, క్రమముగా ప్రకృతి మొదలు వికృతుల వరకును గల, అధిభూతాధి దైవతములతో కూడిన సృష్టినిగూర్చి మనస్సులో భావనచేసి దానిని మరల క్రమముగా ఉపసంహరించి, ఆసృష్టి యంతయు తన్మాత్రలుగా అయిపోయినట్లును, జీవునితో సమానమైననట్లును భావన చేయవలెను.

తతః సంప్రార్థ్య కుమ్భేశం సూత్రం సంహృత్య దేశిక 

అగ్నేః సమీపమాగత్యపార్శ్వేతం సన్ని వేశ్య తు.

మూలమనేణ సృష్టిశమాహుతీనాం శతేన తమ్

 ఉదాసీన మఠాసాద్య పూర్ణాహుత్యా చ దేశికః.

  శుక్లం రజః సమాసాద్య మూలేన శతమనితమ్

 సన్హాడ్య హృదయం తేన హుంఫట్ కారాంత సంయుతై

 వియోగపద సంయుక్తైర్బీజై పాదాదిభిః క్రమాత్

 పృథివ్యా దీని తత్త్వాని విశ్లిష్య జుహుయాత్ర తః.

పిమ్మట గురువు కుంభేశుని ప్రార్థించి, సూత్రమును ప్రోగుచేసి, అగ్ని దగ్గరకు వచ్చి, దానిని అగ్ని పార్శ్వము నందుంచి, సృష్టికి అధిపతియైన ఆ అగ్నిని మూలమంత్రముతో నూరు అహుతులతోను, పిమ్మట పూర్ణాహుతితోను పూజించ వలెను. మూలమంత్రముతో నూ-రుసార్లు అభిమంత్రించిన తెల్లనిరజస్సుతోహృదయతాడనము చేయవలెను, వియోగపద సంయుక్త ములును, పాదాదీంద్రియ ఘటితములును, బీజయుక్తములును అగు వాక్యములతో క్రమముగా పృథి వ్యాది తత్త్వ విశ్లేషణము చేసి హోమము చేయవలెను.

వహ్నావఖిల తత్త్వానామాలయే వ్యాహృతే హరౌ

నీయమానం క్రమాత్సర్వం తత్రాధ్వానం స్మరేద్బుధః.

తాడనేన వియోజ్యైవాదాయాపొద్య శామ్యతామ్

 ప్రకృత్యాహృత్యజుహుయాద్యథోక్తే జాతవేదసి.

పండితుడు అఖిలతత్వములకును నిలయమైన వహ్నియందును, వ్యాహృతుడగు హరియందును సమస్తమైన అర్చనామార్గము క్రమముగ ఉంచబడుచున్నట్లు స్మరింపవలెను. తాడనముచే విడదీసి, గ్రహించి, శమింపచేసి ప్రకృతిచే స్వీకరించి, పూర్వోకమైన అగ్నియందు హోమము చేయవలెను.

 గర్భాధానం జాతకర్మ భోగం చైవ లయం తథా

 హుత్వాష్టా తత్ర తత్రైవ తతః శుద్ధను హోమయేత్.

గర్భాధానమును, జాతకర్మను, భోగమును, లయమును, ఆ అగ్నియందే ఎనిమిది హోమములు చేసి, పిమ్మట శుద్ధహోమము చేయవలెను.

శుద్ధం త త్వం సముద్ధృత్య పూర్ణాహుత్యా తు దేశికః సశయేద్ధి పరే తత్వే యావదవ్యాకృతం క్రమాత్.

గురువు శుద్ధతత్త్వమును గ్రహించి, దానిని ఆవ్యాకృతమువరకును క్రమముగ పూర్ణాహుతిచే పరతత్త్వము నందు హోమము చేయవలెను.

తత్పరం జ్ఞానయోగేన విలాప్య పరమాత్మని

 విముక్తబన్జనం జీవం పరస్మిన్న వ్యయే పదే.

నిర్వృతం పరమానన్దే శుద్దే బుద్దే స్మరేద్బుధః

దద్యాత్పూర్ణాహుతిం పశ్చాదేవం దీక్షాసమాప్యతే.

పండితుడు, జ్ఞానయోగముచేత ఆ పరమును పరమాత్మయందు విలీనముచేసి, బంధ విముక్తుడై జీవుడు శుద్దము, జ్ఞానస్వరూపము, నిర్వికారము, పరమానందరూపము అగు పరమాత్మయందు ఆనందము పొందు చున్నట్లు భావింపవలెను. పిమ్మట పూర్ణాహుతి ఇవ్వవలెను. ఈ విధముగా దీక్ష పూర్తి యగును.

ప్రయోగమంత్రాన్ వక్ష్యామి యైర్దీక్షాహోమసంలయః

ఓం యం భూతాని విశుద్ధం హుం ఫట్

అనేన తాడనం కుర్యాద్వియోజనమిహ ద్వయమ్

దీక్షా-హోమ- విలయముల కుపయుక్తము లగు యోగమంతములను చెప్పెదను. ఓం యం భూతాని విశుద్ధం హుం ఫట్ అను మంత్రముచే తాడనమును, వియోజనమును చేయవలెను.

ఓం యం భూతాన్యా పాతయేహమ్

ఆదానం కృత్వా చానేన ప్రకృత్యా యోజనం శృణు

 ఓం యం భూతాని పుంశ్చాహో.

“ఓం యం భూతాన్యాపాతయేఒహమ్” అను మంత్రముచే ఆదానము చేయవలెను. ప్రకృతితో యోజనము చేయు మంత్రమును వినుము, “ఓం యం భూతాని పుంశ్చాహో” అనునది ప్రయోజన మంతము.

 హోమమంత్రం ప్రవశ్యామి తతః పూర్ణాహుతేర్మనుమ్

ఓం భూతాని సంహర స్వాహా ఓం అం ఓం నమో భగవతే వాసుదేవాయ వౌషట్ పూర్ణాహుత్యనన్త రే తు తత్వే శిష్యం తు సాధయేత్

 ఏవం తత్త్వాని సర్వాణి క్రమాత్సంశోధయేద్బుధః.

హోమ మంత్రమును, పిమ్మట పూర్ణాహుతి మంత్రమును చెప్పెదను- “ఓం భూతాని సంహర స్వాహా” అనునది హోమమంతము “ఓం శ్రీం ఓం నమోభగవతే వాసుదేవాయ వౌషట్” అనునది పూర్ణాహుతి మంత్రము. పూర్ణాహుత్యనంతరము తత్త్వమునందు శిష్యుని సాధించవలెను. ఈ విధముగా బుధుడు కమముగ సర్వతత్త్వ సంశోధనము చేయవలెను.

నమోనైన స్వబీజేన తాడనాది పురః సరమ్

ఓం వాం కర్మేంద్రి యాణి-

ఓం దేం బుద్దీన్డియాణి-

 యం బీజేన సమానత్లు తాడనాదిప్రయోగకమ్.

నమః అనునది అంతమునందుగల ఆయా తత్త్వముల బీజములతో తాడనాది పూర్వకముగా తత్వసంశోధనము చేయవలెను. “ఓం వాం కర్మేస్ట్రియాణి నమః ఓం దేం బుద్దింద్రియాణి నమః' ఇత్యాది విధమున చేయవలెను. తాడనాది ప్రయోగము 'యం' బీజముతో చేసినట్లే చేయవలెను.

ఓం సుగన్ద తన్మాత్రే వియుజ్జ్వ హుం ఫట్ ఓం సంపాహి స్వాహా

 ఓం స్వం స్వం యుజ్జ్వ ప్రకృత్యా

  ఓం సుం హుం గంధతన్మాత్రే సంహర స్వాహా

 తతః హరాహుతి శివముత రేమ పయుజ్యతే.

ఓం రాం రసతన్మాత్రే

ఓం ఖేం రూపతన్మాత్రే

ఓం రం స్పర్శ తన్మాత్రే

 ఓ ఐం శబ్దతన్మాత్రే

ఓం భం మనః

ఓం సోం ఆహడ్కారః

 ఓం నం బుద్దే ఓం నం బుదౌ

ఓం ఓం ప్రకృతౌ

ఏక మూర్తవయం ప్రోక్తో దీఖ్యయోగః సమాసతః

ఏవమేవ ప్రయోగస్తు నవవ్యూహాదికే స్మృతః.

ఓం సుగతన్మాతే వియుజ హుం ఫట్ ఓం సంపాహి స్వాహా” అనునది గంధరన్నా తా వియోజన మంతము. “ఓం స్వం స్వర యజ్వ హకృత్యా' అనునది పకృతి సంయోజన మంతము, . “ఓం సుం హుం గన్డే తన్మాతో సంహర స్వాహా'' అనునది సంహార మంతము, పిమ్మట పూర్ణాహుతి చేయవలెను. మిగిలినవాటి , విషయమున గూడ ఇడ్లి చేయవలెను. “ఓం రసతన్మాతే” మొదలు “ఓం ఓం పకృతౌ” అను దానివరకును ఉన్న ఎనిమిది యతత్త త్ర్పయోగాలలో ఉపయోగించు మంత్రములు. ఇది ఏకమూర్తి విషయమున సంపూర్ణముగ చెప్పబడిన దీక్షా విధానము. నవ వ్యూహాదికమునందు కూడ ప్రయోగ మిట్లే అని చెప్పబడినది.

 దగ్ద్వ పరస్మిన్ సందధ్యాన్ని ర్వాణే ప్రకృతిం నరః

అవికారే సమాదధ్యాదీశ్వరే ప్రకృతిం నరః.

శోధయిత్వాథ భూతాని కర్మాజ్గాని విశోధయేత్

బుద్ధ్యాఖ్యానథ తన్మాత్రం మనో జ్ఞానమహజ్కృతమ్.

నరుడు ప్రకృతిని దహించి దానిని పరమ నిర్వాణమునందు చేర్చవలెను. నరుడు ప్రకృతిని అవికారుడగు ఈశ్వరునితో చేర్చవలెను. పిమ్మట భూతశుద్ధి చేసి బుద్ధాఖ్యములగు కర్మాంగములను, పిన్ముట తన్మాతలను, మనస్సును జ్ఞానమును, ఆహంకారమును శోధించవలేను.

లిజ్గాత్మానం విశోధ్యానే ప్రకృతిం శోధయేత్సునః

పురుషం ప్రాకృతం శుద్దమీశ్వరే ధామ్ని సంస్థితమ్.

రస్వగోచరీకృతా శేషభోగం ముక్తా కృతాస్పదమ్

 ధ్యాయన్ పూర్ణాహుతిం దద్యాద్దీ క్షేయం త్వాధికారిణి.

అంతమునందు లింగాత్మశోధనము చేసి చురల ప్రకృతి శోధనము చేయవలెను. పరిశుద్దుడును, ఈశ్వరధమ మున నున్న పాడును, అన్ని భోగములను తస గోచరము చేసికొనినవాడును, ముక్తి యందు స్థితి సంపాదించినవాడును అగు పాకృత పురుషుని ధ్యానించుచు పూర్ణాహుతిని ఇవ్వవలెను. ఇది అధికారికి సంబంధించిన దీక్షా విధానము.

 అజ్గైరారాధ్య మనస్య నీత్వా తత్వగణం నమమ్

 క్రమాదేవం విశోధ్యానే సర్వసిద్ది సమన్వితమ్.

 ధ్యాయన్ పూర్ణాహుతిం దద్యాద్దీ శేషయం సాధకీ స్మృతా.

మంత్రాoగమలచే ఆరాధనచేసి తత్త్వముల సముదాయమును సమముగా నుండునట్లుచేసి ఈఎధముగ సకరమముగా విశోధనముచేసి, అంతమునందు సర్వసిద్ధి సమన్వితుని ధ్యానించుచు పూర్ణాహుతి ఇవ్వవలెను. ఇది సాధకుడు చేయవలసిన దీక్షా పద్ధతి దీక్షా పద్ధతి.

ద్రవ్యస్య వా న సంపత్తి రశక్తిర్వాత్మనో యది.

  ఇష్ట్వా దేవం యథాపూర్వం సర్వోపకరణాన్వితమ్

సద్యోధివాస్య ద్వాదశ్యాం దీక్షయేద్దేశికోత్తమః.

ద్రవ్యములను కూర్చుకొనుటకు సామర్థ్యము లేకపోయినచో, లేదా తనకు శక్తి లేకపోయినచో, దేశికోత్త ముడు పూర్వము చెప్పినట్లు సర్వోపకరణసహితు డగు దేవుని ఆరాధించి వెంటనే శిష్యునకు ద్వాదశియందు దీక్ష ఇవ్వవలెను.

భక్తి వినీత కారిరై ర్గుణైః సర్వైః సమన్వితః

 శిష్యో నాతిధనీ యస్తు స్థణ్డిలేభ్యర్చ్య దీక్షయేత్.

భక్తుడును, వినయవంతుడును, సమస్త మైన శారీర గుణములు కలవాడును అగు శిష్యుడు ఆధిక ధనవంతుడు కానిచో ఆతనికి స్థండిలాభ్యర్చన చేయించి దీక్ష ఇవ్వవలెను.

ఆధ్వానం నిఖిలం దైవం భౌతం వాధ్యాత్మికీ కృతమ్

సృష్టి క్రమేణ శిష్యస్య దేహే ధ్యాత్వా తు దేశికః. 

అష్టాష్టాహుతిభిః పూర్వం క్రమాత్సంతర్పః సృష్టిమాన్

స్వమనౌర్వాసుదేవాదీన్ జ్వలనాదీన్వినర్జయేత్.

గురువు, సమస్త మైన దైవమార్గమును గాని, ఆధ్యాత్మికముగా భావన చేయబడిన భౌతిక మార్గమునుగాని, శిష్యుని దేహముపై ధ్యానించి, ముందుగా వాసుదేవాది దేవతలను, అగ్ని మొదలై నవారిని, కమముగ వారి వారి మతములతోఎనిమిదేసి ఆహుతులచేత తృప్తి పరచిపరము చేయవలెను.

హోమేన శోధయేత్సశ్చాత్సంహారక్రమయోగతః

 యాని సూత్రాణి బద్దాని ముక్త్వా కర్మాణి దేశికః.

 శిష్యదేహాత్సమాహృత్య క్రమాత్తత్త్వాని శోధయేత్

అగ్నౌ ప్రాకృతి కే విష్ణో లయం నీత్వాధిదై వికే.

 శుద్ధం తత్త్వమశుద్ధీన పూర్ణాహుత్యా తు సాధయేత్

పిమ్మట సంహార క్రమమమున హోమముచే శోధనము చేయవలెను. శిష్యుని దేహముపై కట్టిన కర్మరూప సూత్రములను విడిపించి, వాటిని ఒకచోట పోగుచేసి, తత్వ శోధనము చేయవలెను. ప్రాకృతికాగ్నియందును, ఆధిదై విక విష్ణువు నందును లయముచేసి, అశుద్ధులతో కూడిన తత్త్వమును పూర్ణాహుతిచే శుద్ధము చేయవలెను.

శిష్యే ప్రకృతిమాపన్నే దగ్ద్వా ప్రాకృతికాన్ గుణాన్.

మోచయే దధికారే పానీయుంజ్యాద్దేశిక శిశూన్

ప్రాకృతిక గుణములను దహించి శిష్యుడు ప్రకృతిష్ణుడైన పిమ్మట గురువు ఆతనిని విముక్తుని చేయవలెను; లేదా శిశువులను ( శిష్యులను) అధికారమునందు నియుక్తులను చేయవలెను.

అథాస్యాం శక్తి దీక్షాం వా కుర్యాదావే స్థితో గురుః.

 భక్త్యా సంప్రతిపన్నా నాం యతీనాం నిర్దనస్య చ

సంపూజ్య స్థబ్దిలే విష్ణుం పార్శ్వస్థం స్టాప్య పుత్రకమ్.

 దేవతాభిముఖః శిష్యప్తిర్యగాస్యః స్వయం స్థితః

అధ్వానం నిఖిలం ధ్యాత్వా పర్వభిః స్వైర్వికల్ఫితమ్.

  శిష్యదే హే తథా దేవమాధిదై వికయాజనమ్

 ధ్యానయోగేన సంచిన్య పూర్వవత్తాడనాదినా.

క్రమాతత్త్వాని సర్వాణి శోధయేత్స్థణ్డిలే హరౌ

లేదా గురువు భావస్థితుడై మరియొక శ క్తిదీక్ష యైన చేయవలెను. యతులు గాని, నిర్ధనులు గాని భక్తి పూర్వకముగ తన నాశ్రయించి నపుడు స్థండిలము పై విష్ణువును పూజించి, శిష్యని పార్శ్వమునందే కూర్చుండ బెట్టవలెను. శిష్యుడు దేవతాభిముఖుడుగా ఉండగా గురువు ముఖమును ఆడ్డముగా , త్రిప్పి కూర్చుండవలెను. స్యీయపర్వములతో వికల్పిత మైన సకలాధ్వమును శిష్యునిదేహము పై ధ్యానించి పిమ్మట ఆధిదై వికఫూజ చేయవలెను. ధ్యానయోగముచే చింతించి, వెనుక చెప్పిన విధమున తాడనాంకముచే క్రమముగ స్థండిలము పై నున్న హరియందు సకలతత్వసంతోఢనము చేయవలెను.

తాడనేన విడియ్యో థ గృహిశ్వాత్మనీ తత్పరః.

 దేవే సంయోజ్య సంధ్య గృహీత్వా తత్స్వభావతః

ఆనీయ శుద్దభావేన సన్జయిత్వా క్రమేణ తు.

  శోధయేర్ధ్యానయోగేన సర్వతో జ్ఞానముద్రయా

పిమ్మట తాడనముచేత విడిపించి, తత్పరత్వముతో తనలో గ్రహించి, దేవునితో సంబంధింప చేసి, పరిశోధనము చేసి, దేవస్వరూపమున గ్రహించి, శుద్ధఖవము తో తీసికొని వచ్చి, క్రమముగ సంధింపడేసి, డ్యానగము నవలంబించి జ్ఞానముద్రతో శోదిం పవలెను.

 శుద్ధేషు సర్వతత్వేషు ప్రధానే చేశ్వరే స్థితే.

 ధగా విర్వావయేచ్ఛిష్యాన్ చదే జై  నియోజయేత్

 నినణేత్సిద్ధిమాన్హే వా సాధకం దేశికోత్తమః.

సర్వతత్వములును శుద్ధము లే న పిన్ముట ప్రధానుడగు ఈశ్వరుడు మాత్రము ఉండగా, శిష్యులను(పాశములను) దహించి నిర్వాసితులను చేయవలెను. ఈశ్వరస్థానమున వారిని నియుక్తులను చేయవలెను. లేదా దేశికోత్తముడు సాధకుని కొద్దిమార్గమును పొందింపచేయవలెను.

 ఏవమేవాధికారస్థో గృహే కర్మణ్యతంద్రితః

ఆత్మానం శోధయంస్తిష్టే ద్యావద్రాగశయో భవేత్.

అధికారము గల గృహస్థుడు ఈ విధముగ కర్మాచరణ విషయమున ఆలసత్వము లేనివాడై, రాగము క్షీణించు వరకును ఆత్మశోధకము చేసికొనుచు ఉండవలెను.

క్షీణరాగమథాత్మానం జ్ఞాత్వా సంశుద్దకిల్బిష

 ఆరోపః ప్య పుత్రే శిష్యే వా హ్యధికారం తు సంయమీ.

 దగ్ద్వా మాయామయం పాశం ప్రవ్రజ్య స్వాత్మని స్థితః

 శరీరపాతమాకాజ్క్షన్నా సీతావ్యక్త లిజ్గవాన్.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే సర్వదీక్షాకథనం నామ సప్తవింశోధ్యాయః.

తన కున్నరాగము క్షీణించిన దను విషయము గుర్తించి, పాపము లన్నియు తొలగిన ఆతడు పుత్రునకు గాని శిష్యునకు గాని అధికారము అప్పగించి, సంయమియై, మాయామయ మగు పాశమును దహింపచేసికోని, సన్యాసము స్వీకరించి, ఆత్మ చింతాపరాయణుడై, తన స్థితిని ఇతరులకు వ్యక్తముచేయక శరీరపాతమునకై (మరణమున కై) వేచి యుండవలెను.

అగ్ని మహాపురాణములో సర్వదీక్షాకథన మను ఇరువదిఏడవ అధ్యాయము సమాప్తము.