అగ్ని మహా పురాణము

280 - అథ సర్వరోగ హరాణ్యౌషధాని

ధన్వంతరి రువాచః-

శారీరమాన సాగన్తు సహజావ్యాధయో మతాః

శారీరా జ్వరకుష్టాద్యా క్రోధాద్యా మానసా మతాః.

ఆగన్తవో విమాతోత్థాః సహజాః క్షుజ్ఞ రాదయః

శారీరాగన్తు నాశాయ సూర్యవారే మృతం గుడమ్.

లవణం సహిరణ్యం చ విప్రాయార్చ్య సమర్పయేత్

చంద్రే చాభ్యంగదో విప్రే సర్వరోగైః ప్రముచ్యతే.

తైలం శనైశ్చరే దద్యా దాశ్వినే గోరసాన్నదః

మృతేన పయసా లింగం సంస్నాప్య స్యాద్రుగుజ్ఘితః.

గాయత్ర్యా జుహుయాద్వహ్నౌ దూర్వాంత్రి మధురప్లుతామ్

యస్మిన్బే వ్యాధిమాప్నోతి తస్మిన్స్నానం బలిః శుబే.

మానసానాం రుజాదీనాం విష్ణోః స్తోత్రం హరంభవేత్

వాతపిత్త కిపాదోషా దాతవశ్చ తథాశృణు.

భన్వంతరి చెప్పెను : రోగములు శారీరములు మానసము, ఆగంతుకములు సహజములు యని నాల్గువిధములు. జ్వరకుషాదులు శారీరములు. క్రోధాదులు మానసములు. దేబ్బలు తగులుట మొదలగునవి ఆగంతుక ములు, ఆకలి ముసలి తనమనునవి సహజములు. శారీర ఆగంతుక వ్యాధులను తొలగించుకొనుటకు శనివారమున బ్రాహ్మణుని పూజించి ఆతనికి మృతము గుడము, లవణము, సువర్ణము దానము చేయవలెను. సోమవారమున బ్రాహ్మణునకు అభ్యంగన స్నానము చేయించిన వాడు సర్వ రోగవిముక్తుడగును. శనివారమున తైలదానము చేయవలయును. ఆశ్వీయుజ మాసమున గోరస ములను దానము చేయవలయును. శివలింగమునకు దధిమృతములతో స్నానము చేయించినవాడు రోగ విముక్తుడగుచు. త్రిమధురములలో ముంచి దూరంగా గాయత్రి మంత్రముతో హోమము చేసినవాడు, రోగవిముక్తుడగును. ఏనక్షత్రమున రోగము పుట్టినదో ఆ నక్షత్రమునందే స్నానము చేసి బలి ఇవ్వవలెను. మానస రోగములను విష్ణస్తోత్రము హరించును. ఇపుడు వాత పిత్తకఫములను దోషములను గూర్చియు ధాతువులను గూర్చియు వినుము.

భుక్తం పక్వాశయాదన్నం ద్విదాయాతి చ సుశ్రుత

అంశేనై కేన కిట్టత్వం రసతాం చాపరేణ చ.

కిట్టభాగో మలస్తత్ర విణ్మూత్రస్వేద దూషికాః

నాసామలం కర్ణమలం తథాదేహమలం చయత్.

రసభాగాద్ర సస్తత్ర సమాచ్ఛోణితతాం వ్రజేత్

మాంసం రక్తాత్తతో మేదో మేదసోఽస్థశ్చ సంభవః.

అస్థ్నోమజ్జా తతః శుక్రం శుక్రాదా గస్తథౌజసః

దేశమార్తిం బలం శక్తిం కాలం ప్రకృతి మేవ చ.

జ్ఞాత్వా చికిత్సతం కుర్యా దేృషజస్య తథాబలమ్

తిథిరిక్తాం త్యజేద్భౌమం మందభం దారుణోగ్రకమ్.

హరిగోద్విజ చన్ద్రార్క సురాదీన్ర్పతి పూజ్యచ

శృణు మంత్రమిమంది ద్వన్భేష జారంభ మాచరేత్.

బ్రహ్మ దక్షాశ్వి రుద్రేంద్రభూ చంద్రార్కా నిలానలాః

ఋష్యయశ్చౌషధి గ్రామా భూత సంఘాశ్చ పాస్తుతే.

రసాయన మివర్షిణాం దేవానా మమృతం యథా

సుదేవో త్తమ నాగానాం భైషజ్యమిద మస్తుతే.

వాతశ్లేష్మాతకో దేశో బహువృక్షో బహూదకః

అనూప ఇతివిఖ్యాతో జాంగలస్తద్వి వర్జితః.

కించిద్వృక్షోదకో దేశ స్తథా సాధారణః స్మృతః

జాంగలః పిత్తబహులో మధ్యః సాధారణః స్మృతః.

అన్న అహారము పక్వాశయమునుండి రెండుమార్గములుగా పోవును. ఒక భాగము కిట్టమగును. రెండవ భాగము రసనుగును. కిట్టభాగము మలము. అది మనమూత్ర స్వేదదూషికాదిరూపమునను నాసామల కర్ణమల దేహ మలరూపమునను పరిణతిచెందును. రసభాగమంతయు రక్తముగ మారును. రక్తమునుండి మాంసము దానినుండి మేదస్సు దానినుండి అస్తి, దానినుండి మజ్జ, దానినుండి శుక్రము, దానినుండి రాగ ఓజస్సులు పుట్టును. చికిత్సకుడు దేశ కాల పీడాబల శక్తి ప్రకృతి భేషజ బలములను గుర్తించి తదను కూలముగ చికిత్స చేయవలయును. రికాతిథులు (4, 9;14) భౌమవాసరము మందక్రూర సక్షత్రములు విడిచి చికిత్సా ప్రారంభము చేయవలయును. విష్ణుగో బ్రాహ్మణ చంద్ర సూర్యాదుల పూజ చేసి రోగినుద్దేశించి “బ్రహ్మదక్షుడు, అశ్వినీ దేవలల, రుద్ర, ఇంద్ర, నూర్య, అనిల, ఆనల, ఋషులు, ఓషధి సముదాయము, భూతసముదాయము నిన్న రక్షింతురుగాక! ఋషులకు రసాయనము ఎట్లో, దేవతలకు అమృతము ఎట్లో, ఉత్తమ నాగులకు సుధ ఎట్లో అట్లే నీకు ఈ ఔషధము ఆరోగ్యకరము, ప్రాణరక్షణము అగుగాక” అను ఆర్థములు గల మూలో క శ్లోకము లను పఠించుచు, ఔషధ ప్రారంభము చేయవలయును. బహు వృక్షములు, అధిక జలముకలిగి అనూపమను పేరుగల దేశము వాతశ్లేష్మకరము. అట్లుకానిది జాంగలము. అల్పవృక్షోదకములు గల దేశము సాధారణము. జాంగలము పిత్తమును వృద్ధిపొందించును. సాధారణదేశము, మధ్యముగ నుండును.

రూక్షః శీతశ్చలో వాయుః పిత్తముష్ణం కటుత్రయమ్

 స్థిరామ్ల స్నిగ్ధమధురం బలాశం చ ప్రచక్షతే.

వృద్ధిః సమానైరేతేషాం విపరీతైర్వి పర్యయః

రసాఃస్వాద్వమ్ల లవణాః శ్లేష్మలావాయు నాశనాః.

కటుతి క్త కషాయాశ్చ వాతలాః శ్లేష్మ నాశనాః

కట్వమ్లలవణాజ్ఞేయ స్తథా పిత్తవీవర్దనాః.

తిక్తస్వాదు కషాయాశ్చ తథాపిత్త వినాశనాః

రసస్యైష గుణోనాస్తి విపాకస్యైష ఇష్యతే.

వీర్యోష్ణాః కషావాతఘ్నాః శీతాః పిత్తవినాశీనాః

ప్రభావత స్తథాకర్మ తేకుర్వన్తి చ సుశ్రుత.

శిశిరేచ వసన్తేచ నిదాఘేచ తథాక్రమాత్

చయప్రకోప ప్రశమాః కఫస్యతు ప్రకీర్తితాః.

నిదాఘ వర్షారాత్రౌచ తథా శరది సుశ్రుత

చయప్రకోప ప్రశయాః పవనస్య ప్రకీర్తితాః.

మేఘకాలే చ శరది హేమన్తే చ యథాక్రమాత్

చయప్రకోప ప్రశమాస్తథా పిత్తస్య కీర్తితాః.

వర్షాదయో విసర్గాస్తు హేమన్తాద్యా స్తథాత్రయః

శిశిరాద్యా స్తథాఽఽదానే గ్రీష్మాన్తా ఋతవస్త్రయః.

సౌమ్యో విసర్గస్త్వాదాన మాగ్నేయం పరికీర్తితమ్

వర్షాదీంస్త్రీ నృతూన్సోమశ్చ రన్సర్యాయశోరసాన్.

జనయత్య మ్లలవణ మధురాంస్త్రీ న్మథాక్రమమ్

శిశిరాదీన్మతూ నర్కశ్చరన్పర్యాయశోరసాన్.

వివర్ధయేత్తథా తిక్తకషాయ కటుకాస్క్రమాత్

యథారజన్యో వర్గన్తే బలమేకం హివర్ధతే.

క్రమశోఽథ మనుష్యాణాం హీయమానాసుహియతే

రాత్రి భుక్తదినానాం చ వయసశ్చ తథైవ చ.

ఆదిమధ్యావసానేషు కఫపిత్త సమీరణాః

ప్రకోపం యాన్తి కోపాదౌ కాలే తేషాం చ యఃస్మృతః.

ప్రకోపోత్తర కే కాలేశమస్తేషాం ప్రకీర్తితః

అతి భోజనతో విప్రతథాచా భోజనేన చ.

రోగాపొసర్వే జాయ నే వేగోదీరణ ధారడైః

అన్నేన కు షేర్ధ్వా వంశావేకం పానేన పూరయేత్.

 ఆశ్రయం పవనా దీనాం తథైక మవ శేషయేత్

వ్యాధేర్ని దానస్య తథా విపరీతమధౌషధమ్.

వాతము రూక్ష శీతళల స్వభావము కలది. పిత్తము ఉష్ణము. కటుత్రయము పిత్తమును పెంచును. కఫము స్థిర ఆమ్ల స్నిగ్ధ మధుర స్వభావము కలది. సమాన వస్తువులచే యిది వృద్ధి చెందును. అసమాన వస్తువులచే తగ్గును. మధుర, ఆమ్ల, లవణ, రసములు శ్లేష్మకరములు, వాయునాశకములు. కటుతిక కషాయరసములు వాయువృద్ధీకరములు కఫనాశకములు. కలు ఆమ్లలవణ రసములు పిత్తవర్ధకములు. తిక్త మధుర కషాయరసములు పిత్తనాశకములు. ఈ గుణ ములు రసములవి కాపు, వాటి విపాకమునకు చెందినవని గ్రహించ వలెను, ఉష్ణవీర్యములు కథనాశకములు, శీతవీర్యములు పిత్తనాశక ములు. ఓ సుశ్రుతా! ఇవన్నియు తన ప్రభావముచే ఆయా కార్యములను చేయును. శిశిర వసంత గ్రీష్మము లందు క్రమముగ, కఫములకు చయము, ప్రకోపము, ప్రశ మనము వుండును. సుశ్రుతా ! వాయువునకు గ్రీష్మ, వర్ష, రాత్రి శరదృతువులందు వరుసగ చయ, ప్రకోప, పశమములు చెప్పబడినవి. ఇట్లే వర్ష, శరత్, హేమంతములందు క్రమముగి పిత్తములకు చయ, ప్రకోప, ప్రశమములు చెప్పబడినవి. వర్ష ఋతువు నుండి హేమంతమువరకు మూడు ఋతువులు ను విసర్గకాలము. శిశిరమునుండి గ్రీష్మము వరకు మూడు ఋతువులు ఆదాన కాలము. విసర్గకాలము సౌమ్యము. ఆదాన కాలము ఆగ్నేయము. వరాది ఋతుత్రయమున సంచరించుచున్న చంద్రుడు ఓషధులలో క్రమముగ, ఆమ్ల లవణ మధుర రసములను పుట్టించును. శిశిరాది ఋతుత్రయమున సంచరించుచున్న సూర్యుడు క్రమముగ, తిక్త కషాయ కటు రసములను వృద్ధిపొందించును. రాత్రులు పెరుగుచున్న కొలది ఓషధుల బలము పెరుగుచుండును. రాత్రులు తగ్గుచున్న కొలది మనుష్యుల బలము క్రమముగ తగ్గుచుండును, రాత్రి, దిన, భోజనాంతమునందును, వయస్సు యొక్క ఆది మధ్య అవసాన కాలములందును కఫ పిత్త వాయువులు ప్రకోపించును. ప్రకోప ప్రారంభమున వీటికి జయము కలుగును. ప్రకోపా నంతరము వీటికి శకునము కలుగును ఆతి భోజనము పలనను ఆధికోపవాసము వలనను, మలమూత్ర వేగనిరోధము వలనను కూడ అన్ని రోగములు పుట్టును. ఉదము నందలి రెండు భాగములను అన్న ముతోను, ఒక భాగమును జముతోను నింపి ఒక భాగమును పాయ్వాది సంచార మునకై విడువవలయును. వ్యాధికి ఏది మూలకారణమో, దానికి విపరీత మైనది ఔషధము. ఆట్టి ఔషధమును ఇవ్వవలెను. ఇదియే అన్నింటి సారము. అని నేను చెప్పుచున్నాను.

కర్తవ్యమేత దేవాత్ర మయాసొరం ప్రకీర్తితమ్

నాభేరూర్ధ్వ మదశ్చైవ గుదశ్రోణ్యేస్తథైవ చ.

బలాశ పిత్తవాతానాం దేహేస్థానం ప్రకిర్తితమ్

తథాపిసర్వగాశ్చైతే దేహే వాయుర్విశేషతః.

దేహస్య మధ్యే హృదయం స్థానం తన్మనసః స్మృతమ్

కృశోఽల్ప కేశశ్చపలో బహువాగ్విషమానలః.

వ్యోమగశ్చ తథా స్వప్నేవాత ప్రకృతి రుచ్యతే

ఆకాల పలితః క్రోధీ ప్రస్వేదీ మధురప్రియః.

స్వ ప్నే చ దీప్తిమత్ర్పేక్షి పిత్తప్రకృతిరుచ్యతే

దృఢంగః స్థిరచిత్తశ్చ సుప్రభః స్నిగ్ధ మూర్ధజః.

శుద్దామ్బు దర్శీ స్వప్నే చ కఫప్రకృతికో నరః

తామసా రాజసాశ్చైవ సాత్త్వికాశ్చ తథా స్మృతాః.

మనుష్యా మునిశార్దూల వాత పిత్తకఫాత్మకాః

రక్త పిత్తం వ్యవయాచ్చ గురుకర్మ ప్రవర్తనైః.

కదన్న భోజనాద్వాయుర్దేహేశోకాచ్చ కుప్యతి

విదా హిసాం తథోల్కానాముష్ణాన్న ధ్వనిసేవినామ్.

పిత్తం ప్రకోపమాయాతి భయేన చ తథా ద్విజ

అత్యంబు పాన గుర్వన్న భోజినాం భుక్తశాయినామ్.

శ్లేష్మా ప్రకోపమాయాతి తథాయే చాలసాజనాః

వాతా ద్యుత్థానిరోగాణి జ్ఞాత్వా శామ్యాని లక్షణైః.

అస్థికంగః కషాయత్వమాస్యే శుష్కాస్మతా తథా

జృంభణం లోమహర్షశ్చ వాతిక వ్యాధిలక్షణమ్.

నఖ నేత్రశీరాణాంతు పీతత్వం కటుతాముఖే

తృష్ణా దాహోష్ణతాచైవ పిత్తవ్యాధి నిదర్శనమ్.

ఆలస్యంచ ప్రసేకశ్చ గురుతా మధురాస్యతా

ఉష్ణాభిలాషితా చేతి శ్లైష్మిక వ్యాధి లక్షణమ్.

స్నిగ్ధోష్ణమన్న మభ్యంగ స్తైలపానాది వాతనుత్

ఆజ్యం క్షీరం సీతాద్యంచ చంద్రరశ్మ్యాది పిత్తనుత్.

సక్షౌద్రం త్రిఫలాతైలం వ్యాయామాది కఫాపహమ్

సర్వరోగ ప్రశాంత్యైస్యాద్విష్ణోర్ధ్యానంచ పూజనమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే సర్వరోగ హరౌషధాది కథనం నామాశీత్యధిక ద్విశతతమోఽధ్యాయః.

నాభిపైన పిత్తస్థానము దాని క్రింద శ్రేణీగుదములు వాతస్థానములు. కాని ఇవన్నియు శరీరమునందు తిరుగు చునుండును. విశేషించి వాయువు తిరుగును దేహమధ్యమున హృదయమున్నది. అది మనస్సునకు స్థానము స్వభావత దుర్బలుడును, అల్ప కేశములు కలవాడును. చంచలుడును ఎక్కువ మాటలాడు వాడును విషమమైన జఠరాగ్ని కలవాడును, ఆకాశమునందేగురుచున్నట్లు స్వప్నములు చూచువాడను. వాత ప్రకృతి కలవాడు. ఆకాలమున జుట్టు నరసిన వాడును క్రోధశీలుడును ఎక్కువ చెమట పట్టువాడును తీపి ఇష్టమైన వాడును, స్వప్నమునందు అగ్ని చూచువాడును పిత్త ప్రకృతి. దృఢమైన అవయవములు కలవాడును స్థిరచిత్తుడు మంచికాంతి కలవాడు దట్టమైన కేశములు కలకాడు స్వప్నమున నిర్మ లోదకమును చూచువాడు, కపప్రకృతి ఈ విధముగనే తామస, రాజస, సాత్త్వికులని మనుష్యులు మూడు విధములు ఓ ముని శ్రేష్ణా ! మానవులందర ను వాత, పిత్తకఫాత్మకులు మైథునము చేతను, బరువు పనులు చేయుట చేతను రక్త పిత్తము కలుగును. చెడ్డ ఆహారము తినుటవలనను శోక మువలనను వాయు ప్రకోపము కలుగును ద్విజోత్తమా ! దాహ మను కల్పించు వాటిని కబుతి క్త కషాయ పదార్థములను తినుట చేతను నడచుట చేతను భయము చేతను పిత్త ప్రకోపము కలు గును. ఎక్కువ జలము త్రాగువారికిని గురు వైన భోజనము చేయువానికిని భుజించి వెంటనే నిద్రపోవువానికిని, సోమరుల కును, శ్లేష్మ ప్రకోపము కలుగును. లక్షణములను బట్టి వాతాది రోగములను గుర్తించి వాటిని శమింప చేయవలయును. ఎముకలు విరుగుట, నోటి చేదు నోరుఎడుట, ఆవు లింతలు, రోమాంచము, ఇది వాత వ్యాధి లక్షణములు గోళ్ళు నేత్రములు నాడులు పచ్చబడుట, ముఖమునందు చేదదాహము వేయుట శరీరము వెచ్చగా నుండుట ఇవి పిత్త వ్యాధి లక్షణములు. సోమరితనము నోటిలో నీళ్ళు ఊరుట. శరీరము బరువుగావుండుట నోటితీపి వేడినికోరుట ఇవి కఫ వ్యాధి లక్షణములు; స్నిగ్ధము ఉష్ణమును అయిన అన్నమును, అభ్యంగ స్నానము, తైలపావాదికము, పాతరోగమును నివారించును నెయ్యి పాలు, పటిక బెల్లము, చంద్రకిరణాదులు పిత్తమును తొలగించును. త్రిఫలా తైలమును తేనెలో సేవించుట వ్యాయామాది కము కఫరోగ మును తొలగించును. విష్ణుపూజాధ్యానములు సర్వరోగ నివారకమలు.

అగ్ని మహాపురాణమున సర్వరోగహరౌషధాదికథవమను రెండువందల ఎనుబదవ అధ్యాయము సమాప్తము.