అగ్ని మహా పురాణము

169 - అథ పునః ప్రాయశ్చిత్తాని.

పుష్కర ఉవాచః-

ఏతతభృతి పాపానాం ప్రాయశ్చిత్తం వదామితే

బ్రహ్మహా ద్వాదశాబ్దాని కుటీం కృత్వా వనే వసేత్.

భిక్షే తాత్మ విశుద్ద్యర్థం కృత్వా శవశిరో ధ్వజమ్

ప్రాస్యేదాత్మానమగ్నౌ వా సమిద్దే త్రిరవాక్చిరాః,

యజేత వాశ్వమేధోన స్వర్జితా గోసవేన వా

జపన్వాఒన్యతమం వేదం యోజనానాం శతం వ్రజేత్.

 సర్వస్వం వా వేదవిదే బ్రాహ్మణాయోపపాదయేత్

వ్రతై తై ర్వ్యపోహస్తి మహాపాతకినో మలమ్.

 ఉపపాతక సంయుక్తో గో ఘ్నో మాసం యవాన్ పిబేత్

కృతవాపో వ సేదో ప్లే చర్మణా తేససంవృతః.

 చతుర్థ కాలమళ్నీ యా దవారలవణం మితమ్

గోమూత్రేణ చరేత్స్నానం ద్వౌ మాసౌ నియతేనియః.

దివానుగచ్ఛేద్ధావశ్చ తిష్ఠ న్నూర్ధ్వంరజఃపిబేత్

వృషభై కాదశా గాస్తు దద్యాద్దీ చరితవ్రతః.

అవిద్యమానే సర్వస్వం వేదవిద్భ్యో నివేద యేత్

పాద మేకం చద్రోధో ద్వౌ పాదౌ బన్దనే చరేత్.

యోజనే పాదహీనం స్యాచ్చరేత్సర్వం నిపాతనే

 కొన్తారేష్వథ దుర్గేషు విష మేషు భయేషు చ.

యది తత్ర విపత్తిః స్యాదేక పాదో విధీయతే

ఘణాభరణదో షేణ తథై వార్ధం వినిర్ధి శత్.

 దమనే దామనే రోధే శకటస్య నియోజనే

 సమ్బశృజ్జలపా శేషు మృతే పాదోనమాచరేత్.

శృజభజేస్థిభజే చ లాబ్లూలచ్ఛేదనే తథా

యావకం తు పిబేత్తావద్యావత్సుస్థా తు గౌర్భవేత్.

గోమతీం చ జ పేద్విద్యాం గోస్తుతిం గోమతీం స్మరేత్

ఏకా చేద్బహుభిర్దేవాద్యత్ర వ్యాపారితా భవేత్.

 పాదం పాదం తు హత్యాయాశ్చ రేయు స్తే పృథక్ పృథక్

ఉపకారే క్రియమాణీ విపత్తా నా స్తిపాతకమ్.

ఏతదేవ వ్రతం కుర్యురుపపాతకిన స్తథా

 అవకీర్ణివర్ణం శుద్ద్యర్థం చాంద్రాయణమథాపి వా.

పుష్కరుడు చెప్పెను : ఇటు పైపాపములకు ప్రాయశ్చిత్తములను చేప్పెదను. బ్రహ్మహత్య చేసినవాడు కుడి నిర్మించుకొని పండ్రెండు సంవత్సరములు వనములో నివసించవలెను. శిరస్సు గుర్తును తన దేహముపై ఏర్పరచుకుని ఆత్మ శుద్ధికై భిక్షాన్నము తినవలెను. లేదా ప్రజ్వలించుచున్న అగ్నిలో తలక్రిందులుగా తన శరీరమును పడవేయవలెను. లేదా అశ్వమేధయాగము గాని. స్వర్గలోకము నిచ్చు గోసవము కాని చేయవలెను. లేదా ఏదైన ఒక వేదమును జపించుచు నూరు యోజనము . నడచి వెళ్ల వలేను, లేదా వేదవేత్త యగు బ్రాహ్మణునికి తన సర్వస్వమును ఇచ్చివేయవలెను. మహా పాతకము చేసిన వారు ఈ వ్రతములచే తమ పాపములను తొలగించుకొందురు. ఉపపాతకములు చేసినవాడును, గోహత్య చేసిన వాడును ఒక మాసము యవలు త్రాగ వలేను. ముండనము చేయించుకొని, ఆ గోచర్మమును కప్పుకొని గోష్ణ మనందు నివసించ వలెను. ఉప్పు, పులుపు లేని ఆహారమును మితముగా దినమునందలి నాల్గవ భాగమున తినవలెను. నియంతేంద్రియు డై రెండు మాసములు గోమూత్రముతో స్నానము చేయవలెను. పగలు గోవుల వెంట వెళ్లుచు నిలబడి గోపరాగమును త్రాగవలెను. ప్రళము పూర్తి చేసికొని పది గోవులను, ఒక వృషభమును దానము చేయవలెను. అందుకు శ క్తి లేనిచో వేదవేత్తలకు సర్వస్వమును దానము చేయవలెను. గోవును నిరోధించగా ఆవి చనిపోయినచో ఒక పాదము ప్రాయశ్చిత్తమును. కట్టి వేయుటచే చనిపోయినచో రెండు పాదముల ప్రాయశ్చిత్తమును నాగలికి కట్టి నపుడు చనిపోయినచో మూడు వంతులును, కొట్టగా చనిపోయినచో పూర్తిగను ప్రాయశ్చిత్తము చేయవలెను. అడవులందును, దుర్గ ములందును, విషయప్రదేశములందును, భయము బందును గోవుకు ఆపద కలిగినచో ఒక పాదము ప్రాయశ్చిత్తము విహితము. ఆలంకారార్థమై ఘంటాదులు కట్టుటచే మరణించినచో రెండు పాదముల ప్రాయశ్చిత్తము. గోవును దమనము చేయునపుడు గాని, చేయించునపుడు గాని కట్టి శ్రీమదగ్ని మహాపురాణము నపుడు గాని, గుదికజ్ఞ, గొలుసు, పాశము కట్టుటచే గాని మరణించినచో మూడు వంతులు ప్రాయశ్చిత్తము ఆచరించవలెను. గోవుకు కొమ్మువిరిగినను, ఎముక విరిగినను, తోక తెగినను దానికి పూర్తి ఆరోగ్యము చేకూరువరకును, గంజి త్రాగవలెను. గోమతీవిద్యను జపించుచు, గోస్తుతి - గోమతులను స్మరించుచుండవలెను. దైవవశమున ఒక గోవును అనేకులు చంపినచో వారు ఒక్కొక్కరు పాదము చొప్పున ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. గోవుకు సహాయముచేయబోగా అది మరణించినచో పాపము లేదు. ఉపపాతకములు చేసి శవా రందరును, అవకీర్ణి తప్ప ఇతరులను, శుద్దినిమిత్తమై, ఈ వ్రతమునే చేయవలెను. లేదా చాంద్రాయణము చేయవలెను.

అవకీర్ణీ తు కాలేన గర్ధభేన చతుష్పథే

పాకయజ్ఞవిధానేన యజేత నిరృతిం నిశి.

కృత్వాగ్నిం విధివద్గీమా నన తస్తు సమితృదా

చన్హేంద్రగురువహ్నినాం జుహుయాత్సమృతాహుతిమ్.

 అథవా గార్దభం చర్మ వసిత్వాబ్దం చరేన్మ హీమ్

హత్వా గర్భమవిజ్ఞాయ బ్రహ్మహత్యావ్రతంచరేత్.

సురాం పీత్వా ద్విజో మోహాదగ్ని వర్ణాం సురాం పిబేత్

గోమూత్రమగ్ని వర్ణం వా పిబేదుదక మేవ వా.

సువర్ణస్తేయకృద్విషో రాజాసమభిగమ్య తు .

స్వకర్మఖ్యాపయన్ బ్రూయానాం భవానను స్వీతి.

గృహీత్వా ముసలం రాజా సకృద్ధన్యాత్స్వయం గతమ్

వధేన శుద్ద్యతే స్తేయో బ్రాహ్మణస్తప నైవ వా.

 గురుతల్పో నికృత్యైవ శిశ్నం చ వృషణం స్వయమ్

నిధాయ చాక్టిలో గచ్ఛేదానిపాతాచ్చనైరృతిమ్.

 చంద్రాయణాన్వా తీన్ మాసానభ్య సేన్ని యత్రేంద్రియః

జాతీభ్రంశకరం కర్మ కృత్వాన్యతమమిచ్ఛయా.

 చరేత్సాన పనం కృచ్ఛం ప్రాజాపత్యమనిచ్ఛతా

సజ్జ రీ పాత్రకృత్యాసు మాసం శోధనమైనవమ్.

 మలినీకరణీయేషు తప్తం స్యాద్యావకం త్ర్యహమ్

తురీ యో బ్రహ్మహత్యాయా క్షత్రియస్య వధే స్మృత.

వై శ్యేష్టమాంశో వృత్త శూద్రే జైయస్తు షోడశః

మార్జారనకులొ హత్వా చాషం మడ్డూక మేవ చ.

 శ్వగోధోలూక కాకాంశ్చ శూద్రహత్యావ్రతం చరేత్

 చతుర్ణామపి వర్ణానాం నారీం హత్వా నవస్థితామ్.

 అమత్యైవ ప్రమాప్య శ్రీం శూద్రహత్యా వ్రతం చరేత్

సర్పాదీనాం వధేనక్త మనస్థాం వాయుసంయమః.

ఆవకీర్ణిమాత్రము (వ్రతమధ్యమునందు శ్రీ సంగము చేసినవాడు) రాత్రియందు చతుష్పథమున, నిరృతి నుద్దేశించి నల్లని గాడిదను పాకయజ్ఞవిధానమున పూజించవలెను. పిమ్మట ఆ ధీమంతుడు “సమాసిక్చాత్తు మరుతః' ఇత్యాది ఋక్కుతో చంద్ర ఇంద్రగురువుల నుద్దేశించి మృతాహంతి ఇవ్వవలెను. లేదా గార్దభచర్మము కప్పికొని ఒక సంవత్సరము భూమి పై సంచరించవలెను. తెలియక భ్రూణహత్య చేసినవాడు బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తెలియక సురా పొనము చేసిన బ్రాహ్మణుడు ఆగ్ని వలే కాలుతూన్న సురగాని, గోమూత్రము గాని, జలము కాని త్రాగ వలెను. సువర్ణము నపహరించిన బ్రాహ్మణుడు రాజువద్దకు వెళ్ళి నేను ఈ అపరాధము చేసితిని, నాకు దండము నిమ్ము అని చెప్పవలెను. ఈ విధముగ తనంతట తాను వచ్చి చెప్పిన వానిని రాజు ముసలముతో ఒక్క దెబ్బ కొట్టవలెను. ఈ విధముగ చచ్చుటచే గాని, తపస్సు చేయుటచే గాని సువర్ణస్తేయము చేసిన బ్రాహ్మణుని పాపము తొలగును. గురుపత్నిగమనము చేసినవాడు స్వయముగ శిశ్నమును, వృషణములను ఖండించుకొని, వాటిని దోసిటిలో నుంచుకొని చనిపోవువరకును, నైరృతిదిక్కు వైపు వెళ్ళవలెను. లేదా నియతేంద్రియుడై చాంద్రాయణవ్రతము చేయవలెను. జాతిభ్రంశకర మగు పాప మేదైన తెలిసి చేసినవాడు “సాంతపనకృచ్చమును,” తెలియక చేసినవాడు “ప్రాజాపత్యకృచ్చమును” చేయవలెను. “సంకరీకరణ' “ఆపాత్రీకరణ” పాపములు చేసినవాడు చాంద్రాయణవ్రతము చేయవలెను. “మలినీకరణ' పాపము చేసినవాడు మూడు దినములు తప్తయావకమును త్రాగవలెను. క్షత్రియవధ చేసినవాడు బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తములో నాల్గవ వంతు చేసి కొనవలెను. వైశ్యుని వధించినచో ఎనిమిదవవంతు, సదాచార వతు డైన శూద్రుని వధించినచో పదునారవ వంతు ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. పిల్లి, ముంగిస, నెమలి, కప్ప, కుక్క, ఉడుము, గుడ్లగూబ, కాకి... వీటిని గాని, నాలుగు వర్ణములకు చెందిన ఏ స్త్రీ నైన గాని చంపినచో శూద్రహత్యా ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. సర్పాదులను చంపి నపుడు నక్త వ్రతమును, ఎముకలు లేని జీవులను చంపినపుడు ప్రాణాయామము చేయవలెను.

ద్రవ్యాణామల్పసారాణాం స్తేయం కృత్వానవేశ్మతః

చరేతా స్తపనం కృచ్చం వ్రతం నిర్వాప్య శుధ్యతి.

భక్ష్యభోజ్యాపహారణే యానకయ్యాసనస్య చ

పుష్పమూలఫలానాం చ పళ్చాగవ్యం విశోధనమ్.

 తృణకాష్టద్రుమాణాం తు శుష్కిన్న స్య గుడస్య చ

 చైలచర్మామిషాణాం తు త్రిరాత్రం స్యాదభోజనమ్.

 మణిముక్తప్రవాలానిం తొమస్య రజతస్య చ

ఆయః కాంస్యోపలానాం చ ద్వాదశాహం కణాన్న భుక్.

 కారాసకీటజీర్ణానాం ద్విశ ఫైకశ ఫస్య చ

పక్షి గనౌషధీనాం తు రజ్జ్వశ్చైవ త్ర్యహం పయః.

 గురుతల్పవ్రతం కుర్యాద్రేతః సిఇన్ స్వయోనిషు

 సఖ్యుః పుత్రస్య చ స్త్రీష కుమారీష్వన్యజాసు చ.

 వైతృష్వ సేయీం భగినీం స్వప్రియాం మాతు రేవ చ

 మాతుశ్చ భ్రాతురా ప్రస్య గత్వా చాన్గాయణం చరేత్.

 అమానుషీషు పురుష ఉదక్యాయామయోనీషు

రేతః సిక్త్వా జలేచైవ కృచ్చం సా నపనం చరేత్.

 మైథునం తు సమా సేవ్య పుంసి యోషితి వా ద్విజః

గోయానేప్సు దివా చైవ సవాసా స్నానమాచరేత్.

చాఢాలా న్యస్త్రియో గత్వా భుక్త్వా చ ప్రతిగృహ్య చ

పతత్యజ్ఞానతోవిప్రోజ్ఞానాత్సామ్యం తు గచ్చతి.

 విప్రదుష్టాం శ్రియం భర్తా నిరున్ద్యాదేక వేశ్మని

 యత్పుంసః పరదారేషు తదేనాంచారయేద్ర్వతమ్.

సాచేత్పునః ప్రదు ష్యేత సదృశేనోపమ శ్రితా

కృచ్ఛం చాబ్ధాయణం చైవ తదస్యాః పావనం స్మృతమ్.

యత్కరోత్యేక రాత్రేణ వృషలీ సేవనం ద్విజః

తద్భైక్ష్యభుర్జపన్నిత్యం త్రిభిర్వర్జెర్వ్యపోహతి.

ఇత్యాది మహాపురాణే ఆగ్నే యే ప్రాయశ్చిత్తనిరూవణం

నామైకోన సప్తప్రత్యధిక శతతమోధ్యాయః.

ఇతరులగృహమునుండి ఆల్ప మైన సారము గల వస్తువుల చౌర్యము చేసినవాడు కృచ్ఛసంతపనము చేయుటచే శుద్ధు డగును. భక్ష్యభోజ్యములను, యాన-శయ్యా-ఆసనములను, పుష్ప-ఫల-మూలములను అపహరించినవానికి పంచ గవ్య ప్రాశనము ప్రాయశ్చిత్తము. తృణ.కాష-వృక్షములను, బెల్లమును, వస్త్రమును, చర్మమును, మాంసమును అపహరిం చినవాడు మూడు రోజులు భోజనము చేయరాదు. మణులు, ముత్యములు, ప్రవాళములు, రాగి, వెండి, ఇనుము, కందు, రాళ్లు ఆపహరించినవాడు పండ్రెండు రోజులు కొంచెము అన్నము మెతుకులు మాత్రము తినవలెను. నూలు, పట్టుఉన్ని బట్టలను, రెండు డెక్కలు గల పశువులను, ఒక డెక్క గల పశువులను, పక్షులను, గంధములను, ఓషధులను, త్రాడును అపహరించినవాడు మూడు దినములు పాలుమాత్రమే త్రాగవలెను. సమానోదరు లగు స్త్రీలతోను, మిత్ర-పుత్రాదిస్త్రీలతోను, బాలికలతోను, అంత్యజాతిస్త్రీలతోను, మేనత్తకుమార్తెతోను, సోదరితోను, తల్లి సోదరి కుమార్తెతోను, తల్లి సోదరుని కుమార్తె తోను, ఆప్తని స్త్రీతోను సంగమము చేసినవాడు చాంద్రాయణవ్రతము చేయవలెను. మనుష్యభిన్న పశ్వాదులందును, రజస్వల యందును, యోనిభిన్న ప్రదేశములందును, జలమునందును రేతః సేకము చేసినవాడు కృచ్ఛసంతపనము చేయవలెను. ఎద్దుల బండియందును, నీటియందు, పగటిభాగమునందు స్త్రీతో గాని పురుషునితో గాని మైథునము చేసిన ద్విజుడు సచేత స్నానము చేయవలెను. విప్రుడు తెలియక చండాలస్త్రీతో గాని, అంత్యజాతి స్త్రీలతో గాని సమాగమము చేయుట, భుజించుట, దానము పట్టుట అను పనులు చేసినచో పతితు డగును. తెలిసి చేసినచో వారితో సము డై పోవును. చేడిపోయిన స్త్రీని భర్త ఒక యింటిలో నిరోధించి ఉంచి, పరదార సంబంధము గల పురుషుడు ఏ వ్రతము చేయవలెనో ఆ వ్రతమును ఈమెచే చేయించవలెను. సమావజాతీయునిచే పిలవబడి ఆమె మరల చెడి పోయినచో కృచ్చమును, చాంద్రాయణమును చేయవలెను. దానితో ఆమె పవిత్రు రాలగును. ద్విజుడు ఒక రాత్రి శూద్రస్త్రీసమాగమము చేసిన పాపమును, నిత్యము భిక్షాన్నము తినుట ద్వారా మూడు సంవత్సరము”లో పోగొట్టుకొనును.

అగ్ని మహాపురాణమునందు ప్రాయశ్చిత్తనిరూపణ మను నూటఅరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.