అగ్ని మహా పురాణము

229 - అథ స్వప్నాధ్యాయః

పుష్కర ఉవాచః

స్వప్నం శుభాశుభం వక్ష్యే దుఃస్వప్న హరణం తథా

నాభించినాన్యత్ర గాత్రే తృణవృక్షసముద్భవః.

చూర్ణనం మూర్ధ్ని కాంస్యాసాం ముండనం నగ్నతాతథా

 మలినాంబర ధారిత్వమభ్యఙ్గః పజ్క దిగ్దతా.

ఉచ్చాత్ప్రపతనం చైవ వివాహో గీత మేవచ

తంత్రీవాద్య వినోదశ్చ దోలారోహణమేవచ.

 ఆర్జనం పద్మలోహానాం సర్పాణామథమారణమ్

రక్తపుష్పద్రుమాణాంచ చాండాలస్యతథైవచ.

వరాహశ్వఖరోష్ట్రాణాం తథాచారోహణక్రియా

 భక్షణం పక్షి మాంసానాం తైలస్యకృసరస్యచ.

మాతుఃప్రవేశోజఠరే చితారోహణమేవచ

శుక్రద్వజాభిపతనం పతనం శశి సూర్యయోః.

దివ్యా న్తరిక్ష భౌమానాముత్పాతానాం చ దర్శనమ్

దేవద్విజాతి భూపానాం గురూణాం కోపేఅవచ.

 నర్తనం హసనం చైవ వివాహోగీత మేవచ

తంత్రీ వాద్య విహీనానాం వాద్యానామపిపాదనమ్. 

స్రోతోవహాధో గమనం స్నానం గోమయవారీణా

పంకోదకేన చ తథా మషీతోయేన వాప్యథ.

ఆలింగనం కుమారీణాం పురుషాణాంచ మైథునమ్

 హానిశ్చైవ స్వగాత్రాణాం విరేకోవమనక్రియా.

దక్షిణాశాప్రగమనం వ్యాధినాభిభవస్త థా

 ఫలానాముప హానిశ్చ ధాతూనాం భేదనం తథా.

గృహాణాం చైవ పతనం గృహ సమ్మార్జనం తథా

క్రీడా పిశాచ క్రవ్యాదవానరాంతకనరై రపి.

పరాదభిభవశ్చైవ తస్మాచ్చ వ్యసనోద్భవః

కాషాయవస్త్రధారిత్వం తద్వస్త్రైః క్రీడనంతథా.

స్నేహపానావగాహౌచ రక్తమాల్యానులేపనమ్

 ఇత్యధన్యాని స్వప్నాని తేషా మకథనం శుభమ్.

భూయశ్చ స్వపనం తద్వత్కార్యం స్నానం ద్విజార్చనమ్

 తిలై ర్హోమో హరిబ్రహ్మ శివార్క గణపూజనమ్.

తథాస్తుతి ప్రపఠనం పుంసూక్తాది జప స్తథా

 స్వప్నాస్తు ప్రథమే యామే సంవత్సర విపాకినః.

షడ్భిర్మాసైర్ద్వితీయే తు త్రిభిర్మా సైస్త్రియామికాః

 చతుర్థే త్వర్దమా సేన దశావోదరుణోదయే.

పుష్కరుడు పలికెను : శుభా శుభ స్వప్నములు, ఆశుభస్వప్న ఫలని వారణోపాయములు చేప్పేదను. నాభికప్పఇతర శరీరాంగములందు తృణములు వృక్షములు మంచుట, నెత్తి మీద పెట్టుకొన్న కాంస్య పాత్రలు బద్దలగుతల గొరిగించుకొనుట, వస్త్ర విహీనుడగుట, నినవస్త్రము , ధుంచుక, తైలము, బురద పూసి కౌనుక, పైనుచిప్సు, వివాహమగు, గీతములు వినుట, వీణా వాద్యములు విమచు మనోవినోదము చేయుట, ఉయ్యాల ఊగుట, పద్మములను లోహములను సంపాదించుట, సర్పములను చంపుట, ఎఱ్ఱటి పూవులతోనిండిన వృక్షములను చండాలులను చూచుట సూకరము, కుక్క, గాడిద, ఒంటెవాటిపై ఎక్కుట, పక్షిమాంసము భుజించుకు తైలము త్రాగుట, కిచడి తినుట , మాతృగర్భము ప్రవేశించట, చితి పై ఎక్కుట, ఇంద్రధ్వజము విరిగిపడుట, సూర్యచండులు పడిపోవు! దివ్య - అంతరిక్ష - భూలోకములందు ఉత్పాతములు కనబడుట . దేవతా - బ్రాహ్మణ - రాజ - గురుపులకు కోపము కలుగు, నాట్యమాడుక, నవ్వుట, గీతములు పాడుట, వివాహము చేయుట, వీణతప్ప మిగిలిన వాద్యములను తాము వాయించుట, నదిలో మునిగి క్రిందికి పోవుట, గోమయము, బురద, సిరా కలసిన నీళ్ళలో స్నానము చేయుట, కుమారీకన్యలను ఆలింగనము చేసికొనుట, పురుషులు పరస్పరము మైథునము చేసికొనుట, తన ఆవయపముల హానీ, మనము, విరేచనపు ఆగుట, దక్షిణదిక్కు వైపు వెళ్ళట, రోగ మ పీడితుడగుట, ఫలముల హాని, ధాతువును బద్దలు కొట్టుట, ఇండ్లను పడద్రోయుట , ఇండ్లలోతుడుచుట పిశాచ - రాక్షస - వానర - చాండారాదులతో క్రీడించుట, శత్రువుచే అవమానితుడగుట, శత్రువులనుండి కష్టములు వచ్చుట, కాషాయవస్త్రములు ధరించుట, కాషాయవస్త్రములతో ఆడుకోనుట, తైలము త్రాగుట, దానిలో స్నానము చేయుట, ఎఱ్ఱని పూలమాల ధరించుట, ఎఱ్ఱని చందనము ధరించుట, ఇవన్నియు చెడు స్వప్న ములు. వీటిని ఇతరులకు చెప్పకుండుట మంచిది. ఇట్టి స్వప్నములు వచ్చినపుడు మరల నిద్రించవలెను. స్వప్న దోషశాంతికై బ్రాహ్మణులను పూజించవలేను. తిలహోమము చేయవలెను. బ్రహ్మ విష్ణు శివులను, సూర్యగణములను పూజించి స్తోత్ర - పురుషసూక్తాదుల పారాయణము చేయవలెను. రాత్రిమొదటి తొమునందు చూచిన స్వప్నములవలము ఒక సంవత్సరములో కలుగును. రెండవజామునచూచినవాటి ఫలము ఆరు మాసములందును మూడవజామునందు చూచిన వాటిఫలము మూడుమాసములందురు, నాల్గవ జామునందుచూచిన స్వప్న ములవలము పడనై దుదినములందును కలుగును. అరుణోదయసమయమున చూచిన దానివలము పదిరోజులలోనే కలుగును.

ఏక స్యామథ చేద్రాత్రౌ శుభం వాయదివాఽ శుభమ్

 పశ్చాద్దృష్టిస్తుయ స్తత్ర తస్యపాకం వినిర్ధి శత్. 

తస్మాత్తు శోభనే స్వప్నే పశ్చాత్స్వాపో నశస్యతే

శైల ప్రాసాదనాగాశ్వ వృషభా రోహణం హితమ్.

ద్రుమాణాం శ్వేత పుష్పాణాం గగనేచ తథా ద్విజ

 ద్రుమే తృణోద్భవో నాభౌ తథా చ బహు బాహుతా.

 తథా చ బహు శీర్షత్వం పలితోద్భవ ఏవచ

సుశుక్లమాల్యధారిత్వం సుశుక్లాంబర ధారితా.

 చంద్రార్కతారా గ్రహణం పరిమార్జనమేవచ

 శక్రధ్వజాలింగనంచ ధ్వజోచ్ఛ్రాయక్రియాతథా.

 భూమ్యమ్బుదారా గ్రహణం శత్రూణాం చైవ విక్రియా

జయో వివాదో ద్యూతేచ సంగ్రామే చ తథా ద్విజ.

భక్షణం చార్ద్రమాంసానాం పాయసస్య చ భక్షణమ్

 దర్శనం రుధిరస్యాపి స్నానం వా రుధి రేణచ.

  సురారుధిరమద్యానాం పానం క్షీరస్య వాప్యథ

ఆస్త్రైర్విచేష్టనం భూమౌ నిర్మలం గగనం తథా.

 ముఖేన దోహనం శస్తం మహిషీణాం తథా గవామ్

 సింహీనాం హస్త్రినీనాంచ బడవానాం తథైవ చ. 

ప్రసాదో దేవవిప్రేభ్యో గురుభ్యశ్చ తథా ద్విజ

అంభసా చాభిషేకస్తు గవాంశృంగచ్యుతేన చ.

  చంద్రాద్భ్రష్టేనవా రామజ్ఞేయం రాజ్యపదంహితత్

రాజ్యాభిషేకశ్చ తథాభేదనం శిర సోఽప్యథ.

మరణం వహ్నిలాభశ్చవహ్ని దాహొగృహాదిషు

లబ్దిశ్చ రాజలింగానాం తంత్రీవాద్యాభివాదనమ్.

  యస్తు పశ్యతి స్వప్నాన్ తే రాజానం కుంజరం హయమ్

హిరణ్యం వృషభం గాంచ కుటుంబ స్తస్య వర్ధతే.

వృషేభ గృహశైలాగ్ర వృక్షారోహణ రోదనమ్

మృతవిష్టానులేపోవా హ్యగమ్యాగమనం తథా.

 సితవస్త్రం ప్రసన్నాభ్యః ఫలీవృక్షో నభోఽమలమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే స్వప్నా ధ్యాయో నామైకోనత్రింశదధిక ద్విశతతమోఽధ్యాయః.

ఒకే రాత్రి శుభాశుభ స్వప్నములు రెండును వచ్చినచో తరువాత వచ్చినదాని ఫలమునే చెప్పవలెను. అందుచే శుభ స్వప్నము చూచిన తరువాత నిద్రించుట మంచిదికాదు. పర్వతము, భవనము, ఏనుగు, గుఱ్ఱము, ఎద్దు ఎక్కినట్లు స్వప్నము వచ్చినచో మంచిది. పరశురామా! భూమిమీదగాని, ఆకాశమునందుగాని తెల్లటిపూవులతో నిండిన వృక్షములు కనబడినను, తన నాభినుండి వృక్షముగాని, తృణముగాని మొలిచినను. తన భుజములుగాని, శిరస్సుగాని ఆధికముగా ఉన్నట్లు కవబడినను, కేశములు తెల్లబడినను మంచి ఫలములు లభించును. శ్వేతపుష్పమాలయు, శ్వేతవస్త్రములును ధరించుట, చంద్ర - సూర్య - నక్షత్రములను వట్టుకొనుట, వాటిని తుడుచుట, ఇంద్రధ్వజమును ఆలింగనము చేసికొనుట, ధ్వజమున పైకెత్తు, ఈమి పై పడతున్న జలధారన తనమీడ ఆపుట, శత్రువినాశనమును చూచుట, వాద వివాదములందును, యుద్ధము నందునుతాను జయించుట, పాయసము భుజించుట, రక్త ముచూచుట, రక్త ములో స్నానమాడుట, సుర, మద్యము, లేదా పాలు త్రాగుట, అస్త్ర ప్రహారము తిని నేల పై దొర్లుట, ఆకాశము స్వచ్ఛమగుట, గోవు, గేదె, ఆడ సింహము, ఆడ ఏనుగు, ఆడగుఱ్ఱము వీటి పొదుగునుండి పాలు త్రాగుట, ఇవన్నియు మంచిస్వప్నములు, దేవతా . గురు . బ్రాహ్మణుల ప్రసాదము, గోశృంగము నుండి గాని, చంద్రుని నుండిగాని స్రవించు ఉదకముతో అభి షేకము చేసికొనుట . ఈ స్వప్నములు రాజ్యము నిచ్చును. పరశురామా! తాను రాజ్యాభిని కుడగుట, తన శిరస్సు ఖండితమగుట, తాను చచ్చుట, అగ్నిలో పడుట, గృహాదులకు అగ్ని దగ్ధ మగునపుడు ఆ అగ్నిలో పడుడి, రాజచిహ్నములు లభించుట, స్వయముగా వీణవాయించుట, ఈ స్వప్నములు గూడ మంచివి; రాజ్యమునిచ్చునవి. స్వప్నము చివర రాజును, ఏనుగును, అశ్వమును, సువర్ణమును, వృషభమును, గోవును చూచినవారి కుటుంబము వృద్ధిచెందును. ఎద్దు, గజము, ప్రాసాదోపరిభాగము, పర్వత శిఖరము, వృక్షము వీటి పైకెక్కుట, ఏడ్చుట, శరీరమునకు నెయ్యి, మలము అంటుకొనుట, ఆగ మ్యాస్త్రీగ మసము . ఇవి కూడ కథ స్వప్నములు.

ఆగ్నిమహాపురాణమునందు శుభాశుభస్వప్న - దుఃస్వప్న నివారణమను రెండువందల ఇరువదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.