అగ్ని మహా పురాణము

371 - అథ నరక నిరూపణమ్

అగ్ని రువాచః

ఉక్తాని యమ మార్గాణి వక్ష్యేఽథ మరణే నృణామ్

ఊష్మా వ్రకుపితః కాయే తీవ్రవాయు సమీరితః.

శరీరముపరుధ్యాఽథ కృత్ప్నాన్ దోషాన్ రుణద్దివై

ఛినత్తి ప్రాణస్థానాని పునర్మర్మాణి చై వహి.

శై త్యాత్ప్రకుపితో వాయుశ్చిద్రమన్విష్యతే తతః

ద్వేనేత్రే ద్వౌ తథా కర్ణాద్వౌతు నాసాపుటౌ తథా.

ఊర్థ్వంతు నప్త ఛిద్రాణి అష్టమం వదనం తథా

ఏతైః ప్రాణో వినిర్యాతి ప్రాయశః శుభకర్మణామ్.

ఆధః పాయురుపస్థంచ అనేనాశుభకారిణామ్

మూర్ధానం యోగినో భిత్త్వా జీవో యాత్వథ చేచ్చయా.

అంత కాలేతు సంప్రాప్తే ప్రాణేఽపాన ముపస్థితే

తమసా సంవృతే జ్ఞానే సంవృతేషు చ మర్మసు.

నజీవో నాభ్యధిష్టానాచ్చాల్యతే మాతరిశ్వనా

బాధ్వమానళ్చావయతే అష్టాంగా ప్రాణవృత్తికాః .

చ్యవనం జాయమానం వా ప్రవిశ నం చ యోనిషు

ప్రపశ్యన్తచతం సిద్దా దేవా దివ్యేన చక్షుషా.

గృహ్ణతి తత్క్ష్ణణాద్యోగి శరీరం చాతి వాహికమ్

ఆకాశ వాయుతేజాంసి విగ్రహా దూర్వ గామినః.

జలం మహేచ పంచత్వ మాపన్నః పురుషః స్మృతః

ఆతివాహిక దేహను యమదూతా నయంతితమ్.

యామ్యం మార్గం మహా మోరం షడశీతి సహస్రకమ్

అన్నోదకం నీయమానో బాంధవైర్గత్తమశ్ను తే.

యమం దృష్ట్వా యమే క్తేన చిత్రగుప్తేన చేరితాన్

ప్రాప్నోతి నరకాన్రౌ ద్రాన్దర్మో శుభపథై ర్ధివమ్.

అగ్ని దేవుడు పలికెను. యమరాజ మార్గ ములను గూర్చి చెప్పియుంటిని. మనుష్యుల మరణములను గూర్చి చెప్పే దను. శరీరమున వాయువేగము ఆధికమైనపుడు పిత్తము ప్రకో పించి శరీరమును అవరుద్ధము చేసి సకల దోషములను ఆవరించి ప్రాణ స్థానములను, మర్మస్థానమును భేదించును. శైత్యముచే వాయువు ప్రకోపించి ఐయటకు పోవుటకు రంధ్రములను అన్వేషించుట ప్రారంభించును. శరీరము పైభాగమున రెండు నేత్రములు, రెండు కర్ణములు, రెండు నాసా పుటములు, సుఖము అను ఎనిమిది రంధ్రములున్నవి. సాధారణముగా పుణ్యాత్ముల ప్రాణము వీటి ద్వారా బయటకుపోవును. పాపాత్ముల ప్రాణము క్రిందమన్న పాయూప స్థ ద్వారా పోవును. యోగుల ప్రాణము బ్రహ్మ రంధ్రమును భేదించి బయ టకు పోవును. ఆ జీవుడు ఇచ్చానుసారముగ వెడలి పోవును. అంత కాలము వచ్చినపుడు ప్రాణము ఆపానములో కలిసి పోవును, తమస్సుచే ఆవృతుడై పోవును. మర్మ స్థానములు ఆచ్చాదితములగును. అపుడు జీవుడు వాయువుచే బాధితుడై నాభి స్థానము నుండి చలించును. అష్టాంగములు కల ప్రాణ వృత్తులను తీసుకొని శరీరము నుండి బయటకు వచ్చును. దేహము నుండి బయటకు వచ్చుట మరియొక జన్మ గ్రహించుట వివిధ యోను లందు ప్రవేశించుట మొదలగు సమయములలో ఆ జీవుని సిద్ద పురుషులను దేవతలును దివ్య దృష్టితో చూడగలుగుదురు. మరణ సమనంతర మే జీవుడు ఆతి వాహిక శరీర మును గ్రహించును. అతడు త్యజించిన శరీరము నుండు ఆకాళ, వాయు. తేజస్సులు పైనున్న మూడు తత్వములలో కలసి పోవును. జల పృథ్యంశములు క్రింది తత్త్వములలో కలసి పోవును. పురుషుడు పంచత్వమును పొందుట అనగా ఇదియే. యమదూతలు వానిని ఆతివాహిక శరీరములోనికి ప్రవేశ పెట్టుదురు. యమ లోక మార్గము దాడి భయంకరము. ఎనభై ఆరు వేల యోజనముల దూరము. ఆ మార్గమువ ప్రయాణించు జీవుడు తన బంధువులిచ్చిన అన్నోదకము.ను ఆనుక వించుము. యముని చూచి ఆతని ఆజ్ఞ ప్రకారము చిత్రగుప్తుడు చెప్పిన భయంకరము సాగు నరకములను పొందును. ధర్మా త్ముడై నచో స్వర్గమునకు పోవును

భుజ్యన్తే పాపిభిర్వక్ష్వే నరకాంస్తాశ్చ యాతనాః

అష్టావింశతి రేవాధః క్షితేర్నరక కోటయః.

సప్తమస్య తలస్యా న్ తేఘోరే తమసి సంస్థితాః

ఘోరాఖ్యా ప్రథమాకోటిః సు ఘోరా తదధః స్థిరా.

అతి ఘోరా మహా ఘోరా మోరరూపాచ పంచమీ

షష్టి తరలలోరాభ్యాస ప్తమీచ భయానకా.

 భయోత్కటా కాలరాత్రీ మహాచండాచ చండయా

కోలాహలా ప్రచుడాఖ్యా పద్మారక నాయికా.

పద్మావతీ భీషణాచ భీమాచైవ కరాలికా

వికరాలా మహావజా త్రికోణా పంచకోణికా.

సుదీర్ఘా వర్తులా న ప్రభూమాచైవ సుభూమికా

దీ ప్రమాణాషా వింశతయః కోటయః పాపిదుఃఖథాః.

అష్టావింశత కోటీనాం పంచ పంచ చీనా యకాః

రౌరవాద్యాః శతంచై కం చత్వారింశ చతుష్టయమ్.

తామిస మండలామిసరీ మహాగౌరవిరహే

 అసిపత్రం వంచైవ లోహభారం తథై వచ.

నరకం కాలసూతంచ మహానరక మేవచ

సంజీవనం మహావీచి తపనం సు ప్రతాపనమ్.

 సంఘాతంచ సకాకోలం కుద్మల పూతిమృత్తికమ్

లోహశంకు మృజీషంచ ప్రధానం శాల్మలీంనదీమ్.

నరకాన్విద్ది కోటీశ నాగాన్వై మోర దర్శనాన్

పాత్య నే పాపకర్మాణ ఏకైక స్మినృహుష్వపి.

మార్జారోలూక గోమాయు గృధ్రాది వదనాశ్చతే

తై లద్రోణ్యాంతరం షిప్త్వాజ్వాలయంతిహుతాశనమ్.

అంబరీ షేషు చై వాన్యాంస్తామ్రపాలేషు చాపరాన్

ఆయః పాత్రేషు చై హాస్యాన్బహు వహ్నికణేషుచ.

శూలాగ్రాలోపిలాశ్చాన్యే భీద్యంతే నర కేఒపలే

తాడ్యంతేచ కళాభిస్తు భోజ్య నే దాప్యయోగుడాన్.

యమదూతై ర్నరాః  పాంపూన్విష్ణా రక్త కఫాదికాన్

త ప్రమద్యం పాయయంతి పాటయంతి పునర్నరాన్.

యంత్రేషు పీడయంతిస్మ భక్ష్య నే వాయసాదిభిః

తై లేనోష్ణేన సిద్యన్తే భిద్యన్తేఽనేక రాశిరః.

హాతాతేతి క్రందమానాః స్వకం నిందంతి కర్మతే

మహాపాతక జాన్ ఘోరాన్నరకా న్ప్రాప్య గర్హితాన్.

 కర్మకయాత్ప్రజాయంతే మహాపాతకిన స్త్విహ

పాపాత్ములు అనుభవించు నరకములను, బాధలను చేప్పెదను. భూమి క్రింద ఇరువది ఎనిమిది నరక శ్రేణులు వున్నవి. అవి సప్తమ తలము క్రింద ఘోరాంధకారమున నున్నవి. వీటికి వరుసగా ఘోరా, సుఘోరా, అతి మోరా, మహా మోరా, ఘోర రూపా, తరలూ - భయానకా - థయోత్కటా, కారి రాత్రీ, మహా చండా, చండా, కోలాహలా, ప్రచండా, పద్మా, నరక నాయికా, పద్మావతీ, భూషణా, భీమా కరాలికా, మహా వజ్రా, త్రికోణా, పంచ కోణికా, సుదీరా, వర్తులా, సప్త భూమా, సుభూమికా, దీపమాయా యని పేర్లు. ఈ ఇరువది ఎనిమిది శ్రేణులును పాపాత్ములకు దుఃఖముల నిచ్చును. వీటిలో ఒక్కొక్క దాని యందు ఐదేసి చొప్పున ప్రధాన స్థానము లుండును. వాటికి రౌరవాది నామములు. వీటి మొత్తము సంఖ్య నూట నలుబది ఐదు. లాస అంధతామిస మహా గౌరవ గౌరవ - అసిపత్రవన, లోహభార, కాలసూత్ర మహా నరక, సంజీవన, మహావీచి, తపన, సంప్రలాపన, సంఘాత, కాజోల, కుర్మల, పూతివృత్తిక, లోహశంకు, ఋజీష, ప్రధాన శాల్మలీవృక్ష, వై తరిణీనది మొదలైన వాటిని అన్ని నరకములందను కోటీ నాయకులుగా తెలుసుకొనవలెను. ఇవి చాల భయంకరములు. పాపాత్ములను వీటిలో ఒక ్కక్క దాని యందు లేదా అనేకము లందు పడవేయ వచ్చును. యమ దూతల ముఖములు మార్జార, ఉలూక, గోమాయు, గృధ్రాదుల ముఖముల వలె వుండును. నూనె తొట్టిలో మనుష్యుని పడ వేసి అగ్నిని రగల్చెదరు. కొంతమందిని బొగ్గుల మీదను, కొంతమందిని తామ్ర పాత్రమునందును, మంగలముందును, లోహ పాత్రలఁదును పడవేయుదురు. కొందరిని శూలము పై గుచ్చుదురు. కొందరిని నిరకములో పడవేసి ఛేజించుదురు. కొందరిని కొరడాలతో కొట్టుదురు. కొందరిచే కాలిన ఆయో గోళములను మింగిఁప చేయుదురు. చాల మంది యమ దూతలు కలసి వారిచే ధూళి, మము, రక్తము, కఫము మొదలైన వాటిని తినిపించుచు, కాచిన మద్యమును త్రాగింతురు. కొందరిని రంపముతో కోయుదురు. కొందరిని గానుగలో వేసి త్రిప్పుదురు. కొందరిని కాకులు మొదలగునవి పొడిచి పొడిచీ కొందరిపై ఉష్ణ తైలము చల్ల బడును. కొందరి శిరస్సులు ఛేదింపబడును. ఆ సమయమున జీవులు ఏడ్చుచు తమ పాప కర్మను నిందింతురు. ఈ విధముగా పాపాత్ములు తమ పాపములకు నలముగ వరక బాధలననుభవించి మరల మర్త్య లోకమున జన్మింతురు.

మృగశ్వ సూక రోష్ట్రాణాం బ్రహ్మహా యోనిమృచ్ఛతి.

ఖరపుక్కశమంలేచ్ఛానాం మద్యపః స్వర్ణహార్యపి

కృమికీట పతంగత్వం గురగ స్తృణ గుల్మతామ్.

బ్రహ్మహాక్షయ రోగీస్యాత్పురాపః శ్యావద న్ తకః

స్వర్ణహారీతు కునఖి దుశ్చర్మా గురుతల్పగ.

యోయేన సంస్పృశ త్యేషాం న తల్లింగోభిజాయతే

అన్న హర్తా మయావీస్యాన్మూకో వాగపహారకః .

ధాన్యం హృర్వాతిరిక్తాంగ పిథున పుతినాశికః

తైల హృతైలపాయీ స్వాత్పూతి వక్రీస్తు సూచకః .

పరస్యయోషితం హృత్వా బ్రహ్మస్వ మపహృత్కచ

అరణ్యే నిర్జనే ధే శేజాయతే బ్రహ్మరాక్షసః.

 శిలీ రత్నహారీ హీనజాతిర్గంధాం చుంచుందరీ శుఠాన్

పతం శాకం శిఖిహృత్త్వాముఖరాధాన్యహారకః.

అజః పడుం పయః శాకోయాన ముష్టః ఫలం కపిః

మధుదంశః ఫలంగధోగృహకాక ఉపస్కరమ్.

శ్విత్రీవస్త్రం సారసంచ ఝిల్లీలవణ హారకః

ఉక్త ఆధ్యాత్మికస్తాపః శస్త్రాద్యైరాది భౌతికశ.

గ్రహాగ్ని దేవ పీడాద్యైరాధిదైవిక ఈరితః

త్రిధా తాపంహి సంసారం జ్ఞానయోగాద్వినాశయేత్ .

కృ చ్ఛ్రైర్వ్రతైశ్చ దానాద్యైర్విష్ణు పూజాది భిర్నరః.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే నరక నిరూపణం నామైక సప్తత్యధిక త్రిశతతమోఽధ్యాయః.

 బ్రహ్మ హత్య చేసిన వాడు, లేడి, కుక్క, పంది, ఒంటెయై పుట్టును. మద్యము త్రాగిన వాడు చండాల, మ్లేచ్చ జన్మ పొందును. సువర్ణము ఆపహరించిన వాడు పురుగుగాను, మిడతగాను పుట్టను. గురుతల్పగుడు తృణముగాను, గుల్మముగాను జట్టును. బ్రహ్మహత్య చేసినవాడు క్షయ రోగి యగును. సురాపానము చేసిన దాని దంతములు నల్లగా వుండును. సువర్ణ సేయము చేసిన నాని నఖములు చేడిపోవును. గురుపత్నీ గమనము చేసిన వాని చర్మము దూషిత మగును. ఏ పాపము చేసెనో ఆ పాపము యొక్క చిహ్నములతో పుట్టును. అన్నము అపహరించినవాడు మా మావి అగును. వాణిని ఆపహరించిన వాడు మూగ వాడగును. ధావ్యము అపహరించిన వానికి ఏదో ఒక అంగము అధికముగా వుండును. చాడీలు చెప్పిన వాని ముక్కు నుండి దుర్గంధము వచ్చును. తైలము అపహరించిన వాడు గబ్బిలము ఆగను. ఒకరిపై ఒకరికి చెప్పు వాడు దుర్గంధ ముఖము కలవాడగును. పర స్త్రీలను, బ్రాహ్మణ ధన మన ఆపహరించిన వాడు నిర్జన వనమున బ్రహ్మ రాక్షసుడై పుట్టును. రత్నములు హరించిన వాడు నీచ జాతిలో పుట్టును. గంధ ద్రవ్యములు హరించిన వాడు చుంచుపై పుట్టును. పత్రశాకములను అపహరించిన వాడు కోడి గాన, ధాన్యమును అపహరించిన వాడు ఎలుక గాను, పశవులను హరించిన వాడు మేక గాను, పాలు హరించిన వాడు కాకి గాను, వాహనము హరించిన వాడు ఒంటి గాను, ఫలములు హరించిన వాడు కోతి గాను, తేనే హరించిన వాడు ఈగ గాను, ఫలములు హరించిన వాడు గృధ్రము గాను, ఇంటిలోని సామాను అపహరించిన వాడు గృహకాకము గాను పుట్టును. వస్త్రములు హరించినవాడు బొల్లి కలవాడు గాను, రసమున ఆపహరించిన వాడ ను, ఉప్పును అపహరించిన వాడును ఈగగా జన్మించును. ఇది ఆధ్యాత్మిక తాపవర్ణవము. శస్త్రాదులచే కలిగిన లాపము ఆధీ భౌతికము. గృహ ఆగ్ని దేవూదుల వలన కలిగినది. ఆది భౌతికము. గృహ ఆగ్ని దేవతాదుల వలన కలిగినది ఆది దైవికము. ఈ త్రివిధ లోపముతో కూడిన సంసారమును మానవుడు జాన యోగమును కఠిన వ్రతమును దావాదులమ, విష్ణ పూజాదులన చేసి, దాట వలెను.

ఆగ్ని మహా పురాణమున వరక నిరూపణ మను మూడు వందల డెబ్బది ఒకటవ అధ్యాయము సమాప్తము.