అగ్ని మహా పురాణము

378 - పునః బ్రహ్మవిజ్ఞానమ్

ఆగ్ని రువాచః

అహం బ్రహ్మపరం జ్యోతిః పృథివ్యంబ్వనలోజ్ఘితమ్

అహం బ్రహ్మ పరం జ్యోతిర్వాయ్వాకాశ వివర్జితమ్.

 అహం బ్రహ్మ పరం జ్యోతిరాదికార్య వివర్జితమ్

 అహం బ్రహ్మపరం జ్యోతి ద్విరాడాత్మ వివర్జితమ్.

 అహం బ్రహ్మపరం జ్యోతిర్జాగ్రత్స్థాన వివర్జితమ్

అహం బ్రహ్మపరం జ్యోతిర్విశ్వభావ వివర్జితమ్.

 అహం బ్రహ్మ పరం జ్యోతిర కారాక్షర వివర్జితమ్

 అహం బ్రహ్మ పరం జ్యోతిర్వాక్పాణ్యంఘ్రి వివర్జితమ్. 

అహం బ్రహ్మ పరం జ్యోతిః పాయూపస్థ వివర్జితమ్

 అహం బ్రహ్మ పరం జ్యోతిః శ్రోత్రత్వక్చక్షు రుజ్ఘితమ్.

ఆహం బ్రహ్మపరం జ్యోతి రసరూప వివర్జితమ్

 అహం బ్రహపరం జ్యోతిః సర్వగంధ వివర్జితమ్.

అహం బ్రహ్మ పరం జ్యోతి ర్జిహ్వాఘ్రాణ వివర్జితమ్

అహం బ్రహ్మ పరం జ్యోతిః స్పర్శశబ్ద వివర్జితమ్,

అహం బ్రహ్మ పరం జ్యోతిర్మన్దబుద్ధి వివర్జితమ్

అహంబ్రహ్మ పరం జ్యోతి శ్చిత్తాహంకార వర్జితమ్.

అహం బ్రహ్మపరం జ్యోతిః ప్రాణాపాన వివర్జితమ్

 అహం బ్రహ్మపరం జ్యోతిర్ వ్యానోదాన వివర్జితమ్.

 అహం బ్రహ్మపరం జ్యోతిః సమాన పరివర్జితమ్

అహం బ్రహ్మపరం జ్యోతిర్జ రామరణ వర్జితమ్.

 అహం బ్రహ్మపరం జ్యోతి: శోక మోహ వివర్జితమ్

అహం బ్రహ్మపరం జ్యోతి: క్షుత్పిపాసా వివర్జితమ్.

 అహం బ్రహ్మపరం జ్యోతిః శబ్ధోద్భూతాది వర్జితమ్

 అహం బ్రహ్మ పరం జ్యోతిర్హిరణ్య గర్భవర్జితమ్.

 అహం బ్రహ్మపరం జ్యోతికి స్వప్నావస్థా వివర్జితమ్

 అహం బ్రహ్మపరం జ్యోతి స్తైజసాదివి వర్జితమ్. 

ఆహం బ్రహ్మపరం జ్యోతి రపకారాది వర్జితమ్

 ఆహం బ్రహ్మ పరం జ్యోతిః సభాజ్ఞాన వివర్జితమ్.

 అహం బ్రహ్మపరం జ్యోతి: ఆధ్యాహృత వివర్జితమ్

అహం బ్రహ్మ పరం జ్యోతిః సత్త్వాది గుణ వర్జితమ్.

 అహం బ్రహ్మపథం జ్యోతిః సదసద్భావ వర్జితమ్

అహం బ్రహ్మపరం జ్యోతిః సర్వాయవ వర్జితమ్.

 అహం బ్రహ్మ పరం జ్యోతి ర్భేదా భేద వివర్జితమ్

అహం బ్రహ్మ పరం జ్యోతిః సుషుప్తిస్థాన వర్జితమ్.

 అహం బ్రహ్మపరం జ్యోతిః ప్రాజ్ఞభావ వివర్జితమ్

 అహం బ్రహ్మపరం జ్యోతిర్మకారాది వివర్జితమ్.

 అహం బ్రహ్మపరం జ్యోతిర్తానమేయ వివర్జితమ్

అహం బ్రహ్మ పరం జ్యోతి ర్మితి మాతృవివర్జితమ్.

 అహం బ్రహ్మపరం జ్యోతిః సాక్షిత్వాది వివర్జితమ్

అహం బ్రహ్మ పరం జ్యోతి: కార్యకారణ వర్జితమ్.

 దేహేంద్రియ మనోబుద్ధి ప్రాణాహంకార వర్జితమ్

జాగత్స్వప్న సుషుప్త్యాది ముక్తం బ్రహ్మతురీయకమ్. 

నిత్యశుద్ద బుద్ధముక్తం సత్యమానంద మద్వయమ్

 బ్రహాహ మస్త్యహం బ్రహ్మ సవిజ్ఞానం విముక్త ఓం.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే బ్రహ్మ విజ్ఞానేఽష్ట సప్తత్యధిక త్రిశతత మోఽధ్యాయః.

అగ్ని పలికెను. పరజ్యోతి స్వరూపమును పృథివీ జల వాయు న్నమును అగు పరబ్రహ్మ నేనే. వాయువాకాశ భిన్న మగు జ్యోతిర్మయమైన పరబ్రహ్మను నేనే. అగ్న్యాది కార్య భిన్నమగు పరబ్రహ్మ నేనే. విరాట్ ఓన్న మగు జ్యోతీ రూప బహ్మ నేనే. జాదవస్థా శూన్య మగు జ్యోతీరూప బహ్మ నేనే. విశ్వ శిన్న మగు జ్యోతీరూప బహ్మ నేనే. ఆ రాక్షర వర్జితమగు జ్యోతీరూప బహ్మ నేనే. వాక్పాణిపాద శూన్యమగు జ్యోతీరూప బహ్మ నేనే. పాయూపస్థ రహితమగు జ్యోతీరూప ఒహ్మ నేనే. “తత్వక్ చకూ రహితమగు జ్యోతీరూప బహ్మ నేనే. రసరూప వివర్జితము. సర్వ గంధ శూన్యము, జిహ్వాఘ్రాణ రహితము, స్పర్శ శబ్దరహితము మనోబుద్ధి శూన్యము, చిత్తాహంకార వర్జితము, పాణాపాన, వ్యానోదాన సమాన రహితము జరా మరణ శోక మోహముత్పిపాసా వర్జితము శబోద్భూతాది శూన్యము, హిరణ్య గర్భ భిన్నము, స్వప్నావస్థారహితము. తై జసాది భిన్నము, అపకార, సభాజ్ఞాన, ఆధ్యాహృత, సత్త్వాది గుణ సద సద్భావ రహి తము సర్వావయవ శూన్యము భేదా భేద శూన్యము సుషుప్తి స్థానప్రాజ్ఞ భావమకారాది రహితము. మాన మేయ మితి మాతృత్వ రహితము సాక్షిత్వాది శూన్యము, కార్యకారణ వర్ణితము, దేహేంద్రియ మనో బుద్ధి పారిణాహంకార రహితము, జాగత్స్నప్న సుషుప్త్యాది రహితము, తురీయము నిత్య శుద్ధ, బుద్ధ, ముక్త స్వరూపము, సత్యము ఆనందము, అద్వయము , సవి జ్ఞానమగు జ్యోతి రూప బహ్మ నేనే సమాధి రూపము మోక్ష పదము అగు పరబ్రహ్మ నేనే.

అగ్ని మహా పురాణమున బ్రహ్మ విజ్ఞానమున మూడు వందల డెబ్బది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.