అగ్ని మహా పురాణము

28 - అథాచార్యాభిషేక విధానమ్

నారద ఉవాచః -

అభిషేకం ప్రవక్ష్యామి యథా కుర్యాత్తు పుత్రకః

 సిద్ధిథాక్సాదకో యేన రోగి రోగాద్విముచ్యతే.

  రాజ్యం రాజా సుతం స్త్రీ చ ప్రాప్నుయాన్మలనాశనమ్

నారదుడు పలికెను : శిష్యుడు ఆచార్యాభిషేకము ఎట్లు చేయవలెనో చెప్పెదను. 'దీని చేత సాధకుడు సిద్ధిని పొందును. రోగి రోగ విముక్తు డగును. రాజు రాజ్యమును, శ్రీ కుమారుని, పాపవినాశమును పొందును.

మృత్స్నా కుమ్బాన్ సురత్నా డ్యాన్మధ్యే పూర్వాదితో న్యసేత్ .

సహస్రావర్తి తాన్ కుర్యాదథవా శతవర్తి తాన్

మణ్డలే మణ్డలే విష్ణుం ప్రాచ్యైశాన్యోశ్చ పీఠ కే.

 నివేశ్య సక లీకృత్య పుత్రకం సాడకాదికమ్

అభి షేకం సమభ్యర్చ్య కుర్యాద్గీతాదిపూర్వకమ్.

తూర్పున ప్రారంభించి మంచి రత్నములతో కూడిన మట్టి కుండలను మండప మధ్యభాగమున ఉంచవలెను. వాటిని సహసావర్తితములు లేదా శతావర్తితములు చేయవలెను. మండంమునందు తూర్పు - ఈశాన్యదిక్కులందు పీఠము పై విష్ణువును ఉంచి, సాధకునికిని, శిష్యునికిని సకలీకరణము చేయవలెను. పిమ్మట గీతాదిపూర్వకముగా ఆచార్యునకు పూజ చేసి అభిషేకము చేయవలెను.

దద్యాచ్చ యోగపీఠాదీన్ స్వనుగ్రాహ్యాస్త్వయా నరాః

గురుశ్చ సమయాన్ బ్రూయాద్గుప్తః శిష్యోఒథ సర్వధాక్.

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే ఆచార్యాభి షేకో నామాష్టావింశోధ్యాయః

యోగ పీఠాదులను సమర్పింపవలెను. “నీవు నరులను అనుగ్రహింపవలెను”అని ప్రార్థించవలెను. గురువు కూడ శిష్యునకు నియమము లన్నియు బోధించవలెను. ఈ విధముగా గురుర క్షణ పొందిన శిష్యుడు అన్ని లాభములను సంపాదింపగలడు.

అగ్ని మహాపురాణములో ఆచార్యాభిషేక మను ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.