అగ్ని మహా పురాణము

217 - పునర్గాయత్రీ నిర్వాణమ్

ఆగ్నిరువాచః-

లింగమూర్తిం శివం స్తుత్వా గాయత్య్రాయోగ మాప్తవాన్

నిర్వాణం పరమం బ్రహ్మ వశిష్ఠోఽ న్యశ్చ శఙ్కరాత్.

నమః కనక లిఙ్గాయ వేదలిఙ్గాయ వై నమః

నమః పరమలిఙ్గాయ వ్యోమలింగాయ వై నమః .

 నమః సహస్రలిఙ్గాయ వహ్నిలిఙ్గాయ వై నమః

నమః పురాణలిఙ్గాయ శ్రుతిలిఙ్గాయ వై నమః.

నమః పాతాళ లిఙ్గాయ బ్రహ్మ లిఙ్గాయ వై నమః

నమో రహస్యలిఙ్గాయ సప్త ద్వీపోర్ధ్వలిఙ్గినే.

నమః సర్వాత్మలిఙ్గాయ సర్వలో కాఙ్గలిఙ్గినే

 నమస్త్వవ్యక లిఙ్గాయ బుద్ధిలిఙ్గాయ వై నమః.

నమోఽహఙ్కారలిఙ్గాయ భూతలిఙ్గాయ వై నమః

నమ ఇంద్రియలిఙ్గాయ నమస్త న్మాత్రలింగినే.

నమః పురుషలిఙ్గాయ భావలిఙ్గాయ వై నమః

నమో రజోర్ద్వలిఙ్గాయ సత్త్వలిఙ్గాయ వై నమః.

నమస్తే భవ లిఙ్గాయ నమ స్రైగుణ్యలింగినే

నమోఽనాగత లిఙ్గాయ తేజోలిఙ్గాయ వై నమః.

 నమో వాయూర్ధ్వలిఙ్గాయ శ్రుతిలిఙ్గాయ వై నమః

నమసేఽథర్వలిఙ్గాయ సామలిఙ్గాయ వై నమః.

నమో యజ్ఞాఙ్గలిఙ్గాయ యజ్ఞలిఙ్గాయ వై నమః

 నమస్తే తత్త్వలిఙ్గాయ దైవానుగతలిఙ్గినే.

దిశనః పరమం యోగమపత్యం మత్సమం తథా

బ్రహ్మ చై వాక్షయం దేవ శమంచైవ పరం విభో.

 అక్షయం త్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్

ఆగ్ని రువాచః

వసిష్ఠేన స్తుతః శమ్భుస్తుష్టః శ్రీపర్వతేపురా

వశిష్ఠాయ వరం దత్త్వా తత్రైవాన్త రధీయత.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే గాయత్రీ నిర్వాణ లిఙ్గస్తోత్రం నామ సప్త దశాధిక ద్విశతతమోఽధ్యాయః.

అగ్ని దేవుడిట్లు చెప్పెను : వసిష్ఠా! మరొకవసిష్ఠుడు గాయత్రీజపపూర్వకముగ లింగమూర్తియగు శివుని స్తుతించి శివుని అనుగ్రహముచే నిర్వాణస్వరూపమగు పర బ్రహ్మను పొందెను. వసిష్ఠుడిట్లు స్తుతించెను- “కనకలింగమునకు నమస్కారము, వేదలింగమునకు నమస్కారము. పరమలింగమునకు నమస్కారము. ఆకాశలింగమునకు నమస్కారము. సహస్రలింగ - వహ్నిలింగ - పురాణలింగ .వేదలింగ శివునకు మాటిమాటికి నమస్కారము చేయుచున్నాను. పాతాలలింగ - బ్రహ్మలింగ - సప్త ద్వీపోర్ధ్వ లింగమునకు మాటిమాటికి నమస్కారము. సర్వాత్మలింగ - సర్వలోకలింగ - అవ్యక లింగ - బుద్దిలింగ - ఆహంకార లింగ - భూతలింగ - ఇంద్రియలింగ - తన్మాత్రలింగ - పురుషలింగ - భావలింగ రజోర్ధ్వలింగ - సత్త్వలింగ - ధవలింగ - త్రైగుణ్యలింగ ఆనాగతలింగ - తేజోలింగ - వా మూర్ధ్వలింగ - శృతిలింగ అథర్వలింగ - సమలింగ - యజ్ఞాంగలింగ – యజ్ఞలింగ-తత్త్వలింగ - దైవకానుగ తలింగ స్వరూపుడవగు నీకు మాటిమాటికి నమస్కరించుచున్నాను. ప్రభూ! నాకుపరమయోగమును ఉపదేశించుము; నాతోసమానుడైన పుత్రుని ఇమ్ము. నాకు ఆవినాశి యగు పర బ్రహ్మయొక్క ప్రాప్తి ని కలిగించుము. పరమశాంతినిమ్ము  నావంశము ఎన్నటికిని క్షీణము కాకుండుగాక! నా బుద్ది సర్వదా ధర్మముపై లగ్నమైయుండుగాక” అగ్ని పలికెను : పూర్వము వసిష్ఠుడు శ్రీ శైలముపై స్తుతించగా శంకరుడ ప్రసన్నుడై వసిష్ఠునకు వరములిచ్చి అచటనే అంతర్ధానము చెందెను.

అగ్ని మహాపురాణమున గాయత్రీనిర్వాణకథనమను రెండు వందల పదునేడవ అధ్యాయము సమాప్తము.