అగ్నిగువాచః-
మన్వంతరాణి వక్ష్యామీ హ్యాద్యః స్వాయమువో మనుః ।
ఆగ్ని ద్రాద్యా స్తస్య సుతా యమో నామ తదా సురాః.
ఔర్వాద్యా సప్తర్షయ ఇన్స్టశ్చైవ శతక్రతుః ।
పొరావతాః సతుషిలా దేవా స్వారోచి షేన్తరే.
విపశ్చితత్ర దేవేన్ద ఊర్ల స్తంభాదయో ద్విజాః ।
చైత్ర కింపురుషా పులా స్రృతీయశ్చాత్తమో మనుః.
శ్రీ సున్తరిక్గా దేవాశ్చ సుధామాద్యా వసిష్ఠజాః ।
సప్తర్ష యోజొద్యాః పుతాశ్చతుర్ధ స్తామనో మనుః.
స్వరూపాద్యాః సురగణాః శిఖిరిశో సురేశ్వర ।
జ్యోతిర్దమాద విప్రా నవ ఖ్యాతిముఖాః సుతా.
రైవతే వితథ శ్చేనొ హ్యమిలోధా స్తథాసురాః ।
హిరణ్యరోద్యా మునయో బలబస్ధాదయః సుతాః.
మనోజవళ్చాను షేథ ఇస్త్ర స్వాత్యాదయః సురాః ।
సుమేధాద్యా మహర్షయః పరుప్రభృతయః సుతాః.
వివస్వతః సుతో విప్ర శాద్ధదేవో మను స్తతః ।
ఆదిత్యవసురుద్రాద్మా దేవా ఇన్స్ట పురస్గరః.
వసిష్ఠ కశ్యపోథాతీర్థమదగ్నిః సగౌతమః ।
విశ్వామిత్రభరద్వాజో మునయః సప్త సాంపతమ్.
ఇవ్వాకుప్రముఖాః పుత్రా అంశేన హరిరాభవత్ ।
స్వాయముచే మానసో భూదళిత స్తదన న్తరే.
నత్వో హరిర్దేవవరో వైకుళో వామనః క్రమాల్ ।
ఛాయాజః సూర్యపుత్రస్తు భవితా చాష్టమో మనుః.
పూర్వస్య చ సవర్లోనో సావర్ణిర్భవితాష్టమ। ।
సుతపాద్యా దేవగణా ధీ ప్రీమద్రౌణి కాదయః.
మున బలిరిన్దశ్చ విరజపముఖాః సుతాః ।
నవమో దక్షపావర్ణిః పారాద్వాశ్చ తదా సురా.
ఉగ్రవాద్భుత స్తేషాం సవనాద్యా ద్విజోత్తమా ।
ధృత కేత్వాయః పఠా బ్రహ్మసావర్ణిరిత్యత.
సుఖాదయో దేవగణా స్తేషాం శాంతిః శతక్రతుః।
హవిషాద్యాశ్చ మ;నయః సుక్షేత్రాద్యాశ తత్సుతాః.
అగ్నిదేవుడు చేప్పేను : ఇపుడు మన్వంతరములను గూర్చి చెప్పెదను. స్వాయం భువమనువు మొదటివాడు. ఆగ్నీధైతులు ఆతని కుమారులు. ఈ స్వాయంభువ మన్వంతరమున దేవతలు యమలః ఔర్వాదులు సప్తర్షులు, శతక్రతువు ఇంద్రుడు. రెండవది స్వారోచిష మన్వంతరము. పౌరావతలు, తుషితులు ఆనువారు దేవతలు. చైత్ర కింపురుషులు స్వారోచిషమనువు కుమారులు. విప్చత్తు ఇంద్రుడు. ఊర్జస్వంతుడు మొదలగువారు సప్తర్షులు. మూడవ పొడిఉత్తమడ. ఆజాదులు ఆతని పుత్రులు. ఆతని మన్వంతరమున సుశాంతి ఇంద్రుడు; సుధామాదులు దేవతలు వసిషపుత్రులు సప్తర్షులు. నాల్గవ మనువు ఈమసుడు. ఆతనికి ఖ్యాతి మొదలగువారు తొమ్మండుగురు కుమారులు. ఆతని మన్వంతరమున స్వరూపాదులు దేవతలు. శిఖరి ఇంద్రుడు జ్యోతిర్దోమాదులు సప్తర్షులు. ఖ్యాతి మొదలగు తొమ్మండుగురు సుతులు. ఐదవదగు రైవత మన్వంతరమున వితథుడు ఇంద్రుడు. అమితాభులు దేవతలు. హిరణ్య రోమాదులు సప్తర్షులు. ఐలబంధాదులు రైవతుని కుమారులు. ఆరవ దైన చాక్షుష మన్వంతరమున మనోజవుడు ఇంద్రుడు. స్వాత్యాదులు దేవతలు. సుమేధస్ మొదలగువారు సప్తర్షులు. పురు మొదలగువారు చాక్షుషుని పుత్రులు. ఏడవ మన్వంతరమున సూర్యపుత్రుడైన శ్రాద్ధదేవుడు మను వాయెను. ఈతని మన్వంతరమున ఆదిత్య-వసు-రుద్రాదులు దేవతలు. పురందరుడు ఇంద్రుడు. వసిష్ఠ-కాశ్యపఅత్రి-జమరగ్ని-గౌతమవిశ్వామిత్ర-భరద్వాజులు. సప్తర్షులు. ఇది ఇప్పుడు జరుగుతూన్న మన్వంతరమ. వైవస్వతమనువునకు ఇవ్వాకు మొదలగువారు పుత్రులు. ఈ అన్ని మన్వంతరములందును శ్రీమహా విష్ణువు అంశావతారరూపమున అవతరించెను. స్వాయంభువమన్వంతరమునందు 'మానసుడు' అను పేడతోన, పిదప మన జన రాణి మిగిలిన ఆరు మన్వంతరములందు, క్రమముగా- ఆజిత - సత్య – హరి-దేవవర - వైకుంఠ - వామన రూపములతోను అవతరించెను. ఛాయాదేవీ గర్భసంజాతు డై న పుత్రుడు సావర్ణి ఏడవ మనువు కాగలడు. ఇతని వర్ణము (శరీర ద్బాయ) తన అన్నదైన శ్రాద్ధ దేవుని శరీరచ్ఛాయతో సమముగా నుండును. అందుచే 'సావర్ణి' అని పేరు. ఇతని కాలమున సుతపన్ మొదలగువారు దేవతలు గాన పరమతేజః కాలు లైన ఆ్వత్థామాదులు సప్తర్షులు గాను, బలి ఇంద్రుడు గాను అగుదురు. విరబదులు మను వుత్రులు, తొమ్మిదవ మనువు పేరు దక్షసావర్ణి. ఆతని మన్వంతరమున పారాదులు దేవతలుగాను, అద్భుతుడు ఇంద్రుడుగాను, సవనుడు మొదలగు వారు సప్తర్షులు గాను అగుదురు. మను పుత్రుడు ధృతకేతువు. పదవ మనువు బ్రహ్మసావర్ణి, సుఖాదులు దేవగణములుగాను, శాంతి ఇంద్రుడు గాను, హవిష్యాదులు సప్తర్షులు గాను ఆగుదురు. సుక్షేత్రాదులు మనుపుత్రులు.
ధర్మసావర్ణిక ళ్చాయం విహజ్గాద్యా సదా సురాః ।
గణశ్చెంద్రో నిశ్చరాద్యా ముసియః పుత్రకా మనోః.
నర్వత్రగాద్యా రుద్రాఖ్య: సావర్ణిర్బవితా మనుః ।
ఋతధామా సురేన్తశ్చ హరిద్యాశ్చ దేవతాః.
తపస్యాద్యః సప్తర్షయః సులా వై దేవవన్ముఖాః ।
మనుస్త్రయోదశో శౌచ్యః సుత్రామాణాదయఃసు రా.
ఇక్టో దివస్పతి స్తేషాం దానవాదివిమర్ధనః ।
నిర్మోహాద్యాః సప్తర్షయశ్చిత్ర సేనాదయః సు.
మనుశ్చతుర్దశో భౌత్యః శుచిరిశో భవిష్యతి ।
చాక్షుషాద్యాః సుర గణా అగ్ని బాహ్వాదయో ద్విజా.
చతుర్ధశస్య భౌత్యస్య పుత్రా ఊరుముఖా మనోళి ।
ప్రవర్తయ స్తి వేదాంశ్చ భువి స పర్షయో దివః.
దేవా యజ్ఞభుజస్తే తు భూః పుత్ర పరిపాల్యతే ।
బ్రహ్మణో దివసే బ్రహ్మన్ మనవస్తు చతుర్ధశ.
మన్వాద్యాశ్చ హరిర్వేదం ద్వాపరా నే బిభేది సః ।
ఆద్యో వేదశ్చతుష్పాదః శతసహస్రసంమిత.
ఏక శ్చాసేద్యజుర్వేద సం చతుర్ధి వ్యకల్పయత్ ।
ఆధ్వర్యవం యజుర్భిస్తు ఋగ్బిడ్జెత్రం తథా మునిః.
ఔద్దాత్రం సమభిశ్చ కే బ్రహ్మత్వం బాహ్యథర్వభిః ।
త్రథమం వ్యాసశిష్యస్తు వైలో హృగ్వేదపారగః.
అస్త్రప్రమితయే ప్రాదాద్బాష్కలాయ చ సంహితామ్ ।
బౌధ్యాదిభ్యో దదౌ సోఒపి చతుర్దా నిజసంహితామ్.
యజుర్వేదతరోః శాఖాః సప్తవింశన్మహామతిః ।
వైకమాయననామానీ వ్యాసశిష్యశ్వర వై:
కాణ్వా వాజసనేయాద్యా యాజ్ఞవల్యాదిభిః స్మృతాః ।
సామ వేదతతోః శాభా వ్యాసశిష్యం స జైమిని.
సుమస్తుశ్చ సుకర్మా చ హ్యేకై కాం సంహితాం తతః ।
గృష్ణతే చ సుకర్మాఖ్యః సహస్రం సంహితా గురుః.
సుమస్తుశ్చాథర్వతరుం వ్యాసశిష్యో బిభేద తమ్ ।
శిష్యానధ్యాపయామాస వైప్పలాదాన్ సహస్రశః.
పురాణసంహితాం చ కే సూతో వ్యాసప్రసాదతః.
ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే మన్వన్తర వేద విభాగో నామ పఞ్చాశదధిక శతతమోధ్యాయః.
పిదప ధర్మసావర్ణి అను పదునొకొండవ మనువు ఆధికారమునం దుండును. ఆ మన్వంతరమునందు విహంగా దులు దేవతలు, గణుడు ఇంద్రుడు; నిశ్చరాదులు సప్తర్షులు కాగలరు. సర్వత్రగాదులు, మనువుత్రులగుదురు. పండ్రెండవ మనువు రుద్రసావర్ణి. ఆ మన్వంతరమున ఋతధాముడు ఇంద్రుడు. హరితాదులు దేవతలు, తపస్యాదులు సప్తరులు అగుదురు. దేవవంతుడు మొదలగు వారు మనుపుత్రు అదురు. పదమూడవ మనువు. రొచ్యుడు. ఆ సమయమున సుత్రామణ్యాదులు దేవతలుగను, దివస్పతి ఇంద్రుడుగను అగుదురు. ఈ ఇంద్రుడు దైత్యదానవాదులను వర్ణించును నిర్మోహాదులు సప్త రులుగ నుందురు. చిత్ర సేనాదులు మనుపుత్రులు. పదునాల్గవ మనువు భౌత్యుడు. ఆ సమయమున శుచి ఇంద్రుడుగను, చాక్షుషాదులు దేవతలుగను అగ్ని దాహ్వాదులు సప్త రులుగను ఉందురు. ఉరు మొదలగువారు మను పుత్రులు. సప్త రులు భూమండలముపై వేద ప్రచారము చేయుచుందురు. దేవతాగణములు భుజింతురు. మనుపుత్రులు ఈ భూమిని పాలింతురు. ఓ మునీ! ఒక్క బ్రహ్మదివసమున పదునాలుగురు మనుషులు ఆవిర్భవింతురు. దేవతా ఇంద్రాదులు పదునాల్గుసార్లు పుట్టుదురు. ద్వాపరాంతమున శ్రీమహావిష్ణువు వేదవ్యాస రూపమున ఆవతరించి, వేదవిభాగము చేయును. మొట్టమొదట వేదము ఒక్కటే. దానిలో నాలుగు చరణములు, ఒక లక్ష ఋక్కులు ఉన్నవి మొదట యజుర్వేద మొక్కటిగానే ఉండగా వ్యాసుడు దానిని నాలుగా విభజించెను. ఆధ్వర్యుపు యజుర్వేదము చేతను, హోత ఋగ్వేదము చేతను, ఉద్గాత సామమంత్రముల చేతను, బ్రహ్మ అథర్వవేదము చేతను, తమ తమ ఆర్విజ్యము నడుపవలె నని నిశ్చ యించెను. వ్యాసుని ప్రథమ శిష్యుడైన పైలుడు ఋగ్వేదపారంగతుడు. ఇంద్రుడు ప్రమతికిని, బాష్కలునకును సంహితను ఇచ్చేను. బాష్కలుడు తన సంహితను నాల్గుగా విభజించి బౌద్ధాదులకు ఇచ్చెను. వ్యాసశిష్యుడును, బుద్ధిమంతు డును అగు వైశంపాయనుడు యజుర్వేద మను వృక్షమునకు ఇరువది ఏడు శాఖలు నిర్మించెను. యాజ్ఞవల్క్యదులు కాణ్వ-వాజసనేయాది శాఖలను సంపాదించిరి. వ్యాసశిష్యుడై న జైమినీ సామవేద మను వృక్షమునకు శాఖలు నిర్మించెను. సుమంతు-సుకర్మలు ఒక్కొక్క సంహిత రచించిరి. సుకర్మ తన గురువునుండి వెయ్యి సంహితలను గ్రహించెను. వ్యాస శిష్యుడైన సుమంతుడు ఆథర్వవేదమునకు ఒక శాఖ ఏర్పరచి ప్రెప్పలుడు మొదలగు వేలకొలది శిష్యులకు నేర్పెను. వ్యాసుని అనుగ్రహముచే సూతుడు పురాణసంహితా విస్తారము చేసెను.
అగ్ని మహాపురాణమునందు మన్వంతరవర్ణనమను నూటఏబదవ ఆధ్యాయము సమాప్తము.
Summary of chapter 150 of the Agni Purāṇa is as follows:
The fourteen Manvantaras—the vast cosmic time-cycles each presided over by a Manu—are described. Agni names each Manu from Svāyaṃbhuva through Bhauma, along with the associated Indra, Saptarṣis, and principal devatā-gaṇas of each period. The current Vaivasvata Manvantara, the seventh, is identified as the present age. The astronomical and cosmological details of each Manvantara's duration (approximately 306 million years) and the divine governance structure are given. The chapter situates the reader within the immense sweep of cosmic time as conceived in Purāṇic cosmology.