అగ్ని మహా పురాణము
383 - అథాగ్నేయపురాణ మాహాత్మ్యమ్
ఆగ్ని రువాచః
అగ్ని దేవుడు పలికెను. నీకు బ్రహ్మ రూప మగు అగ్ని పురాణమును చెప్పితిని. విద్య విస్తృతము, సంక్షిప్తము అని రెండు విధములు. ఋగ్యజుస్సా మాథర్వ రూప మగు విద్య జగత్కారణ భూతుడగు విష్ణువు. ఛందస్సు శిక్షా, వ్యాకరణ, నిఘంటు జ్యోతిష నిరుక్త, ధర్మ శాస్త్ర, మీమాంసా, న్యాయ, ఆయుర్వేద, పురాణ, ధనుర్వేద, గాంధర్వ, అర్ధ శాస్త్ర, వేదాంతాది విద్యలు అన్నియు హరి స్వరూపములు. ఈ విద్య అపర విద్య. పరమగు ఆత్మతత్త్వమును బోధించు విద్య పర విద్య. ఈ ప్రపంచ మంతయు విష్ణు రూపము అను భావించు వానిని కలియు బాధించదు. మహా యజ్ఞమును చేయ కున్నను పితృస్వధ చేయకున్నను, భ క్తి పూర్వకముగా కృష్ణుని పూజించు వాడు పాపములను పొందడు. సర్వ కారణ భూతు డగు విష్ణువును సర్వదా ధ్యానించు వాడు ఎన్నటికిని నశించడు. పారతంత్ర్యాది దోషములు కలవాడను, విషయములచే ఆకర్షింపబడిన మనస్సు కలవాడు, పాపములు చేసినను గోవిందుని ధ్యానించుటచే ఆ పాపముల నుండి విముక్తుడగును. గోవిందుడన్నదే ధ్యానము. కేశి వుడు వున్నదే కథ. వానికై చేయునదే కర్మ. చాల చెప్పనేల. నేను చెప్పిన ఈ ఉ త్తమ పరమార్థమును తండ్రి కుమారున కుమారునకు చెప్పజాలడు. గురువు శిష్యునకు చెప్పజాలడు. సంసారములో భ్రమించు చున్న వాడు పుత్ర దారాదులను అధిక ధనమును మిత్రులను, ఇతరులను కూడ పొంద వచ్చును. కాని ఇట్టి ఉపదేశ మును పొందజాలడు. పుత్రదార, మిత్ర, తేత్ర, బాంధవాదులచే ఏమి ప్రయోజనము. ఇట్టి ఉపదేశ మే పరమ బంధువు. ఈ భూతి మార్గము, దైవము ఆసురము అని రెండు విధములు. విష్ణు భక్తిపర మైనది దైవ మార్గము. తద్విపరీతమైనది ఆసుర మార్గము. నేను నీకు బోధించిన ఈ పురాణము పవిత్రము, ఆరోగ్యము, ధన్యము, దుఃస్వప్న నాశనము. సుఖ ప్రీతికరము, మానవులకు మోక్షము నిచ్చునది. వ్రాయబడిన అగ్ని పురాణ గ్రంథము, ఎవరి గృహమునందుండో, వారికి ఉపద్రవము లేవియు వుండవు. ప్రతి దినము అగ్ని పురాణమును విను వారికి తీర్థ స్నానమెందుకు ? గోదాన మెందుకు ? యజ్ఞము లేందుకు ? ఉపవాసము లేందుకు ?
వసిష్ట ఉవాచః
వ్యాస ఉవాచః
అగ్ని పురాణములోని ఒక శ్లోకము విన్న వానికి తిలప్రస్థము, ఒక మాషము సువర్ణము, దానము చేసిన వానికి, వచ్చు పుణ్యము లభించును. ఒక అధ్యాయమును చదువుట గోదానము కంటే విశిష్టము. దీనిని చదువకోరు వానికి ఒక అహో రాత్రము నందు చేసిన పాపములు నశించును. ఆగ్ని పురాణము పఠించిన వాడు జ్యేష్ఠ పుష్కరము నందు , నూర కపిల గోవులను దానము చేసిన పుణ్యమును పొందును, ధర్మము ప్రవృత్తి, నివృత్త్యాత్మకము. అగ్ని పురాణముతో సమాన మైన శాస్త్రము లేదు. వశిష్ఠా ! నిత్యమును అగ్ని పురాణమును, చదివినను విన్నను భక్తుడగు మనుష్యుడు సర్వ పాప విముక్తుడగును. ఆగ్ని పురాణము పుస్తకము వున్న గృహమున గృహోప ద్రవములు కాని, అనర్థము కాని చోర శత్రు భయముండదు. ఆ యింటిలో గర్భస్రావ భీతి కాని, బాల గ్రహములు కాని, పిశాచాది, భయము గాని వుండదు. బ్రాహ్మ ణుడు దీనిని వినినచో వేదవేత్త యగును. క్షత్రియుడు పృథివీ పతియు అగును. వైశ్యుడు ఐశ్వర్యమును, శూద్రుడు ఆరోగ్య మును పొందును. సమ దృష్టియే విష్ణువు నందు మనస్సు నిలిపి, ఈ అగ్ని పురాణమును చదివినచో ఆచట ఉపద్రము లన్నియు నశించును. దివ్య, ఆంతరిక్ష, భౌమాది ఉపద్రవములు, దుస్వప్న ఆభిచారములు, ఇతర పాపములు వాటినన్నిం టిని, కేశవుడు నశింప చేయును. ఈ పురాణమును చదువు దానికిని, విను వానికిని, ఈ పుస్తక మును పూజించు వానికిని పూర్వోక్త ఫలము లభించును. ఈ పుస్తకమును, గంధ పుష్పాదులతో పూజించి, హేమంతము నందు ఎవడు వినునో వానికి ఆగ్ని హొమ ఫలము లభించును. శిశిర ఋతువు నందు పుండరీక ఫలమును, వసంత్రము నందు అశ్వమేధ ఫలమును, గ్రీష్మము నందు వాజపేయ ఫలమును, వర్షాకాలము నందు రాజసూయ ఫలమును, శరత్కాలమున గోసహస్ర దాన-ఫలమును పొందును. భక్తి పూర్వకముగ విష్ణు సన్ముఖ ముఖమున అగ్ని పురాణమును పూజించిన వాడు జ్ఞాన యజ్ఞముచే కేశ వుని పూజించిన వాడగును. అగ్ని పురాణము యొక్క లిఖిత పుస్తకము ఎవని గృహము నందు పూజింపబడునో వానికి జయము కలుగును. భుక్తి ముక్తులు వాని చేతిలో నుండును. ఈ విధముగ కాలాగ్నిరూపుడగు హరి బ్రహ్మ విద్యాద్వయ స్థానమగు ఈ ఆగ్ని పురాణమును నాకు బోధించివాడు. వశిష్ఠా ! ఈ విద్యాద్వయమును భక్తులకు మాత్రమే చెప్పగలవు. వశిష్టుడు పలికెను. వ్యాస ! విష్ణువు బ్రహ్మకును, అగ్ని దేవ, ముని, సహితుడనగు వాకును బోధించిన విద్యాద్వయాత్మక మగు సర్వ విషయ ప్రదర్శకమైన అగ్ని పురాణము నీకు చెప్పబడినది. వ్యాసా ! అగ్ని చే ఉపదేశింపబడివడియు, వేదతుల్య మును ఆగు ఈ అగ్ని పురాణమును ఎవడు చదువునో, వినునో, వ్రాయునో, వ్రాయించునో, చదివించునో, పూజించునో, ధరించునో ఆతడు సర్వపాప వినిర్ముక్తుడై , సర్వ కామములను పొంది స్వర్గమునగు వెళ్ళును. ఈ పురాణము వ్రాయించి బ్రాహ్మణులకు దానము చేసిన వాడు నూరు తరములను ఉద్దరించి, బ్రహ్మ లోకము పొందును. ఒక్క శ్లోకము చదివిన వాడు పాప పంక విముక్తుడగును. వ్యాస ! అందువలన సర్వ దర్శన సంగ్రహ రూపమగు ఈ పురాణమును వినదలచిన శుకాది మునులతో కూడ శిష్యులు సర్వదా వినిపించవలెను. అగ్ని పురాణమును చదివినను, చింతనము చేసినను, భుక్తి ముక్తులనిచ్చును. ఈ పురాణమును చెప్పిన అగ్ని కి నమస్కారము.
సూత ఉవాచః
వ్యాసుడు పలికెను. సూతా ! పూర్వము వశిష్ఠుడు చెప్పిన పరావిద్యా అపరావిద్యా రూపమగు పురాణమును నీకు చెప్పితిని. దీనిని చదువు భాగ్యవంతులు దుర్లభమగు ఆగ్నేయ రూపమును పొందుదురు. ఆగ్నేయమును ధ్యానించు వారు పరమాత్మ హరిని చేరిరి. విద్యార్థులు విద్యను రాజ్యార్థులు రాజ్యమును పొందిరి. పుత్రులు లేని వారు పుత్రులను ఆశయము లేనివారు ఆశ్రయమును, సౌభాగ్యము కోరువారు సౌభాగ్యమును, మోక్షమును కోరువారు మోక్షమును పొందిరి. వ్రాసిన వారును వ్రాయించిన వారును పాపరహితులై ఐశ్వర్యము పొందిరి. ఈ ఆగ్ని పురాణమును శుక పైలవాదులతో కలసి చింతన చేయుము. భుక్తి ముక్తులను పొందెదవు. సందేహములేదు. నీవు కూడ శిష్యులకు భక్తులకును ఈ పుణము వినిపించుము. సూతుడు పలికెను. శౌనకాదిమునులారా ! వ్యాసుని అనుగ్రహము వలన బ్రహ్మ రూపమగు ఈ ఆగ్నేయ పురాణము, ఆదర పూర్వకముగ వినబడినది. మీరు నైమిశారణ్యమును శ్రద్ధాయుక్తులై పరమేశ్వరుడగు శ్రీ హరిని పూజించుచున్నారు కావున మీకు బోధింపబడినది. అగ్ని ప్రోక్తమగు, ఈ ఆగ్ని పురాణము, వేదతుల్యము, ద్వి విధ బ్రహ్మ విద్యలు బోధించునది? భుక్తి ముక్తి ప్రదము. దీనిని మించిన సారము, దీనిని మించిన మిత్రుడు, దీనిని మించిన గ్రంథము, గతి, శాస్త్రము, శ్రుతి, జ్ఞానము, స్మృతి, ఆగమము, విద్య సిద్ధాంతము, మంగళము, దీనిని మించిన వేదాంతము లేవు. ఇదియే అత్యుత్తమము. దీనిని మించినది ఈ భూలోకమున లేదు. అట్టి వస్తువు దుర్లభము. ఈ అగ్ని పురాణమున సకల విద్యలు ప్రదర్శింపబడినవి. సమ సమైన, మత్స్యాద్యవ తారములు రామాయణము, హరివంశము, భారతము, నవ విధ సృష్టులు వర్ణింపబడినవి. వైష్ణ వాగ మము, పూజ, దీక్షా, ప్రతిష్ఠా, పవిత్రా రోహణాదికమం, ప్రతిమాలక్షిణాదికము, ప్రాసాద లక్షణాదికము, భుక్తి ముక్తి ప్రదములగు మంత్రములు, శైవాగయము దాని అర్థము శాక్తే యాగమము, సౌరాగమము మండలములు, వాస్తు, వివిధ మంత్రములు, ప్రతిసర్గ, బ్రహ్మాండ మండలము, భువన కోశము. ద్వీప వర్షాదులు, నదులు, గ, యా, గంగా, ప్రయాగాది తీర్థ మాహాత్మ్యము, జ్యోతిశ్చక్రము, జ్యోతిషాదికము, యుద్ధ జయార్ణవము మన్వంతరాదులు వర్జాది ధర్మములు, ఆశౌచము, దవ్య శద్ధి ప్రాయశ్చిత్తము, రాజ ధర్మములు, దాన ధర్మ మలు, వివిధ వ్రతములు, వ్యవహారములు, శాంతులు, ఋగ్వేదాది విధానము, సూర్య వంశము, సోమ వంశము, ధనుర్వే దము, వైద్యము, గంధర్వ వేదము, ఆర్థ శాస్త్రము, మీమాంసా శాస్త్రము, వ్యాయ విస్తరము, పురాణ సంఖ్యామాహాత్మ్యము, ఛందస్సు, వ్యాకరణము, అలంకారము, నిఘంటువు, శివా, కల్పము, నైమిత్తిక ప్రళయము, ప్రాకృతిక ప్రళయము, ఆత్యం తిక ప్రళయము వేదాంతము బ్రహ్మ విజ్ఞానము, అష్టాంగ యోగము స్తోత్రము, పురాణ మాహాత్మ్యము, అష్టాదశ విద్యలు దీని యందు చెప్పడినవి. ఋగ్వేదాది ఆపరా విద్యలు, ఆక్షర మగు పరా ఏద్య బ్రహ్మ యొక్క సప్రపంచ నిష్పంచ రూపము బోధింపబడినది. ఇది పది హేను వేల సంఖ్య గలది. దేవ లోకమున శతకోటి విస్తరమగు ఈ పురాణము, దేవతలచే పఠింపబడును. అగ్ని లోకహితమును గోరి దీనిని సంక్షిప్తమును చేసి ఉపదేశించెను. శౌనకాది మునులారా ! సర్వము బ్రహ్మ స్వరూప మని తెలుసుకొనుడు. ఎవడు వినునో వినిపించునో, చదువునో, చదివించునో, వాడు స్వర్గమును పొందును. రాజు నియమవంతుడై గో, భూ, హిరణ్య, దానాదులచేతను, వస్త్రాలంకారాదుల చేతను పురాణ పాఠకుని పూజించవలెను. అట్లు పూజించి, పురాణ శ్రవణ ఫలమును పొందును. పురాణాంతమున ద్విజులకు భోజనము పెట్టవలెను. ఇట్లు చేసినవాడు నిర్మలుడై, సకల ప్రయోజనములను పొంది తన వంశముతో స్వర్గము చేరును. పుస్తక ము నిమిత్తమై శర యంత్రమును, త్రాడును, పత్ర సముదాయమును. పట్టినాబంధ మును వస్త్రాదులను ఇచ్చువాడు స్వర్గమును పొందును. పుస్తకము దానము చేసినవాడు బ్రహ్మలోకము పొందును. ఈ పుస్త కము ఎవరి ఇంటిలో వుండునో వానికి ఉత్పాత భయముండదు. ఆతడు భుక్తి ముక్తులను పొందును. ఈ ఆగ్ని పురాణము ఈశ్వర రూపమైనది, అని మీరు చింతింపుడు. ఇట్లు పలికి పొరిచే పూజింపబడి సూతుడు వెళ్ళి పోయెను. శౌనకాదులు విష్ణువును పొందిరి.
అగ్ని మహాపురాణమున ఆగ్నేయ పురాణ మాహాత్మ్యమను మూడు వందల ఎనుబది మూడవ అధ్యాయము సమాప్తము.
