అగ్ని మహా పురాణము

Table of Contents

221 - అథానుజీవివృత్తమ్.

పుష్కర ఉవాచః

పుష్కరుడు పలికెను : భృత్యుడు రాజాజ్ఞను, శీఘ్యడు గుర్వాజ్ఞను పాలించినట్లును. పతివ్రత భర్త ఆజ్ఞ పాలించినట్లును పాలించవలెను. రాజు మాటలను ఎన్నడును వ్యతిరేకించక సర్వదా అతనికి అనుకూలమగు మాటలు చెప్పవలెను. ఏదైన రాజునకు హితకరము. కాని అతనికి ఆప్రియము ఆయిన విషయము చెప్పవలసి వచ్చినపుడు అతనికి రహస్యముగా చెప్పవలెను. ధనాదాయమునకు సంబంధించిన కార్యమునందు నియుక్తుడే నవాడు రాజధనమును అపహరింప కూడదు. రాజసన్మానమును ఉపేక్షింపగూడదు. రాజును మాటలలోగాని, చేష్టలలోగాని, వేషభూషణాదులలో గాని అనుకరింపరాదు. అంతఃపుర సేనాధ్యక్షుడు రాజుతో వైరము కలవారితో కాని, అవమానపూర్వకంగా రాజాస్థానమునుండి వెడలగొట్టబడిన వారితోగాని కలిసిమెలసి ఉండరాదు. రాజరహస్యములను భృత్యుడెన్నడును ఇతరులకు చెప్పరాదు. తనకున్న ఏదోఒక నేర్పును చూపి రాజును సంతుష్టుని చేయవలెను. రాజు తనకేదైన రహస్యవిషయము చెప్పినచో అది ఇతరులకు చెప్పరాదు. రాజు మరెవ్వరికైన పని చెప్పదలచుచున్న పుడు తావే లేచి “మహారాజా! ఏమి చేయవలెనో సెలవిమ్మ, నేను చేసెదను” అని ముందుకు రావలెను. బహూకరించిన వస్త్రాలంకారాదులను సర్వదాధరించు చుండవలెను. రాజాజ్ఞ లేనిదే ద్వాదమునందుగాని, రాజుదృష్టిపడుటకు అవకాశముండు మరొక స్థానమునందుగాని కూర్చుండగూడదు. రాజసమీపమున ఆవులింత, ఉమ్మి వేయుట, దగ్గుట, కోపమప్రకటించుట, మంచముపై కూర్చుండుట, కనుబొమ్మలు విరచుట. ఆపానవాయువు విడచుట, త్రేన్చుట మొదలగు పనులు చేయరాదు. రాజు సమక్షమున తన గుణములను ఇతరుల ద్వారా వర్ణింపచేయవలెను. శఠత్వము (రహస్యముగా అపకారము చేయుట), దూళ, చెవికొరకుట, నాస్తికత్వము, నీచత్వము చాపల్యము మొదలగు దోషములను రాజ సేవకుడు సర్వథా పరిత్య శించవలెను. ప్రయత్నపూర్వకముగా వేద విద్యా శిల్పకలాదులలో ముందుగా ప్రావీణ్యము సంపాదించుకొని, పిమ్మట ధనాభివృద్ధి కొరకై రాజసేవానియుక్తి సంపాదించుకొనవలెను. రాజునకు ఇష్టుడైన వానికిని, అతని పుత్రురునుచు తులమును నమస్కరించుచుండవలెను. మంత్రుల దగ్గర ఉన్నంతమాత్రముచే రాజునకు తన పై విశ్వాసము కలుగదు. అందుచే అతని మనస్సుకు అనుకూలములగ కార్యములు సర్వదా చేయుచుండవలెను. రాజు స్వభావమును బాగుగా గుర్తించి ఆతనికి తనపై సదభిప్రాయము లేనిచో అతనిని విడచి, తనను ఆదరించు మరొక రాజును ఆశ్రయించవలెను. అడగకుండ రాజుకు ఏమియు చెప్పరాదు. కాని ఆపత్సమయమునందు మాత్రము చెప్పవచ్చును. రాజు ప్రసన్నుడై నచో వినీతుడు సేవకుని మాట విని ఆతని ప్రార్థనను అంగీకరించును ప్రేమపాత్రుడైన సేవకు అంతఃపురాని రహస్యస్థానములందు కనబడినను రాజు ఆతని విషయమున శంకించడు. అతడు సభకు వచ్చినపుడు రాజు ఆతనిని కుశలప్రళ్నేలు వేసి ఆసనమిచ్చును. ఆతడు చేయు చర్చలు విని నంతోషించును. ఆతడేదైన ఆప్రియవాక్యము పలికినను దానిని చెడ్డగా తీసుకొనక ప్రసన్నుడు కూడ ఆగును. అతడిచ్చిన చిన్న వస్తువును కూడ ఆవరముతో గ్రహించి, మాటలలో దానిని స్మరించుచుండును. ఈ లక్షణములను బట్టి రాజు తన పై విరక్తుడా అనురక్తుడా అను విషయమును గ్రహించి ఆనురక్తుడగు రాజును సేవించవలెను. విరక్తుడైన వానిని విడువలెను

అగ్ని మహాపురాణమునందు ‘అనుజీవివృత్తకథ’మను రెండువందల ఇరువదియొకటవ అధ్యాయము సమాప్తము.