అగ్ని మహా పురాణము

Table of Contents

33 - అథ పవిత్రారోపణ విధానమ్

అగ్ని దేవుడు పలికెను : మునీ! ఇపుడు నేను పవిత్రారోపణమును గూర్చి చెప్పెదను. సంవత్సరమునందు ఒక మారు పవిత్రారోపణము చేసినచో, సంవత్సర మంతయు శ్రీహరి పూజ చేసిన ఫలము నిచ్చును. ఆషాడశుక్ల ఏకాదశి మొదలు కార్తీక శుక్లైకాదశి వరకు నున్న కాలమున పవిత్రారోపణము చేయవలెను. ప్రతిపత్తు విడువవలెను. ద్వితీయాదితిథులు క్రమముగ లక్ష్మ్యాదిదేవతల తిథులు. ద్వితీయ లక్ష్మికి, తృతీయ గౌరికి, చతుర్థి గణేశునికి, పంచమి సరస్వతికి, షష్టి కుమారస్వామికి, సప్తమి సూర్యునకు, అష్టమి మాతృదేవతలకు. నవమి దుర్గకు, దశమి నాగులకు, ఏకాదశి ఋషులకు, ద్వాదశి విష్ణువునకు, త్రయోదశి మన్మథునకు, చతుర్దశి శివునకు, పౌర్ణమాసవాస్యలు బ్రహ్మకు సంబంధించినవి. ఏ ఉపాసకుడు ఏ దేవతను ఉపాసించునో ఆతనికి ఆ దేవతయొక్క తిథి పవిత్ర మైనది.

పవిత్రారోపణ విధి అందరు దేవతలకును సమానమే. మంత్రాదులు మాత్రమే ఆయా దేవతలకు వేరు వేరుగా నుండును. పవిత్రకమును నిర్మించుటకై బంగారము, వెండి, రాగి తీగలను గాని నూలు దారముగాని ఉపయోగింపవలెను.

బ్రాహ్మణస్త్రీ చేతితో వడికిన నూలు చాల. శ్రేష్ట మైనది. అది లభించనిచో ఏ దారము నే నను గ్రహించి, దానిని సంస్కరించి, ఉపయోగింపవలెను. దారమును మూడు పేటలు చేసి, మరల దానిని మూడు పేటలు చేసి, దానితో పవిత్రకమును నిర్మింపవలెను. నూట ఎనిమిది మొదలు అధికము లగు తంతువులతో నిర్మించిన పవిత్రకము, ఉతమాది శ్రేణికి చెందినదిగ పరిగణింపబడుచున్నది. పవిత్రారోపణమునకు ముందు ఇష్టదేవతను గూర్చి ఈ విధముగ ప్రార్థింప. వలెను. “ప్రభూ! క్రియాలోపమువలన కలిగిన దోషమును తొలగించుటకై నీవు ఏ సాధనమును చెప్పినావో దానినే నేను చేయుచున్నాను. క్కడ ఏ పవిత్రకము ఆవశ్యకమో ఆక్కడ అట్టి పవిత్రకమునే ఆర్పించగలను. నీ కృపచే ఈ కార్యమునందు విఘ్న బాధ లేవియు కలుగకుండుగాక. అవినాశి యైన పర మేశ్వరా! నీకు జయమగుగాక.

ఈ విధముగ ప్రార్థించు పవిత్రకమును ఇష్టదేవతామండలమునకు గాయత్రీమంత్రముతో కట్టవలెను. “ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్” అనునది ఇష్టదేవత యగు నారాయణుని గాయత్రీమంత్రము. ఈ గాయత్రీ ఇష్టదేవతానామానుసారముగ ఉండును. దేవప్రతిమల పై అర్పించుటకు అనేక విధములగు పవిత్రకము లుండును. విగ్రహము యొక్క నాభివరకు వచ్చునది ఒకటి; తొడలవరకు వచ్చునది మరియొకటి మోకాళ్ళవరకు వచ్చునది మరియొకటి. పాదము వరకు వ్రేలాడునది  ఒకటి. చివరిదానికి వరమాం అని పేరు. దానిని ఒక వెయ్యి ఎనిమిది దారముతో నిర్మింపవలేము. సాధారణ పూలను శ క్త్యనుసారము నిర్మింపవలెను. లేదా ఆది పదునారు అంగుళములకంటె రెట్టింపు పెద్దదిగా ఉండవలెను. కర్ణికా-కేసర-దళాచులుగల యంత్ర-చక్రా మండలములపై వేయు పవిత్రకము పైనుడి క్రిందివరకును కప్పునదిగా ఉండవలెను. ఒక చక్రము, ఒక కనులము ఉన్న మండలము పై ఆ మండలము ఎన్ని అంగుళము ఉన్నదో అన్ని అంగుళముల పవిత్రకము ఆర్పేంపవలెను. వేద పై ఆర్పించు పవిత్రకము తన చేతి ఆంగుళములతో ముప్పయేడు అంగుళము పొడ వుండవలెను.

ఆచార్యునికోరుకును, తందండ్రులకొరకును, పుస్తకముపై ఉంచుటకోరకును  నిర్మింపబడు పవిత్రకము నాభిప్రదేశమువరకును వ్రేలాడవలెను.. దీనికి పండ్రెండు ముడులు ఉండవలెను. దానిపై మంచి గంధము పూయవలెను. వనమా గుందు రెండేసి అంగుళములదూరము క్రమము నూట ఎనిమిది ముడులు వేయవలెను. లేదా కనిష్ట-మధ్యమ- ఉత్తమపకము పై ఆచమూ పండ్రెండు, ఇరువదినాలుగు, ముప్పదియారు ముడులు వేయవలెను. ముంద. మధ్యమఉత్తమమాలార్థు లగు పురుషులు అనామికా-మధ్యమా-అంగుష్ఠములచేతనే పవిత్రక ములను గ్రహింపవలెను. లేదా కనిష్ఠకారి నామధేనుము- గల పవిత్రక ఘులందు అన్నింటియంను పండ్రెండేసి ముడులే ఉండవలెను. (తంతువుల సంఖ్యను పట్టి, పాడవును పట్టియు ఈ కనిష్టి కాదనామధేయము లేర్పడినవి). సూర్యునకు, కలశమునకు, అగ్ని మొదలగు పొడని గూడ చుథాసంభవము భగవంతు డగు విష్ణువుకు వలెనే పవిత్రకములను ఆర్పేంచుట ఉత్తమ మని చెప్పబడినది. పీఠము కొరకు వాని పొడవును పట్టియు, కుండము కు దాని మేఖలపర్యంతమును పొడవు గల పవిత్రకముండ వలెను. విష్ణుపార్షదులు యథాశక్తిగ సూత్రగ్రంథు:ను సమర్పింపవలెను. లేదా గ్రంథులు లేకుండ పదునేడు సూత్రములు సమర్పింపవలెను. భద్రుడను పార్షదుకు త్రిసూత్రము సమర్పించవలెను.

పవిత్రకమును గోరోచనముతోను, ఆగురుకర్పూరము కలిపి పసుపుతోను, కుంకుమరంగుతోను పూయవలెను. భక్తుడు ఏకాదశీదివసమున స్నానసంధ్యాదులు చేసి, పూజాగృహము ప్రవేశించి, భగవంతు డగు శ్రీహరిని పూజింపవలేను. విష్ణువుయొక్క సమ స్తపరిచారమునకును బలి సమర్పించి విష్ణువును పూజించవలెను. ద్వారము యొక్క అంతమునందు “క్షం క్షేత్రపాలాయ నమః” అని చెప్పి క్షేత్రపాలపూజ చేయవలెను. ద్వారము పై భాగమున “శియై నమః” అని చెప్పుచు శ్రీదేవిని పూజించవలెను. ద్వారదక్షిణ (కుడి) దేశమున “ధాత్రే నమః” “గంగాయై నమః” అను ముత్రము లుచ్చరించుచు, ధాతను, గంగను పూజింపపలెను. ఎడమ వైపున “విధాత్రే నమః” యమునాయై నమః” అని చెప్పుచు విధాతను, యమునను, పూజింపవలెను. ఇదే విధముగ ద్వారముయోక్క కుడి ఎడమ ప్రదేశములందు క్రమముగ “శ జ్ఞానిధయే నమః” పద్మ నిధయే నమః” అని చెప్పుచు శంఖపద్మ నిధులను పూజింపవలెను.[(పిదప మండపములోపల కుడి హదము మణవను మూడు మార్లు కొట్టి విఘ్న ములను పారద్రోలవలెను.] పిమ్మట ' “సారజ్ఞాయ నమః అని అనుచు విఘ్న కారకము లగు భూతములను పారద్రోలవలెను. [పిమ్మట “ఓం హాం వాస్వధిపతయే బ్రహ్మణే నమః  అను మంత్రము నుచ్చరించుచు బ్రహ్మ యొక్క స్థానమున పుష్పములుంచవలెను.] పిదప ఆసనముపై కూర్చుండి భూతశుద్ది చేయవలెను.

అను ఐదు ఉదాతవాక్యముల నుచ్చరించుచు గంధతన్మాత్రస్వరూపమగు భూమండలమును, వజచిహ్ని తము, సువర్ణమయము, చతురస్రము (నలుపలకలు గలది) పీఠమును, ఇంద్రాదిదేవతలను తన పాదములు మధ్య నున్నట్లు చూచుచు వాటి భావన చేయవలెను. ఈ విధముగ శుద్ద మగు గంధతన్మాత్రను రసతన్మాత్రయందు లీనము చేసి ఉపాసకుడు అదే క్రమమున రసతన్మాత్రను రూపతన్మాత్రయందు లీనము చేయవలెను.

అను నాలుగు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు మోకాళ్లు మొదలు నాభివరకును ఉన్న శరీర భాగమును శ్వేతకములచే చిహ్నిత మైనదానినిగాను, శుక్ల వర్ల మైనదానినిగాను, అర్ధచంద్రాకారము కలదానినిగాను చూడవలెను. ఈ జలియ భాగమునకు వరుణుడు దేవత యని భావన చేయవలెను. పై నాలుగు ఉదాతవాక్యములను ఉచ్చరించుటచే రసతన్మాత్రము శుద్ద మగును. ఈ రసతన్మాత్రను రూపతన్మాత్రయందు లీనము చేయవలెను.

            అను మూడు మూడు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు నాభి మొదలు కంఠమువరకును ఉన్న భాగమునందు త్రికోణాకారాగ్నే మండలమును భావింపవలెను. దాని రంగు ఎరుపు. ఆది స్వ సికాకారముచే చిహ్నిత మైనది. దాని అధిదేవత అగ్నిఈ విధముగా శుద్ధము చేయబడిన రూపతన్మాత్రను స్పర్శతన్మాత్రయందు లీనము చేయవలెను.

అను రెండు ఉద్ఘాతవాక్యముల నుచ్చరించుచు కంఠము మొదలు నాసికామధ్య వరకును ఉన్న భాగమునందు గోలాకార వాయు మండలమును భావన చేయవలెను. దాని రంగు ధూమము వలె నుండును. ఆది నిష్కలంకచంద్రునిచే చిహ్నత మైనది. స్పర్శతన్మాత్రమును ధ్యానముచే శతన్మాత్రయందు లీనము చేయవలెను. పిమ్మట “ఓం హ్రీం హః ఫట్ హూం కవిత్రాటి విధాల శబ్దతన్మాత్రం సంహరామి నమః అను ఒక ఉద్ఘాతవాక్యము సచ్చరించుచు శద్ధ స్ఫటికముతో సమాన మైన ఆతాళమును, వాసికి నుండి శిఖవరకును ఉన్న శరీరభాగముపై భావన చేయవలెను. ఆ శబ్దాతాళమును (అహంకారమునందు) ఉపసంహరింపవలెను.

పిమ్మట శోషణాదుల ద్వారా దేహశుద్ధి చేసుకొనవలెను. పాదమునుంచి శిఖవరకును దేహము 'యం' ఆను వాయుబీజముచే ఎండిపోయినట్లు భావన చేయవలెను. పిమ్మట ‘రం' ఆను బీజము ద్వారా అగ్నిని ప్రకటించి నమ స్తశరీరము అగ్నిజ్వాలలచే దగ్గ మై భస్మ మైనట్లు భావన చేయవలెను. పిమ్మట “వం బిందువును ఉచ్చరించుచు బ్రహ్మరంధ్రమునండి. అమృతబిందువు ఆవిర్భవించినట్లు భావన చేయవలెను. దాని నుండి ప్రవహించిన అమృతధార చే శరీరము నంతను ముంచెత్తివేయవలెను. పిమ్మట 'ఎం' అను బీజమును ఉచ్చరించుచు ఆ భస్మమునుండి దివ్యదేహము ఆవిర్భవించి నట్లు భావన చేయవలెను. ఈ విధముగ దివ్యదేహభావన చేసి అంగన్యాసకరన్యాసములు చేయంలేను. పిమ్మట మానసయాగాను ప్లానము చేయవలెను. హృదయకమలముపై అంగ దేవతాసహితు డగు మహావిష్ణువును నిలిపి, మానసికవుష్పాద్యుపచారములు చేయుచు, మూలమంత్రము లుచ్చరించుచు పూజింపవలెను. ఆ భగవంతుడు భోగమోక్షముల నిచ్చువాడు.. మానసిక పూజలను స్వీకరింపు మని భగవంతుని ఈ విధముగ ప్రార్థింపవలెను. “దేవా! దేవాధిదేవా! కేశ వా! నీకు స్వాగతము. నా సమీపమున సన్నిహితుడవై నేను ఆర్పించు మానసికపూజను కే కొనుము. పీఠము మధ్యభాగమునందు, యోగపీఠమును ధరించు ఆధారశక్తి యైన కూర్మమును, అనంతుని, పృథివిని పూజింపవలెను. ఆగ్నేయకోణము మొదలగు నాలుగు కోణములందును క్రమముగ ధర్మ-జ్ఞాన-వేరాగ్య-ఐశ్వర్యములను పూజింపవలెను. తూర్పుమొదలగు ప్రధానదిక్కులందు అధర్మ -అజ్ఞాన-అవే రాగ్య-అనేశ్వర్యములను పూజింపవలెను. పీఠమధ్యమునందు సత్తాదిగుణత్రయమును, కమలమును, మాయను, అవిద్యను. కొలతత్వమును, సూర్యాది మండలములను, పక్షిరా జైన గరుత్మంతుని పూజింపవలెను. పీఠము వాయవ్యకోణమునుండి ఈశాన్యకోణము వరకు గురుపం క్తిని పూజింపవలెను.

గణములు, సరస్వతి, నారదుడు, నలకూబరుడు, గురువు, గురుపాదుక. పరమగురువు, ఆతని పాదుక వీటి పూజయే గురుపంక్తిపూజ. పూర్వసిద్ధపర సిద్ధ శక్తులను కేసరముల పై పూజింపవలెను. లక్ష్మి, సరస్వతి, ప్రీతి, కీర్తి, శాంతి, కాంతి, పుష్టి-; తుష్టి-వీరు పూర్వసిద్ధశ క్తులు, పూర్వాది దిక్కులలో క్రమముగ ఈ శక్తుల పూజ చేయవలెను. ఇంద్రాదిదిక్పాలకులను గూడ వారి వారి దిక్కులందు పూజింపవలెను. వీరందరి మధ్యయందు శ్రీహరి విరాజిల్లుచుండును ధృతి, శ్రీ, రతి, కాంత్యాదులు పర సిద్దశక్తులు. మూలమంత్రముచే అచ్యుతుని స్థాపింపవలెను. పూజాప్రారంభమున”ఓం ఆభిముఖో భవ” పూర్వదిక్కున నా సమీపమున నుండుము అని భగవంతుని ప్రార్థింపవలెను. ఈ విధముగ - ప్రార్థించి స్థాపించిన పిమ్మట ఆర్ఘ్యపాద్యాదులను సమర్పించి, గంధాద్యుపచార ముల ద్వారా మూలమంత్రముతో అచ్యుతుని పూజింపవలెను. “భీషయ భీషయ హృదయాయ నమః” “ఓం త్రాసయ త్రాసయ శిరసే నమః” ఓం మర్గయ మర్గయ శిఖాయై నమః” “ఓం రక్ష రక్ష నేత్రత్రయాయ నమః” “ఓం ప్రధ్వంసయ ప్రధ్వంసయ కవచాయ నమః” “ ఓం హుం ఫట్ ఆస్తాయ నమః” ఈ విధముగ ఆగ్నేయాదివిదిశలయందు క్రమముగా, మూలబీజములతో అంగ ముని పూజ చేయవలెను. తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము ఈ దిక్కులందు మూర్త్యాత్మక ఆవరణముల పూజ చేయవలెను.

వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని నాలుగుమూర్తులు. ఆగ్నేయాది విదిశలయందు క్రమముగ శ్రీ, రతి, ధృతి, కాంతులను పూజింపవలెను. వీరు కూడ శ్రీహరి మూర్తులే. అగ్న్యాదికోణములందు క్రవగ శంఖ చక్ర గదా-పద్మములను పూజింపవలెను. తూర్పు మొదలైన దిక్కులందు - ముసల - ఖడ్గవనమాలలను పూజించవలెను. వాటి వెలుపల తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఇంద్ర-అగ్ని-యమ-నిరృతి. హోమాది విధిక వరుణ-వాయు కుబేర - ఈశాను”ను పూజించి నైరృతి పశ్చిమదిక్కుల మధ్య అనంతుని, తూర్పు ఈశాన్యపోక్కుల మధ్య బ్రహ్మను పూజించవలెను. వీటి జైట వజ్రము మొదలగు అస్త్రమయఆవరణములను పూజించవలెను. వీటి బైట దిక్పాలకుల వాహనరూపము లగు ఆవరణములను పూజింపవలెను. తూర్పు మొద లగు దిక్కులందు క్రమముగ ఐరావతమును, మేకను, దున్నపోతును, వానరుని, మత్స్యమును, మృగమును, చేవులపిల్లిని, వృషభమును, కూర్మమును, హంసను పూజింపవలెను. వీటి బయట పృశ్నిగర్భుడు, కుముదుకు మొదలగు ద్వారపాలను పూజింపవలెను. తూర్పు మొదలు ఉత్తర ము వరకు, అన్ని దిక్కులందును ఇద్దరిద్దరు ద్వార పాలకులను పూజింపవలెను. పిమ్మట శ్రీహరికి నమస్కారము చేసి వెలుపల బలి అర్పింపవలెను. - “ఓం విష్ణుపారదేభ్యో నమః” అను మంత్రము నుచ్చరించుచు ఎష్ణపీఠముపై వారలకు బలి అర్పింపవలెను. ఈశానదిక్కు నందు “ఓం - విశ్వాయ విష్వక్సేనాయ నమః” - అను మంత్రముచే విష్వక్సేనపూజ చేయవలెను. పిమ్మట దేవుని కుడి చేతికి రక్షాసూత్రము కట్టవలెను. - ఆ సమయమున ఆ. భగవంతునితో ఇట్లు చెప్పవలెను. “దేవా! ఒక సువత్సరము నిరంతరము జరుగు మీ- పూజ యొక్క సంపూర్ణఫలము లభించుటకై జరుప నున్న పవిత్రారోపణకర్మకొరకై ఈ కౌతుక సూత్రమును ధరింపుము. ఓం నమః పిమ్మట భగవంతుని సమీపమున ఉపవాసాడి నియమమును అవలంబించి ఇట్లు చెప్పవలెను. “నేను నియమపూర్వకముగ ఉపవాసాదులు చేసి ఇష్టదేవతకు సంతోషము కలిగింపగలను. దేవేశ్వరా! నేడు మొదలు వైశేషిక ఉత్సవ దివసము వరకును కామక్రోధాదోషము లేవియు నా వద్దకు రాకుండు గాక వ్రతమును స్వీకరించిన యజ పూనుడు ఉపవాసముచేయు సామర్థ్యము లేని - పక్షము నక్త వ్రతము (రాత్రి మాత్రమే భోజనము చేయుట) ఆచరించవలెను. హవనము చేసి భగవంతునిస్తోత్రము - చేసిన పిమ్మట భగవంతుని ఉద్వాసన చెప్పవలెను. భగవంతుని నిత్యపూజ చేసి చో లక్ష్మి ప్రాప్తించును. భగవంతుని పూజించుటకై “ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనా మే నమః” అనునది మంత్రము.

శ్రీ అగ్ని మహాపురాణము నందు పుత్రారోపణమున శ్రీధర నిత్యపూజావిధాన మను ముప్పదిమూడవ అధ్యాయము సమాప్తము.