అగ్ని మహా పురాణము
320 - అథ మండలాని
ఈశ్వర రువాచః-
ఈశ్వరుడు పలికెను. స్కందా ! ఇప్పుడు సర్వతో భద్రములు యను పేరు గల ఎనిమిది మండలమాలను చెప్పెదను. శంకువుతో తూర్పు దిక్కున సాధించి విషువ కాలమున చిత్ర స్వాతి నక్షత్రముని మధ్య యందు గాని లేదా సూత్రము. గ్రహించి తూర్పు నుండి పశ్చిమము వరకు లాగి మధ్యము నందు రెండు కోటులను గుర్తించవలెను, వాటి మధ్య నుండి ఒక దీర్ఘమైన ఉత్తర దక్షిణ రేఖ గీసి రెండు మత్స్యములను నిర్మించి వాటిని దక్షిణోత్తరముల పై ఆస్ఫాలనము చేయవలెను. క్షత పద క్షేత్రము యొక్క అర్ధ మానముచే కోణ సంపాతము చేయవలెను. ఈ విధముగా నాల్గు పర్యాయములు సూత్రమును షేత్రము నందు ఆస్ఫాలనము చేయగా ఒక చతురస్రము ఏర్పడును. దాని నాల్గు హస్తముల శుభకర మగు భద్ర మండలము ఏర్పరుపవలెను. ఎనిమిది పదములచే అన్ని వైపులను విభ క్తములగు ఆరువది నాలుగు పదముల నుండి ఇరువది పదముల గల క్షేత్రమున వెలుపల ఒక వీథిని నిర్మించవలేను. ఈ వీథి ఒక మంత్రమునకు సంబంధించినది. కమల మానముచే రెండు పదముల ద్వారము నిర్మించి దానిని కపోలయుక్తముగ చేయవలెను. కోణ బంధముచే ఆది ఆందముగ నుండవలెను. ఈ విధ ముగ ద్విపదమును ద్వార నిర్మాణము నందు ఉపయోగించవలెను. కమలమును శ్వేత వర్ణముగాను, కర్ణికను పీత వర్ణన గాను, కేసర ములను చిత్ర వర్ణములు గాను, వీథిని రక్త వర్ణముగాను చేయవలెను. ద్వార ములో కప్మా స్వరూపములు నిత్య నైమిత్తిక వీథు లందు కోణము ఎర్రగా వుండవలెను. ఇపుడు పద్మమును గూర్చి వినుము. అసంసక్తము సంస క్షము యని అవి రెండువిధములు. భుక్తి ముక్తి ప్రదము. అసంసక్తము ముముక్షువులకు ఉపయుక్తము బాల యువ. వృద్దములని సంసక్త కమలములు మూడు విధములు. అవి తమ పేర్లననుసరించి ఫలసిద్ధిని ఇచ్చును.
కమల క్షేత్రము నందు దీక్ విదిక్కుల వైపు సూత్ర విన్యాసము చేసి పద్మ క్షేత్ర సమములగు ఐదు వృత్తములను విర్మించవలెను. ప్రథమ వృత్తము నందు నాలుగు పుష్కరములు గల కర్ణి కయు రెండవ దాని యందు ఇరువది నాలుగు కేసరములు, మూడవ దాని యందు గజ కుంభ సదృశములగు దళ సందులు నాల్గవ వృత్తము నందు దశాగ్ర భాగములు పంచమ వృత్తము నందు ఆకాశ మాత్రమూ వుండును. ఇది సంసక్త కమలము. అసంసక్త కమలమున దళాగ్ర భాగము నందున్న దిక్కల భాగము నందున్న దిక్కుల భాగముల విస్తారము ననుసరించి రెండు భాగములు విడచి ఎనిమిది రాగములతో దళములు ఏర్పరుప వలయును. సంధి విస్తార సూత్రముతో దాని మావముననుసరించి దళములను రచించ వలయును. దీని యందు ఎడమ నుండి, గుడికి ఏర్పరచ వలయును. లేదా సంధి మధ్య నుండి ఆర్ధ చంద్రాకారముగా త్రిప్పవలెను. లేదా రెండు సంధుల ఆగ్రము నందున్న సూత్రమును అర్ధ చంద్రాకారముగ త్రిప్పవలెను. అపుడు బాల పద్మము ఏర్పడును. సంధి సూత్రము యొక్క అగ్ర భాగము నుండి పృష్ఠ భాగము వైపు సూత్రము త్రిప్పవలెను. యది తీష్ణోగ్ర భాగ మగు యువ సంజ్ఞక కమలము. భుక్తి ముక్తి ప్రదము. ముక్తినుద్దేశించి చేయు ఆరాధనము నందు వృద్ధ కమ లమును వశీకరణాదులందు బాల పద్మ మును ఉపయోగించవలెను. నవనాథ కమల చక్రము ఎనిమిది హస్తముల ప్రమాణము కలదై యుండును. దాని యందు మంత్రాత్మకములగు తొమ్మిది భాగములుండును. దాని మధ్య భాగమున కమల ము ఏడును. కమల మానానుసారముగ పట్టిక వీథి ద్వారము యొక్క ఏడు కంఠము, ఉపకంఠములు నిర్మించవలెను. ఐదు భాగముల వీథి యుండును. దాని నలువైపుల పది భాగముల స్థానముండుమ. దాని ఎనిమిది దిక్కులందు ఎనిమిది కమలములున్న వీథి సహితమగు ఒక ద్వార పద్మము వుండును. దాన బాహ్య భాగమున లతా దివిభూషిత మగు ఐదు పదముల వీథి యుండును. ద్వార కంఠము నందు కమలముండును. ద్వారము యొక్క ఓష్ణ కంఠ భాగములు ఒక్కొక్క పదము నందుండును. కపోల భాగము ఒక పదముండును. మూడు దిక్కులందును మూడు ద్వారములు స్పష్టముగా వుండును. కోణ ఐంధము నందు మూడు పట్టములు రెండు పదముల వజ్ర చిహ్న ముండును. మధ్య కమలము శుక్ర వర్ణము. మిగిలిన దిక్కుల కమలములు పూర్వాదిక్రమమున పీత, రక్త, నీల, పీతి, శుక్ల ధూమ్ర రక్త పీత వర్ణములై యుండును. ఈ కమల చక్రము ముక్తి దాయకము.
పూర్వాది దిక్కులందు ఎనిమిది కమలములను శివ విష్ణ్వాది దేవతలను పూజించవలెను. శివ విష్ణ్వాదులను ప్రాసాద మధ్యకమల మందు పూజించి పూర్వాది కమలముల పై ఇంద్రాది దేవతలను పూజించవలెను. బాహ్య వీథి యందు ఆ దేవతల హస్త్రమును విష్ణ్వాదులను పూజించినవాడు ఆశ్వమేధ ఫలము పొందును. పవిత్రారోహణాదు లందు మహా మండలము ఏర్పరుపవలేను. ఎనిమిది హస్తముల పొడవైన క్షేత్రమును ఇరువది ఆరుచే విభజించి మధ్యనున్న పదద్వయము నందు కమలమును తనకు తర్వాత ఒక పదమున వీథిని దిగ్విదిక్కులందు ఎనిమిది నీలకమలములను నిర్మించవలెను. మధ్య నున్న కమలము మావముతో, మొత్తము ముప్పది పద్మములు నిర్మించవలెను. వాటికి దళ సంధులు వుండకూడదు. అవినీలేండీ వర ములు దాని పృష్టమున ఒక పాదము వీథియు, దాని పైన స్వ క్రిక చిహ్నము ఏర్పరుచవలెను. పిదప బాహ్య భాగమున వీథికయు ద్వారములు కమలములు ఉపకంటములు అన్నియు వుండవలెను. కోణముల రక్త వర్ణముబు. వీథిపీత వర్లము. మండల మధ్య కమలము నీల వర్ణము అయి వుండవలెను. విచిత్ర వర్ణములు గల స్వస్తికాది మండలములు సకల కామ ప్రదములు.
పంచాబ్జ మండలము ఐదు హస్తము క్షేత్రమను అన్ని వైపుల నుండి పదిచే విభజించి నిర్మించవలెను. రెండు పదములు కమలము, దాని బాహ్య భాగమున వీథి, పట్టికా, మరల నాల్గు దిక్కులందును నాలుగు కమలము వాటి పృష్ణ భాగమున వీథి వుండవలెను. దానిని ఏక పదములందు గాని పద ద్వయమునందు గాని నిర్మించవలెను. కంఠోప కంఠములు గల ద్వారములు వాటి మధ్య భాగమున కమలములు వుండవలెను. ఈ పంచావ్లి మండల మున పూర్వ దిక్కు నందున్న కమలము శ్వేత వర్ణము, పీత వర్ణము ఆయి వుండును. దక్షిణ కమలము వైడూర్య వర్ణము, పశ్చిమ కమలము శ్వేత వర్ణము ఉత్తర కమలము శంఖ తుల్య వర్ణము. మిగిలినవన్నియు విచిత్ర వర్ణములు ఆయి వుండును.
సర్వ కామ ప్రదమగు దశ హస్త మండలమును చేప్పెదను. దానిని వికార సంఖ్యచే అన్ని వైపుల విభక్తము చేసి చతురస్ర క్షేత్రము ఏర్పరుచ వలెను. రెండేసి పదముల ద్వారముండును. పూర్వము నందు చెప్పిన చక్రము నందువలె దీని మధ్య భాగమున కమలముండును. ఇపుడు విఘ్న ధ్వంస చక్రము చెప్పెదన. నాల్గు హస్తముల పురము ఏర్పరచి దాని మధ్య రెండు హస్తముల గోళాకార చక్రము ఏర్పరుచవలెను. అన్ని వైపుల నుండి స్వస్తిక చిహ్న వృత మగు హస్త ప్రమాణము గల వీథి యుండును. ఒక్కొక్క హస్తమున నాలుగు వైపుల ద్వారమాలు ఏర్పంచ వలెను. నాలుగు దిక్కు లందు, కమలాంకితములగు వృత్తములుండును. ఈ చక్రమున శ్వేత వర్ణములగు ఐదు కమలములు వుండును. మధ్యవర్తి కమమున నిరాకారుడగు పరమాత్మను పూజించవలెను. పూర్వాది దీక్కులందు హృదయాద్యంగ ములను విదిక్కులందు హస్తములను పూజించవలెను. సద్యోజాతాది పంచ బ్రహ్మ మయ ముఖములను గూడ పూజించవలెను. ఇపుడు బుద్ధ్యా ధార చక్రమును చేప్పెదను. నూరు పదముల క్షేత్రమున పధ్య యందున్న పదునైదు పదములో ఒక కమలము అంకితము చేసి ఎనిమిది దిక్కులందును ఒక్కొక్క శివ లింగమును ఉంచవలెను. రెండు పదములలో మేఖలా భాగ సహిత మగు కంఠము రచించవలెను. ఆచార్యుడు తన బుద్ధి సహాయముతో లతాదులను ఏర్పరుపవలెను. నాలుగు, ఆరు, ఐదు, ఎనిమిది ఇత్యాది సంఖ్యలో వున్న కమలములతో మండము ఏర్పడును. ఇరువది ముప్పది కమలములున్నది కూడ వుండును. 12120 కమ రిములున్న సంపూర్ణ మండము కూడ వుండును. 120 కమలములు మండలము కూడ కనబడుచున్నది. విష్ణు, శివ దేవీ సూర్యులకు 1440 మండము లుండును. పది హేడు పదములతో పది హేడు పదములను విభజించినవో 288 పదము లగును. ఈ మండము నందు “లతాలింగము” ఎట్లు ఉద్భవించునో చెప్పెదను. వినుము. ఒక్కొక్క దిక్కు యందు ఐదు, మూడు, ఒకటి, మూడు, ఐదు పదములను తుడిచి వేయవలేమ. పైన నున్న రెండు పదములతో లింగము పార్శ్వము నందున్న రెండేసి కోష్టములతో నుందిరము ఏర్పడును. మధ్యనున్న రెండు పదములో కమలము మరల మరియొక కమ లము ఏర్పడును. లింగ పార్శ్వ భాగము లందు రెండు భద్రనులు ఏర్పడును. ఒక పదమున ద్వార ముండును. దానిని తుడిచి వేయకూడదు. ఆ ద్వార పార్శ్వము లందు ఆరేసి పదములను తుడిచి వేయగా ద్వార శోథ ఏర్పడును. మిగిలిన పదములందు శ్రీహరికి లతలు ఏర్పడును. పైనున్న రెండు పదములను తుడిచి వేయగా విష్ణువునకు భద్రాష్టకము ఏర్పడును. మరల నాల్గు పదములను తుడిచి వేయగా రశ్మి మానాయుక్త మగు శోభా స్థానమేర్పడును. ఇరువది ఐదు పదములచే పద్మము, పిదప పీఠము, ఆపీఠము రెండేసి పదములను వుంచగా ఎనిమిది ఉప శోభలు ఏర్పడును. దేవ్యాది సూచిక మగు భద్ర మండలము మధ్య విస్తృతముగను. ప్రాంత భాగమున లఘువుగను వుండును. మధ్య తొమ్మిది పదముల కమల మేర్పడును. నాల్గు కోణములందున నాలుగు భద్ర మండలములు ఏర్పడును. మిగిలిన పదమూడు పదములలో బుద్ఘ్యాధా రమండలము ఏర్పడును. దీని యందు నూట ఆరువది పదములుండును. బుద్ద్యాధార మండలము శివాది దేవతారాధనకు ప్రశస్తములు.
అగ్ని మహా పురాణమున మండల నిరూపణ మను మూడు వందల ఇరువదవ అధ్యాయము సమాప్తము.
