అగ్ని మహా పురాణము

Table of Contents

241 - అథ పునః సామాదికమ్

రాతు ఉవాచః

శ్రీ రాముడు చెప్పెను : ప్రభుశక్త్యుత్సాహశక్తుల కంటే మంత్రశక్తి గొప్పది. ప్రభుశ క్తి - ఉత్సాహశక్తులున్న శుక్యాచార్యుని దేవపురోహితుడైన బృహస్పతి మంత్రశక్తిచే ఓడించెను. విశ్వాసపాత్రుడే కాక నీతిశాస్త్రకోవిదుడు కూడ ఆయిన వానితో రాజు మంత్రణము చేయవలెను. అశక్యమైన కార్యము నారంభించు వారికి క్లేశములననుభవించుట తప్ప ఫలమేదియు లభింపదు. తెలియని విషయములు తెలిసికొనుట, తెలిసిన దానిని నిశ్చయించుట, కర్తవ్యమునందు సందేహ మేర్పడినపుడు దానిని తొలగించుకొనుట, శేషము లభించుట - ఇవి మంత్రులపై ఆధారపడి యున్నది. సహాయకులు, కార్యసాధనోపాయములు, దేశ కాల ప్రవిభాగము, విపత్తినివారణము, కర్తవ్యసిద్ధి - ఇవి మంత్రా ఆలోచనలకు సంబం ధించిన ఐదు అంగములు. మనస్సు యొక్క ప్రసన్నత్వము, శ్రద్ధ, జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు తమతమ పనులు చేయుటయందు సమర్థములుగా నుండుట, సహాయసంపత్తి, ఉత్థానసంపత్తి (వెంటనే లేచి పనులు చేయుట) ఇవి మంత్రము ద్వారా నిశ్చయించి ప్రారంభింపబడు కర్మలసిద్ధికి లక్షణములు. మదము, ప్రమాదము (పొరబడుట) కామము, స్వప్న ములో పలవరించుట, స్తంభాదుల వెనుక పొంచియుండు జనులు, స్త్రీసాంనిధ్యము, ఉపేక్షిత ప్రాణులు (చిలకలు, బధి రులు మొ) భేదము కలుగుటకు (ఇతరులకు వెల్లడియగుట) కారణములు, సభలో నిర్భయముగా మాటలాడుట, మంచి జ్ఞాపకశక్తి, ప్రవచనకౌశలము, శస్త్ర శాస్త్రముల పరినిష్టిత జ్ఞానము, దూతలకు తగిన కార్యములందు నేర్పుకలవాడు రాజ దూత అగుటకు యోగ్యుడు, నిసృష్టార్థుడు (బాధ్యతలన్నీ తీసికొన్నవాడు), పరిమితార్థుడు (కొన్ని బాధ్యతలు మాత్రమే ఉన్న వాడు), శాసనహారకుడు (వార్తలు మాత్రము తీసికొను పోవువాడు) అని దూతలు మూడు విధములు.

తనరాకను గూర్చి మాందుగ సూచించకుండ దూత శత్రుదుర్గమును దాని, సభను గాని ప్రవేశించరాదు. కార్య సిద్ధికై సమయమును నిరీక్షించవలెను. శత్రువు అనుమతిపొంది తిరిగి వెళ్ళవలెను. శత్రువునలోపమును తెలిసికొనవలెను. వారి కోశము, మిత్రులు మొదలగువాటిని తెలుసుకొని, శత్రువులయొక్క చూపులు, చేష్టలు మొదలగువాటిచే తన విషయమున అతనికి ఎట్టి ఆభిప్రాయమున్నదో తెలిసికొనవలెను. అతడు రెండు పక్షములవారి కుల-నామ-ద్రవ్య-శ్రేష్ట కర్మలను ప్రశంసించవలెను. తపస్వివేషములో నున్న తమపక్షీయులగ గూఢచారులతో సంప్రదించవలెను ప్రకటులు, అప్రకటులు అని దారులు రెండువిధములు. ప్రకటముగా నున్న వారు దూతలు, ఆప్రకాశ ముగా నున్నవారు గూడ దారులు. చారుల స్థితికి, వర్తకులు, వ్యవసాయదారులు, సన్యాసులు, భిక్షువులు, అధ్యాపకులు వీరు ఉపయోగింతురు. ఆందుచే వీరి వృత్తికై (సుఖజీవనమునకై) ఏర్పాట్లు చేయవలెను. దూత ప్రయత్నములు విఫలమైనపుడు, శత్రువు దుర్బలుడుగానున్నపుడు అతని పై దండెత్తవలెను. విజిగీషవు తన ప్రకృతులలో నున్న వ్యసనములన్నియు తొలగించుకొని పిమ్మట శత్రువుపై దాడి చేయవలెను. మానుషము, దైవము అని వ్యసనములు రెండు విధములు. అనయము (నీతిని అనుసరించకుండుట) ఆపన యము (చేడునీతిని అవలంబించుట) అను వాటిచే ప్రకృతివ్యసనమేర్పడును. కేవలము దైవవశము చేతగూడ ఆది రావచ్చును. శ్రేయస్సును వ్యసము చేయునుగాన ‘వ్యసనము’. అగ్ని, జలము, రోగములు, దుర్భిక్షము, మహామారి ఇవి ఐదు దైవవ్యసనములు. మిగిలినవి మానుషవ్యసనములు. పురుషప్రయత్నము చేతగాని, ఆథర్వోక్త శాంతికర్మలచేగాని దైవ వ్యసనమును తొలగించవలెను. ఉత్తానశీలత్వము (పనులలో జాప్యము లేకుండుట), నీతి, సంధి, సామము మొదలగువాటిచే మనుషవ్యసనమును శాంతింపచేయవలెను. మంత్రము, మంత్రఫలప్రాప్తి కార్యానుష్టానము భవిష్యదున్నతి సంపాదనము, ఆయవ్యయములు, దండనీతి, శత్రునివారణము, వ్యసనములను తొలగించు ఉపాయము, రాజును రాజ్యమును రక్షించుట- ఇవి అమాత్యుల కర్తవ్యములు. ఆమాత్యుడు వ్యసనగ్రస్తుడై నచో ఈ పనులన్నింటిని పాడుచేయును. సువర్ణ-ధాన్య-వస్త్ర-వాహనాది సంగ్రహము జనపదవాసులగు ప్రజల కర్తవ్యము. ప్రజలు వ్యసనగ్రస్తులైనచో ఇవన్నియు నష్టమగును. ఆపత్సమయమున జనులను రక్షించుట, కోశ -సేనారక్షణము, రహస్యముగా గాని, ఆకస్మికముగా గాని వచ్చిన యుద్ధము నుండి కాపాడుకొనుట, కష్టాలలో చిక్కుకొనియున్న మిత్ర - అపమిత్రులను సంగ్రహించుట, సామంతులనుండియు, వన వాసులనుండియు వచ్చు ఉపద్రవములను తొలగించుకొనుట ఇవన్నియు దుర్గాశ్రయణ ప్రయోజనములు. నగరమునందలి నాగరికులు గూడ అవసరమైనపుడు రక్షణపొందుట కొరకై, కోశాదుల నిచ్చుచు దుర్గపతికి ఉపకరింతురు. భృత్యుల భరణపోషణము, దానము, హస్తి-ఆశ్వ- ఆభరణాదులను కొనుట, స్థిరత్వము, శత్రుపక్షమునందున్న లుబ్ధులగు ప్రకృతుల రో ధనాదులిచ్చి, విరోధముత్పన్నము చేయుట, దుర్గసంస్కారము, సేతుబంధము, వాణిజ్యము, ప్రజా-మిత్రసంగ్రహము, ధర్మార్థకామసిద్ధి ఇవన్ని కోశ మువలన సిద్ధించును. రాజునకు మూలము కోశముగాన కోశవ్యసనము రాజునకు సంబంధించిన సర్వమును నశింపచేయును.

మిత్ర-అమిత్ర-సువర్ణ-భూములను తనవశములో నుంచుకొనుట, శత్రువులను ఆణచివేయుట, ఇతర కార్యములను శీఘ్రముగ సాధించుట ఇవన్నియు సేనాబలముచే సాధించదగినవి. దానికి కష్టము వచ్చినచో ఈ పనులన్నియుపాడగును. మిత్రుడు-విజిగీషువు యొక్క మిత్రులు స్థిరముగా ఉండునట్లు చేయును. శత్రువులను నశింపచేయును మిత్రుడు వ్యసన శ్రీమదగ్ని మహాపురాణము గ్రస్తుడై నచో ఈ కార్యములన్నియు చెడిపోవును. రాజువ్యసనియైనచో సమస్తకార్యములు చెడిపోవును. కఠినముగా మాటలాడి ఇతరుల మనస్సునొప్పించుట, కఠినముగా శిక్షించుట, ఆర్థదూషణము, మద్యపానం, స్త్రీలంపటత్వము, వేట, జూదము ఇవి రాజవ్యసనములు. సోమరితనము, మొండితనము, దర్పము, ఏమరుపాటు, అకారణవై రము, పైనచెప్పిన రాజవ్యసనములను, సచివునకు దుర్వ్యసనములు, అనావృష్టి, రోగాదిపీడలు రాష్ట్రవ్యసనములు. యంత్ర - ప్రాకార - పదిఖాదులు పాడగుట, అస్త్రశస్త్రముల కొరత, గడ్డి, కట్టెలు, అన్నము క్షీణించుట- ఇవి దుర్గవ్యసనములు. చెడ్డవ్యయము మండలమునందు అనేకస్థానములందు కొంచెము కొంచెము ఉంచుట, రక్షకులు మొదలగువారు భక్షించివేయుట, ప్రోగు చేయకుండుట, చోరులచే అపహరింపబడుట, దూర ప్రదేశమునందు ఉంచబడుట- ఇవి కోశ వ్యసనములు. నాలుగుమూలల నుండి ముట్టడించబడుట, సరియైన సంమానము లభింపకపోవుట, భరణపోషణములు సరిగా లేకుండుట, చాలమందిరోగగ్రస్తులు గాని ఆలసిపోయినవారుగాని, క్రొత్తగా వచ్చినవారుగాని ఉండుట, పూర్తిగా ఓడిపోవుట, ముందుకు వెళ్లవేగము కుంఠిత మగుట, చాలమంది నిరాశాపీడితులగుట, అయోగ్యప్రదేశములలోనుండుట, విశ్వానహీనులగుట, స్త్రీల, స్త్రీప్రియులు కలిసి ఉండుట, హృదయములో ఏవియోబాధలుండుట, దుష్టుడగు పార్ష్ణిగ్రాహుని సైన్యము వెన్నంటి వచ్చుట, ఇట్టిదురవస్థ బల (సేనా) వ్యసనము.

 దైవపీడితుడును, శత్రు సేవాక్రాంతుడును, కామ-క్రోధాదియుక్తుడును ఆగు వ్యసనగ్రస్తుడై న మిత్రునకు, తగు ఉత్సాహము, సాహాయ్యము ఇచ్చినచో ఆతడు యుద్ధోద్యతుడై , శత్రువులపై విజయముసాధించగలడు. అర్థదూషణము, వాక్పారుష్యము, కఠినదండము, ఈ మూడుమ క్రోధజవ్యసనము.  వేట, జూదము, మద్యపానము, స్త్రీ సంగము - ఈ నాల్గును కామజవ్యసనములు. వాక్పారుష్యము ఇతరులకు ఉద్వేగము కలిగించి అనర్థ హేతువగను. థనహరణము, కాడనము, వధ అని మూడువిధములగు దండము సిద్ధించని కార్యమును సిద్ధింపజేయునుగాన, సత్పురుషులచే “శాసన” మని చెప్పబడుచున్నది. దానిని యుక్తిపూర్వకముగ ప్రయోగించవలెను. యుక్త మగు దండమును విధించు రాజును ప్రశంసింతురు. క్రోధవశుడై కఠిన శిక్ష ఇచ్చు వానిపై ప్రజలలో ఉద్వేగము కలుగును. ఆ విధముగ ఉద్విగ్నులైన వారు శత్రువును శరణువేడుదురు. దానిచే వృద్ధిపొందిన శత్రువు రాజును నశింపచేయును. దూషణీయుడగు ఒక వ్యక్తికి అపకారము చేయుటకై ఆతనివలన లభింపవలసిన గొప్ప ప్రయోజనమునకు విఘాతము కలిగించుటకు “ఆర్థదూషణము” అని పేరు. వేటవలన, పరుగెత్తుచున్న వాహనమునుండి పడుట, ఆకలిదప్పులవలన శ్రమపడుట మొదలగు దోషములు కలుగును. దాగిఉన్న శత్రువెవ్వడై నను చంపివేయుటకు కూడ అవకాశ మేర్పడును, ఆలసటను జయించుటకై రాజు ఏదైన సురక్షితమగు అరణ్యమునందే వేటాడవలెను. జూదముతో ధర్మార్గముల నాశము, ప్రాణము పోవుట మొదలగు దోషములు కలుగును. కలహము వచ్చును. శ్రీవ్యసనము కలవారి పనులన్నియు పోలవిలంబమున జరుగును. ధర్మార్థములకు గూడ హాని కలుగును. మద్యపానవ్యసనమువలన ప్రాణాపాయముకూడ కలుగవచ్చును. మత్తులోనున్న వాడు కర్తవ్యాక ర్తములను తెలిసికొనజాలడు. సేనానివేశము ఎచట నెలకొల్ప వలెనో తెలిసినవాడును, శుభాశుభశకునముల జ్ఞానము కలవాడును శత్రువుపై విజయము సాధించగలడు. సేనానివేశముమధ్యయందు రాజు కోశముతో ఉండవలెన. రాజభవనమునకు నలువై పులచుట్టి మౌల (పితృ పితాదిమహాది క్రమమున వచ్చుచున్న) స్యైము, ధృత (జీతమిచ్చి ఏర్పరచుకోన్న) సైన్యము, శ్రేణి (జానపదుల లేదా సాలేవారు మొదలగు శిల్పుల) సేన, మిత్ర సేన, శత్రు సేన! (రాజుకు లొంగిన శత్రువుల సేన), ఆటవికులు.వీరి నివేశము లేర్పరుపవలెను. నాల్గవవంతు సేన యుద్ధసన్నద్ధులై, సేనాపతిని ఎదుటనుంచుకొని, నివేశమునకు బైట, రాత్రియంతయు తీరగవలెను. వాయుతుల్యవేగముగల అశ్వములనధిరోహించి ఆశ్వికులు సరిహద్దులవరకునువెళ్ళి, శత్రువుల పరిస్థితులను కని పెట్టవలెను. రాజాజ్ఞానుసారమే ఎవ్వరై నను నివేశములోనికి వచ్చుట, బైటకు వెళ్ళుట జరుగవలెను.

సామ-దాన-దండ-భేవ-ఉపేక్షా-ఇంద్రజాల. మాయలను ఏడు ఉపాయముల ప్రయోగముచే శత్రువు వశమగును. ఎదుటివాని ఉపకారమును వర్ణించుట, తమ పరస్పర సంబంధ బాంధవ్యాదులను ప్రకటించుట, గుణములు కీర్తించుచు మధురముగా మాటలాడుట, భవిష్యల్లాభమును ఉద్ఘాటించుట, నేను నీ వాడను ఆనీ చెప్పుచు ఆత్మ సమర్పణము చేయుట అని సామము ఐదు విధములు. ఎవని వద్దనుడియైవ లభించిన, ఆసారము, సొరాసారము అగు పదార్థమును ఆతనికి ఆ విధముగ నే తిరిగి ఇచ్చివేయుట దానములోని మొదటి భేదము . తానివ్వకుండగనే ఎదుటివాడు ఏదైనధనమును తీసి కౌన్నచో దానిని అనుమోదించుట రెండవభేదము. ఆపూర్వద్రవ్యదానము మూడవ భేదము. ఒకనిని మరొకని నుండి ధనము తీసి కౌనుమని ప్రేరేపించుట (స్నయంగ్రాహప్రవర్తనము) నాల్గవ భేదము. ఇవ్వవలసిన ధనమును తీసికొనకుండుట ఐదవ భేదము. స్నేహమను నశింపచేయుట, పరస్పరకలహముసృజించుట, బెదిరించుట.ఇవీ భేదములోని మూడు విధములని భేషజ్ఞులు చెప్పదు. చంపుట, ధనములను అపహరించుట, బంధనలాడనాదులద్వారా పీడించుట ఆని దండ భేదములు మూడు. ప్రకాశవద, ఆప్రకాశ వథ అని వధ రెండు విధములు. అందరికిని ద్వేషపాత్రుడై న వానివి ప్రకాశముగ వధించవలెను. ఎవనిని చంపుటచే ప్రజలు ఉద్వేగము చెందుదురో, ఎవడు రాజప్రియుడో, అధిక బలశాలియో, ఎవడు రాజహితమునకు భంగము కలిగించునో వానిని రహస్యముగ చంపవలేను. విషప్రయోగము చేతగాని, అగ్ని ప్రయోగము చేతగాని, రహస్యముగా ఇతరులచే ఆస్తప్రయోగము చేయించిగాని, స్ఫోటలను పుట్టించు పదార్థములను శరీరము నకు లేపము చేయించటచేగానీ రాజ్యశత్రువులను రహస్యముగ నశింపచేయవలెను. జాతీమాత్రముచే బ్రాహ్మణుడై నవానిని కూడ , ప్రాణదండమీయక, సామముచే వశము చేసిన ప్రయత్నించవలెను.

ప్రియముగా మాటలాడుట సామము. చిత్తమునందు ఆమృతసేకము చేసినట్లు సావప్రయోగము చేయవలెను. ఎదుటనున్న వానిని ప్రేమతో త్రాగివేయుచున్నట్లు చూచుచు, ఆమృతము వర్షించుచున్నట్లు మాటలాడవలెను. అసత్యమైన దోషారోపణకు గురియైనవారును, ధనలుబ్దులును. పిలిచి అవమానింపబడినవారును, రాజద్వేషులును, ఎక్కువపన్ను వేయ ఐడినవారును, విద్యాకులాదులచే అందరికంటే గొప్పవారమని భావించువారును, చిన్నభిన్న మైన ధర్మార్థకామములు కలవారును, కుపితులు, దురభిమానము కలవారును, అనాదరపాత్రులును, అకారణముగ రాజ్యము నుండి బహిష్కరింపబడిన వారును, పూజాసత్కార యోగ్యులైనను ఆవి పొందనివారును, హరింపబడిన ధనము స్త్రీలు కలవారును, మనస్సులో వై రమున్నను సామనీతి ప్రయోగముచే పైకి శాంతముగ నుండువారును, నిత్యశంకితులును ఇట్టివారు శత్రుపక్షమునకు చెందినవారైనచో వారిలో వారికి వైరము కలిగించవలెను. తనపక్షము వారైనచో ప్రయత్నపూర్వకముగ వారిని శాంతులను చేయవలెను. ఇట్టివారు శత్రుపక మునుండి విడిపోయి తవపక్షమునకు వచ్చినచో వారిని సత్కరించవలెను. రెండు పక్షముల వారికిని సమానమగు లాభమును చూపుట, ఉగ్రభయమును చూపుట, అత్యధిక దొనకనములు- ఇవి భేదోపాయాంతర్గతములు. భేదోపాయ ప్రయోగము చే శత్రు సేనలో వైషమ్యము జనించినపుడు అది పురుగు తొలచిన కఱవలె విరిగిపోవును. ప్రభు-మంత్రోత్సాహసంపన్నుడు, దేశకాలాభిజ్ఞుడును అగు రాజు దండముచే శత్రువులను అంతమొందించవలెను. మైత్రిగుణ సంపన్నుడు, ఉత్తమ విచార శీలుడు, అగు వానిని సామప్రయోగ ముచే వశము చేసుకొనవలెను. ఆర్థికముగా క్షీణించిన అబ్దుని దానముచే వశము చేసుకొనవలెను. ఒకరినొకరు శంకించుకొను దుష్టులను దండముచే వశము నందుంచుకొనవలెను. పుత్ర - సోదరాదులను, బంధువులను, జానపదులను దానభేదములచే వశము చేసుకొనవలెను. సామంతులను, ఆటవికులను, ఇతరులను గూడ ఆవశ్యకతానుసారముగ భేదదండముల ప్రయోగించుచు వశము నందుంచుకొనవలెను.

దేవతాప్రతిమలు చెక్కిన స్తంభముల పెద్ద పెద్ద రంధ్రములందు దాగియున్న వారు, శ్రీ వేషము ధరించినవారు, రాత్రియందు అద్భుతరూపములు ప్రదర్శించువారు, వేలాశులవలెను, ముఖము నుండి అగ్నిని కక్కుచున్న పిశాచములవలెను, దేవతలవలేను, రూపములు ధరించు వారును చేయునది “మానుషమాయ”. ఇచ్చానుసారముగ రూపమధరించుట. శస్త్ర - ఆగ్ని - శిలా - జలములు వర్షించుట, అంధకారము, ముంమారుతము, పర్వతములు, మేఘములు సృజించుట ఇది అమానుషమాయ. గడచిన ద్వాపరమునందు పాండవవంశీయుడిగు భీమ సేనుడు శ్రీ వేషము ధరించి శత్రువైన, కీచకుని చం పెను. ఆన్యాయమునందును, వ్యసనములందును. అధిక బలవంతునితో యుద్దమునందును ప్రవర్తించిన తన వారిని మరల్చకుండు ఓ 'ఉపేక్ష'. భీమసేనుని తో యుద్ధమున కుపక్రమించిన సోదరుడైన హిడింబుని హిడింబ నిషేధింప లేదు. స్వలాభమునకై ఉపేక్షి ఐచినది. మేమములను, ఆంధకారమును, వర్షమును, ఆగ్నిని, పర్వతములను, ఇట్టి ఇతరా ద్భుతములను, దూరముగా నిలచియున్న ధ్వజళాలుఅగు మహాసైన్యములను చూపుట, ఓన్నమలైన శత్రు సైనికుల అవయవములనుండి రక్తధారలు ప్రవహించుచున్నట్లు చూపుట. ఇదియంతయు ‘ఇంద్రజాలము’. ఈ ఇంద్రజాలమును ప్రయో గించి శత్రువులను భయ పెట్టవలెను.

అగ్ని మహాపురాణమునందు సామాద్యుపాయ కథనమను రెండువందల నలుబదియొకటవ ఆధ్యాయమ సమాప్తము.