అగ్ని మహా పురాణము

Table of Contents

331 - అథ ఛందోజాతి నిరూపణమ్

అగ్ని రువాచః

ఆగ్నిదేవుడు చెప్పెను. ఉత్కృతి ఛందస్సునందు నూట నాలుగు అక్షరము లుండును. ఉత్కృతి మండి నాలుగేసి అక్షరములు తగ్గించుచు పోయినచో వేరు వేరు ఛందస్సులు ఏర్పడును. అవి వేదిక ఛందసులు గాయత్రి మొదలు త్రిష్టప్ వరకువున్నవి లౌకిక ఛందస్సులు కూడ వాటి పేర్లు త్రిష్టప్ పంక్తి బృహతీ, అనుష్టప్, ఉప్టిక్, గాయత్రి యన నవి. గాయత్రిలో ఒక్కొక్క అక్షరము తగ్గినచో సుప్రతిషా ప్రతిష్టా మధ్యా, అత్యుక్తాత్యుక్తి మొదలగు ఛందస్సు లేర్పడును.  ఛందస్సులో నాల్గవ భాగమునకు పాదమని పేరు. ముందు గణ ఛందస్సు చెప్పబడుచున్నది. నాలుగు లఘు అక్షరములు ఒక గణము. ఇవియైదు కొన్ని చోట్ల ఆది గురువు - మధ్య గురువు - అంత్య గురవు సర్వ గురువు - నాల్గు అక్షరములును లఘువులు వుండవచ్చును. ఇపుడు ఆర్యా లక్షణము చెప్పబడుచున్నది. ఏడున్నర గణములతో ఆర్య ఏర్పడును విషమ గణము జగణము కాకూడదు. ఆరవ గణము జగణము కావలెను. లేదా సర్వలఘువు కావలెను. సర్వ లఘువై నిపుడు ఆగణము యొక్క ద్వితీయాక్షరము నుండి పదసంజ్ఞ ఏర్పడును. ఆరవ గణము మధ్యగురువు గాని, సర్వ లఘువు కాని అయినచో, ఏడవ గణము కూడ సర్వ లఘువై వచో దాని ప్రథమాక్షరము నుండి పద సంజ్ఞా ప్రవర్తిం చును. ఉత్తరార్ధమున ఐదవ గణము సర్వ లఘువే నచో దాని ప్రథమాక్షరము నుడి పద ప్రారంభమగును. ఉత్తరార్ధ మున ఏడవ గణము ఏక మాత్ర లఘువగును పూర్వార్ధ ఉత్తరార్ధములందు మూడేసి గణములుండి వాటి తరువాత పాద విరామమైనచో ఆ ఆర్యకు పథ్యాయని పేరు. పూర్వార్ధము నందు కాని ఉత్తరార్ధమునందు కాని రెండింటి యందుకాని మూడు గణముల తరువాత పాద విరామము లేకున్నచో దానికి విపులయని పేరు. ద్వితీయ చతుర్థ గణములు గుర్వక్షర ముల మధ్య నుండి జగణము కూడ వున్నచో దానికి చపలయని పేరు. పూర్వార్ధమున చపలా లక్షణమున్నదీ ముఖ చపలా, ఉత్తరార్థమున చపలా లక్షణమున్నది జఘన చపలా, రెండింటి యందును. చపలా లక్షణమున్నది మహా చపలా ! పూర్వార్ధము వలే ఉత్తరార్ధమున్న చోగీతి ఉత్తరార్ధము పఠి పూర్వార్ధమున్న చో ఉపగీతి. పూర్వోక్త క్రమమువకు విపరీత ముగ నున్నచో ఉధ్ధతి. ఇపుడు మాత్రా ఛందస్సు చెప్పబడు చున్నది. ప్రథమ తృతీయ చరణము లంద పదునాలుగు లఘువులు, గ్వితీయ చతుర్థ చరణములందు పదహారు లఘువులు, అన్ని చరణముల అంతమునందు రగణ లఘువు, గురువు లున్నచో వైతాళీయ ఛందస్సు. దీని అంతమున ఒక గురువు అధికముగ నున్నచో యది ఔపచ్చందసిక వ. దీని చరణముల ఆంతములందు భగణము, రెండు గురువులు వున్నచో “ఆపాతాలికా” ఈ వై లాఠీ ఛందస్సు నందు చెప్పబడిన తగణాదులతో ఒక్కొక్క పాదము యొక్క ఆంతమున ఎనిమిది అకారములు, చెప్పబడినవి. వాటిని విడిచి ప్రత్యేక పాదమున మిగిలిన లకారములలో సమ ల కాగములు విషమ లకారములతో కలువకూడదు. ద్వితీయ చతుర్థ పాదము లందు ఆరు లఘువులను వరుసగా ప్రయోగించ కూడదు. తృతీయ చతుర్థ పాదములందు చతుర్థ లకారము, పంచమ లకారముతో సంయుక్తమైనచో యది ప్రాచ్యవృత్తి. ప్రథమ తృతీయ పాదములంను ద్వితీయ తృతీయ రికారములు మిశ్రితములైనచో ఉదీచ్యవృత్తి రెండు లక్షణములును ఒకే పర్యాయము ప్రవర్తించినచో యది ప్రవృత్తి కా. నాల్గు పాదములు విషమ పాదముల ననుసరించియున్నచో యది చారుహాసిని. సమపాద లక్షణమున్నచో ఆపరాంతిక ఒక్కొక్క పాదమున పదునారు లకారములుండి, పాదాంతి మాక్షరములు గురువు లైనచో యది మాత్రా సమకము. దీనిలో పండ్రెండవ లకారము స్వరూపము నందేవున్నచో యద్ వనవాసికా పంచమ అష్టమ లకారములు లఘువు లైవచో శ్లోకము తొమ్మిదది కూడ లఘువైనచో యది చిత్ర. నవమ దశమములు కలిసినచో ఉపవిత్ర మాత్రా సమకాది పంచ ఛందస్సులలో ఒక్కొక్క పాదముతో నాలుగు పాదముల ఛందన్సు ఏర్పరచినచో దానికి పాదారులకము యని పేరు. ఒక్కోక్క పాదమున పదునారేసి లఘువులుండి దేనితోను కలిసి గురువు కానిచో ఆది గీర్యార్య దీనిలోనే ఆర్ధభాగములో అన్ని మాత్రలు గురువులు, రెండవ అర్ధమున లఘువులు ఆయినచో ఆదిశిఖా. దీనికి విపర్యర్ధమైనచో తూలిక. పూర్వార్ధమున ఇరువది తొమ్మిది లకారములు, ఉత్తరార్థమున ముప్పది ఒక్కరికారములు, చివరి రెండు లఘువుల స్థానమున ఒక గురువు వున్న చో అది సమావల. “గు” యనునది ఒక గురువును చెప్పును. అక్షర సంఖ్యలో గురు సంఖ్యను తగ్గించగ మిగిలివేది లము సంఖ్య యగును.

అగ్ని మహా పురాణమున ఛందస్సారమున మూడు వందల ముప్పదవ అధ్యాయము సమాప్తము.