అగ్ని మహా పురాణము
61 - అథ ద్వారప్రతిష్టా ధ్వజారోహణాది విధిః
హయగ్రీవుడు చేప్పెను : బ్రహ్మదేవా! ఇపుడు నేమ అవభృథస్నా నమును గూర్చి చెప్పేదను. “విష్ణోర్ను కం వీర్యాణి” ఇత్యాదిమంత్రముతో హోమము చేయవలెను. ఎనుబది యొక్క పదముల వాస్తుమండపమునందు కలశస్థాపన చేసి వాటి ఉదకముతో శ్రీహరికి స్నానము చేయించవలెను. స్నానానంతరము గంధపుష్పాదులతో పూజించి, సమర్పించి, గురువును పూజించవలేను. ఇపుడు ద్వార ప్రతిష్ఠను గూర్చి చెప్పేదను. గురువు ద్వారము క్రింద బంగారము నుంచవలెను. ఎనిమిది కలశ లతో. అచట రెండు ఉదుంబర శాఖలుంచవలెను. వే దికమంత్రములు చదువుచు, గంధాద్యుపచారములతో పూజించి కుండములందు స్థాపింపబడిన అగ్నిలో సమిధలు, ఆజ్యము, తిలలు మొదలగునవి హోమము చేయవలెను. పిమ్మట శయ్యా దిదానము చేసి క్రింద ఆధారశక్తిని స్థాపింపవలెను. ఆ రెండు శాఖల క్రింద చండ ప్రచండు లను దేవతలను స్థాపించవలెను. ఉదుంబర శాఖల పైభాగమున దేవవృందపూజితురా లగు లక్ష్మిని స్థాపించి శ్రీ సూక్తముతో యథోచితముగ పూజింపవలెను. పిమ్మట బ్రహ్మను పూజించి, ఆచార్యునకు శ్రీఫలము (నారికేళ ఫలము) మొదలగు దక్షిణ లీయవలెను. ప్రతిష్టాత మగు ద్వారముపై ఆచార్యుడు శ్రీహరిని స్థాపింపవలెను. దేవాలయ ప్రతిష్టను “హృత్పతిష్టా” ఇత్యాదిమంత్రముతో చేయవలెను. దానిని గూర్చి వినుము. వేదికంటే ముందు, (లేదా వేదికి తూర్పుగా) శుకనాస ఎచట సమాప్త మగునో అచట, గర్భగృహశిరో భాగమునందు బంగారు కలశను గాని, వెండి కలశను గాని స్థాపింపవలెను. దానిలో ఎనిమిది విధము లైన రత్నములు, ఓషధులు, ధాతువులు, బీజములు, సువర్ణము ఉంచవలెను. ఆ కలశము కంఠమునకు వస్త్రము చుట్టి దానిని నీటితో నింపి, దానిని మండలము పై అధివాసితము చేయవలెను. దానిలో చిగుళ్లు వేయవలెను. పిమ్మట నృసింహమంత్రముతో అగ్నియందు ఆజ్యధార పోయుచు హోమము చేసి నారాయణతత్త్వముతోప్రాణన్యాసము చేయవలెను.
సురేశ్వరా। ఆ ప్రాసాదక లక మును విరాడ్రూపముగ భావింపపలెను. మొత్తము ప్రాసాదమును పురుషునిగా భావన చేయవలెను. క్రింద సువర్ణ ముంచి, సువర్ణకలశను స్థాపింపవలెను. గురువు మొదలైనవారికి దక్షిణ లిచ్చి బ్రాహ్మణులకు భోజనములు పెట్టవలెను. దాని పైన కంఠభాగమునందు దారము గాని మాల గాని చుట్టవలెను. దాని పైన కూడ “విమలామలసార” అను పుష్పమాలను దేవాలయము నాల్గు వై పుల కట్టవలెను. దాని పైన వృకలము, దాని పైన సుదర్శనచక్రము నిర్మింపవలెను. అచటనే వాసుదేవతామూర్తి గ్రహగుప్త యని తెలుపవలెను. లేదా మొదట కలశమును, దాని పైన సుదర్శనచక్రమును ఏర్పాటు చేయవలెను. బ్రహ్మదేవా! వేదికి నలువైపుల ఎనమండు విఘ్నేశ్వరులను స్థాపించవలెను. లేదా నాలుగు దిక్కులందు నలుగురు విఘ్నేశ్వరులను స్థాపించవలెను. ఇపుడు భూతాదినినాశ గరుడధ్వజారోపణ విధానము చెప్పెదను,
దేవాలయమును నిర్మించిన వాడు, ప్రాసాదబింబద్రవ్యములలో ఎన్ని పరమాణువు లున్నవో అన్ని వేల సంవత్సరములు విష్ణులోకములో నుండును. పాపరహితుడ వైన బ్రహ్మదేవా! వాయువుచే కదల్చబడిన ధ్వజపటము కలశమును, వేదిని, ప్రాసాదబింబకంఠమును ఎప్పుడు చుట్టుకొనునో అపుడు ప్రాసాదకర్తకు ధ్వజారోపణముకంటే కోటి రెట్లు అధిక మగు ఫలము లభించు నని తెలిసికొనవలెను. వతాక ప్రకృతి; దండము పురుషుడు; ప్రాసాదము వాసుదేవస్వరూపము. ప్రాసాదము భగవంతుని ధరించుచున్నది గాన ఆదియే దానిలోని ధరణీరత్వము, దేవాలయము నందలి ఏ శూన్యావకాశ మున్నదో అదియే అకాశ తత్త్వము. దానిలోని ప్రకాశమే ఆగ్నితత్వము. దానిలో కలుగు వాయుస్పర్శయే వాయుతత్వము.
పాషాణాదులలో నున్న జలము పార్థివజలము. దానిలో పృథివీగుణ మగు గంధముండును. ప్రతిధ్వనిరూప శబ్దమే ఆచటి శబ్దము. స్పృశింపగా కనబడు కఠోర త్వాదిక మే స్పర్శ. శుక్లాడ్వర్ణములు రూపము. ఆహ్లాదమును కలిగించు -సమే రసము. ధూపాదిగంధమే గంధము. భేర్యాదులలో ప్రకట మగు వాదమె వాక్కు. ఆది వాగింద్రియము వంటిది. అందుచే వాగింద్రియము అచటనే ఉన్న దని భావించ వలెను. నాసిక శుక నాసయం దుండును. దాని రథకములు భుజములు. శిఖరముపై అండాకారమున నున్నది. శిరస్సు. కలశ కేశపాశము. ప్రాసాచకంఠభాగ్ ము కంఠము. వేది భుజము. రెండు నాళికలు గుదోపస్థలు. సున్నము త్వక్కు.. ద్వారము ముఖము. ప్రతిమ దేవాలయజీవాత్మ, పిండిక జీవశక్తి. దాని ఆకారము ప్రకృతి. నిశ్చలత దాని గర్బము. నారాయణుడు దాని అధిష్ఠాత. ఈ విధముగ మహావిష్ణులే దేవాలయరూపమున నిలచియున్నాడు. శివుడు కాళ్లు; బ్రహ్మ స్కంధము పై నున్నాడు. ద్వార ప్రతిష్ఠ ధ్వజారోహణాది విధికి ఊర్థ్వభాగమున సాత్తు విష్ణువే ఉండును. ఈ విధముగ నున్న ప్రాసాదమున ప్రతిష్టింపబడు ధ్వజమును గూర్చి వినుము. శస్త్రాదిచిహ్నములతో కూడిన ధ్వజమును నిలబెట్టి దేవతలు దైత్యులను జయించిరి. . అండముపై కలశము నుంచి, దాని పైన ధ్వజమును స్థాపింపవలెను. ధ్వజమానము బింబమానములో సగ ముండ వలెను. ధ్వజదండము పొడవులో మూడవ వంతుతో చక్రము నిర్మింపవలేను. ఆ చక్రమునందు ఎనిమిది కాని పండ్రెండు గాని ఆకులుండవలెను. దాని మధ్య నృసింహుని మూర్తి గాని, గరుడుని మూర్తి గాని ఉండవలెను. ధ్వజదండము విరిగినదిగాని, రంధ్రాదు లున్నది గాని కాకూడదు. దండము పొడవు ప్రాసాదము వేడిల్పుతో సమముగా నుండవలెను. లేదా దాని పొడవు శిఖరముయొక్క సగముభాగము లేదా మూడవవంతు ఎంత ఉండునో అంత ఉండపలేను. లేదా ద్వారము పొడవుకంటే రెట్టింపు పొడవు ఉండవలెను. ఆ ధ్వజదండమును దేవాలయముపై ఈశాన్యమున గాని, వాయవ్యమున గాని స్థాపింపవలెను.
ధ్వజవస్త్రము (పతాక) పట్టుగుడ్డ మొదలైనవాటితో విచిత్రవర్ణముగ నుండునట్లు చేయవలెను. లేదా ఒకే రంగు ఉండు నట్లు చేయవలెను. దానికి ఘంట, దామరములు, చిరుగంటలు కట్టినచో ఆది సర్వపాపవినాశకమగును. దండాగ్రమునుండి నేలవరకు వ్రేలాడు వస్త్రమునకు “మహాధ్వజము” అని పేరు. అది సంపూర్ణమనోరథముల నిచ్చును. దానికంటే నాల్గవ వంతు. చిన్న దే నదానిని పూజించినచో సర్వమనోరథము సిద్ధించును. ధ్వజములో సగము ప్రమాణము గల వస్త్రముతో నిర్మించినదానికి 'పతాక' అని పేరు. లేదా పతాకకు కొలత ఏదియు ఆవసరము లేదు. ధ్వజవిస్తారము ఇదువది అంగుళ ము లుండవలెను. చక్ర-దండ. ధ్వజముల అధిహాసనమును దేవతామూర్తులకు వలె చేసి, సకలీకరణము గూడ కావించి, మండపస్నా నాది కార్యములు కూడ చేయవలెను. నేతోన్మీలనము తప్ప వెనుక చెప్పిన కార్యము లన్నియు చేయవలెను. ఆచార్యుడు వీటి నన్నింటిని శయ్య పై ఉంచి ఆధివాసనము చేయవలెను.
పిమ్మట విద్వాంసుడు “సహస్రశీర్షా” ఇత్యాదిస్తూ క్రమును ధ్వజాంకితచక్రముపై న్యాసము చేసి, సుదర్శన మంత్రమును, మనస్తత్వమును గూడ న్యాసము చేయవలెను. అది మనోరూపమున ఆ చక్రమున సజీవీకరణము. సురశ్రేష్ఠా! పండ్రెండు ఆకులపై (ఆదములపై) క్రమముగ కేశ వాదిమూర్తుల న్యాసము చేయళల్లెను. కమలముపై తీవదగ్ని మహాపురాణము నృసింహుని గాని, విశ్వరూపుని గాని ఉంచవలెను. దండముపై జీవసహితు డగు సూతాత్మను న్యాసము చేయవలెను ధ్వజముపై, శ్రీహరిధ్యానము చేయుచు, నిష్కలపరమాత్ముని స్థాపించవలేను. ఆతని బలాబలరూపవ్యాపకశక్తిని ధ్వజరూపమున ధ్యానింపవలెను. మండపము పై దానిని స్థాపించి, పూజించి, ఓ కుండములో హోమము , చేయవలెను. కలశములో బంగారు ఖండము, పంచరత్నములు ఉంచి, అస్త్రమంత్రముతో చక్రమును స్థాపింపవలెను. పిమ్మట సువర్ణచక్రమును, కింద నున్న పాదరసములో ముంచి నేత్రపటముతో కప్పవలెను. పిమ్మట చక్రము నుంచి, దాని మధ్యమున శ్రీహరిని స్మరింపవలెను.
“ఓం క్రైం నృసింహాయ నమః”అను మంత్రముతో హరిని స్థాపించి పూజించవలెను. పిమ్మట యజమానుడు, బంధుసమేతుడై ధ్వజము తీసికొని దాని ఆగ్రభాగమును పెరుగుపాత్రలో ముంచవలెను. 'ఓం ఫట్' అను మంత్రముతో ధ్వజపూజ చేయవలెను. పిమ్మట ఆ పాత్రను తలపై పెట్టుకొని నారాయణస్మరణ చేయుచు వాద్యధ్వనులతో, మంగళ పాఠములతో, పరిక్రమణము చేయవలెను. పిమ్మట అష్టాక్షరమంత్రముతో ధ్వజదండమును స్థాపించవలెను. “ముఞ్చామి త్వా” ఇత్యాదిసూక్తము చదువుచు ధ్వజములు విడువ (ఎగురవేయ) వలెను. ఆచార్యునకు పాత్ర-ధ్వజగజాదులు దానము చేయవలెను. ఇది ధ్వజారోపణసాధారణ విధి. ఏ దేవతకు ఏ చిహ్నమో ఆ చిహ్నమే ఉన్న ధ్వజమును, ఆ దేవతామంత్రముతో స్థిరముగ స్థాపింపవలెను. ధ్వజదానము చేసినవాడు స్వర్గమునకు వెళ్ళును; ఈ లోకమునందు బలవంతు డగు రాజగును.
శ్రీ అగ్నివహావురాణమునందు ద్వార ప్రతిష్టాధ్వజారోహణాదివిధి యను అరువదియొకటవ అధ్యాయము సమాప్తము.
