అగ్ని మహా పురాణము

Table of Contents

197 - అథ దివసవ్రతాని.

ఆగ్ని రువాచః-

ఆగ్ని దేవుడు చేప్పెను : ఇపుడు దివసములకు సంబంధించిన వ్రతములు చేప్పెదను. మొదట ధేనువ్రతమును గూర్చి చెప్పెదను. సువర్ణరాశితో కూడ ఉభయముఖగోదానము చేసి ఒక దినమున పయోవ్రతము చేయువాడు పరమపదమును పొందును. స్వర్ణమయ కల్పవృక్షదానము చేసి మూడు దినములు పయోవ్రతము చేయు వాడు బ్రహ్మపదమును పొందును. దీనికి కల్పవృక్ష వ్రత మని పేరు. పది పలములకంటే అధిక మగు స్వర్ణముతో పృథివి నిర్మించి దానము చేసి రెండు దినములు పయోవ్రతము చేయవలెను. దినమునందు మాత్రము వ్రతమవలంబించువాడు రుద్రలోకమును చేరును. ప్రతిపక్షమునందును మూడు రాత్రులు ఏక భుక్త వ్రతము చేయువాడును, పగలు నిరాహారుడై త్రిరాత్రవ్రతము చేయువాడును అధిక మగు ధనము పొందును. ప్రతిమాసమునందును మూడు ఏకభుక్త నక్షతములు చేయువాడు గణపతిసాయుజ్యమును పొందును. జనార్దనుని ఉద్దేశించి త్రిరాత్రవ్రత మాచరించువాడు తన నూరు కులములతో వైకుంఠముచేరును. మార్గశీర్ష శుక్ల నవమినుండి త్రిరాత్రవ్రత ప్రారంభము చేయవలెను. ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రమును వేయి పర్యాయములు, లేదా నూరు పర్యాయములు జపము చేయవలెను. అష్టమినాడు ఏక భుక్త వ్రతము, నవమీ - దశమీ - ఏకాదశులందు ఉపవాసము చేయ వలెను. ద్వాదశినాడు శ్రీ మహా విష్ణువును పూజించవలెను. ఈ వ్రతము కార్తిక మాసమందు చేయవలెను. వ్రతసమాప్తి యందు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారికి వస్త్ర - శయ్యా - ఆసన - ఛత్ర - యజ్ఞోపవీత - పాత్రల దానము చేయవలెను. దానసమయమున బ్రాహ్మణులలో ఇట్లు చెప్పలేను. దుష్కర మగు ఈ వ్రతమునాచరించు నపుడు నావలన కలిగిన లోపములు అన్నియు మీ అనుగ్రహముచే తొలగి పోవుగాక. ఈ తిరాతవతము చేయువాడు. ఇహలోకమున బోగము లనుభవించి మరణానంతరము శ్రీమహావిష్ణుసాంనిధ్యమును పొందును. ఇపుడు భుక్తిముక్తిద మగు కార్తిక వ్రతమును గూర్చి చెప్పెదను. దశమినాడు పంచగవ్యపాశన చేసి ఏకాదశినాడు ఉపవాసముండవలెను. ఈ వ్రతమునందు కార్తీక శుక్ల ద్వాదశినాడు శ్రీమహావిష్ణువును పూజించినవాడు విమానము పై సంచరించు దేవత అగును. చైతమున ఆలాతవత మాచరించి, రాతి మాతము భోజనము చేయువాడు వతసమాప్తి యందు ఐదు మేకలు దానము చేసినచో సుఖవంతు డగును. కార్తిక శుక్ల షష్టి మొదలు మూడు దినములు పాలు మాతము తాగి తరువాత, మూడు దినములు ఉపవాసము చేసినచో దానికి మా హేంద్ర కృచ మని పేరు. కార్తిక శుక్లైకాదశినాడు ప్రారంభించి పాంచరాతవతము చేయవలెను. మొదటి దినమున క్షీరము, రెండవ దినమున పెరుగు తీసికొని మూడవ దినమునుండి మూడు నాళ్ళు ఉపవాసము చేయవలెను. ఇది “భాస్కరకృచము” శుక్ల పంచమినుండి ప్రారంభించి ఆరు దినములు వరుసగ యవలగంజి, శాకములు, పెరుగు, క్షీరము, నెయ్యి, జలము, ఆహారముగా గ్రహించవలెను. దీనికి “సాంతపస కృచ్ఛ్రము” అని పేరు.

ఆగ్ని మహా పురాణమునంద దివసవ్రతవర్ణన మును నూట తొంబదియేడవ అధ్యాయము సమాప్తము.