అగ్ని మహా పురాణము
168 - అథ మహాపాతకాదిప్రాయశ్చిత్తమ్.
పుష్కర ఉవాచః-
పుష్కరుడు చెప్పెను : ప్రాయశ్చిత్తము చేసికొననివారిని రాజు దండించవలెను. తప్పు తెలిసి చేసినను, తెలియక చేసినను ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. మత్తులు, క్రుద్ధులు, రోగ గ్రస్తులు వీరి అన్నము ఎన్నడును తిన గూడదు. రజస్వల స్పృశించిన అన్నమును, సామూహికాన్నమును, వేశ్యాశ్రీ అన్నమును తినరాదు. మహాపాతక ములు చేసినవాడు, వడ్డీవ్యాపారము చేయు వాడు, దాయకుడు, అభిశప్తుడు, నపుంసకుడు, ఉపపతితో నివసించు స్త్రీ, రజకుడు, క్రూరుడు, వంది, జూదగాడు, కపటి, తపస్వి, చోరుడు, దండధారి యైన భటుడు, స్త్రీకిథర్త ఉండగా జారునివలన పుట్టినవాడు, స్త్రీ కిభర్త చనిపోయిన పిమ్మట జారునివలన పుట్టినవాడు, స్త్రీకి లొంగిపోయినవాడు, వేదమును అమ్ముకున్న వాడు నటుడు, సాలివాడు, కృతఘ్నుడు, కమ్మరి, నిషాదుడు, బట్టలకు రంగులు వేయువాడు, కపటసంన్యాసి, జారిణి, తిలఘాతకుడు, ఆరూఢపతితుడు, శత్రువు- వీరి అన్నము తినగూడదు. బ్రాహ్మణునిచే నియంత్రితుడు కానిచో బ్రాహ్మ ణాన్నము తినగూడదు. నియంత్రితు డైనను శూద్రాన్నము తినగూడదు. పైన చెప్పిన వారి అన్నమును తెలియక తిన్న చో మూడు దినములు ఉపవాసము చేయవలెను. తెలిసి తిన్న చో కృచ్చవ్రత మాచరించవలెను. వీర్యము, మలము, మూత్రము, బొండాలాన్నము శ్వపచాన్నము తిన్న చో చాంద్రాయణవ్రతము చేయవలెను. పది రోజులు దాటని ప్రేతకు ఇచ్చిన అన్న మును, ఆవు వాసనచూసిన అన్నమును, శూద్రోచ్చిష్టమును, శునకోచ్చిష్టమును, పతితుని అన్నమును తిన్న చో తప్రకృచ్చవతము చేయవలెను. అశౌచములో ఉన్న వారి అన్నము తిన్న వాడు ఆశుద్ధుడగును. అట్టి అన్నము తిన్నపుడు గూడ తప్తకృచ్ఛవ్రతము చేయవలెను.
ఏదైన ఐదు గోళ్ల జంతువు మరణించిన కూపము నుండి, అపవిత్రవస్తుసంబంధ మేర్పడిన కూపమ నుండియు జలము త్రాగినచో ద్విజోత్తముడు మూడు దినములు ఉపవాసము చేయవలెను. పైపాపము లన్నియు శూద్రుని విషయమున ఒక్క పాదమే అంటును. (ప్రాయశ్చిత్తములు గూడ అంతే). వైశ్య క్షత్రియులకు రెండు పాదములు అంటును. గ్రామ్య వరాహము, గాడిద, ఒంటె, నక్క, కోతి, కాకి - వీటి మూత్రపురీషములు తిన్న ద్విజుడు చాంద్రాయణము చేయ వలెను. శుష్కమాంసమును, పేతాన్నమును, కరక ములను, మాంసము తిను ఆరణ్యమృగములు, సూకరములు, ఉష్ట్రము, నక్క, కోతి, కాకి, గోవు, నరుడు, అశ్వము, గాడిద - వీటిమాంసమును, ఛత్రాకమును, గ్రామ్యకుక్కు టమును, ఏనుగు మాంసమును తిన్న వాడు త ప్రకృచ్చ మాచరించి విశుద్దు డగును. బ్రహ్మచారి ఆమ శ్రాద్ధమున భుజించినను మద్యము సేవించినను త ప్రకృచ్ఛము చేయవలెను. వెల్లుల్లి, గృంజనము తిన్న వాడు ప్రాజాపత్యాదులచే శుద్ధుడగును. తనకొరకై మాంసము వండించుకొని తిన్న వాడు చాంద్రాయణవ్రతము చేయవలెను. పీలుగవ్యము, జున్ను, శ్లేష్మాతకము, మట్టి, నిమిత్తము లేకుండ వండిన పులగము, సంయావము, పాయసము, అప్పములు, చేగోడీలు మొదలైనవాటిని, అసంస్కృతము లగు మాంసములను, దేవాన్న ములను, హవిస్సులను తిన్న వాడు పైవిధముగ ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. ఆవులు, గేదెలు, మేకలు తప్ప ఇతర పశువుల పాలు వర్ణ్యములు. పై పశువుల పాలు కూడ ఈనిన పది రోజుల లోపున నిషిద్ధము. చెవులపిల్లి, సల్లకి, ఉడుము, ఖడ్గమృగము, కూర్మము అను ఐదు గోళ్లు గల జంతువులు భక్ష్యములు. ఇతర జంతువులు భక్ష్యములు కావు. పాఠకములను, రోహితమత్స్యములను, సింహతుండములను భక్షించవచ్చును. అగ్నిహోత్ర మునందు ప్రజ్వలింపచేయబడిన అగ్ని గల బ్రాహ్మణుడు స్వేచ్ఛగా యవగోధూమలతో చేసిన పదార్థములను, పాలతో చేసిన భక్ష్యములను, వాగషాంగవచక్రాదులను, నూనె వస్తువులను, నిలవ ఉన్న దానిని తిన్నచో ఒకమాసము చాంద్రా యణము చేయవలెను. అది వీరవధతో సమాన మైనది.
బ్రహ్మహత్య, సురాపానము, సువర్ణ చౌర్యము, గురుగ్రీసంగమము, ఇవి మహాపాతకములు. ఈ మహాపాత కములు చేసిన వారితో సంబంధము కూడ మహాపాతకము. అసత్యమును పెంపొందించుట, రాజువిషయమున చాడీలు చెప్పుట, పూజ్యుని అనావశ్యకముగ నిర్బంధించుట. ఇవి బ్రహ్మహత్యతో సమానము. వేదమును పరిత్యజించుట, వేదనింద, కపట సాక్ష్యము, మిత్రుని చంపుట, నింద్య మైన అన్నమును ఆజ్యమును తినుట ఈ ఆరును సురాపానసమాసములు. దాచి ఉంచిన వస్తు వును, నరులను, ఆశ్వములను, రజతములు అపహరించుట, భూమినీ, పజ మును, మణిని హరించుట సువర్ల ఫేయముతో సమానము. తోడబుట్టువులు, బాలికలు. అంత్య జాతుల స్త్రీలు, మిత్రుని స్త్రీలు, పుత్రుని స్త్రీలు, వీరియందు నేతః సేకము గురుపత్నీ గమన తుల్యము. గోవధ, ఆయాజ్యులచే యాగము చేయించుట, పరస్త్రీ సంబంధము, తనను ఇతరులకు ఆమ్మి వేయుట, గురువును, తల్లిని, తండ్రిని విడచివేయుట, స్వాధ్యాయమును, అగ్నిని, పుత్రుని పరిత్యజించుట, పరిపి త్తిత్వము (తమ్ముడు వివాహము చేసికొనగా తాను అవివాహితుడుగా నుండుట), తమ్ముడు పరివేదనము చేయుట (ఆన్న కంటే ముందుగా వివాహము చేసికొను), అట్టివారికి కన్యను ఇచ్చుట, వారికి యాజకుడుగా నుండుట, కన్యను చేరచుట, వడ్డీతో జీవించుట, వ్రతమునకు విఘాతము కలిగించుట, తటాకమును, ఆరామమును, భార్యను సంతానమును విక్రయించుట, స్వధర్మపరిత్యాగము, బాంధవత్యాగము, జీతమునకు వేధాధ్యయనము చేయించుట జీతము తీసికోను వానినుండి అధ్యయనము చేయుట, అమ్మ కూడనివాటిని అమ్ముట, గనుల పై అధికారము, పెద్దయంత్రములను నడపుట, ఓషధులను హింసించుట, శ్రీ పై ఆధారపడి జీవించుట, కర్తవ్యమును దాటవేయుట, కట్టెలకొరకై సజీవములైన వృక్షములను ఛేదించు, స్త్రీలను నిర్బంధించుట, స్త్రీలను నిందించువారితో స్నేహము, స్వలాభము కొరకై పనులు ప్రారంభించుట, నిందితుల అన్నము తినుట, అగ్న్యాధానము చేయకుండుట, చౌర్యము, ఋణములు తీర్చకపోవుట, అసచ్చాస్త్రముల అభ్యాసము, దుష్ట శీలము, ధాన్యమును, వెండి మొదలగువాటిని పశువులను అపహరించుట, మద్యమును త్రాగున్రీని సేవించుట శ్రీని, శూద్రుని, వైశ్యుని, క్షత్రియుని చంపుట, నాస్తికత్వము ఇవి ఉపపాతకములు. బ్రహ్మణునకు పీడ కల్గించుట, వాసనచూడదగని వాటిని, మద్యమును వాసనచూచుట, వక్రత్వము, పురుషునితో మైథునము- ఇవన్నియు, జాతిభ్రష్టత్వమును కలిగించును. కుక్క, గాడిద, ఒంటె, సింహము, మేక, గోఱ్ఱె- వీటిని చంపుట, మీన - సర్ప - నకులములను చంపుట . ఇది సంకీర్ణ కరణ మసి చేప్పబడును. నిందితులనుండి ధనము స్వీకరించుట, వాణిజ్యము, శూద్ర సేవ, అసత్యభాషణము ఇవి “ఆపాత్రీకరణము”. కృమి - కీట - పక్షులను చంపుట, మద్యము కలిసిన భోజనము, ఫలములను, పుష్పములను అపహ రించుట, ఆధైర్యము- ఇవి పాపహేతువులు.
అగ్ని మహాపురాణమునందు మహాపాతకాదిప్రాయశ్చిత్త మను నూటఆరువదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.
