అగ్ని మహా పురాణము
44 - అథవాసుదేవాది ప్రతిమలక్షణాని.
హయగ్రీవుడు చెప్పెను. ఇపుడు వాసుదేవాది ప్రతిమల లక్షణము , చేప్పెదను విము. ఆలయమున పూర్వాభి: ముఖముగ గాని, , ఉత్తరాభి ముఖముగ్మగాని, శిలనుంచి, దానికి పూజచేసి, శిల్పి, ఆ శిలకు మధ్య సూత్రముంచి దానిని తొమ్మిది భాగములు చేయవలెను. తొమ్మిదవ భాగమును గూడ పండ్రెండు భాగ ములుగ విభజించిన పిమ్మట ఒక్కొక్క భాగము ఆతని అంగుళముతో ఒక్క అంగుళముండును. రెండు అంగుళములు “గోలకము” దీనికి “కాలనేత్ర” మని కూడ పేరు. పైన చెప్పిన తొమ్మిది భాగములలో ఒక భాగమును మూడు భాగములుగా విభజించి దానితో సీలమండలుగా చేయవలెను. ఒక భాగము మోకాలుకొరకు, మరొక భాగము కంఠము కొరకు నిశ్చయించి ఉంచుకోనవలెను. ముకుటము నకు ఒక జానేడు, ముఖమునకు ఒక జానేడు, కంఠమునకు ఒక జానెడు, హృదయమునకై ఒక జానెడు ఉంచ వలెను. నాభికిని, లింగమునకు మధ్య ఒక జానెడు దూరముండవలెను. తొడలు రెండు జానలు కాళ్ళు రెండు జోనలు ఉండవలెను. ఇపుడు సూత్రముల కొలతను వినుము - పాదములపై రెండు సూత్రములు, కాళ్ళ పై రెండు సూత్రములు, మోకాళ్ళపై రెండు సూత్రములు రెండు తొడలపై రెండేసి సూత్రములు ఉపయోగింపవలెను. లింగముపై మరి రెండు సూత్రములు కటి ప్రదేశ ముపై నడుము నిర్మించుటకు మరి రెండు సూత్రములును ఉపయోగింపవలేను. నాభి యందు కూడ రెండు సూత్రములు ఉపయోగింపవలెను. అట్లే హృదయమునందును. కంఠము నందును రెండు సూత్రము లుంచ వలెను. లలాటముపై మరి రెండు సూత్రములు, శిరస్సుపై మరి రెండు సూత్రములు ఉపయోగించవలెను. బుద్ధిమంతుడైన శిల్పి ముకుటము పై ఒక సూత్రముంచవలెను. పైన ఏడు సూత్రములు మాత్రమే ఉంచవలెను.
ఆరు సూత్రములను మూడు కక్షల అంతరముచే ఉంచవలెను. మరల మధ్య సూత్రమును విడిచివేసి కేవల సూత్రములను మాత్రమే ఉపయోగింపవలెను. లలాట - నాసికా - ముఖముల విస్తారము నాలుగు అంగుళములుండవలెను. కంఠ విస్తారము చెవుల విస్తారము కూడ నాలుగు అంగుళములే ఉండవలెను. రెండు ప్రక్కల చెక్కిళ్లు రెండేసి అంగుళ ముల వెడల్పు ఉండవలెను. బుగ్గ కూడ రెండు అంగుళము లుండవలెను. పూర్తి విస్తారము ఆరు అంగుళములుండవలెను. లలాట విస్తారము ఎనిమిది అంగుళములుండవలెను. రెండు ప్రక్కల శంఖ ప్రదేశములు రెండేసి అంగుళముల విస్తారము కలిగియుండి వాటిపై వెండ్రుకలు కూడ ఉండవలెను. చెవులకు నేత్రములకు మధ్య నాలుగు అంగుళముల వ్యవధానముండ వలెను. చెవులు పృథుకములు రెండేసి అంగుళములు నిర్మింపవలెను, కనుబొమ్మలకు సమావ సూత్రముననున్న భాగము నకు “కర్ణ శ్రోతస్సు” అని పేరు. గుచ్చివ (కుట్టిన) చెవులు ఆరు అంగుళములు, కుట్టనివి నాలుగు అంగుళములు ఉండ వలెను. లేదా కుట్టివ, చెవులై నను కుట్టనిచెవులైనను, బుగ్గతో సమానముగ ఆరు అంగుళములు ఉండవలెను.
గంధ పాత్రము, ఆ వర్తము, శమ్కిలి (చెవి రంధ్రము) కూడ నిర్మింపవలెను. క్రింది పెదవి ఒక అంగు లము, పై పెదవి అర అంగుళము ఉండ వలెను. నేత్రవిస్తారము అర అంగుళము, ముఖ విస్తారము వాలుగు అంగుళములు ముఖము వెడల్పు ఒకటిన్నర అంగుళములు ఉండవలెను. ముక్కు ఎత్తు ఒక అంగుళము పొడవు రెండు అంగుళములు ఉండవలెను. దాని ఆకారము కరవీరకుసుమమువలె ఉండవలెను. రెండు నేత్రముల మధ్య నాలుగు అంగుళముల ఆవ కాశ ముండవలెను. రెండు అంగుళములు నేత్రముల పరిధిలోనికి రాగా ఇంక రేండు అంగుళముల వ్యవధానముండును. నేత్రములోని మూడవ వంతు నల్లగ్రుడ్లు, ఐదవవంతు చిన్న నల్లగుడ్డు ఉండవలెను. నేత్ర విస్తారము రెండు అంగుళ ములు, ద్రోణి అర అంగుళము ఉండవలెను. కను బొమ్మల రేఖల ప్రమాణము కూడ అంతే ఉండవలెను. రెండు కను బొమ్మలును ఒకే ప్రమాణములో ఉండవలెను. కనుబొమ్మల మధ్య రెండు అంగుళములు విస్తారము నాలుగు అంగుళ ములు ఉండవలెను.
కేశ వాది మూర్తుల శిరస్సు మొత్తము తిరుగుడు ఇరువదియారు లేదా ముప్పది రెండు అంగుళము లుండవలెను. క్రింద కంఠము పది అంగుళములు, దాని తిరుగుడు ముప్పది అంగుళములు. క్రిందినుండి పైకి కంఠ విస్తారము ఎనిమిది అంగుళములు. కంఠమునకును. వక్షస్థలమునకును మధ్యనున్న అవకాశము కంఠముకంటె మూడు రెట్లు విస్తారముతో ఉండవలెను. స్కంథములు ఎనిమిదేసి అంగుళములు, అంసములు మూడేసి అంగుళములు ఉంచవలెను. బాహువులు మోచేయివరకు పదునాలుగేసి అంగుళములు, ప్రజాహువులు (మోచేతి క్రింద) పదునారేసి అంగుళములు, బాహువుల వెడల్పు ఆ రంగుళములు. ప్రబాహువుల వెడల్పు కూడ దీనితో సమానముగా ఉండవలెను. బాహుదండము తిరుగుడు పై నుండి తొమ్మిది కలలు లేదా పదునేడు అంగుళము లుండవలెను. బాహు మధ్యమున కూర్పరము (మోచేయి) ఉండును. కూర్సరము తిరుగుడు పదునాలుగు అంగుళములు, ప్రజాహమధ్యమున దాని విస్తారము పదువారు అంగుళములు, చేతి అగ్ర భాగము విస్తారము పండ్రెండు అంగుళములు. దాని మధ్య అర చేతి విస్తారము ఆరంగుళములు ఆర చేయి వెడల్పు ఏడంగుళములు, మధ్యవేలు పొడవు ఐదు. అంగుళములు, తర్జనీ - ఆనామికల పొడవు, దానికంటే అర అంగుళముశ్రీమదగ్ని మహాపురాణ తక్కువగా ఉండవలెను. కనిష్ఠికా అంగుష్ఠము పొడవు నాలుగు అంగుళము బొటనవ్రేలికి రెండు కణుపులు, మిగిలిన వాటికి మూడేసి కణుపులు ఏర్పరింపవలేను. గోళ్ళ పొడవు ఒక కణుపు పొడవులో సగముండవలెను. వక్షస్థలమెంత ఉన్నదో పొట్ట అంతే ఉండవలెను. నాభిరంధ్రము ఒక అంగుళముండవలెను. నాభినుండి లింగము వరకు జానెడు దూరముండవలెను.
ఉదరము తిరుగుడు నలుబది రెండు అంగుళములు. స్తనముల మధ్య భాగము జానేడు. స్తనాగ్రములు యవ ప్రమాణముతో ఉండవలెను. స్తనముల తిరుగుడు రెండు పదములుండవలెను. వక్షస్థలము తిరుగుడు ఆరువది నాలుగు అంగుళములు, దాని క్రింద నాలువేపుల తిరుగుడు లోకువేష్టనము” అని పేరు. నడుము తిరుగుడు ఏబది నాలుగు అంగుళ ములు. ఊరు మూలముల విస్తారము పుడెండేసి అంగుళములు దాని పైన మధ్యభాగ విస్తారము అధికముగా ఉండవలెను, మధ్య భాగము నుండి క్రిందికి విస్తారము క్రమముగ తగ్గ వలెను. మోకాళ్ళ విస్తారము ఎనిమిది అంగుళములు. వాటికి క్రింది పిక్క విస్తారము. మూడు రెట్లుండవలెను. పిక్క మధ్యభాగము విస్తారము ఏడు అంగుళము లుండవలెను. దాని తిరుగుడు మూడు రెట్లుండవలెను. పిక్క ఆగ్రభాగమున విస్తారము ఐదు అంగుళములు, దాని తిరుగుడు మూడు రెట్లు, పాదములు జానెడేసి పొడుగు ఉండవలెను. పాదముల ఎత్తు వాలుగు అంగుళములు మడమల ముందు భాగము కూడ నాలుగు అంగుళము లుండవలెను.
పాదముల విస్తారము ఆరంగుళములు, గుహ్యకము- మూడు అంగుళములు, పంజా ఐదు అంగుళములు ఉండవలెను. పాదముల బొటనవేలు వెడల్పుగా ఉండవలెను. మిగిలిన వేళ్ళ మధ్య భాగ విస్తారము: క్రమముగా మొదటి ప్రోలు ఎనిమిదవ భాగము తరువగా ఉండవలెను. బొటన వేలు ఎత్తు ఒకటిన్నర అంగుళము. లుండ వలెను, దీని గోరుప్రమాణమును మిగిలిన వేళ్ళ ప్రమాణము కంటె రెట్టింపు ఉంచవలెను. రెండవ వ్రేలి గోరు విస్తా రము అర అంగుళము, ఇతర మైన వేళ్ళ గోరు విస్తారము క్రమముగా కొంచెకొంచెము తగ్గించవలెను. అండకోశములు రెండును మూడేసి అంగుళముల పొడవు, లింగము నాలుగు అంగుళములు ఉండవలెను, దాని పై భాగము నాలుగు అంగు ళము లుండవలెను. అండకోశముల పూర్తి తిరుగుడు ఆరేసి అంగుళములు. ఇంత మాత్రమేకాక దేవతా ప్రతిమను సకల భూషణములతో అలంకరించవలెను. ఈ విధముగా సంక్షిప్తముగ లక్షణము చెప్పబడినది. ఇదే విధముగ లోకములో కనబడు ఇతర లక్షణములను కూడ దృష్టిలో వుంచుకొని, ప్రతిమ పై ఆలక్షణములను నిర్మింపవలెను. . పైకుడి చేతిలో చక్రము, క్రింది దానిలో పద్మము, పై ఎడమచేతిలో శంఖము క్రింది దానిలో గద ఉంచవలేను ' ఇవి వాసుదేవ శ్రీకృష్ణుని చిహ్న ములు గాన ఆప్రతిమ యందు మాత్రమే ఉంచవలెను. భగవంతుని సమీపమున, హస్త ముందు కమలము ధరించిన లక్ష్మిని, వీణను ధరించి యున్న పుష్టిదేవిని నిర్మించవలెను. ఈ ప్రతిమల ఎత్తు భగవత్రతిమ తొడల ఎత్తు ఉండవలెను. ప్రభామండలములో ఉన్న మాలాధర.విద్యాధరుల విగ్రహము కూడ స్థాపింపవలెను. ప్రభను ఏనుగు మొదలైన వాటితో ఆలంకరింపవలెను. భగవచ్చరణముల క్రింది భాగమును (పాదపీఠమును) పద్మాకారమున నిర్మింపవలెను. ఈ విధముగ దేవ ప్రతిమలకు పై చెప్పిన లక్షణము లుండునట్లు కూర్చవలెను.
అగ్ని మహాపురాణమునందు వాసుదేవ ప్రతిమా లక్షణమను నలుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.
