అగ్ని మహా పురాణము

Table of Contents

330 - అథ ఛందః సారః

ఆగ్ని రువాచః-

అగ్ని దేవుడు పలికెను. ఈ ప్రకరణమును చివరి వరకు “పాదః” యను పదము అనువర్తించును. గాయత్రికి ఒక పాదమున ఎనిమిది అక్షరములుండును. జగతికి పండ్రెండు అక్షర ములు, విరాట్ నకు పది త్రిష్టుప్నకు పండ్రెండు అక్షరములుండును. ఛందస్సులలో కొన్ని ఏక పాదములు, ద్విపాదములు ఇత్యాది విధమున నుండును. గాయత్రి ఆరేసి అక్షరముల నాల్గు పాదములతో కూడ వుండును. కొన్ని చోట్ల ఏడు అక్షరముల మూడు పాదములతో కూడ వుండును. దీనికి నిచృత్ యని పేరు. ప్రథమ పాదము యెనిమిది అక్షరములు. ద్వితీయ పాదము. ఏడు అక్షరములు, తృతీయ పాదము ఆరు అక్షరములు ఆయినచో అది ప్రతిష్టా గాయత్రి. ఇందుకు విపరీతముగా మూడు పాదములలో వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది అక్షరములున్న చో వర్ధమాన గాయత్రి మొదటి పాదము ఆరు, రెండవది ఎనిమిది, మూడవది ఏడు అక్షరము లున్న చో అతిపాద నిచృత్” యని పేరు. రెండు పాదములందు తొమ్మిదేసి అక్షరములు, తృతీయ పాదమున ఆరు ఆక్ష రములున్న చో “నాగీ గాయత్రి” ఆరు తొమ్మిది తొమ్మిది వున్నచో వారాహి గాయత్రి. ఇపుడు మూడవ భేదము చెప్పబడు చున్నది. ద్వీపాద ఛందస్సులో వరుసగా పండ్రెండు ఎనిమిది అక్షర ములున్న చో అనే ద్విపాద విరాట్. పదకొండేసి ఆక్ష రముల ఒక పాదము వున్న చో ఉష్ణిక్, ప్రథమ తృతీయ పాదము లందు ఏడేసి అక్షరములు ద్వితీయ పాదమున పండ్రెండు అక్షరములు, ద్వితీయ తృతీయములు ఎనిమిదేసి ఆక్షరములై న పునరుష్ణిక్. ప్రథమ ద్వితీయములు ఎనిమేది అక్షరములు, తృతీయము పండ్రెండు అక్షరములు అయినా, పరోషిక్. ఏడేసి అక్షరముల నాలుగు పాదములున్నను ఉష్ణిక్ చంధస్. ఎనిమిదేసి ఆక్షరములు నాలుగు పాదములు న్నది. అనుష్టుప్ ఛందస్సు. త్రిపాద అనుష్టుప్ కూడ వుండును. దీనిలో మొదటి పాద మున ఎనిమిది, ద్వితీయ, తృతీయము లందు పండ్రెండేసి అక్షరములున్నది ఒక భేదము మధ్యమ పాదము గాని అంతిమ పాద ముగాని అష్టాక్షరమై మిగిలిన రెండు పాదముందు పండ్రెడేసి అక్షరములున్నది రెండవ భేదము. ఒకపాదము జగతి ఛందస్సు మూడు పాదములు గాయత్రి ఛందస్సు అయినచో యది బృహతీ ఛందస్సు. మూడవ పాదము మొదటి పాదము వలె ఆయినచో అది పథ్యా బృహతి. ప్రథమ మగు జగతీ పాదము ద్వితీయ పాదమై మిగిలిన ఏ మూడు గాయత్రి పాదములైనచో యదిన్యంకు సారిణీ బృహతీయగును. క్రోమ్లకి మతము ప్రకారము దీనికే స్కందలేదా గ్రీవాయని పేరు. అంతిమ పాడను జగతియై మొదటి మూడు పాదములు గాయత్రియైనచో యది ఉపరిష్టార్బృహతి. ప్రథమ పాదము జగతియై మిగిలిన పాదములు గాయత్రియైనచో ఆది పురస్తాద్బ్రుహతి. తొమ్మి దేసి అక్షరములు వాలుగు పాదములు కూడ కనబడుచున్నవి. పది యక్షరముల రెండు పాదములు. ఎనిమిదేసి అక్షరముల రెండు పాదములు వున్నది కూడ బృహ తియే. కేవల జగ తీ పాదములు మూడున్నచో మహాబృహతీ.

            పండ్రెండేసి అక్షరముల రెండు పాదములు ఎనిమిదేసి అక్షరముల రేండు  పాదములు న్నచో పంక్తి ఛందస్సు. విషమ పాదమైన చో యనగా ప్రథమ తృతీయ చరణముకు పండ్రెండేసి యక్షరములు మిగిలినవి రెండు ఎనిమిదేసి అక్షర ములు అయినచో సతః పంక్తి ఛందస్సు. అవి విపరీతావస్థలో వున్నచో యది కూడ సతః పంక్తి మొదటి రెండు పాదములు పండ్రెడేసి అక్షరము మిగిలిన రెండు పాదములు ఎనిమిదేసి అక్షరము లేనచో ప్రస్తార పంక్తి. చివరి రెండు పాదము లందు పండెండేసి అక్షరములు మొదటి రెండు పాదము లందును ఎనిమిదేసి అక్షరములున్నచో ఆస్తార పంక్తి. పండ్రెండేసి ఆక్షత మలున్న రెండు పాదములు మధ్య నుండి మిగిలిన పాదములందు ఎనిమిదేసి అక్షరములున్న చో విస్తార పంక్తి ప్రథమ చతుర్థములందు పండ్రెండేసి అక్షరములు, ద్వితీయ చతుర్థములందు ఎనిమిదేసి అక్షరములు వున్నచో సంస్తార పంక్తి ఐదేసి అక్షరముల నాలుగు పాదములున్నచో ఆక్షర పంక్తి ఐదేసి అక్షరముల రెండు పాదములో వున్న చో ఆల్పశకి పంక్తి అయిదేసి అక్షరములు ఐదు పాదములున్నది పదపంక్తి. ప్రథమము నందు నాలుగు అక్షరములు ద్వితీయమునందు ఆరుఆక్షర ములు మిగిలిన మూడింటియందు ఐదేసి అక్షరములు వున్నను పదపం క్రియే ఎనిమిదేసి అక్షరముల ఐదు పాదములున్నది పథ్యా పంక్తి. ఎనిమిదేసి ఆక్షర ముల ఆరుపాదములున్నది జగతీ పంక్తి,

ఒక పాదము త్రిష్టుప్, ఎనిమిదేసి అక్షరములు నాలుగు పాదములు వున్నది త్రిష్టుభ్ జ్యోతిష్మతి ఒకపాదము జగతి నాలుగు పాదములు గాయత్రీయైసచో జగతీ జ్యోతిష్మతి. మొదటి పాదము పదకొండు అక్షరము, మిగిలిన నాలుగు పాదములు ఎనిమిదేసి అక్షరములైనచో పురస్తా జ్యోతి. మొదటి పాదము పండ్రెండు అక్షరము , మిగిలిన నాలుగు పాదములు ఎనిమిదేసి అక్షరములైనను యదియే పేరు. మధ్యమచరణమున పడ్రెండు అక్షరములు, మిగిలిన చరణములందు ఎనిమిదేసి అక్షరము లున్న చో యది మధేజ్యోతి మధ్య చరణము పండ్రెండు అక్షరములు మిగిలినవి ఎనిమిదేసి అక్షర ములు వున్నను యఏయే పేరు. మొదటి నాలుగు పాదములందు యెని సుదేసి అక్షరములు, చివర పాదమునందు పదకొండు అక్షరములు లేదా పండ్రెడు అక్షరములు వున్న చో అది ఉపరిషాజ్యోతి. గాయత్ర్యాది ఛందస్సులందు ఒకపాదమున ఐదు అక్షరములు ఇతర పాదముందు నియతాక్షరములు వున్నచో శంకుమతి. ఒక చరణము ఆరు అక్షరములు ఇతర చరణము లందు నియతములగు అక్షరములున్న చో కకుద్మతి. మూడు పాదముల ఛందస్సులో ప్రథమ తృతీయ పాదములందు ఎక్కువ అక్షర ములుండి మద్యయందు తక్కువ అక్షరమున్నచో యది పిపీలిక మధ్య. దీనికి విపరీతముగ వున్నది. యవ మధ్య గాయత్రి లేదా ఉష్టాక్ మొదలగు ఛందస్సులలో ఒక అక్షరము తగ్గినచో నిచృతయనియు, ఒక అక్షరము పెరిగినచో భూరిక్ యనియు రెండు అక్షరములు తగ్గిన విరాట్ యనియ, రెండు అక్షరములు పెరిగిన స్వరాట్ యనియు పేర్లు సందేహము కల్గినపుడు మొదటి పాదమున బట్టి ఛందస్సును నిర్ణయించవలెను. దేవతా, స్వర, వర్ణ, గోత్రాదుల ద్వారా కూడ నిర్ణయించవలేను. గాయత్ర్యాది ఛందస్సులకు క్రమముగా అగ్ని సూర్యచంద్ర బహస్పతి మిత్రావరుణ ఇంద విశ్వేదేవతలు, షడ్దాదులు స్వరములు. శ్వేత సారంగ, కృష్ణ, నీల, లోహిత, గౌరములు వర్ణములు, కృతి ఛండన్సు యొక్క వర్ణముగోరోచనా సమానము ఆతి ఛందస్సుల వర్ణము శ్యామలము ఏడు ఛందస్సులకును వరుసగా అగ్ని వేశ్య, కాశ్యప, గౌతమ ఆంగీరన్, భార్గవ కౌశిక వశిష్టులు దేవతలు.

అగ్ని మహాపురాపుణమున ఛందస్సారమను మూడువందల ముప్పదవ అధ్యాయము సమాప్తము.