అగ్ని మహా పురాణము
40 - అథార్ఘ్యాదిదానవిధిశల్యకథనే.
భగవంతుడైన హయగ్రీవుడు చేప్పేమ : ఓ బ్రహ్మదేవా! పూర్వము సమస్తప్రాణులకును భయంకరమైన ఒక మహాభూత ముండెను. దానిని దేవతలు భూమిలో పాతి పెట్టిరి. దానికే వాస్తుపురుషు డని పేరు; ఆరువదినాలుగు పదముల క్షేత్రమునందు ఆర్ధకోణమునందున్న ఈపని ఘృతాక్షతలచే తృప్తిపరుపవలెను. ఒక పదమునం దున్న పర్ణన్యుని కమల-జలములచేతను, రెండు పదములలో ఉన్న జయంతుని పతాక చేతను, రెండు కోషములం దున్న ఇంద్రుని కూడ అదే విధమునను, రెండుపదములలో నున్న సూర్యునిఎఱ్ఱని అన్ని పదార్థములచేతను, రెండు పదములపై నున్న సత్యుని వితానము (చాందనీ) చేతను, ఒక పదము నం దున్న భృతని ఘృతముచేతను, అగ్ని కోణమునందలి ఆర్ధకోణమునం దున్న ఆకాశమును శాకున మను ఓషధి జిగురుచేతను, ఆ కోణమునందే రెండవ ఆర్థపదమునం దున్న అగ్ని దేవుని సుక్కుచేతను, ఒక పదమునం దున్న పూమని లాజలచేతను, రెండ పదములపై నున్న వితథునిస్వర్ణము చేతను, ఒక పదముపై నున్న గృహక్షతుని వెన్న చేతను, ఒక పదముపై నున్న యమధర్మరాజును మాంసాన్న ముచేతను, రెండు పదములపై ఉన్న గంధర్వుని గంధముచేతను, ఒక పదముపై నున్న భృంగుని శాకునజిహ్వ అను ఓషధిచేతను, అర్ధపదముపై ఉన్న మృగమును నీలిబట్టచేతను, ఆర్థకోష్ఠము నిమ్న భాగమునం దున్న పితృగణమును పులగముచేతను, ఒక పదముపై నున్న ద్వారపాలకుని దంతకాష్ఠముచేతను, రెండు పదములపై నున్న సుగ్రీవుని యవలతో చేసిన పదార్థము చేతను తృప్తి పరుపవలెను.
రెండు పదములపై నున్న పుష్పదంతుని కుశతృణములచేతమ, రెండు పదములపై నున్న వరుణుని పద్మముల చేతను, రెండు పదములపై నున్న ఆసురుని సురచేతను, ఒక వరము పైనున్న ఆది శేషుని నేయి కలిపిన జలముచేతను ఆర్ధపదముపై నున్న పాపమును యవాన్నముచేతను, ఆర్ధపదము పై నున్న రోగమును గంజిచేతను, ఒక పదముపై ఉన్న నాగమును నాగపుష్పము చేతమ, రెండు పదములపై మన్న ముఖ్యుని భక్ష్యపదార్థముల చేతను, ఒక పదము పై నున్న భల్లాటుని పెసల అన్నముచేతమ, ఒక పదము పై ఉన్న సోముని తేనెతో కూడిన పాయసముచేతను, రెండు పదములపై నున్న ఋషిని శాలూకముచేతమ, ఒక పదము పై ఉన్న అదితినీ లోపికచేతను, అర్ధపదము పై నున్న దితిని పూరీలచేతను తృప్తిపరుపవలేమ. ఈశాన్యదిశయం దున్న ఈశునికి క్రింద ఆర్ధపదము పై నున్న ఆపునిపాలచేతమ, క్రింద అర్ధపదముపై నున్న ఆపవత్సుని దధిచేతను తృప్తిపరుపవలెను, తూర్పున నాలుగు కోష్టముల పై నున్న మరీచిని లడ్డూలచే తృప్తి పరుపవలెను. బ్రహ్మకు పై నున్న కోణమందు ఆర్ధ పదముపై ఉన్న సావిత్రునకు రక్తపుష్పములు నివేదించవలెను. దాని క్రింద నున్న ఆర్ధకోణమునం దున్న సవితకు కశోదకము లియవలెను. నాలుగు పదముల పై ఉన్న వివస్వంతునకు రక్తచందనమును, నైరృతీదిక్కున నున్న కోణమునందలి ఆర్ధకోష్ఠమునం దున్న సురాధిపతి యైన ఇంద్రునకు పసుపునీళ్ళతో అర్ఘ్యమును ఇవ్వవలెను. దాని అర్ధభాగమునందే కోణమునందలి కోష్టమునం దున్న ఇంద్రజయునకు నెయ్యి అర్ఘ్యముగా ఇవ్వవలెను. చతుష్పదమునందలి మిత్రునకు గుణయుక్త మగు పాయసము సమర్పింపవలేను. వాయవ్య కోణమున అర్ద కోష్ఠముపై నున్న రుద్రునకు పక్వమాంసమును ఇవ్వవలెను, దాని క్రింద ఆర్దకోష్టమునం దున్న యమునకు (రుద్రదాసునకు) (ద్రాక్షమొదలగు) ఆర్ద్రఫలము లివ్వవలేను. చతుష్పదమునం దున్న పర్వతమునకు మాంసాన్నమును, మాషమును బలి ఇవ్వవలెను. మధ్యలో నున్న నాలుగు కోష్ట్రములందును బ్రహ్మకొరకై తిలతండులము లుంచవలెను. చరకిని మాంసమృతములచేతను, కుమారస్వామిని పులగముచేతను, రక్తముచేతను, విదారీని రక్త కమలములచేతను, కందర్పుని ఒక ఫలము ఆన్నముచేతను, పూతనను ఫలపిత్తములచేతను, జంభకుని మాంసర క్తములచేతను, పాపర క్షసుని పిత్త-రక్త-ఆస్థులచేతను, పిలిపిత్సుని మాలికలచేతను, రక్తము చేతను తృప్తిపరుపవలేను. పిదప ఈశానాది దిక్పాలకులకు రక్తమాంసమును, సమర్పింపవలేను. ఆయా వస్తువులు లభింపనపుడు ఆక్షతలు సమర్పింపవలేను. రాక్షస-మాతృకా-గణ-పిశాచ-పితృ-క్షేత్రపాలాదులకుగూడ ఇచ్ఛానుసారముగా బలిప్రదానము చేయవలెను.
వాస్తు హోమ బలిప్రదానాదులచే ఈ దేవతలకు తృప్తి కలిగించకుండ ప్రొసాదాదినిర్మాణము చేయరాదు. బ్రహ్మస్థానమున శ్రీహరి-లక్ష్మీ-గణదేవతలను పూజింపతలెను. పిమ్మట భూమిని, వాస్తుపురుషుని, వర్ధనీ (మూకుడు) యుక్తకలశములను పూజింపవలెను. కలశమధ్యమున బ్రహ్మను దిక్పాలకులను పూజింపవలెను. స్వస్తివాచనముచేసి, ప్రణమించి, పూర్ణాహుతి చేయవలెను. ఓ బ్రహ్మదేవా! పిమ్మట గృహస్వామి రంధ్రములుగల ఒక జలపాత్రహ స్తమున ధరించి విధిపూర్వకముగా దక్షిణావర్తమండలములు చేయుచు సూత్రమార్గమున జలధారను త్రిప్పవలెను. పిమ్మట వెనుకటి వలే అదే మార్గమున ఏడు బీజములు నాటవలెను. ఆదే మార్గమున గొయ్యి తవ్వుట ప్రారంభింపవలెను. పిమ్మట మధ్య యందు ఒక హస్తము వెడల్పు నాలుగు అంగుళములు లోతుగల గొయ్యి తవ్వవలెను. దానిని అలికి పూజాప్రాంభము చేయవలెను. అన్నింటికంటును ముందుగ వాలుగుభుజములు ధరించిన శ్రీ మహావిష్ణువును ధ్యానించి కలశ తో ఆర్య ప్రదానము చేయవలెను, పిదప జారీతో నీళ్లుపోసి ఆ గొయ్యినింపి దానిలో తెల్లని పుష్పములు వేయవలెను. శ్రేష్టమైన ఆదక్షిణావర్తగర్తమును విత్తనములతోడను, మట్టితోడను నింపవలెను. ఈ విధముగ అర్ఘ్యప్రదానకార్యము ముగించి, ఆచార్యునకు గోవస్తాదిదానము లీయవలెను. జ్యోతిష్కుని, స్థపతినిగూడ యథోచితముగ సత్కరించి విష్ణుభక్తులను, సూర్యుని పూజింపవలెను. పిమ్మట భూమిని ప్రయత్నపూర్వకముగ, నీరువచ్చునంతవరకును తవ్వవలెను. మనిషిలోతు క్రింద శల్యములున్నను గృహమునకు దోషములేదు. శల్యములున్న చో ఇంటి గోడ విరిగిపోవును. గృహపతికి సుఖము ఉండదు. తవ్వుచున్నపుడు ఏ జంతువు పేరు వినబడునో ఆ జంతువు శల్యమే ఆక్కడ నుండునని తెలియవలెమ.
ఆగ్నేయమహాపురాణమునందు అర్ఘ్యదాన-శల్యముల కథనమను నలువదవ అధ్యాయము సమాప్తము.
