అగ్ని మహా పురాణము
269- అథ ఛత్రాదిమంత్రాదయః
పుష్కర ఉవాచః
పుష్కరుడు పలికెను. ఛత్రాడి మంత్రములను చేప్పేదను. వాటిని పూజించుటచే విజయాదికమును పొందును. మహామతియైన ఓఛత్రదేవా ! నీవు హిమము, మల్లెపూవు, చంద్రుడువలే, తెల్లని కాంతితో ప్రకాశించుచున్నావు. బ్రహ్మ యొక్క సత్యవచనము చేతన, వరుణ సూర్య ప్రభావములచేతను నీవు సర్వదా వృద్ధి పొందుము. మేఘము మంగళము కొరకై ఈ భూమిని ఆచ్చాదించునట్లు నీవు విజయము కొరకును ఆరోగ్య వృద్ధికొరకును రాజును ఆచ్ఛాదించుము. ఓఅశ్వమా ! నీవు గంధర్వ కులమున బుట్టితివి కావున కులదూషకము కావద్దు. బ్రహ్మ సత్య వాక్యము చేతను, హోమ వరుణ అగ్నుల ప్రభావము చేతను, సూర్య తేజస్సు చేతను, మునుల తపస్సు చేతను, రుద్రుని బ్రహ్మ చర్యముచేతను, వాయుపు బలముచేతను, నీవు సర్వదామున్ముందుకు సాగుము. నీవు అశ్వరాజపుత్రుడను విషయము స్మరించుము. కౌస్తు కమణిని స్మరించుము. బ్రహ్మహత్య, పితృహత్య, మాతృహత్య చేసిన వాడును, భూమి కొరకై ఆసత్యమాడినవాడు, యుద్దము నుండి పరాజ్ముఖుడైన క్షత్రియుడును ఎంత శీఘ్రముగా అధోగతిని పొందుదురో, యుద్ధమునందు పృష్ఠము చూపించుటచే నీవు కూడ అట్లే దుర్గతిని పొందుదువు. నీకు అట్టి వికారము కలుగ కుండుగాక ! అట్టి పాపము కలుగకుండు గాక ! సమరాంగణమున శత్రువులను సంహరించుచు నీస్వామితో కూడి సుఖముగ నుండుము. మహాపరాక్రమమునకు ప్రతీకమైన ఓయింద్రధ్వజమా ! నారాయణుని ధ్వజమైన గరుత్మంతుడు నీ పై ప్రతిష్ఠింపబడినాడు. ఇతడు సర్ప శత్రువు. విష్ణు వాహనము కశ్యపకుమారుడ. దేవలోకములోనుంచి బలాత్కారమున, అమృతమును అపహరించి నాడు. అతను విలకాయుడు. అతని బలవేగమలు గొప్పవి. అమృతమును ఆస్వాదించినవాడు. అతనిశ క్తి ఆప్రమేయము. యుద్దమంలో దుర్జయుడై శత్రుసంహారము చేయును. వాయుతుల్యగతి కలవాడు. అట్టి గరుత్మంతుడు ఇంద్రుని కొరకై శ్రీ మహావిష్ణువుచే నీ పై స్థాపింపబడినాడు. నీవు సర్వదా నాకు విజయమును ఇమ్ము. నాబలమును పెంచుము. ఆశ్వములు కవచములు, ఆయుధములు వీటితో కూడిన నాయోధులను రక్షించి శత్రువులను కాల్చి భస్మముచేయుము.
కుముద - ఐరావత - పద్మ - పుష్పదంత - వామన - సుప్రతీక - అంజన - నీలులు, అను ఎనిమిది గజు రాజులు దేవయోనియందు పుట్టినవి. వీటి పుత్ర పౌత్రులే ఎనిమిది వనములందు నివసించుచున్నది. భద్ర - మంద్ర - మృగ - సంకీర్ణ జాతీయగజములు ప్రతివనమునందు పుట్టుచున్నవి. ఓ మహాగజములారా : నీ జాతిని స్మరించుడు. వసు. వులు, రుద్రులు, ఆదిత్యులు, మరుద్గణములు, మిమ్ములను రక్షించుగాక ! ఓగజేంద్ర! నీనీయమును పాటించి స్వామిని రక్షించుము. వజ్రధారియైన దేవేంద్రుడు ఐరావతమును ఎక్కి నీ వెనుక నే వచ్చుచున్నాడు. అతడు నిన్ను రక్షించుగాక. యుద్ధము నందు విజయము పొంది స్వస్తుడవై ముందుకు నడువుము. యుద్ధమునందు నీకు ఐరావతము వంటి బలము వచ్చు గాక. చంద్రుని మండి కాంతిని, విష్ణువు నుండి బలమును, సూర్యుని నుండి తేజస్సును, వాయు నుండి వేగ మును, పర్వ తము నుండి స్థిరత్వమును, రుద్రుని నుండి విజయమును, ఇంద్రుని నుండి యశమును పొందుము. దిగ్గజములు, దిక్కులు దిక్పాలకులు, యుద్ధమున నిన్ను రక్షింతురు గాక. గంధర్వ సహితులగు ఆశ్వికుమారులు అన్ని వైపుల నుండి నిన్న రక్షింతురు గాక. మను - వసు - రుద్ర - వాయు – చంద్ర - మహర్షి - నాగ - కిన్నర - యక్ష - భూత - ప్రమథ - గ్రహ - ఆదిత్యులు, మాతృకా సహితుడగు భూతాధిపతియైన శివుడు, ఇంద్రుడు, దేవ సేనాపతియైన కార్తికేయుడు, వరుణుడు, నిన్ను అధిష్టించియున్నారు. వారు సమస్త శత్రువులను భస్మము చేయుదురు గాక ! రాజు విజయము పొందుగాక.
ఓ పతాకా! శత్రువులు నలువైపులనుండిచేయు ఘాతక ప్రయోగ వణులు నీతేజస్సుచే కొట్టబడి నశించుగాక! కాలనేమి త్రిపుర సంహార యుద్ధములందును, హిరణ్యకశిపుయుద్దములందును, సకలదై త్యయుద్ధములందును, నీవు ఎట్టుప్రకాశించితివో అట్లేనేడు ప్రకాశించుము. నీప్రతిజ్ఞను స్మరించుము, నల్లగను తెల్లగను వన్న నిన్ను చూచి రాజుశత్రువులు వెంటనే నశింతురుగాక ! వ్యాధులచేతను శస్త్రములచేతను పరాజితులగుదురు గాక! నీవు పూతన, రేవతి, లేఖాకాళ రాత్రి మొద పేళ్లతో ప్రసిద్దులవు. ఓ పతాకా! నిన్ను ఆశ్రయించుచున్నాము. మాశత్రువులందరిని కాల్చివేయుము, సర్వమేధ మహాయజ్ఞమును, దేవదేవుడగు రుద్రుడు జగత్తు యొక్కసారముతో నిన్ను స్మరించినాడు. శత్రునాశకమగు ఓ ఖడ్గమా! నీవు నారాయణుని, నందకమను ఖడ్గమునకు రెండవమూర్తీ వను విషయమును స్మరింపుము. నీవు నీలక మల దళముతో సమానమగు శ్యామకృష్ణవర్ణములు కలదానవు. దుస్వప్నములను నశింపచేయుదువు. పూర్వము, బ్రహ్మ దేవుడు నీకు ఆసి, విషసనము, ఖడ్గము, తీక్షధారము, శ్రీ గర్భము, విజయము, ధర్మపాలము అను ఎనిమిది పేర్లు పెట్టినాడు. నీది కృత్తికానక్షత్రము మహేశ్వరుడు నీగురువు. సువర్ణము నీశ రీరము. జనార్దనుడు నీదేవత. ఓ ఖడ్గమా! శయనా నగర సహికుడగు రాజునుర క్షింపుము. దేవ శ్రేష్ఠుడగు పితామహుడు నీ తండ్రి నీవుసర్వదామమ్ముల రక్షించుము.
ఓ కవచమా! నీవు రణభూమిలో కల్యాణ ప్రదము. ఓ నిష్పాపమా నేనునీనుండి రక్షపొందుటకు అర్హుడను. నన్ను రక్షింపుము నీకు నమస్కారము ఓ దుందుభీ నీవు ధ్వనిచే శత్రువుల హృదయములను కంపింపచేయుదువు మా రాజు సేనలకు విజయవృద్ధిని చేయుము. మేఘధ్వనిచే ఉత్తమ గజములు సంతసించినట్లు నీశబ్దముచే మాకుహరము కలుగు గాక! మేఘ గర్జనముచే స్త్రీలకు భయము కలుగునట్లు నీధ్వనిచే యుద్ధమునకు వచ్చిన నా శత్రువు భయ పడుదురుగాక! ఈ తంతములతో రాజోపకరణములను పూజించి వాటిని విజయకార్యమునకై వినియోగించవలెను. దైవజ్ఞుడు ఆగు రాజపురోహితుడు రక్షాబంధనాదుల ద్వారా రాజరక్షణముచేసి, ప్రతిసంవత్సరము విష్ణ్వాది దేవతలకును రాజునకును, అభిషేకము చేయవలెను.
అగ్ని మహాపురాణమున చక్రాదిమంత్రాదికమను రెండువందల అరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
