అగ్ని మహా పురాణము

Table of Contents

328 - అథ చ్ఛందస్సారః

ఆగ్ని రువాచః-

అగ్ని దేవుడు పలికెను :  ఇపుడు వేదమూలమంత్రాను సారముగ పింగలోక్త ఛందస్సులను క్రమముగా వర్ణించెదను. మ, న, థ, య జ, ర, స, త, గణములు యని గణములు ఎనిమిది. అన్ని గణములందును. మూడేసి అక్షరము లుండును. మగణములో అన్ని అక్షరములు గురువులు. నగణములో అన్ని అక్షరములు లఘువులు, ఆది గురువు భగణము, ఆది లఘువుయగణము, అంత్యగురువు సగణము, అంత్యలఘువు తగణము. పొదాంతమునందున హ్రస్వాక్షరము వికల్పముగా గురువగును. విసర్గ అనుస్వార సంయుక్తాక్షర జిహ్వా మూలీయ ఉపధ్మా నీయములకు అవ్యవహిత పూర్వమునందున్న హ్రస్వము కూడ గురువు. దీర్ఘము గురువు గురువువు “గ” లఘువునకు “ల” యని సంకేతము. వసు శబ్దము ఎనిమిదికి, వేద శబ్దము నాలుగుకు, సంజ్ఞయగును. ఈ విషయములను లో కాను సారము తెలుసుకొనవలెను.

అగ్ని మహాపురాణమున ఛందస్సారమను మూడువందల ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.