అగ్ని మహా పురాణము
239 - అథ పునః శ్రీరాజధర్మాః
రామ ఉవాచః
శ్రీ రాముడు పలికెను : లక్ష్మణా ! స్వామి - అమాత్య - రాష్ట్ర - దుర్గ - కోశ - బల - సుహృత్తులనునవి పరస్పరోపకారములగు ఆరు అంగ ములు. వీటిలో రాజ - అమాత్యుల తరువాత ప్రధానమైనది రాష్ట్రము. ఆర్థసాధకము. అందుచే సర్వదా దానిని పాలించవలెను. కులీనత్వము, సత్వము, వనము, శీలము, దాక్షిణ్యము, శీఘ్రకారిత్వము, పూర్వపర విరుద్ధముగ మాటలాడుకుండుట, సత్యము, వృద్ధ సేవ, కృతజ్ఞత్వము, దైవానుకూల్య సంపాదనము, బుద్ధి, నీచపరివారము లేకుండుట, సమర్ధులగు సామంతులు కలిగియుండుట, దృఢభక్తిత్వము, ముందుచూపు, ఉత్సాహము, చిత్త శుద్ధి, ఔదార్యము, వినయము, ధార్మికత్వము. ఇవి ఆభిరామిక గుణములు. అభివృద్ధి కోరు రాజు - సుప్రసిద్ధమగు కాలమునందు జనించినవారు, క్రౌర్యము లేనివారు, గుణవంతులు, పవిత్రులు అగు పురుషులను చేరదీసి తన పరివారము నoదుంచుకొనవలెను.
వాగ్మి, ప్రగలుడు స్మరణశక్తి కలవాడు, ఎత్తై నవాడు, బలవంతుడు, జితేంద్రియుడు, సేనను నడపగల వాడు. విద్యానిష్ణాతుడు, స్వరగ్రహుడు (పొరబాటున ప్రారంభించిన చెడుపని నుండి వెనుకకు మరలు వాడు). పరాక్రమణము సహించగలవాడు, అన్నింటికీని ప్రతిక్రియ ఆలోచించ సమర్థుడు, శత్రువుల లోపములమ కని పెట్టువాడు, సంధివిగ్రహ తత్త్వజ్ఞుడు, మంత్రణము గూఢముగా నుంచువాడు, దేశ కాలవిభాగము ఎరిగినవాడు, ధనమును రాబట్టుకొనువాడు, తగు వ్యయము చేయువాడు. సతాత్రలను ఎరిగినవాడు, క్రోధ - లోభ - భయ -ద్రోహ స్తంభ (మొండితనము)-చాపల్యములను దోషములు లేనివాడు, పరపీడన . పైశున్య (చాడీలు చెప్పుట) - మాత్సర్య - ఈర్ష్యా - అనృతములను దుర్గుణములులేనివాడు, వృద్ధజనోపదేశానుసారము ప్రవర్తించువాడు, మధుర భాషి, మధుర్ దర్శకుడు, గుణానురాగి, మితభాషి, అయిన రాజు శ్రేష్ఠుడు. ఇవి రాజునకుండవలసిన ఆత్మసంపత్తికి సంబంధించిన గుణములు. ఉత్తమ కులసంజాతులు, బాహ్యoతః శుద్ధులు, శౌర్యసంపన్నులు, ఆన్వీక్షక్యాది విద్యానిపుణులు, స్వామిభక్తులు, దండనీతి ప్రయోగ కుశ అలు అగు వారు రాజామాత్యులుగా ఉండుటకు యోగ్యులు.
అన్యాయమార్గమునుండి సులభముగ మరల్చుటకు శక్యమైనవాడు. అదే జనపదమునందు పుట్టినవాడు, సత్కుల సంజాతుడు, సుశీలుడు, శారీర బలసంపన్నుడు, వక్తృత్వము కలవాడు, సభాసంభాషణప్రోలుడు, శాస్త్రమను నేత్రము కలవాడు, ఉత్సాహవంతుడు, సమయస్ఫూర్తి కలవాడు సజ్జత్వ (మొండితనము) చాపల్యములు లేని వాడు, స్నేహశీలుడు, శీతోష్ణాది క్లేశ సహనసమర్థుడు, శుచి (లంచము మొదలగు వాటికి దూరముగా నుండువాడు), సత్య - సత్వ - ధైర్య ఛైర్య ప్రభావ - ఆరోగ్యాది గుణసంపన్నుడు, శిల్ప నిపుణుడు, దక్షుడు, ప్రజ్ఞావంతుడు, ధారణాశక్తి కలవాడు, దృఢభక్తి, ఎవ్వరితోను వైరము లేనివాడు. ఇతరులు కల్పించిన విరోధమును శాంతింపచేయు వాడు ఆగు పురుషుడు రాజునకు బుద్ది సచివుడుగను, కర్మ సచివుడుగ ను ఉండుటకు తగినవాడు. స్మరణశక్తి, కార్వవ్యగ్రత, ఊహశక్తి జ్ఞాననిశ్చయము, దృఢత్వము, మంత్రగుప్తి ఇవి మంత్రిసంపద. పురోహితుడు వేదత్రయసిష్ణాతుడై , దండనీతి ప్రయోగకుశలుడై , ఆథర్వ వేదోక్త విధానమున రాజు కొరకు శాంతికర్మ - పుష్టికర్మలను సంపాదించుచుండవలెను. బుద్ధిమంతుడగు రాజు ఆయా విద్యలయందు నైపుణ్యముగల పండితులచే ఆమాత్యుల శిల్పశాస్త్రాదిజ్ఞానమను పరీక్షించవలెను. ఇది పరోక్ష పరీక్ష. కులీనత్వము, జన్మస్థానము, ఆవగ్రహము (అతడు ఎవరి చెప్పుచేతలలో ఉండును అను విషయము) ఈ మూడిటిని ఆతని ఆత్మీయులనుండి తెలుసుకొనవలెను. పరికర్మ (దుర్గాది నిర్మాణ) దక్షత్వము, విజ్ఞానము, ధారయిష్ణుత అను మూడు గుణములను కూడ పరీక్షించ వలెను ప్రగల్భత్వము, ప్రతిక, వాగ్మిత్వము, సత్యవాచిత్వము ఆను నాలుగు గుణములను మాటలలో తానే స్వయముగా పరీక్షించవలెను. ఉత్సాహము ప్రభావము, క్లేశ సహన సామర్థ్యము, ధైర్యము, స్వామిభక్తి సైర్యము అను గణములను ఆపత్సమయములందు పరీక్షించవలెను. రాజు విషయమున దృఢమైన భక్తి, మైత్రి, ఆదార విచారములందు పరిశుద్ధత్వము- ఈ గుణములను ఆతని వ్యవహారమును బట్టి పరీక్షించవలెను.
బలము, సత్త్వము, ఆరోగ్యము, శీలము, ఆస్తబ్దత, అచాపల్యము అనుగుణములను చుట్టుప్రక్కలనున్న వారిద్వారా పరీక్షించవలెను. వైరము పెంచుకొనకుండు స్వభావమును, భద్రత్వమును, నీచత్వమును ప్రత్యక్షముగనే చూచి గ్రహించ వలెను. గుణప్రవృత్తులు ప్రత్యక్షముగా గ్రహించుటకు వీలుకాని పురుషుని గుణములను ఊహించి తెలుసుకొనవలెను. ఎక్కువ పంటలు పండునదియు, వివిధవస్తువుల గనులు, ఆమ్మటకు వీలైన ఆధికమైన ఖనిజ పదార్థములు ఉన్నదియు, గోవులకు హితకరమైనదియు, అధిక జలము కలదియు, చుట్టును పవిత్రమైన జనపదము లున్నదియు, అందమైనదియు, ఆడవులలో ఏనుగు లున్నదియు, జలమార్గ - స్థలమార్గములున్నదియు, పంటలకే వర్షము పై ఆధారపడనిదియు, పంటలకై ఆధికముగ జలము లభించునదియు అగు భూమి ఐశ్వర్యవృద్ధికి ప్రశస్తము. జలము అధికముగ లభించునది, పర్వత సాహాయ్యమున్నది, శూద్ర - శిల్పి - వైశ్యులు అధిక సంఖ్యలో ఉన్నది, ప్రయత్నశీలులు, పెద్ద పెద్దపనులు తలబెట్టువారు, రాజానుర క్షులు, రాజశత్రుద్వేషులు, పీడా-కర భారములను సహింపగలవారు, అగు వ్యవసాయదారులు కలది, అనేక దేశములనుండి వచ్చిన జనులకు నివాసస్థానమైనది, సువిస్తృతము, ధార్మికులు, పశుసంపద కలవారు, అగు ధనికులు కలది మూర్ఖులును, వ్యసనగ్రస్తులును ఆగు నాయకులుకలది యగు జనపదము రాజుకు శ్రేష్టమైనది. విస్తృతమైన సరిహద్దులు కలది, నాల్గువైపులందును విశాలమైన అగడ్తలు కలది, ఉన్నతమైన ప్రాకార గోపురములు కలది, పర్వతమును గాని, మరుభూమిని గాని, అడవిగాని ఆశ్రయముగా గ్రహించి నిర్మించినది, అగుపురమునందు రాజు నివసించవలెను. జలము, ధాన్యము, ధనము అధికముగనున్న దుర్గము చాలకాలము శత్రువుల ఆక్రమణమును తట్టుకొనుటకు సమర్థమై యుండును. జలమయము, పర్వతమయము, వృక్ష మయము, ఇరిణము (నిర్జనప్రదేశ నిర్మితము), ధన్వనము (మరుభూనిర్మితము) అని దుర్గము ఐదువిధములు.
విశ్వాసపాత్రుల రక్షణినున్నది. ధర్మ న్యాయానుసారముగ ఆర్జింపబడినది, ఎంత వ్యయము చేసినవ తరగ నీది అయిన కోశము శ్రేష్ఠము. కోశమును ధర్మాదివృద్ధికొరకును, థృత్యాదుల పోషణము కొరకును వినియోగించవలెను. తాత ముత్తాతల నుండియు సేవచేయుచున్న వారును, లొంగిఉండువారును, ఐకమత్యము కలవారును, జీత మాలు పూర్తిగ చెల్లించిన (తీసికొన్న) వారును, ప్రసిద్ధ పౌరుషవంతులును, తన జనపదమునందే జనించినవారును, యుద్దకుశ లులును, కుశ లులగు సైనికులతో కలిసి ఉండువారును, నానావిధ శస్త్రాస్త్రసంపన్నులును, అనేక యుద్దములందు ఆరితేరినవారును, అనేకులు మహాయోధులున్న దళములకు చెందినవారును, తమ సైన్యమునందలి అశ్వములకును, గజములకును హారతి ఇచ్చు వారును, పర దేశ నివాసము, యుద్ధమునందలి కష్టములు, అనేక విధములగు క్లేశమాలు సహించ సమర్థులును, యుద్ధమునందు చాల శ్రమపడినవారును రెండు ఆలోచనలు లేనివారును, చాలవరకు క్షత్రియజాతికి చెందినవారును ఆరు సైనికులు గల సైన్యము శ్రేష్టమైనదని దండనీతిజ్ఞుల అభిప్రాయము. త్యాగ-విజ్ఞాన-సత్త్వములు కలవారును, చాలమంది ఆత్మీయులు కలవారుమ, ప్రియముగ మాటలాడువారును, థJష్యత్తులో ఉపయోగించువారును. రెండు ఆలోచనలు లేనివారును, ఉత్త మకుల సంజాతు లును అగు పురుషులును మిత్రులనుగ చేసికొనవలెను. మిత్రుడు రాగానే దూరము నుండియే ఎదురేగుట, స్పష్టములు, ప్రియములు అగు మాటలు చెప్పుట, సత్కారపూర్వకముగ మనోవాంఛిత వస్తువునిచ్చుట - ఇవి మూడును మిత్రసంగ్రహ ణోపాయములు. ధర్మార్థకామములు మిత్రులనుండి లభించు మూడుఫలములు. ఔరసులు (మాతృపిత్రాది సంబంధము ద్వారా ఏర్పడినవారు), మైత్రీబంధబద్ధులు, కులక్రమాగతులు, కష్టముల నుండి రక్షింపబడినవారు అని మిత్రులు నాల్గు రకములు. సత్యవచనము, అనురాగ్ ము, సుఖదుఃఖములందు ఒకే విధముగ పాలుపంచుకొనుట, ఇవి మిత్రగుణములు.
రాజ సేవకుల ప్రవృత్తి నిగూర్చి చెప్పెదను ; సేవకులకు తగిన గుణములు కలవాడు. రాజు సేవ చేయవలెను. నేర్పు, లోక ప్రియత్వము, దృడత్వము. ఓర్పు, క్లేశ సహశక్తి, సంతోషము, శీలము, ఉత్సాహము. ఈ గుణములు సేవకుల అలంకారములు. సేవకుడు సమయానుసారముగను, న్యాయపూర్వకముగను రాజు సేవ చేయవలెను. ఇతరుల స్థానము నకు వెళ్ళుట, క్రూరత్వము, అసభ్యత్వము, ఈర్ష్య. ఈ దోషములను త్యజించవలెను. తన పై అధికారి మాటలను ఖండించిగాని, తద్విరుద్దముగ గాని రాజసభలో మాటలాడగూడదు. రాజు యొక్క రహస్యకార్యములను, గుప్త మంత్రణమును ఎచ్చటను ప్రకటము చేయకూడదు. తన విషయమున స్నేహముగల స్వామివద్దనే సేవకుడుగా ఉండవలెను. రాజు తన పై విరక్తి చూపినచో, లేదా అసహ్యము చూపినచో ఆతనిని విడువవలెను. సంగ్రహముగ చెప్పవలెనన్నచో రాజు అనుచిత కార్యముచేయనున్నప్పుడు నివారించట, సత్కార్యములు చేయుచున్నప్పుడు ఆతనికి సాహాయ్యము చేయుట. ఇది బంధువులు, మిత్రులు, సేవకులు చేయవలసిన ! శేషాచారము. మేఘమువలే రాజుసమస్త ప్రాణాలకును వృత్తి కల్పింపవలేను. ఆయా స్థానములన్నింటియందును, సుపరీక్షితులును. విశ్వాస యోగ్యులును అగువారిని నియోగించవలెను. ఉద్యమశీలులను మాత్రమే కర్మాధ్యక్షులుగ చేయవలెను. వ్యవసాయము, వర్తకులకు ఉపయోగించు స్థలజలమార్గములు, పర్వతాది దుర్గములు సేతుబంధములు, ఏనుగులను పట్టు స్థానములు సువర్ణ - రజతాదిఖనులు, వనమునందు లభించు శ్రేష్టమైవ కట్టి మొదలైనవి శూన్య ప్రదేశములందు గ్రామాది నిర్మాణము - ఈ ఎనిమిది ఆయద్వారములు. వీటికి ‘అష్టవర్గము' అని పేరు. ధర్మాత్ము డైన రాజు ఈ అష్టవర్గమును నిరంతరము రక్షించవలెను. అధికారులు, చోరులు, శత్రువులు, రాజబంధువులు, రాజు యొక్క దురాశ ఈ ఐదును ప్రజలకు ఐదు విధములగు భయములను కలిగించుచుండును. రాజు, ఈ భయములు కలుగ కండ చేయుచు, ప్రజల నుండి తగు సమయములందు పన్ను వసూలు చేయుచుండవలెను. బాహ్యము, అధ్యన రము అని రాజ్యము రెండు విధములు. రాజు యొక్క శరీర మే ఆభ్యంతరము. రాష్ట్రము బాహ్యరాజ్యము. రాజు ఈ రెండింటిని రక్షించుకొనవలెను. రాజ్యమునకు హాని కలిగించు పాపాత్ములు రాజప్రియులై నను దండనీయులే. రాజు వారందరిని శిక్షించవలెను. విషాదుల నుండి తనను రక్షించుకొనవలెను, స్త్రీలను, పుత్రులను, శత్రువులను ఎన్నడును విశ్వసించ గూడదు.
ఆగ్ని మహాపురాణమునందు రాజధర్మ కథనమను రెండువందల ముప్పది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
