అగ్ని మహా పురాణము

Table of Contents

378 - పునః బ్రహ్మవిజ్ఞానమ్

ఆగ్ని రువాచః

అగ్ని పలికెను. పరజ్యోతి స్వరూపమును పృథివీ జల వాయు న్నమును అగు పరబ్రహ్మ నేనే. వాయువాకాశ భిన్న మగు జ్యోతిర్మయమైన పరబ్రహ్మను నేనే. అగ్న్యాది కార్య భిన్నమగు పరబ్రహ్మ నేనే. విరాట్ ఓన్న మగు జ్యోతీ రూప బహ్మ నేనే. జాదవస్థా శూన్య మగు జ్యోతీరూప బహ్మ నేనే. విశ్వ శిన్న మగు జ్యోతీరూప బహ్మ నేనే. ఆ రాక్షర వర్జితమగు జ్యోతీరూప బహ్మ నేనే. వాక్పాణిపాద శూన్యమగు జ్యోతీరూప బహ్మ నేనే. పాయూపస్థ రహితమగు జ్యోతీరూప ఒహ్మ నేనే. “తత్వక్ చకూ రహితమగు జ్యోతీరూప బహ్మ నేనే. రసరూప వివర్జితము. సర్వ గంధ శూన్యము, జిహ్వాఘ్రాణ రహితము, స్పర్శ శబ్దరహితము మనోబుద్ధి శూన్యము, చిత్తాహంకార వర్జితము, పాణాపాన, వ్యానోదాన సమాన రహితము జరా మరణ శోక మోహముత్పిపాసా వర్జితము శబోద్భూతాది శూన్యము, హిరణ్య గర్భ భిన్నము, స్వప్నావస్థారహితము. తై జసాది భిన్నము, అపకార, సభాజ్ఞాన, ఆధ్యాహృత, సత్త్వాది గుణ సద సద్భావ రహి తము సర్వావయవ శూన్యము భేదా భేద శూన్యము సుషుప్తి స్థానప్రాజ్ఞ భావమకారాది రహితము. మాన మేయ మితి మాతృత్వ రహితము సాక్షిత్వాది శూన్యము, కార్యకారణ వర్ణితము, దేహేంద్రియ మనో బుద్ధి పారిణాహంకార రహితము, జాగత్స్నప్న సుషుప్త్యాది రహితము, తురీయము నిత్య శుద్ధ, బుద్ధ, ముక్త స్వరూపము, సత్యము ఆనందము, అద్వయము , సవి జ్ఞానమగు జ్యోతి రూప బహ్మ నేనే సమాధి రూపము మోక్ష పదము అగు పరబ్రహ్మ నేనే.

అగ్ని మహా పురాణమున బ్రహ్మ విజ్ఞానమున మూడు వందల డెబ్బది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.